ప్రైవేట్ స్కూళ్లలో పేద పిల్లలకు 25శాతం సీట్లు ఇవ్వాలి
మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మైస.ఉపేందర్ మాదిగ
పరకాల నేటిధాత్రి
ప్రైవేట్ స్కూళ్లలో పేద పిల్ల లకు 25% సీట్లు కేటాయించి, విద్యా హక్కు చట్టం అమలు చేయాలని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మైస.ఉపేందర్ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం ఆయన మాట్లాడుతూ కేంద్రం రూపొందించిన విద్యా హక్కు చట్టం 2009 అమల్లోకి వచ్చినప్పటికీ రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదని ప్రశ్నించారు.విద్యాహక్కు చట్టం 2009లోని సెక్షన్ 121సీ ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లను
కేటాయించాల్సి ఉందన్నారు. ప్రభుత్వం చొరవతిసుకొని ప్రైవేట్ స్కూల్ లలో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.