
నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట పట్టణంలోని హరిజనవాడ ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 1991-92 సంవత్సరంలో ఏడో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు మంగళవారం పట్టణంలోని రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్ లో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా పూర్వ విద్యార్థులు చిన్ననాటి జ్ఞాపకాలను ఉపాధ్యాయులతో తోటి మిత్రులతో గుర్తుచేసుకొని ఆనందాన్ని వ్యక్తం చేశారు. నాడు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించుకున్నారు. ఉపాధ్యాయులు సురేందర్, సాంబయ్య, కమల, సరోజినీ దేవి, రెహమాన్, కర్ణకుమారి, రజాక్, పూర్వ విద్యార్థులు ఆగారపు స్వామి, శ్యామ్, కృష్ణ, యాకయ్య, ప్రవీణ్, నగేష్, అశోక్, శ్రీధర్, రవి, రవీందర్, రాజేందర్, శంకర్, కందుల అరుణ, యశోద, కవిత, ఉమా, సరిత, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.