భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపాలిటీలో కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారయణ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 6 గురు మున్సిపల్ కౌన్సిలర్లు, ఇద్దరు కోఆప్షన్ సభ్యులు హస్తం గూటికి చేరడం తో భూపాలపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలోకి చేరే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ను విడిన కౌన్సిలర్లకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కౌన్సిలర్లు శిరూప అనిల్, పిల్లలమర్రి శారద నారాయణ, కొక్కుల స్వరూపరాణి, ముంజంపల్లి మురళీధర్, సజ్జనపు స్వామి, పానుగంటి హారిక శ్రీనివాస్, కో ఆప్షన్ సభ్యులు మొహమ్మద్ ఇర్ఫాన్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది.