రామకృష్ణాపూర్ ,నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పట్టణంలోని సూపర్ బజార్ ప్రాంతంలో గల షిరిడి సాయిబాబా దేవాలయపు 24వ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని సోమవారం ఆలయ కమిటీ ప్రధాన అర్చకులు గట్టు సుభాష్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సాయిబాబా విగ్రహానికి పూజ నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఆలయ ప్రాంగణంలో సాయినాథుడికి ప్రత్యేక అభిషేకము, హోమము, తీర్థప్రసాదాలు సాయినాధుడికి హారతులు, భక్త బృందం భజన కార్యక్రమం, పల్లకి సేవ వంటి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించినట్లు ప్రధాన అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు గట్టు సుభాష్ శర్మ మాట్లాడుతూ… దేవాలయపు 24 సంవత్సరాల వార్షిక మహోత్సవ కార్యక్రమాన్ని శాస్త్ర యుక్తంగా షిరిడి సాయి నాధుడికి సమస్త భక్తుల సహకారంతో సాయిబాబా కు అనేక రకమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. సాయినాధుడి మహిమతో దేవాలయం బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని,భక్తులు సాయి బాబా పట్ల భక్తి శ్రద్ధ వహించి దేవాలయ అభివృద్ధికి పాల్పడుతున్నారని అన్నారు.