21న ఎస్‌ఆర్‌ఎవిఎస్ ఆధ్వర్యంలో 10కె రన్
ఎస్‌ఆర్‌ఎవిఎస్ ఫిట్‌నెస్ జోన్ ఆధ్వర్యంలో ఈనెల 21వ తేదీన 10కె మారధన్ రన్ నిర్వహిస్తున్నామని నిర్వాహాకురాలు స్రవంతిరెడ్డి తెలిపారు. బుధవారం హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎస్‌ఆర్‌ఎవిఎస్ ఫిట్‌నెస్ జోన్ ఆధ్వర్యంలో వరంగల్ ఐఎంఎ, బంధన్ సెరిమిక్ ప్రైవేట్ లిమిటెడ్ సౌజన్యంతో ఈ 10కె రన్‌ను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ రన్ ఈనెల 21వ తేదీ ఉదయం 5.30గంటలకు సుబేదారి ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియం నుండి ప్రారంభమవుతుందని అన్నారు. ఈ రన్‌లో పాల్గొనదలిచిన వారు 500రూపాయలు చెల్లించి తమ పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు. పాల్గొన్న వారికి టి-షర్లు, బిడ్ నెంబర్, సర్టిఫికేట్, మెడల్, పండ్ల రసాలు అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, వరంగల్ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ వి.రవీందర్ హాజరవుతారని తెలిపారు. ఈ రన్‌లో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా 10వేల రూపాయలు, ద్వితీయ బహుమతిగా 5వేల రూపాయలు, తృతీయ బహుమతిగా మూడువేల రూపాయలు అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వచ్చిన ఆదాయాన్ని తలసేమియా బాదితులకు అందజేస్తామని ఐఎంఎ రెసిడెంట్ నల్ల సురేందర్‌రెడ్డి, బంధన్ డైరెక్టర్ శ్రవన్, స్రవంతిరెడ్డి, టీంసభ్యులు సంగీతనాయుడు, మాధవి తెలిపారు.