మున్సిపాలిటీ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
నూతన మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపేలా కృషి చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి సైతం ప్రాధాన్యత ఇస్తానని క్యాతన్ పల్లి మున్సిపాలిటీకి నూతన మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన మారుతి ప్రసాద్ అన్నారు. రామగుండం మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహించిన ఏ మారుతీ ప్రసాద్ సాధారణ బదిలీల్లో భాగంగా క్యాతన్ పల్లి మున్సిపాలిటీకి మున్సిపల్ కమిషనర్ గా బదిలీపై వచ్చి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నానని, సిబ్బంది సైతం సహకరించాలని కోరారు.ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. పలువురు సిబ్బంది కమిషనర్ కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
