మృతుని కుటుంబానికి బియ్యం అందజేత
–ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామి నాయక్ సహకారంతో
–సర్పంచ్ బాషబోయిన ఐలేయ్య
ఖానాపురం నేటిధాత్రి:ఖానాపురం మండలంలోని రాగం పేట గ్రామానికి చెందిన యాసాల కొమురయ్య కొద్ది రోజుల క్రితం మృతి చెందగా అతని కుటుంబానికి ఓడిసిఎంఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్ ఒక క్వింటా బియ్యం పంపించగా సోమవారం రోజు అనగా గురువారం సర్పంచ్ బాషబోయిన ఐలయ్య ఆధ్వర్యంలో మృతుని కుటుంబానికి అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు ఏపూరి వెంకన్న,దుగ్యాల రాజేశ్వర్ రావు, అన్నెబొయిన లింగయ్య,అన్నెబొయిన ఎల్లయ్య,కప్పల శ్రీనివాస్,తడుగుల సాంబరాజు,కుందనపెళ్లి కృష్ణ గ్రామస్థులు పాలగిన్నారు.