Uma Maheshwara Seva Samiti President Resigns
శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి అధ్యక్షులు రాజీనామా
ఆకుల సుభాష్ ముదిరాజ్
గణపురం మండలం ధర్మారావుపేట గ్రామంలో శివాలయం లో
విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం మార్గశిర మాసం హేమంత ఋతువు బహుళ పక్షం సఫల ఏకాదశి రోజునా శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి ఆధ్వర్యంలో శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని సేవ సమితి అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్ తెలిపారు.. పూజ కార్యక్రమాల అనంతరం వచ్చిన భక్తుల నుద్దేశించి ఆకుల సుభాష్ మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాలనుండి శ్రీ ఉమా మహేశ్వర సమితి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ రోజు నుండి సేవ సమితి బాధ్యతల నుండి
తప్పుకుంటున్నందుకు కొంత బాధగా వుంది.ఈ గ్రామం అభివృద్ధి కొరకు ధార్మికరంగంలో మరియు అనేక సేవ కార్యక్రమాలు మా సమితి సభ్యుల సహకారంతో చేయడం జరిగింది.నాకు నేనుగా స్వచ్ఛందగా ఒక పర్వదినం రోజు ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇక నుండి ఒక గ్రామ పౌరుడిగా ఎప్పటికి నా గ్రామం కోసం గ్రామ అభివృద్ధి కోసం పాటుపడుతూనే ఉంటానని వారు తెలిపారు
