ట్రంప్‌నకు.. మోదీ ఎందుకు భయపడుతున్నారు: ఎంపీ చామల…

ట్రంప్‌నకు.. మోదీ ఎందుకు భయపడుతున్నారు: ఎంపీ చామల

 

ఎల్పీజీ సిలిండర్ ధరల పెరుగుదల, కొరతపై పార్లమెంట్ మకర్ ద్వార్ వద్ద ఇండియా కూటమి ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు.ఇండియా కూటమి ఎంపీల ధర్నాలో కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.

 ఎల్పీజీ సిలిండర్ ధరల పెరుగుదల, కొరతపై పార్లమెంట్ మకర్ ద్వార్ వద్ద ఇండియా కూటమి ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. కట్టెల పొయ్యిలు, వంట పాత్రలు, ఎల్పీజీ సిలిండర్ల పోస్టర్లతో నిరసనకు దిగారు. విపక్షాల ఆందోళనలో ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, ఇండియా కూటమి ఎంపీలు పాల్గొన్నారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) పాల్గొని ప్రసంగించారు. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరతపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధంపై పార్లమెంట్‌లో ఎందుకు చర్చించడం లేదని నిలదీశారు.
ఎల్పీజీ సమస్యను పరిష్కరించాలి..

ఎల్పీజీ సమస్యను కేంద్రప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. 18వ లోక్‌సభలో కేంద్రప్రభుత్వం వాస్తవాలు మాట్లాడనీయడం లేదని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం మోదీ ప్రభుత్వ అజెండాగా మారిందని ఆగ్రహించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడే మాటలను నరేంద్రమోదీ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ట్రంప్ చర్యలను మోదీ ఎందుకు వ్యతిరేకించడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. ట్రంప్‌నకు మోదీ ఎందుకు భయపడుతున్నారో అర్ధం కావడం లేదని అన్నారు. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ పరిస్థితులు, ప్రభావంపై ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంట్‌లో మాట్లాడాలని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version