సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి
ఎల్లారెడ్డిపేట(రాజన్న సిరిసిల్ల) నేటిధాత్రి
హిమాం హలీ హంజ దర్గా ఉత్సవం సందర్భంగా ప్రతి ఏటా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాపయ్య పటేల్ బంగ్లా సమీపంలో ఉన్న దర్గాలో ఉర్సు ఉత్సవం నిర్వహిస్తుంటారు. ఉర్సు ఉత్సవానికి సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి 5వేల ఆర్థిక సహాయాన్ని శనివారం తన నివాసంలో అందజేశారు. వేడుకను ఘనంగా నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ అధ్యక్షులు రఫిక్, అలీమ్, లాల్ మహమ్మద్, ఎండి రషీద్, ఎండి బాబా తదితరులు పాల్గొన్నారు.