జైపూర్, నేటి ధాత్రి:
సివిల్ సర్వీసెస్ ఎంతోమందికి చిరకాల స్వప్నం. ఆ కలను సాకారం చేసుకునేవాళ్లు కొంతమంది మాత్రమే ఉంటారు. సంవత్సరాల తరబడి నిరంతరాయంగా ఏకాగ్రతతో కృషిచేసి, పరిస్థితులకు తలవంచని బలమైన సంకల్పంతో, అలుపెరగని కఠోర దీక్షతో, పట్టుదలతో ప్రయత్నిస్తేనే సివిల్ సర్వీసెస్ అనే కల నెరవేరుతుంది. జాతీయ స్థాయిలో లక్షల మందితో పోటీపడి ముందు వరుసలో ర్యాంకు సంపాదించడం అంత సాధ్యమైన విషయం కాదు అలాంటి ఘనత మన మంచిర్యాల జిల్లా ఎసిపి వెంకటేశ్వర్లు కుమారుడు విశాల్ సివిల్ సర్వీసెస్ లో 718 ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. మంగళవారం సివిల్ సర్వీసెస్ విలువరించిన ఫలితాలు జైపూర్ ఎసిపి గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు కుమారుడు విశాల్ జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి 718 వ ర్యాంక్ సాధించాడు. అదిలాబాద్ మండలంలోని చాందా(టి) గ్రామం వీరి స్వస్థలం వృత్తిరీత్యా మంచిర్యాల జిల్లా జైపూర్ మండల ఏసిపిగా వెంకటేశ్వర్లు విధులు నిర్వహిస్తున్నారు. తమ అబ్బాయి విశాల్ జాతీయస్థాయిలో ప్రతిభ చూపడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. అలాగే యూపీఎస్సీ ఫలితాల్లో 50 మందికి పైగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన యువతీ యువకులు ఉండటం ఎంతో హర్షించదగ్గ విషయం. యువతరం వీటిని స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత శిఖరాలను చేరుకోవాలి.
