CPI Siege Over Monkey Menace
కోతులను అరికట్టడంలో మున్సిపల్ అధికారులు విఫలం..
సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముట్టడి, ఉద్రిక్తం
సిపిఐ పట్టణ కార్యదర్శి సొతుకు.ప్రవీణ్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపల్ పరిధి లోని 30 వార్డులలో కోతులను కుక్కలను అరికట్టడంలో అధికారులకు విఫలం చెందారని సిపిఐ జిల్లా నాయకులు సోతుకు ప్రవీణ్ కుమార్, గురీజపెళ్లి సుధాకర్ రెడ్డి, కోరిమి సుగుణ లు అన్నారు. కోతుల కుక్కల బెడదను నివారించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో కోతులు,కుక్కల సమస్య విపరీతంగా ఉంద ని వాటిని నివారించడంలో అధికారుల వైఫల్యం ఉందన్నారు. పట్టణ కేంద్రంలో 30 వార్డులలో కోతులు చాలా మంది మహిళలను,పిల్లలను తీవ్రంగా ఎన్నోసార్లు గాయపర్చడం జరిగిందన్నారు. ఈ విషయంపై అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. పట్టణం లోని హనుమాన్ నగర్ లో 80లక్షల రూపాయలతో అనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ను ప్రభుత్వం నుండి ఏర్పాటు చేయడం జరిగిందని, రెండు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు వాటి నివారణకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ నిర్వహించకపోవడం వల్ల కోతులు,కుక్కల సమస్య తీవ్రంగా ఉందని అన్నారు. కోతులు కుక్కల పట్టడానికి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నప్పటికీ అధికారులు నిధులను దుర్వినియోగం చేస్తూన్నారని వారు ఆరోపించారు. అధికారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు.సింగరేణి యాజమాన్యం కలిసి కోతుల పట్టే బోన్ లను తీసుకొచ్చి నాలుగు నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు వాటిని వాడకపోవడం చాలా సిగ్గుచేటని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు వెంటనే కోతుల కుక్కల బెడదను అరికట్టకపోతే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. అనంతరం కమిషనర్ కువినతిపత్రం ఇవ్వడం కోసమే అధికారులు నిరాకరించటంతో మున్సిపల్ కార్యాలయంలో అధికారులు ఎవరూ లేకపోవడంతో సిపిఐ నాయకులు ఆఫీస్ గేట్ ను నెట్టుకొని లోపటికి పోయే ప్రయత్నం చేయగా పోలీసులు నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు నూకల చంద్రమౌళి,మాతంగి రామ్ చందర్,పల్లె కృష్ణ,నేరెళ్ల జోసెఫ్,వేముల శ్రీకాంత్,గోలి లావణ్య, సదానందం,గణగల జోగేష్ ,లోకిని రమేష్ ,గంప రాజు,పెదమాముల్ సంధ్య శ్రీలత స్వప్న సుభద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.
