Bonalu Offered to Renuka Mata at Dattakshetra
దత్తక్షేత్రంలో రేణుకా మాతకు బోనాల సమర్పణ
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం మండలం బర్దిపూర్ దత్తక్షేత్రంలో వెలసిన రేణుకా మాతకు గ్రామస్థులు శుక్రవారం బోనాల నైవేద్యం సమర్పించారు. మాతృశ్రీ అనసూయ మాత ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఉత్సవ కమిటీ సభ్యులు, ఆశ్రమ పీఠాధిపతులు అవధూత గిరి మహారాజ్, సిద్ధేశ్వరానందగిరి మహారాజ్, దత్తగిరి మహారాజ్ పాల్గొన్నారు. గ్రామస్తులు అమ్మవారికి వడి బియ్యం, అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
