బిల్లులు మింగేశారు! వేలకోట్లు కొల్లగొట్టేశారు!
అధికారులు, క్రషర్ దొంగలు కలిసి కాలేశ్వరం ముంచారు?

క్వాలిటీ కంట్రోల్ బోర్డు ఎన్ని క్రషర్ల కంకర ను తిరస్కరించింది?
-అసలు దొంగలు కంకరగాళ్ళు, అధికారులు!

-వ్యాపారం చేసుకుంటాం గుట్టలు కావాలని అడిగారు?
-ఇసుక తయారీ కోసం కలెక్టర్లు కొందరికి గుట్టలు కేటాయించారు?
-ఆ గుట్టలనుంచి మోసగాళ్లు కంకర తయారుచేశారు?
-వరంగల్ గుట్టల రాళ్లతో కంకర తయారీ సాధ్యం కాదు!
-కంకరకు నాణ్యమైన కొండలు అసలే కావు!
-ఆ రాళ్లు ఏఇంటి నిర్మాణానికి కూడా పనికి రావు.
-కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎలా అధికారులు అంగీకరించారు?
-అధికారులతో కుమ్మక్కై ప్రాజెక్టులకు పనికి రాని కంకర ఎంతమంది సరఫరా చేశారు?
-అధికారుల మీద నమ్మకంతో ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థలు విశ్వసించ్చాయి!
-కాళేశ్వరం పిల్లర్లు కుంగిపోయేదాకా వచ్చాయి!
-రాతి ఇసుక తయారీ గుట్టల నుంచి కంకర తయారు చేసి దొంగల్లా సరఫరా చేశారు!
-ఇప్పుడు సుద్దపూసల్లా మాకేం సంబంధం అంటున్నారు!
-జిల్లా కలెక్టర్లు గుట్టలు కేటాయించింది కంకర కోసం కాదు!
-అందరి కళ్ళు గప్పి కంకర సరఫరా చేశారు.
-రాజేంద్రనగర్ క్వాలిటీ కంట్రోల్ బోర్డు ఆదేశాలు ఎవరు తుంగలో తొక్కారు!
-నాసి రకం కంకర వాడేలా అధికారుల మీద ఒత్తిడి తెచ్చిన నాయకులెవరు?
-రాజేంద్రనగర్ క్వాలిటీ కంట్రోల్ బోర్డు ఎన్ని క్రషర్ల కంకర తిరస్కరించింది?
-కులం పేరు అడ్డుపెట్టుకొని కంకర సరఫరా చేసింది ఎవరు?
-ఇసుక తయారీకి గుట్టలు తీసుకొని నాసిరకం కంకర సరఫరా చేసిన ఘరానా గాళ్ళు ఎవరు?
-ఆ వ్యక్తులకు సహకరించిన నాయకులెవరు?
-అధికారులను ఒత్తిడి చేసింది ఎవరు?
పెద్ద పెద్ద ప్రాజెక్టుల విషయంలో చిన్న చిన్న నిర్లక్ష్యాలు కొన్ని సార్లు పెద్ద సమస్యలు సృష్టిస్తాయి. నష్టాన్ని తెచ్చిపెడుతుంటాయి. తెలంగాణలో గత ప్రభుత్వం నిర్మాణం చేసిన బారీ ప్రాజెక్టు కాళేశ్వరంలోనూ ఇదే జరిగిందని తెలుస్తోంది. సహజంగా పెద్ద, చిన్న ప్రాజెక్టులేవైనా సరే నిర్మాణం సంస్థలను ప్రభుత్వాలు నమ్ముతాయి. రాజకీయాలు ఎలా వున్నా ఆ సంస్థల నిర్మాణాలను ప్రభుత్వాలు నమ్ముతాయి. ఆ నిర్మాణ సమయంలో నిర్మాణ సంస్దలు పూర్తిగా అధికారుల మీద ఆదారపడుతుంటారు. నిర్మాణ సంస్దలకు సంబందించిన క్వాలిటీ చెకింగ్ ఉద్యోగులున్నప్పటికీ ప్రభుత్వ అదికారుల నిర్ణయమే ఫైనల్ అవుతుంటుంది. అదే కాళేశ్వరంలో అవినీతి, అక్రమాలకు తావిచ్చింది. కొంత మంది ఉద్యోగుల మూలంగా కాళేశ్వరం ప్రాజెక్టు మొదటికే మోసం వచ్చింది. నీతి, నిజాయితీగా వుండాల్సిన అధికారులు అవినీతికి ఆశపడ్డారు. కొంత మంది మోసగాళ్లకు కింది స్దాయి పనులు అప్పగించారు. అయితే నిర్మాణాల విషయంలో సహజంగా కంకర అనేది చాలా ముఖ్యమైనది. కాని ఆ కంకర విషయంలోనే అదికారులు నిర్లక్ష్యం చేశారు. కొత్త కొత్త టెక్నాలజీని అడ్డం పెట్టుకొని నాసిరకం కంకరను అధికారులు ఓకే చేశారు. అధికారులు సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల కాంట్రాక్టు కంపనీలు ఆ కంకర నాణ్యమైదే అనుకొని నిర్మాణాలకు ఉపయోగించారు. ఆ నిర్మాణ సంస్ధలు కంకర సరఫరా చేసిన వారికి తక్కువ ధర చెల్లించలేదు. నాణ్యమైన కంకరకు చెల్లించాల్సినంత సొమ్ము చెల్లించారు. కాని కంకర సరఫరా చేసిన వాళ్లు మాత్రం నాసి రకం కంకర సరఫరా చేశారు. ఇది అధికారులకు తెలుసు. కంకర సరఫరా చేసిన వారికి తెలుసు. అటు అధికారులు, ఇటు కంకర సరఫరా చేసిన మోసగాళ్లు కలిసి నమ్మిన నిర్మాణ కంపనీ నమ్మకాన్ని వమ్ము చేశారు. ప్రభుత్వాన్ని విశ్వాసాన్ని నిండా కాళేశ్వరం నీళ్లలో ముంచేశారు. అయితే ఆ కంకర ఎవరు సరఫరా చేశారు? ఎందుకు సరఫరాచేశారు? ఆ మోసగాళ్లకు ఎవరు అనుమతులిచ్చారు? ఎందుకిచ్చారు? వారికి అనుమతులు ఇవ్వడం వెనుక ఎవరున్నారు? ఎంత పెద్ద నాయకులు ఒత్తిడి చేశారు? ఖచ్చితంగా మోసగాళ్ల కంకరే సరఫరా చేసేలా ఎవరు చర్యలు తీసుకున్నారు? నాసిరకం కంకర సరఫరా చేసిన వారి వెనుకు వున్న బిఆర్ఎస్ నాయకులు ఎవరు? అసలు ఆ నాసిరకం కంకర క్రషర్లు ఎవరివి? ఆ క్రషర్ల యజమానులు ఎవరు? బి ఆర్ఎస్ నాయకులకు వున్న ఆ నాసిరకం కంకర క్రషర్లు ఎన్ని? ఆనాటి బిఆర్ఎస్ ఎమ్మెల్యేల పాత్ర ఎంత? ఎంత మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేకు నాసిరకం కంకర క్రషర్లు వున్నాయి? అనేది తేల్చితే అసలు గుట్టంతా రట్టవుతుంది. ఇక్కడ ప్రధానంగా చర్చించాల్సిన విషయాలు అనేకం వున్నాయి. వరంగల్ జిల్లాలో కంకర సరఫరా చేసేంత నాణ్యమైన గుట్టలు, కొండలు లేవు. అవన్నీ ఎర్రరాయి కొండలు. ఆ రాయి నుంచి తయారు చేసే కంకర నాణ్యమైనది అసలే కాదు. అది పూర్తిగా నాసిరకం కంకర? ఆ గుట్టలు కొండలు, పెద్ద పెద్ద బండరాళ్లతో కూడినవి కాదు. కేవలం చిన్న చిన్న గుండ్లతో కూడిన ఎరుపు రంగు రాళ్లు. కనీస నల్ల రాళ్లు కూడా కాదు. అలాంటి ఎరుపు రాళ్లతో కంకర తయారు చేయడం వల్ల వాటిలో ఎలాంటి నాణ్యత వుండదు. కాని ఆ కొండలను తవ్వి, అక్కడే క్రషర్లు ఏర్పాటు చేసి కొంత మంది మోసగాళ్ల కంకర తయారు చేశారు. దీని వెనుక పెద్ద బాగోతమే వుంది. కొంత మంది రాజకీయ పార్టీలకు చెందిన వాళ్లు, వ్యాపారం కోసం గుట్టలను కేటాయించమని అప్పటి కలెక్టర్లుకు దరఖాస్తులు చేసుకున్నారు. గత ప్రభుత్వ హాయంలో జరిగిన అనేక రకాలైన ప్రాజెక్టుల మూలంగా ఇసుక కొరత ఏర్పడే ప్రమాదం ఎదురౌతుందని ప్రభుత్వం గ్రహించింది. అందుకోసం మట్టితో కూడుకున్న కొన్ని కొండలను, గుట్టలనుంచి ఇసుక తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేసింది. ఆ గుట్టల నుంచి ఇసుక తయారు చేసే వారికి వాటిని అప్పగించేందుకు అనుమతులు జారీ చేసింది. ఆ అవకాశాన్ని అదునుగా చేసుకొని కొంత మంది అక్రమార్కులు ఆ కొండలను లీజుకు తీసుకున్నారు. ఇసుక తయారు చేస్తామని ప్రభుత్వాన్ని నమ్మించారు. తమకు ఆ గుట్టలను అప్పగించాలని కలెక్టర్లకు దరఖాస్తులు చేసుకున్నారు. అలా అనుమతులు పొందిన గుట్టల నుంచి ఇసుక తయారు చేయాల్సిన వాళ్లు కంకర తయారు చేశారు. చిన్న చిన్న రాళ్లు, రప్పలను కంకరగా మార్చారు. ఆ కంకరను కాళేశ్వరం ప్రాజెక్టుకు సరఫరా చేసే ఒప్పందాలు చేసుకున్నారు. అయితే ఈ కంకరను రాజేంద్రనగర్లో వున్న క్వాలిటీ కంట్రోల్ బోర్డుకు పంపించారు. అక్కడ ఆ కంకరను టెస్టింగ్ చేసిన అదికారులు ఎట్టిపరిస్దితుల్లోనూ ఆ కంకర ప్రాజెక్టులకు వినియోగించొద్దని హెచ్చరించింది. ఆ కంకర పూర్తిగా నాసిరకమైందని తేల్చింది. ఆ కంకర వినియోగిచొద్దని సూచించింది. కాని అధికారుల క్వాలిటీ కంట్రోల్ బోర్డు ఆదేశాలను పెడచెవిన పెట్టింది. వారి నిర్ణయాలను పక్కన పెట్టింది. మోసగాళ్లతో అధికారులు చేతులు కలిపారు. కొంత మంది అధికారులు ఈ కంకరను ఒప్పుకోకపోతే ఆ అక్రమార్కులు పెద్దపెద్ద నాయకులతో బెదిరించినట్లు కూడా తెలుస్తోంది. దాంతో అదికారులు కూడా నాయకుల ఆదేశాలను పాటించారు. అధికారులు వినకపోతే నాయకులు ఏం చేస్తారో వారికి తెలుసు. దాంతో అధికారులు కూడా కొంత మంంది ఎమ్మెల్యేలు, నాయకుల ఒత్తిళ్లతో ఆ నాసిరకం కంకరను సరఫరాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో విచ్చలవిడిగా వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు చెందిన గుట్టల నుంచి నాసిరకం కంకర సరఫరా చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ కంకరతో జరిగిన నిర్మాణాలలో లోపాల కారణంగానే కాళేశ్వరంలోని పిల్లర్లు కుంగాయని తెలుస్తోంది. ఆ కంకర సరఫరా చేసిన వారిలో గత ప్రభుత్వ పెద్దల కులానికి చెందిన అక్రమాలర్కులున్నారు. కొంత మంది ఎమ్మెల్యేలు కూడా ఆ క్రషర్లను ఏర్పాటు చేశారు. మొత్తం మీద దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు కాళేశ్వరం నిధులు వేల కోట్లు పంచుకున్నారు. నాసిరకం కంకర సరఫరా చేశారు. ఇప్పుడు మాకేం తెలుసు. మేం సుద్దపూసలమన్నట్లు ఆ నాసిరకం కంకర సరఫరా చేసిన అక్రమార్కులు అంటున్నారు. పైగా తాము మాత్రమే ఆ నాసిరకం కంకర సరఫరా చేశామా? ఇంత ఎంతో మంది అలాంఇ కంకరే సరఫరా చేశారని కూడా వాళ్లే చెబుతున్నారు. అంటే ఇదంతా ఒక పథకం ప్రకారమే నాసిరకం కంకర సరఫరా చేసినట్లు అర్ధమౌతోంది. ప్రభుత్వం ఈ దిశగా విచారణ మొదలు పెడితే దోషులను గుర్తించడం చాలా తేలికౌతుందంటున్నారు. గత ప్రభుత్వ పెద్దలకు బంధువులుగా చెప్పుకునే కొంత మంది అక్రమార్కులే అదికారులతో చేతులు కలిపి ఈ దుర్మార్గానికి ఒడిగట్టారని తెలుస్తోంది. అందులో వున్నవి చిన్న చిన్న తలకాయలు కాదు. పెద్ద పెద్ద తలకాయలే వున్నాయి. అసలు ఆ కంకరను ఎందుకు సరఫరా చేశారు? ఎవరు చేయమన్నారు? అధికారులు ఎవరికి లొంగిపోయారు? ఎందుకు లొంగిపోయారు? నిర్మాణ సంస్ధను ఎలా మోసం చేయగలిగారు? క్వాలిటీ కంట్రోల్ బోర్డు ఆదేశాలను అంత దైర్యంగా ఎలా ఉల్లంగించారు. చిన్న చిన్న పిట్టగోడల నిర్మాణాలకు కూడా వినియోగించుకోలేని నాసిరకం ఎర్ర కంకరను అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టుకు వినియోగించారనేది తేలాల్సిన అవసరం వుంది. నాసిరకం కంకర నుంచి తీగ లాగితే డొంకంతా కదుతుందని అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఈ దిశగా విచారణ చేయిస్తే మొత్తం బండారం బైటకు వస్తుందంటున్నారు.
