నిజాంపేట లో ఘనంగా 79వ స్వాతంత్ర వేడుకలు
నిజాంపేట: నేటి ధాత్రి
79 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజాంపేట మండలం ప్రభుత్వ కార్యలయాలు, వివిధ పార్టీ కార్యాలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం లో ఎమ్మార్వో శ్రీనివాస్, స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ. రాజేష్. ఎంపీడీఓ కార్యలయంలో రాజీరెడ్డి, రైతు వేదికలో సోమలింగారెడ్డి, విద్యుత్ కార్యలయంలో ఏఈ గణేష్, కాంగ్రేస్ పార్టీ కార్యలయంలో వెంకట్ గౌడ్, గ్రామాల్లో గల పాఠశాలలలో ప్రధానోపాధ్యాయులు మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు.
