5 నెలల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి

సిఐటియు ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికుల నిరసన

భద్రాచలం నేటి ధాత్రి

ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదలను చేయాలని కోరుతూ సిఐటియు భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏరియా హాస్ప ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు కే బ్రహ్మచారి మాట్లాడుతూ భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో కొత్త కాంట్రాక్టర్ వచ్చిన దగ్గర నుండి కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. గత ఐదు నెలల నుండి వేతనాలు లేకుండా కార్మికులు ఎలా పనిచేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు విడుదల చేయాలని గత ఫిబ్రవరి నెలలో ధర్నా నిర్వహించగా ఆసుపత్రి సూపర్డెంట్ రామకృష్ణ ద్వారా ఐటిడిఎపిఓ జీతాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారని ఆ హామీ నేటికీ అమలు కాలేదని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసి ఐదు నెలల పెండింగ్ వేతనాలు ఇస్తేనే కార్మికులు పనిలోకి వెళ్తారని ఆయన హెచ్చరించారు. అనంతరం హాస్పటల్ సూపర్డెంట్ ఆదేశాల మేరకు హాస్పిటల్ ఆర్ఎమ్ఓ రాజశేఖర్ తో చర్చలు జరపగా ఈనెల 9 తారీఖు నాటికి పెండింగ్ ఐదు నెలల జీతాలు పై అధికారులతో మాట్లాడి ఎకౌంట్లో వేస్తామని సూపర్డెంట్ ఎం రామకృష్ణ హామీ ఇచ్చారు. అనంతరం కార్మికులు సమ్మె నోటీసు అందించారు.
ఈనెల 9న కార్మికుల ఎకౌంట్లో వేతనాలు పడకుంటే పది నుండి సమ్మెలోకి వెళ్తామని కార్మికులు హెచ్చరించారు. వేతనాలు విడుదల చేయకుంటే కార్మికులు దిగేస్ సమ్మెకు ప్రభుత్వం ఐటీడీఏ పీవో మరియు ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి సంఘీభావం తెలపగా సిఐటియు సీనియర్ నాయకులు బండారు శరత్ బాబు, వైవి రామారావు, పి సంతోష్ కుమార్, ఎన్ నాగరాజు, ఉపేందర్, ఉబ్బ రమా, కృష్ణ, శ్రీకాంత్, రమాదేవి, నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!