బిజెపి సీనియర్ నాయకుడు తడుక అశోక్ గౌడ్.
నల్లబెల్లి,నేటిధాత్రి: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 22వ తేదీన సెలవు రోజుగా ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు తడుక అశోక్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు.ఈ నెల 22వ తేదీన అయోధ్యలో జరగబోయే రామమందిరంలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం యావత్ ప్రపంచ ప్రజలందరు ఎదురుచూస్తున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 22వ తేదీన సెలవు దినం గా ప్రకటించక పోవడం సిగ్గు చేటుఅని ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా వెంటనే చొరవ తీసుకొని 22వ తేదీన సెలవు దినంగా ప్రకటించి దైవ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములయ్యేలా చూడాలని కోరారు.ప్రపంచ నలు దిశల అయోధ్య మందిరం ప్రాణ ప్రతిష్ట దైవ కార్యక్రమం కోసం ప్రజలందరు చూడటం చాలా సంతోషకరం అని ఆయన అన్నారు