
కలెక్టర్ ను కలసి కృతజ్ఞతలు తెలిపిన అక్షయ తల్లిదండ్రులు
భూపాలపల్లి నేటిధాత్రి చిన్నారి అక్షయ తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాకు కృతజ్ఞతలు తెలిపారు. భూపాలపల్లి పట్టణంలోని ఎల్బీనగర్ కు చెందిన కాజిపేట నరేష్, సుమలత దంపతుల కుమార్తె అక్షయ(7)గత సంవత్సరం దీపావళి వేడుకలులో ప్రమాద వశాత్తూ గాయపడడంతో మంచానికే పరిమితమైంది. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న అక్షయ గురించి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలుసుకొని చిన్నారి వైద్య చికిత్సలు అందిస్తామని ఆదివారం ప్రకటించిన నేపథ్యంలో సోమవారం సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అక్షయ తండ్రి నరేష్…