Afridi Recalls 2011 World Cup Pressure
ట్రంప్‌నకు.. మోదీ ఎందుకు భయపడుతున్నారు: ఎంపీ చామల
ఎల్పీజీ సిలిండర్ ధరల పెరుగుదల, కొరతపై పార్లమెంట్ మకర్ ద్వార్ వద్ద ఇండియా కూటమి ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు.ఇండియా కూటమి ఎంపీల ధర్నాలో కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
ఎల్పీజీ సమస్యను కేంద్రప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. 18వ లోక్‌సభలో కేంద్రప్రభుత్వం వాస్తవాలు మాట్లాడనీయడం లేదని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం మోదీ ప్రభుత్వ అజెండాగా మారిందని ఆగ్రహించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడే మాటలను నరేంద్రమోదీ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ట్రంప్ చర్యలను మోదీ ఎందుకు వ్యతిరేకించడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. ట్రంప్‌నకు మోదీ ఎందుకు భయపడుతున్నారో అర్ధం కావడం లేదని అన్నారు. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ పరిస్థితులు, ప్రభావంపై ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంట్లో మాట్లాడాలని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
