
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తేదీ:26.01.2024న కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ వారి కార్యాలయములో ఎం. షాలేం రాజు, జనరల్ మేనేజర్, కొత్తగూడెం ఏరియా ఉదయం 9.00గంటలకు జాతీయ పతాకావిస్కరణ గావించారు. ఈ కార్యక్రమములో శ్రీ ఎం. షాలేం రాజు, జనరల్ మేనేజర్, కొత్తగూడెం ఏరియా ప్రసంగించినారు.
అనంతరం కొత్తగూడెం ఏరియా ప్రధాన గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగముగా ప్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్స్ రుద్రంపూర్ లో ఉదయం 9.30 గంటలకు జాతీయ పతాకావిస్కరణ అనంతరం ఎస్&పిసి మరియు ప్రైవేట్ సెక్యూరిటి గార్డ్స్ వివిధ పాట శాలల విద్యార్ధుల కవాతును గౌరవ ముఖ్య అతిది శ్రీ ఎం. షాలేం రాజు, జనరల్ మేనేజర్, కొత్తగూడెం ఏరియా స్వీకరించారు. తదుపరి ముఖ్య అతిది శ్రీ ఎం. షాలేం రాజు ఉద్యోగులను అందరినీ ఉద్దేశించి తమ సందేశాన్ని ఇచ్చినారు. అనంతరం కొత్తగూడెం ఏరియా లో వివిధ గనుల్లో నుండి ఉత్తమ ఉద్యోగులుగా ఎంపిక కాబడిన 06 మంది ఉద్యోగులను వారి కుటుంబ సభ్యులను సన్మానించారు. అలాగే ఎస్&పిసి డిపార్ట్మెంట్ వారికి కమండేషన్ సర్టీఫికేట్లను మరియు ప్రశంసా పత్రాలను అందజేసినారు. తదుపరి పాటశాలల విద్యార్ధి విద్యార్ధులతో దేశ భక్తికి సంభధించిన వివిధ సంస్కృతిక కార్యక్రమాలను మరియు పిరమిడ్ ఫార్మేషన్ లను ప్రదర్శించి ఆహుతులందరిని అలరించినారు. చివరిగా పాటశాలల ప్రధానోపాధ్యాలు మరియు ఈ వేడుకలను విజయాల్లో బాగస్థులైన సంభాధిత డిపార్ట్మెంట్ వారిని మెమొంటో లను బహుకరించినారు. చివరగా శ్రీ ఎం. శ్రావణ్ కుమార్, డిప్యూటీ పర్సనల్ మేనేజర్, వందన సమర్పణతో ఈ కార్యక్రమము ముగిసినది.
ఈ కార్యక్రమములో శ్రీ ఎం. షాలేం రాజు, జనరల్ మేనేజర్, కొత్తగూడెం ఏరియా, SEWA అధ్యక్షురాలు శ్రీమతి జి. మధురవాణి షాలేం రాజు, ఎస్.ఓ. టు జి.ఎం. జివి. కోటి రెడ్డి, ఏరియా ఇంజినీర్ వి. దుర్గా ప్రసాద్, పద్మావతి ఖని ఏజెంట్ బి. రవీందర్, పర్సనల్ మేనేజర్, బి. శివ కేశవ రావు, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ ఎం. వేంకటేశ్వర రావు, డివై ఎస్ఈ (సివిల్) అచ్చుతరామయ్య, పద్మావతి ఖని మేనేజర్ పాలడుగు శ్రీనివాస్, జికేఓసి మేనేజర్ మురళి, ఏరియా సెక్యూరిటి ఆఫీసర్ రమణ రెడ్డి, ఏరియా వర్క్ షాప్ ఈఈ (ఈ &ఎం) అనిల్, సీనియర్ పి.ఓ. పర్సనల్ మజ్జి మురళి ఇతర అధికారులు, ఉద్యోగులు మరియు పర్సనల్ డిపార్ట్మెంట్ సిబ్బంధి పాల్గొన్నారు.
కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ. ఎం. షాలేం గారి సందేశం.
సింగరేణి సహోద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు, కార్మిక నాయకులకు, పత్రిక, మీడియా ప్రతినిదులకు మరియు గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన వివిద పాటశాలల ఆద్యాపకులకు మరియు వారి విద్యార్ధులకు మొదటిగా 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
భారత రాజ్యంగా నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ సారధ్యంలో భారత రాజ్యాంగాన్ని రూపొందించుకొని సర్వ సత్తాక సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక గణతంత్ర దేశముగా భారత దేశము అవతరించిందన్నారు. స్వపరిపాలన లక్ష్యం తో సాధించుకొన్న గణతంత్ర రాజ్యాన్ని పరిరక్షించు కొనుట మనందరి భాద్యత అని ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దేశం నలుమూలల 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించుకోనుటం అని అన్నారు.
మన దేశం ఏటేట అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ తన ప్రతిభను మరింత మేరుగుపరుచుకుంటూ అగ్ర దేశాల సరసన నిలిచింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్ధిక శక్తిగా నిలిచింది అని అన్నారు..
డిమాండ్ కి తగిన విధంగా ఇందన అవసరాలను తీరుస్తూ విద్యుత్తుతో పాటు మరిన్ని అనుబంద సంస్థలకు అవకాశాలను కల్పిస్తున్న సంస్థ మన బొగ్గు పరిశ్రమ. 137 సంవత్సరాల చరిత్ర కలిగిన మన సింగరేణి సంస్థ దక్షిణ భారత దేశం లోని ఇందన అవసరాలను తీరుస్తున్న అతి పెద్ద బొగ్గు పరిశ్రమ. బొగ్గు ఉత్పత్తి లోనే కాకుండా పవర్ ఉత్పాదనలో కూడా మన సంస్థ ముందుకు సాగుతున్నందుకు సంతోషముగా ఉన్నది. అన్ని ఏరియాలలో సోలార్ ప్లాంట్లను వేగవంతముగా నిర్మాణం చేపట్టటం జరుగుతుంది అని అన్నారు.
సంస్థ అభివృద్దికి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకొని, నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేస్తూ వినియోగుదరులకు అందించేందుకు గాను ప్రతి ఒక్కరు తమ విధులను రక్షణతో సమర్దవంతంగా, సక్రమంగా, నిజాయితీతో నిర్వహిస్తూ సంస్థ అభివృద్దికి కృషి చేయవలసి ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.
2023-24 సంవత్సరానికి కొత్తగూడెం ఏరియాకి నిర్దేశించిన లక్ష్యం 154.50LT గాను నేటి వరకు (24.01.2024) 117.15LT గాను 94% శాతంతో 110.23LTలు ఉత్పత్తి సాదించటం జరిగినది. కొత్తగూడెం ఏరియా విస్తరణలో భాగముగా మరియు జికేఓసి మూసివేస్తున్నందున ప్రస్తుతము ఉన్న వికే-7 భూగర్భ గనిని వికే ఓపన్ కాస్ట్ గా చేయుటకు 3ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాలను నిర్వహించి పర్యావరణ అనుమతి వచ్చిన వెంటనే ప్రారంభించడం జరిగిందని అన్నారు.
ఈ ఆర్ధిక సంవత్సరంలో తేదీ:24.01.2024 వరకు 124.24లక్షల టన్నులు బొగ్గును రవాణా చేయటం జరిగింది. రైలు మార్గం ద్వారా తేదీ: 24.01.2024 వరకు 99.90 లక్షల టన్నులను 2517 రేకుల ద్వారా ఆర్సిహెచ్పి మరియు జేవిఆర్ సిహెచ్పి నుండి బొగ్గు రవాణా చేయటం జరిగింది. మరియు రోడ్డు మార్గంలో 25.33 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేశామన్నారు.
కొత్తగూడెం ఏరియాలో 37 ఎండబ్ల్యూ సోలార్ ప్లాంట్ ను నిర్మించటం జరిగింది. : 24.01.2024 వరకు 125.66 మిలియన్ యూనిట్ ల సోలార్ విద్యుత్ ను ఉత్పతి చేయటం జరిగింది. భవిష్యత్ లో 10.5మరియు 22. సోలార్ ప్లాంట్ ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇవి త్వరలో పూర్తి కానున్నవని తెలియజేశారు.
2023-2024 ఆర్ధిక సంవత్సరానికి కొత్తగూడెం ఏరియా నుండి సి.ఎస్.ఆర్ బడ్జెట్ 2.18 కోట్లకు గాను 64 లక్షలను ఇప్పటివకు వినియోగించటం జరిగింది. మిగిలిన బడ్జెట్ 1.54 కోట్ల పనులు ఇంకా జరుగుతున్నవి మరియు జరగాల్సినవి అన్నారు.
వీకే ఓ సి పబ్లిక్ హియరింగ్ ను విజయవంతంగా నిర్వహించటం జరిగింది మరియు పర్యావరణ అనుమతులు రాగానే. వీకే ఓ సి ని ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు.
* కొత్తగూడెం ఏరియాలో 3 ఇంక్లైన్ బంగ్లాస్ వద్ద 83 ఆఫీసర్ క్వార్టర్ లను, మైన్స్ రెస్క్యూ స్టేషన్ వద్ద 60 ఎంసీ – టైప్ క్వార్టర్ లను, రుద్రంపూర్ ఏరియాలో 210 – ఎండి టైప్ క్వార్టర్ లను మరియు సత్తుపల్లి నందు 81 ఆఫీసర్ క్వార్టర్ లను సుమారు 174.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలియజేశారు.
2018 నుండి మెడికల్ ఇన్ వాలిడేషన్ / మరణించిన 706 మంది కార్మికుల వారసులకు కారుణ్య నియమకాలలో భాగంగా ఇప్పటివరకు 596 కార్మికుల వారసులకు ఉద్యోగాలను ఇవ్వటం జరిగింది మరియు 60 మంది కార్మికులకు లేదా వారి కుటుంబ సభ్యులకు ఏకమొత్తం ఎల్ పి ఎస్. ను 25 లక్షల చొప్పున ఇవ్వటం జరిగింది.
2018 నుండి ఇప్పటివరకు 2558 CPRMS సి పి ఆర్ ఎం ఎస్ హెల్త్ కార్డ్ లకు గాను 2529.సిపిఆర్ఎంఎస్ హెల్త్ కార్డ్ జారీ చేశామన్నారు.
2023వ సంవత్సరంలో 166 గ్రాట్యుటీ క్లెయిమ్ లకు గాను 85 క్లైమ్ లను సెటిల్ చేయటం జరిగింది. మిగిన 81 క్లైమ్ లను క్వార్టర్ ఖాళీ చేయకపోవటం వలన చెల్లించలేక పోయామన్నారు.
2023వ సంవత్సరంలో 166 ఎంప్లాయీ పెన్ సన్ క్లైమ్ లను, 71 విడో పెన్ సన్ క్లైమ్ లను సెటిల్ చేశామన్నారు.
2023వ సంవత్సరంలో 135 మందికి ఎస్ఎల్పి/ఎస్ఎల్ఐ ప్రమోషన్స్ మరియు టైమ్ రేటెడ్ వేకన్సి క్రింద 26 మందికి మరియు 64 మందికి క్యాడర్ స్కీమ్ క్రింద ప్రమోషన్ ఇవ్వడం జరిగిందన్నారు.
2023వ సంవత్సరంలో 320 మంది ఉద్యోగులకు కంపనీ నియమాలను అనుసరించి ఇంటి వడ్డీ మొత్తాన్ని చెల్లించమన్నారు.
సింగరేణి సేవా సంస్థ. ద్వారా రుద్రంపూర్, గౌతమ్ పూర్, ములుగు గూడెం (పెనగడప), ప్రశాంత్ నగర్ (రామవరం) మరియు సత్తుపల్లి ప్రాంతాలనందు టైలరింగ్, మగ్గం వర్క్, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులలో సుమారు 190 మంది నిరుద్యోగ పరిసర ప్రాంత మహిళలు శిక్షణ పొందుతున్నారు మరియు సుమారు ఎనిమిది కోర్సులను త్వరలో ఈ ప్రాంతాలలో ప్రారంభించబోతున్నామని తెలియజేశారు.
ప్రాజెక్ట్ ప్రభావిత మరియు పరిసర ప్రాంతాల కాలనీలు/గ్రామాలలో ఉచిత మెడికల్ క్యాంప్ లను నిర్వహించడం జరిగింది. 25 పరిసర ప్రాంతాల కాలనీలు/గ్రామాలలో సుమారు 40 మెడికల్ క్యాంప్ లను నిర్వహించి సుమారు 4200 మందిని పరీక్షించి తగిన మందులను ఉచితంగా ఇస్తునమని ఈ సందర్బంగా తెలియజేశారు.