కోహిర్ లో గణనాథుడికి 82 ఏళ్ల చరిత్ర
జహీరాబాద్ నేటి ధాత్రి:
గత రెండు రోజుల నవరాత్రుల సందర్భంగా కోహిర్ గ్రామంలోని 4వ వార్డులో 82 సంవత్సరాల చరిత్ర కలిగిన సార్వజనిక వినాయకుడి విగ్రహానికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. గత ఐదేళ్లుగా స్వచ్ఛమైన మట్టితో తయారుచేసిన విగ్రహం పర్యావరణానికి హాని కలిగించకుండా ఉండటం గ్రామ ప్రజలకు ఆనందాన్నిచ్చింది. పిల్లల ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో 9 రోజుల నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి.