ఆశ చిగురించడం అంటే ఇదే….వారిలో ఒక నమ్మకం కలగడం అంటే ఇదే…కొన్ని సార్లు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కకపోవచ్చు. కొన్ని సార్లు మనసులో తలుకున్నప్పుడే నెరవేరొచ్చు. దాన్ని అదృష్టమంటారో…లేక మరేమంటారో గాని సంతోషం నిండడం ముఖ్యం. కల నెరవేరడం ఆనందం. కళ్లముందు భవిష్యత్తు మళ్లీ ఆశాజనకంగా కనిపించడం అన్నది గొప్ప అనుభూతి సాక్ష్యాత్కారం. తాము వెతుకుతున్న తీగ కాలికి తగలడం అంటే నేటిధాత్రిని ఆశ్రించడమే అంటూ హోంగార్డులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఒక ప్రయత్నం ఫలించింది. అది ప్రభుత్వ పెద్దలదాక వెళ్లింది. వారి పరిశీలకు నోచుకున్నది. వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. పాలకపక్షం పెద్దల్లోకూడా బాధితులైన హోంగార్డులకు న్యాయం చేయాలన్న ఆకాంక్ష కనిపించింది. పదేళ్లగా పడుతున్న ఇబ్బందులు కూడా మర్చిపోయేలా నేతలు స్పందించడం అన్నది కూడా బాధితులకు ఆనందాన్ని తెచ్చింది.
గత పదేళ్లుగా ఉద్యోగాలు పోయిన నాటినుంచి రోజూ తిరుగుతూనే వున్నారు. సభలు, సమావేశాలంటూ ఏదో హడావుడి చేస్తూనే వున్నారు. కాని కాలం గడుస్తున్న కొద్ది ఆశలు ఆవిరైతూ వచ్చాయి. అటు ఉద్యోగ సాధన, ఇటు కుటుంబ పోషణ. ఈ రెండూ ఏకకాలంలో చేసుకుంటూ పోతే తప్ప భవిష్యత్తు లేదు. పగలంతా కుటుంబపోషణ కోసం కూలీ, నాలీ పనులు చేసుకున్నారు. సమయం చిక్కినప్పుడల్లా మళ్లీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఇలా తిరుగుతూనే వున్నారు. కూలీ,నాలితో వచ్చే డబ్బులతో అటు కుటుంబానికి, ఇటు ఉద్యోగ ప్రయత్నాలకు ఖర్చు చేస్తూ బతుకులీడుతున్నారు. ఏన్నటికైనా మళ్లీ ఖాకీ దుస్తులు వేసుకోకుండాపోతామా? అన్న ఆశతోనే ఎదురుచూస్తున్నారు. అయితే వీళ్లు తమ కోర్కెల సాధనలో కూడా సమయం చాలా కోల్పోయారు. ఉద్యోగాలు తొలగించిన నాడే ప్రతిఘటించాల్సి వుండేది. కాని ఆ పని చేయలేదు. కారణం ఏదైనా! ఇంత కాలానికి వారికి ఒక దారి దొరికనట్లైంది. వారి కళ్లలో ఆనందం కనిపించే రోజులు సమీపించే మాటలు వినిపిస్తూ వస్తున్నాయి. గత వారం రోజులగా వారి జీవితాలకు కొత్త వెలుగులు వచ్చే అవకాశం కనిపిస్తోందన్న నమ్మకం వారిలో కల్గుతోంది. మీరు త్వరలో మంచి శుభవార్త వింటారు. మీరు ప్రగతిభవన్‌కు వచ్చే సమయం ఆసన్నం కావొచ్చు. మీ ఆశలు నెరవేరేమార్గం కనిపించొచ్చు. అంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అనడంతో వారిలో గతంలో ఎన్నడూ లేని భరోసా కనిపించింది.
నేటిధాత్రి దగ్గరకు వచ్చిన నాటినుంచి…: కాలం కలిసొస్తే చాలు…సాగాల్సిన పనులన్నీ సజావుగా సాగుతాయంటే ఇదేనేమో! గతంలో ప్రతిపక్ష పార్టీల నేతలచుట్టూ, ప్రతిపక్ష ఎమ్మెల్యేల చుట్టూ తిరిగారు. ఎలా ముందుకు సాగాలో తెలియలేదు. ప్రజాసంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులను కలిశారు. అయినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఏ కృతికి ఆ మంత్రం చెప్పాలని పెద్దలు ఊరికే అనలేదు. ఆఖరుకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి వద్దకు వెళ్లారు. నేటిదాత్రి అక్షరాలు ఒక దిశ, దశను మీకు చూపించే ప్రయత్నాలు చేస్తాయని వారికి చెప్పారు. కొంత కాలంగా నేటిధాత్రిని కలుస్తూ వచ్చిన హోంగార్డుల సమస్యలను విని నేటిధాత్రి చలించింది. వారికి ఏదైనా దారి దొరికేలా చూడాలని అక్షర సంకల్పం మొదలు పెట్టింది. పదేళ్ల క్రితం అన్యాయంగా ఉద్యోగాలు కోల్పోయారు. వారి తరుపున నాడు మాట్లాడిన వారు లేరు. వారికి అండగా నిలిచిన వారు లేరు. ఉద్యోగ సంఘాలు మద్దతుగా రాలేదు.
ఏం జరుగుతుందో తెలిసే లోపే వారి జీవితాలకు కొలువులు లేవు. జీతాలు రావన్న నిజం తెలుసుకున్నారు. అయితే అప్పుడప్పుడూ మళ్లీ వారి చేత బందోబస్తు లాంటి పనుల నిర్వహణ అప్పగించడంతో వారి ఆశలు సజీవమే అనుకున్నారు. కాని ఎండమావులౌతాయని అనుకోలేదు. రాను రాను ఆశలు ఆవిరైపోయాయి. ఇక ఆ కొలువులు మావి కావన్న నిర్ణయానికి వచ్చారు. కాని అందులో కొందరు మాత్రం పట్టువదలని విక్రమార్కుల్లా వీలు చిక్కినప్పుడే కాదు, వీలు చేసుకొని మరీ ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆ క్రమంలో వాళ్లు నేటిధాత్రిని కలవడం జరిగింది. వారి సమస్యలు అక్షరబద్దం చేసింది. నేటి ధాత్రి వారు పడుతున్న ఇబ్బందులను వెలుగులోకి తెచ్చింది. మొదటిసారి నేటిదాత్రి సూచనల మేరకు నడుచుకున్నారు. ప్రభుత్వ పెద్దలను కలిశారు. వారికి వారి సమస్యలు విన్నవించారు. వారిని కూడా కదిలించగలిగారు. వారి సమస్య పరిగణలోకి తీసుకునేలా చేశారు.
నిన్నటిదాకా ఆవేదనతో కళ్లలో కన్నీళ్లు చూసిన వాళ్లు, ఆనందంతో కూడ ఆనంద బాష్పాలు చూస్తామని అనుకోలేదని చెప్పుకుంటున్నారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ స్పందించడం జరిగింది. వారికి న్యాయం చేయాలన్న ఆలోచనతో ఇప్పటికే రాష్ట్ర డిజిపికి ఉత్తరం కూడా రాయడం జరిగింది. హోంగార్డుల సమస్యలను వెంటనే అధ్యయనం చేయాలని కోరడం జరిగింది. అదే విధంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా వారికి ఎంతో భరోసా కల్పించడం జరిగింది. మంచిరోజులోస్తాయని ఆయన స్వయంగా చెప్పడం కూడా జరిగింది. మరో మంత్రి జగదీష్‌రెడ్డి కూడా ముఖ్యమంత్రితో మాట్లాడతామని అన్నారు. వీరందరినీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికూడా సమన్వయం చేయడానికి ముందుకొచ్చారు. నమ్మకం అన్న మాట కూడా మనిషినే కాదు, జీవితాలను నిలబెడుతుందనడానికి ఇదే నిదర్శనం. రేపటి తరానికి ఒక సంకేతం…ఇది నేటిధాత్రి అక్షర విజయం. ఒక కదలికను తెచ్చిన వేళా విశేషం. ఏది ఏమైనా 200 కుటుంబాల్లో మళ్లీ తెలుగు సంవత్సరాధి శుభకృతి నుంచి మంచి రోజులు మొదలు కావాలని మనసారా కోరుకుందాం…
శాయంపేట, నేటిధాత్రి: తెలంగాణా రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యపు చివరి గింజ వరకు కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని గోవాలో నిరసన తెలిపిన తెలంగాణ ఉద్యమకారులు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. తెలంగాణ రాష్ట్ర సమితి టఆర్ఎస్ పార్టీ పిలుపుమేరకు తెలంగాణ ఉద్యమకారులు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నిమ్మల మహేందర్, గంట శ్యామ్ సుందర్, అశోక్ గోవాలో తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం చివరి గింజ వరకు కొనాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ నిరసనలో వారి వెంటకుమారస్వామి, పరమేష్ పాల్గొన్నట్లు తెలిపారు.
స్టేషన్ ఘన్‌పూర్ నేటిధాత్రి: మండల కేంద్రంలో సోమవారం బీజేవైఎం మండల అధ్యక్షులు రాజ్ కుమార్ నాయక్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశంలో ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా పూండ్రు నవీన్ రెడ్డి హాజరై మాట్లాడుతూ …డ్రగ్స్ కట్టడి చేయడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది అని అన్నారు.ఈ కార్యాక్రమంలో బీజేపీ కార్యదర్శి ఆరోగ్యం , మధు, బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు ఉదయ్ కిరణ్,తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ , నేటిధాత్రి : పగవాడికి కూడా ఇలాంటి కష్టం రావొద్దని పెద్దలు ఎందుకున్నారో…కొలువులు కోల్పోయిన హోంగార్డులను చూస్తే అర్ధమౌతుంది. ఇక్కడ ఒక్కొక్కరిదీ ఒక్కో చరిత్ర. ఆ కుటుంబాల పరిస్థితి వింటే విలపించుకుండా ఎవరూ వుండలేరు. కన్నీరు కార్చకుండా ఆపుకోలేరు. అంతటి దయనీయమైన గాధలు కొందరివి. సరే బతికున్నవారు ఎన్నటికైనా మా కొలువులు రాకపోతయా? అన్న ఆశతో బతుకుతున్నారు. అందరినీ కలిసి వేడుకుంటున్నారు. నేడు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండన్న ఆశల్లోనైనా వాళ్లు ఆకలి చంపుకుంటూ బతుకుతున్నారు. కన్నీళ్లతో దాహం తీర్చుకుంటున్నారు. అలాంటి వారితోపాటు ఆఖరి శ్వాస వరకు కొలువును కలవరించి ప్రాణాలు విడిచిన వారు కూడా వున్నారంటే ఇక ఆ కుటుంబ సభ్యుల బాధలు వర్ణణాతీతం…అలాంటి వారిలో కోదాడకు చెందిన రమేశ్ అనే హోంగార్డు గత ఏడాది కరోనా కాటుకు బలయ్యాడు. అర్ధాంతరంగా తనువు చాలించాడు. ఆ కుటుంబం వీధినపడిరది. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయింది. పోషించే కుటుంబ పెద్ద రమేశ్ కాలం చేశాడు. ఆ కుటుంబానికి భవిష్యత్తు శూన్యమైంది. వారి జీవితాలను నల్లమబ్బు కమ్మేసింది. కాలం కాటేసింది. కానరాని లోకాలకు ఇంటి యజమానికి తీసుకెళ్లింది. వారి బాధ ఎవరు తీర్చుతారు? ఎవరు ఆదుకుంటారు? సానుభూతి చూపినా అయ్యో! అంటారే గాని అంతకు మించి ఏం చేయగలరు. అది కూడా ఒకరోజు,రెండు రోజులు పరామర్శిస్తారు. అంతకు మించి ఎవరూ ఏమీ చేయలేరు. ఆ తర్వాత నాలుగుసార్లు ఎదురుబడితే పక్కకు తిరిగిపోతారు. అది వాళ్ల తప్పు కాదు. వ్యవస్ధ అలాగే తయారైంది. ఒకరికి ఎల్లకాలం సేవ చేసేంత స్ధోమత ఐనవారికి కూడా లేకుండాపోయింది. అది కూడా ఒక కారణం. ఇలాంటి పరిస్ధితిని ప్రత్యక్ష్య నరకంగా అనుభవిస్తున్న రమేష్ భార్య తన దీన స్ధితిని నేటిధాత్రితో చెప్పుకొని కన్నీటి పర్యంతమైంది….ఆమె మాటల్లోనే బతుకంటే ఎంత బరువైందో…ప్రాణమంటే ఎంత నరకమైందో…జీవితం ఎంత దుర్భరంగా వుంటుందో విందాం…ప్రభుత్వం దృష్టికి ఆమె మాటలు వెళ్లి, ఆ కుటుంబంలో వెలుగు నిండాలన్నదే అందరి ఆశ….` జ్యోతి
జీవితం జ్యోతిలా జీవితాంతం వెలుగాలని ఆమె తల్లిదండ్రులు కోరికోరి ఆ పేరు పెట్టుకున్నారు. కాని ఆ వెలుగు మధ్యలోనే ఆరిపోయింది. జీవితం అంధకారమైంది. జీవితాంతం తోడుంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి, మంగళవాయిద్యాల మధ్య బాగస్వామిని చేసుకున్న భర్త, ప్రమాణం మర్చిపోయాడు. జ్యోతిని ఒంటరిని చేసి వెళ్లిపోయాడు. కాలం మాటను కనుమరుగైపోయాడు. పోతూ పోతూ ఇద్దరు పిల్లల్ని కూడా చేతిలో పెట్టి తన రుణం తీరిపోయిందన్నాడు. కారణం ఎవరు? సమాధానం ఎవరు చెప్పాలి? కాలం చెప్పాలా? దేవుడు చెప్పాలా? ఈ సమాజం చెప్పాలా? కొలువిచ్చిన వ్యవస్ధ చెప్పాలా? ఆ జ్యోతి ఎవరిని ప్రశ్నించాలి? ఎవరిని నిందించాలి? తన జీవితం ఇలా ఎందుకయ్యిందని ఎవరికి మొరపెట్టుకోవాలి? ఓ కుటుంబంలో ఎవరికైనా జ్వరం వస్తేనే అందరూ విలవిలలాడిపోతారు. అలాంటిది మనిషే దూరమైతే…మనుషులే కానరాని లోకాలకు వెళ్లిపోతే ఆ నరకం మాటల్లో వర్ణించలేదనిది. వారి బాధ తీరలేనిది. ఆ ఇంటికి రమేష్ కుటుంబ పోషకుడు. తల్లి, తండ్రి..అన్న, వదిన. పిల్లలు. తన చిన్న కుంటుంబం. హాయిగా కాలం సాగతున్న వేళ కాలానికి కన్నుకుట్టింది. ఉన్న ఫలంగా ఉద్యోగం పోయింది. ఎందుకు పోయిందో అర్ధం కాదు. ఉద్యోగం వచ్చి హోంగార్డు కొలువు వచ్చి ఏడెనమిదేళ్లకు రమేశ్ పెళ్లి చేసుకున్నాడు. జ్యోతి కూడా రమేశ్‌కు కొలువుందని కోటి ఆశలతో పెళ్లి చేసుకున్నది. పెళ్లయిన నాటి నుంచి జీతం చిన్నదైనా గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాడు. జ్యోతికాలు బైట పెట్టకుండా పోషించుకున్నాడు. ఉన్నదానిలో సంతృప్తి పడాలని, భవిష్యత్తు బంగారంగా వుంటుందన్న ఆశలు కల్పించాడు. కాని విధి కాటేసింది…కాలం రమ్మని లాక్కెల్లింది. జ్యోతి జీవిత ప్రయాణం చీకటైంది. ఇదే పెద్ద నరకమనుకుంటే, అదే ఏడాది అత్త, మామ, హోంగార్డు రమేశ్ సోదరుడు కూడా చనిపోయారు. ఇదేంటి కాలం పగబట్టినట్టే కుటుంబాన్నంతా పట్టుకెళ్లింది. జ్యోతిని ఒంటరిని చేసింది. ఆ కుటుంబంలో ఇద్దరు కోడళ్లు మిగిలారు. కొడుకులు పోయారు. ఏం జరుగుతుందో అర్ధయ్యేలోపే అందరూ దూరమయ్యారు. ఇల్లు చీకటైంది. కుంటంబం బారమైనరకాన్ని ఇలలోనే చూపిస్తోంది. ` ఆఖరి శ్వాస వరకు నా కొలువు…అంటూ…తనువు చాలించాడు? జ్యోతి చెప్పిన కొన్ని విషయాలు వింటుంటే గుండె తరక్కు పోక మానదు. ఎప్పుడైతే కొలువు పోయిందో అప్పటినుంచి రమేశ్ ఇటు కూలీ పనులు చేశాడు. దాంతో పాటు పోయిన కొలువు ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నాడు. పదేళ్లు కడుపు నిండా తిన్నది లేదు. కంటినిండా నిద్రపోయింది లేదు. నిద్రలోనూ కొలువు గురించే కలవంతరింతలు. ఎన్నటికైనా ముఖ్యమంత్రి కేసిఆర్ తమ కొలువులు తమకు ఇస్తాడన్న మాటలే చెప్పేవాడు. ఇదే సమయంలో వచ్చిన కరోనా మహామ్మారి బారిన పడి మరణించాడు. అతని వైద్యం కోసం వున్న అర ఎకరం అమ్మేసింది. రమేశ్ వైద్యం కోసం అందిన కాడల్లా చేసిన అప్పులు ఇప్పుడు చెల్లించాల్సివుంది. ఇదిలా వుంటే వరుసగా కుటుంబంలోని పెద్దలంతా వరుస కట్టి ఏడాదిలో అందరూ తనవు చాలించారు. కరోనా కాటుకు బలయ్యారు. వారి వైద్యం కోసం కూడా అనేక చోట్ల అప్పులు చేయాల్సివచ్చింది. జ్యోతికి ఇద్దరు పిల్లలు. అమ్మాయి. అబ్బాయి. కరోనా తీవ్రంగా బాధపడుతున్న సమయంలోనూ తనకు ఏం కాదని, ఆరోగ్యం కుదుటపడి, కొలువుతోనే పోతాననేవాడు రమేశ్. ఆ మాట నిత్యం కలవరిస్తుండేవాడు. ఈ మాటలు జ్యోతి చెబుతుంటే హృదయం ద్రవించిపోయింది. ఇలాంటి పరిస్ధితి ఎదుర్కొంటున్న మరో మూడు కుటుంబాల బాధలు ఇలాగే వున్నాయి. వారిలో హోంగార్డులు ఎన్. శ్రీను. ఎన్. నాగరాజు. డి. యాకూబ్‌నాయక్‌లున్నారు. ఆఖరి క్షణాల్లో కూడా కొలువు కోసం కలవరిస్తూనే ప్రాణాలొదిలారంటే ఆ ఉద్యోగాల మీద వారికున్న మక్కువ ఎలాంటిదో తెలియజేస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని, పోలీసు డిపార్టుమెంటు ఈ హోంగార్డులపై మానవతా దృక్పధతంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
సీఎం కేసిఆర్ ఆదేశాలిస్తే 200 కుటుంబాల్లో వెలుగులు ` పోయిన కొలువులు వస్తాయని ఎదరుచూపులు ` మంత్రులందరినీ కలిసి కన్నీళ్లు పెట్టుకున్న హోంగార్డులు ` కనిపించిన నాయకుల కాళ్లు పట్టుకుని వినతులు ` ఉద్యోగ సంఘాల నాయకులతో మొర పెట్టుకున్నా ఫలితం శూన్యం ` కుల సంఘాల నాయకుల చుట్టూ ప్రదక్షిణాలు ` ఆత్మగౌరవంతో బ్రతాకాలనే కోరిక చావక ఇబ్బందులతో తనువు చాలిస్తున్న అభాగ్యులు ` ఇప్పటికే పలు కారణాలతో నలుగురి మృతి ` హామీ నేరవేర్చి బ్రతుకు భరోసా ఇవ్వాలని వేడుకుంటున్న కుటుంబాలు
హైదరాబాద్ , నేటిధాత్రి : పోయిన కొలువుల కోసం వాళ్లు ఎక్కని మెట్టు లేదు. మొక్కని దేవుడు లేడు. తెలంగాణ సాధన కోసం ఉద్యమకాలంలో ముఖ్యమంత్రి కేసిఆర్ ఎంతో మందిని కలిశారు. ఎన్నో పార్టీలతో ఉత్తరాలు రాయించారు. ఎక్కే గడప,దిగే గడప అన్నట్లు ఆయన తెలంగాణకోసం ఎంత కష్ట పడ్డాడో అందరికీ తెలిసిందే…అలాగే ఉద్యోగాలు పోయిన హోంగార్డులది కూడా అలాంటి పరిస్ధితే. తెలంగాణలోనే కాదు, దేశంలో ఎక్కడా ఇంత కాలం పాటు కోల్పోయిన ఉద్యోగాల కోసం చరోక పక్షుల్లా ఎదురుచూసిన వాళ్లు లేరు. వాళ్లేం అన్యాయం చేయలేదు… అక్రమాలు చేయలేదు….కొలువులు ఎందుకు పోయాయో కూడా తెలియని అమాయకులు…. డిపార్టుమెంటులో ఎవరి కోపమొచ్చినా హోంగార్డుల మీదే ప్రతాపం చూపిస్తారని చెప్పడానికి ఉద్యోగాలు కోల్పోయిన వారి జీవితాలే నిదర్శనమని చెప్పకతప్పదు. ఉమ్మడి రాష్ట్రంలో కొంత మంది పోలీసు ఉన్నతాధికారులు మోసం మూలంగా బలైన జీవితాలు. ఆ పెద్దలు చేసిన తప్పిదం, అన్యాయం మూలంగా వీరి జీవితాలు ఎందుకు బలికావాలి? వారి జీవితాలకు ఎవరు భరోసా కల్పించాలి. ఆనాడు జై తెలంగాణ అన్నందుకు ఉద్యోగాల నుంచి తొలగించడం ఒక కారణమైతే…వీళ్లకు అప్పాయింటు మెంటు లెటర్లు ఇవ్వకుండా పని చేయించుకున్నారు. వెట్టి చారికీ చేయించుకునేందుకు ఉద్యోగాలు ఇచ్చినట్లు మోసం చేశారు. అన్నీ ఇస్తున్నామని నమ్మించారు. ఐడి కార్డులిచ్చారు. యూనిఫారమ్స్ ఇచ్చారు. సర్సీసు రూల్స్ ప్రకారం జీతాలు కూడా చెల్లించారు. ఆఖరకు ఉద్యోగాలనుంచి తొలగించారు. వెట్టిని సహించలేకే తెలంగాణలో మొదటి సారి తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాల కోసమే ఉద్యమం మరోసారి వచ్చింది. కాని ఇప్పుడు తెలంగాణ వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయానికి గురైన వారికి న్యాయం చేసే అవకాశం వచ్చింది. దాంతో మాపై కనికరం చూపండని హోంగార్డులు కోరుతున్నారు.. కనీసం మానవతా దృక్పధమైనా చూపించమని వేడుకుంటున్నారు. ` కొలువు లేకపోతే……..
సహజంగా ఏ కుటుంబంలోనైనా ప్రభుత్వ ఉద్యోగం అన్న పేరు చాలు. ఒక భరోసా. ఒక ధైర్యం. అది నాలుగో తరగతి ఉద్యోగమైనా సరే…కుటుంబానికి ఆసర అనుకుంటారు. ప్రైవేటు ఉద్యోగంలో అంతకన్నా జీతం ఎక్కువ వచ్చినా సరే ప్రభుత్వ ఉద్యోగం అన్నది ఒక స్టేటస్ పాయింట్. ఎంతో కష్టపడితే గాని కొన్నిసార్లు ఉద్యోగాలు రావు. కొన్ని సార్లు ఆదృష్టం తోడై కూడా చిన్న చిన్న ఉద్యోగాలు వస్తుంటాయి. కాని వాటికి భరోసా లేకపోతే ఎలా? ఆశల పెట్టుకున్న వారి జీవితాలు మధ్యలో ఆగిపోతే, కొలువులు పోతే ఎలా వుంటుంది? ఆ కుటుంబానికి ఎంత ఇబ్బందో అందరికీ తెలుసు? పెద్ద పెద్ద ఉద్యోగులను ఇలా ఎలాంటి కారణాలు లేకుండా తీసేయగలరా? చిన్న ఉద్యోగులు…? అంటే అంత చిన్న చూపా? ఇది తెలంగాణ రాకముందు జరిగినందును వారిపై కనికరం అందరకీ వుండాలి. ముఖ్యమంత్రి కేసిఆర్‌కు నిత్యం కొన్ని వందల సమస్యలను వింటుంటారు. వాటిలో ప్రాధాన్యతా క్రమంలో అధికారులు సూచించే వాటిపై దృష్టిపెట్టాల్సివుంటుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసిఆర్ అసెంబ్లీలో ఉద్యోగాలు కోల్పోయిన హోంగార్డుల న్యాయం చేస్తామని చెప్పారు. ఏ ముఖ్యమంత్రి నోటనుంచైనా ఒక మాట వస్తే అది జీవోతో సమానమంటారు. ఆ తర్వాత వాటిని ముందుకు తీసుకెళ్లాల్సింది అధికారులు. నాయకులు. వాళ్లు హోంగార్డులను మర్చిపోయారా? వదిలేశారా? ఆందోళన సర్వత్రా వ్యక్తమౌతోంది. ` హోంగార్డుల బాధ వర్ణణాతీతం…….
వాళ్లంతా బడుగులే… ఒక్క మాటలో చెప్పాలంటే హోం గార్డు లాంటి ఉద్యోగాలకు ముందుకు వచ్చేది అత్యంత పేదరికంలో మగ్గుతున్నవాళ్లే. అందులోనూ ఎస్సీ, ఎస్టీలు, బిసీలు, ఉన్నత వర్గాలలో వున్న పేదలు మాత్రమే హోంగార్డుల ఉద్యోగాలలో చేరుతుంటారు. ఉద్యోగాల్లో చేరేప్పుడే వారికి పరిస్థితి తెలుసు. సహజంగా పోలీసు శాఖలో కానిస్టేబుల్ స్ధాయి వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు వుంటాయో! ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటిది హోంగార్డుల జీవితాలు ఎలా వుంటాయో అర్ధం చేసుకోవచ్చు. అయినా అన్నీ భరిస్తారు.. అధికారులు చీ..అన్నా పడతారు. చీదరించుకున్నా పడతారు. తిట్టినా పడతారు. ఆఖరుకు కోపం వచ్చి…ఏంచేస్తారో తెలుసు. అయినా వాళ్లు మౌనంగానే వుంటారు. ఎందుకంటే తుమ్మితే ఊడిపోయే ఉద్యోగం. కన్నీళ్లను దిగమింగుకొని బతికేస్తుంటారు. అలాంటి చిన్న వేతన జీవులైన హోంగార్డులు ఉద్యోగాలు కోల్పోయి దశాబ్ధకాలమైనా ఖాకీ దుస్తులు వేసుకోవాలన్న తపనతో బతుకుతున్నారు. పదేళ్లు చేసిన ఉద్యోగాలను తిరిగి చూసుకోవాలన్న ఆశతో బతుకులు వెళ్లదీస్తున్నారు. చిన్నా, చితకా పనులు చేసుకుంటున్నా, దేశం కోసం, సమాజం కోసం వారు తక్కువ జీతమైనా పనిచేశారంటే వారి అంకితభావం ఎంత గొప్పదో ప్రభుత్వాలు గుర్తించాలి. హోంగార్డు ఉద్యోగాలు అంటే కత్తిమీద సాములాంటిది. ఎవరు వచ్చి బెరించినా పడాలి? రాత్రిళ్లు డ్యూటీ చేస్తే కొన్ని సార్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పని చేయాలి. ఇలా సమాజం కోసం తమ జీవితాలను త్యాగం చేస్తున్నప్పుడు వారిని ఉద్యోగులుగా కాకుండా, సామాజిక సేవకులుగా గౌరవించుకోవాల్సిన అసవరం వుంది. ` దండం పెట్టని నాయకులు…మొక్కని దేవుడు లేడు పన్నెండేళ్లయినా వారిది ఒకటే జపం. తమ ఉద్యోగం. ఆ ఉద్యోగంతో ఇప్పుడేదే సాధిస్తారని కాదు. సాంపాదించుకుంటారని కాదు. ఆత్మగౌరవం కోసం… అంతే తప్ప వేలకు వేలు జీతాలు వచ్చి, కుర్చీలో కూర్చునే ప్రమోషన్లు వస్తాయని కాదు. అదే జీవితం. అదే ఉద్యోగం. ఎండనక? వాననక? పని చేయాల్సిందే. ట్రాఫిక్‌లలో పనిచేసి ఊపిరి తిత్తులు పాడు చేసుకోవాల్సిందే..అయినా వారు వెరవకుండా పనిచేస్తారు. ఉద్యోగ నిర్వహణ బాధ్యత నిర్వర్తిసారు. అలాంటి కొలువుల కోసం ఒకరు కాదు, ఇద్దరు కాదు ఎంత మంది నాయకులను కలిశారో లేక్కే లేదు. మా ఉద్యోగాలు మాకిప్పించడని కనిపించిన ప్రతీ నాయకుడిని వేడుకున్నారు. వారికి వినతి పత్రాలు అందించారు. మంత్రులు,ఎమ్మెల్యేలు ఎక్కడికి వచ్చినా వారి వద్దకు వెళ్లి వారి కాళ్లావేళ్లా పడ్డారు. నాయకుల ప్రసన్నం కోసం ప్రదక్షిణాలు చేశారు. ఏడ్చారు? ఏదో ఒక సానుకూల ప్రకటన వస్తుందని తెలిసిన ప్రతీసారి పాలాభిషేకాలు చేశారు. కనిపించిన దేవతలందరినీ మొక్కారు. ఉద్యోగ సంఘాల నాయకులను కలిసి కలిసి కళ్లు కాయలయ్యలా ఎదురుచూస్తున్నారు. ఎవరు ఎదరైనా, తమను కనికరించేలా చూడమని కోరుతున్నారు. ఉద్యోగాలు కోల్పోయిన వారు ప్రతి నియోజకవర్గంలోనూ వున్నారు. వారందరికీ వీరి బాధలు తెలుసు. ఇటీవలే ముఖ్యమంత్రి కేసిఆర్ గతంలో తొలగించిన ఉపాధి హమీఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించారు. అలాగే తెరాస నాయకులు, ఎమ్మెల్యేలు చొరవ తీసుకొని వీరికి ఉద్యోగాలు వచ్చేలా చూడాలని కోరుతున్నారు.
కుటుంబాలు గడవక కుమిలిపోతున్న హోంగార్డులు ` పోయిన కొలువులు వస్తాయన్న ఆశతో బతుకుతున్నారు ` ఎండనక, వాననక పదేళ్లు విధులు ` చాలీ చాలని జీతాలిచ్చినా భవిష్యత్‌పై ఆశలు పెంచుకున్నారు. ` ఉమ్మడి రాష్ట్ర పాలకులు చేసిన తప్పుకు బలయ్యారు ` జై తెలంగాణ అన్నందుకు దుర్మార్గంగా వీధిపాలు చేసిన ఉమ్మడి రాష్ట్ర పాలకులు ` కనికరించి…కాపాడండని వేడుకుంటున్న భాదితులు ` అందరూ బాగున్నారు..వాళ్లేం పాపం చేశారు ` మానవత్వంతో ఆదుకుని భవిష్యత్‌నివ్వండని వేడుకుంటున్న వైనం ` 200 కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపాలని సీఏంకు మొర
జై తెలంగాణ అని గొంతెత్తినందుకు ఆకలి కేకలు. ఆర్థాకలి బతుకులతో తెలంగాణ రాష్ట్రంలో 200 కుటుంబాలు కాలం వెల్లదీస్తున్నాయి. కడుపు నింపని నాలుగు మెతుకులు, చాలీ చాలని జీతాలు..పర్మనెంటు ఆశ లేకపోయినా ఏళ్ళపాటు హోంగార్డులుగా నిత్యం పడిన వెతలు పడిన ఆ అభాగ్యుల ప్రస్తుత పరిస్థితిని గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరౌతున్నారు. సొంత రాష్ట్రం ఏర్పడుతుందని మన బతుకులు బాగుపడతాయని ఆశలు పెచుకుంటున్న క్రమంలో విధులు నిర్వహిస్తూనే స్వరాష్ట్ర ఉద్యమంలో జై తెలంగాణ అన్నందుకు అర్ధాంతరంగా కొలువులు కోల్పోయి వారి జీవితాలు వీధిన విసిరేయబడ్డాయి.దాంతో వారి జీవితాలు పనులు లేక ఎంతో ఇష్టంతో చేరిన ఉద్యోగం లేక పస్తులతో చస్తూ విగతజీవులుగా బ్రతుకులీడుస్తున్నారు. గౌరవంగా చేసుకుంటున్న ఉద్యోగం లేకపోవడంతో పిల్లల బతుకులు , కుటుంబాలు పూర్తిగా కాకవికలమయ్యాయి.పదేళ్లు పాటు పని పేరుతో వాడుకుని సరిగ్గా తెలంగాణ వచ్చే సమయానికి ఉద్యోగాల నుంచి పీకేశారు.
జై తెలంగాణ అన్నందుకు ఉమ్మడి రాష్ట్ర పాలకులు మాకు మెతుకు లేకుండా కొలువులు అర్ధాంతంరంగా తీసేశారని వారికి జరిగిన అన్యాయాన్ని గుర్తు చేసుకుంటూ ఉద్వేగానికి లోనౌతున్నారు. అయినా మన తెలంగాణ వస్తే మనకు మన ఉద్యోగాలొస్తాయనుకున్నారు. తెలంగాణ కోసం తనువులనే త్యాగం చేసిన వారి ముందు మనదెంత అనుకున్నారు. తెలంగాణ వచ్చాక మళ్లీ మన ఆత్మగౌరవంతో మన కొలువులు మనకొస్తాయని ఎదరుచూశారు…తెలంగాణ వచ్చింది. సంబరాలు తెచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో వెలుగులు నింపింది. కాని చీకటిలోకి నెట్టేయబడిన హోంగార్డుల జీవితాలకు వెలుగు రాలేదు. ఇంకా వారి జీవితాల్లో వెలుగులు ప్రసరించలేదు. పోయిన కొలువులు రాలేదు. వారి గోడు ఎవరూ పట్టించుకోవడం లేదు. జై తెలంగాణ అన్న నాటి నుంచి నేటి దాకా తెలంగాణ ఆత్మగౌరవమైన టిఆర్‌ఎస్‌కు కూడా జైకొట్టినావాళ్లే…ఎంతో మంది జీవితాలు గాడిన పడ్డట్టే తనకూ దారి దొరుకుతుందని ఎదురు చూస్తున్నారు. పోయిన కొలువులు మళ్లీ వస్తాయన్న ఆశతో బతుకుతున్నారు. కాని కాలం వారిలో నిర్వేదం నింపుతోంది. ఆశలు అడుగంటుతున్నాయి. కన్నీళ్లు ఇంకిపోతున్నాయి. మాటలు మూగ బోతున్నాయి. ఏడ్చీ ఏడ్చీ కనుపాపలు కుమిలిపోతున్నాయి. ఇతరులతో కలవలేకపోతున్నారు. బంధువుల వద్దకు వెళ్లలేకపోతున్నారు. పూట గడవని బతుకులొస్తాయని కలలో కూడా ఊహించలేదు. ఏం పాపం చేశారని ఈ కుటుంబాటు వీధిన పడ్డాయని వీరి పరిస్థితి తెలిసినవారందరు ఆవేదన చెందుతున్నారు.
` అందరూ బాగానే ఉన్నారు తెలంగాణ వచ్చాక ఉద్యోగులకు కొత్త జీతాలు అందాయి. కొత్త జీవితాలు మొదలయ్యాయి. ఆత్మగౌరవం వెల్లిరిసింది. కింది స్ధాయి నుంచి పై స్ధాయిదాకా మార్పులొచ్చాయి. ఓ రెండొందల మంది హోం గార్డులకు ఉద్యోగాలు పోయాయి. తెలంగాణ వచ్చాక కొన్ని వేల మందికి కొత్తగా ఉద్యోగాలు వచ్చాయి. తెలంగాణలో ఇప్పుడు పనిచేస్తున్న వేలాది మంది హోం గార్డులకు జీతాలు కూడా పెరిగాయి. కాని ఈ రెండొందల మంది మాత్రం బతుకు సమరం సాగిస్తున్నారు. వాళ్లు కొలువులు చేసిన నాడు విధులకు సమయం సందర్భం లేని వేళలు. ఇక తెలంగాణ ఉద్యమ కాలమంతా ఎప్పుడు తిన్నారో, ఎప్పుడు పడుకున్నారో తెలియని అయోమయం. రోడ్లమీదే తిండితిప్పలు. ఎక్కడినుంచి ఎక్కడకు పంపిస్తారో తెలియదు. ఎన్ని గంటలు పనిచేయాలో తెలియదు. అయినా ఎనాడైనా జీవితాల్లో వెలుగులు రాకపోకపోతాయన్న ఆశ. ప్రతి ఉద్యోగి కనే కలే. కాకపోతే హోంగార్డుల జీవితాలే ఎందుకు ఇలా తలకిందులయ్యాయి. వారి జీవితాలు ఎందుకు బజారున పడ్డాయనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమౌతున్నాయి. ` ఖాకీ దుస్తులంటే ప్రాణం ఖాకీ దుస్తులు వేసుకొని మురిసిపోయారు. ఆ దుస్తుల్లో వున్న ధైర్యంతో ముందుకు సాగారు. సమాజ రక్షణలో పాలు పంచుకున్నారు. చాలీ చాలని జీతమైనా, ఓర్చుకున్నారు. ఎండనక, వాననక పదేళ్లు పనిచేశారు. ఆకలి కూడా మర్చిపోయిన పనుల్లో నిమగ్నమయ్యారు. భవిష్యత్తులో కానిస్టేబుల్ ఉద్యోగాల రిక్రూట్ మెంటు పడితే వెయిటేజీ వస్తుందన్న ఆశతో కూడా పనిచేశారు. పోలీసు ఉద్యోగం చేయాలన్న అంకితభావంతో వారంతా విధులు నిర్వర్తించారు. అదేంటో వారి ఆశలు మొగ్గలోనే తుంచివేయబడ్డాయి. వారి ఆశలు అడియాసలయ్యాయి. ఉద్యోగాలు పోయాయి. ` నాటి పాలకుల తప్పుకు బలైన హోంగార్డుల జీవితాలు అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ఐడి కార్డులున్నాయి. డిపార్టుమెంటులో జాయిన్ అయ్యాక తీసుకున్న బ్యాంకు ఖాతాలున్నాయి. ప్రభుత్వం సరఫరా చేసిన యూనిఫారమ్స్ వున్నాయి. పదేళ్ల సర్వీసు వుంది. అప్పాయింటు మెంటు లెటర్ లేదంటూ ఉద్యోగాలనుంచి తొలిగించారు. అది ఆనాటి ప్రభుత్వ బాధ్యతారాహిత్యం. దానికి హోంగార్డులెలా బాధ్యలౌతారు , బలౌతారు? ఎలాగూ ప్రశ్నించలేని చిన్న ఉద్యోగులన్న చిన్న చూపా? వారిని విధుల్లోనుంచి తీసేసిన తర్వాత కూడా డిపార్టుమెంటు వారిచేత నగరంలో బోనాల పండుగలకు బంధోబస్తులకు కూడా వినియోగించుకున్నారు. అయినా ఉద్యోగులుగా గుర్తించలేమని వదిలేశారు. వారి జీవితాలను తుంచేశారు. పదేళ్ల సర్వీసు పోయింది. పదేళ్లు చేసిన పని పోయింది. నడీడు వచ్చి చేరింది. ఇప్పుడు ఏం చేయమంటారని వారు పాలకులను అభ్యర్ధించుకుంటున్నారు? ఆత్మగౌరవం కోసం పనిచేసి ఉద్యోగం పోగొట్టుకొని కూలీలుగా , ఆటోలు డ్రైవర్లుగా జీవితాలను వెల్లదీస్తున్నారు. ` సీఎంగారు దయచేసి కనికరించండి ఈ విషయం గతంలో ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి వెళ్లింది. అసెంబ్లీలో కూడా 2018కి ముందు నాటి బిజేపి ఎమ్మెల్యే లక్ష్మణ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి కేసిఆర్ కూడా సానుకూలంగా స్పందించారు. వారికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈ విషయాన్ని హోంగార్డుల రాష్ట్ర గౌరవాధ్యక్షుడిగా కొనసాగుతున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు అప్పగించారు. ఇక తమ జీవితాలు మళ్లీ చిగురిస్తున్నాయని ఆశపడ్డారు. హామీ ఇచ్చి నాలుగేళ్లయినా వారి జీవితాలను ఎవరూ పట్టించుకోలేదు. గతంలో పలు మార్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కలిసి విన్నపాలు చేసుకున్నారు. పని అవుతుందిలే అనే సమాధానాలతో పదేపదే సంతృప్తిపొందుతూ వచ్చారు. అయినా వారి ఉద్యోగాలు వారికి ఇంకా అందలేదు. వారి జీవితాలకు ఉద్యోగాలు అందలేదన్న సంగతి ముఖ్యమంత్రికి తెలియాల్సిన అసవరం ఉందన్న ఆవేదన వారిలో ఎక్కువగా ఉంది. ఎందుకంటే తమకు ఉద్యోగ కల్పన జరిగిందని అనుకునే అవకాశం ఉందని నుమానం వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల ఎలాగైనా తమ గోడు మరోసారి ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి వెళ్లాలి. ఎలాగైనా మళ్లీ తమ కొలువులు వస్తాయన్న కోటి ఆశలతో రెండు వందల మంది హోంగార్డులు ఎదురుచూస్తున్నారు. జై తెలంగాణ అన్న పాపానికి ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాలు కోల్పోయిన తెలంగాణ బిడ్డలను గుండెల్లో పెట్టుకోవాల్సిన అవసరం వుంది. వారి ఉద్యోగాలు మళ్లీ వారికి అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.
ఎంత దూరమైనా ఒక అడుగుతోనే మొదలౌతుంది. ఎంతటి గ్రంధమైనా అక్షరంతో మొదలై పదకోశమౌతుంది. అలాంటి అక్షరాలను నిత్యం లక్షలాదిగా రాసులుపోసి నేటిధాత్రి పత్రికా ప్రయాణం మొదలు పెట్టి ఇప్పటికీ 17వసంతాలు పూర్తయింది. 18వ పడిలో అడుగిడి అక్షర యానంలో అలుపులేని ప్రయాణం సాగిస్తోంది. ఈ పదిహేడేళ్లలో వేస్తూ వస్తున్న ప్రతి అడుగు ఒక చరిత్రే…ప్రతి అక్షరం ప్రత్యేకమే…
అడుగు మొదలుపెట్టడం సులువే…అది నడకగా మారి ప్రయాణమైతే గాని దాని విలువ తెలియదు. ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో మలుపులు. ఎన్నో ఆటంకాలు. అవరోదాలు. అయినా అలసట లేని అక్షర ప్రయాణం. ఒక్క మాటలో చెప్పాలంటే రాసే ప్రతి అక్షరానికి విలువ లెక్కిస్తూ ఖర్చు చేస్తే గాని పత్రిక పాఠకుల ముందుకు రాదు. ఇలా నిత్యం పురిటినొప్పులే…పదిహేడు సంవత్సరాలుగా అనుభవిస్తున్న వేధనే… పురిటి నొప్పులే… ప్రాణం మీదకు వచ్చినా తల్లి బిడ్డకోసం ఓర్చుకుంటుంది. అలాగే సమాజ చైతన్యం, ప్రగతి కోసం పత్రిక నిత్యం ఆరాటపడుతుంది. కష్టాలు, కన్నీళ్లు, అప్పులు, వెతలు, బెదిరింపులు, దాడులు, కార్యాలయాల ధ్వంసాలు, నాయకుల వింత వ్యాఖ్యలు, కొన్ని సార్లు గిట్టని వారి శాపనార్థాలు, వార్తలు నచ్చని వారి చీదరింపులు అనేకం వుంటాయి. అయినా పాఠకుల కోరిక మేరకు, జనాభిప్రాయాన్ని ప్రతిబింబించడమే నేటిధాత్రి కర్తవ్యం… అవినీతి, అక్రమాలకు ఎదురొడ్డి నిలబడి, తెగింపు ప్రయాణంలో అన్యాయంపై అక్షర సమరం సాగిస్తున్నాము. ఈ ప్రయాణంలో అలుపు లేదు. వెనుకడుగు లేదు. నేటిధాత్రిని దాత్రిని ఉఫ్ మని ఊదేస్తామని శఫథాలు, బీరాలు పలికిన వారు కూడా వున్నారు. కేసులు పెట్టి ఇంబందుల పాలు చేయాలని చూశారు. మానసికంగా ఇబ్బందులు ఎదురైతే తమ దారికొస్తారని కొందరు చూశారు. ఏ సమాజమైనా మంచీ చెడు వుంటుంది. అందులో మీడియా కూడా వుంటుంది. మహాత్మాగాంధీకే తప్పలేదు… సమాజ చైతన్యం కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం పత్రికలు నడిపారు. చరిత్రకే చారిత్రక సత్యమయ్యారు. ప్రతి పత్రికకు శత్రువులే కాదు…మిత్రులు, శ్రేయోభిలాషులు, హితులు, సన్నిహితులు వుంటారు. అక్షరాలను బతికించే ఔదార్యం వున్న వాళ్లు వుంటారు. వెన్నంటి వుంటారు. వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంటారు. అలాంటి మంచి మనసున్న వాళ్లు నేటిధాత్రికి తోడౌతున్నారు…తోడుగా సాగుతున్నారు. ఎందరో మహానుభావులు. అందులో నా శ్రేయోభిలాషులు ఎంతో గొప్ప మనసున్న వాళ్లు. వాళ్లకు వేల వేల దండాలు….పాఠకులకు శతకోటి వందనాలు. మా అక్షరం మీ కోసం… నేటిధాత్రి సమాజం కోసం… ఇట్లు మీ కట్టా రాఘవేంద్రరావు ఛీఫ్ ఎడిటర్.
హైదరాబాద్ ,నేటిధాత్రి: కార్యకర్తలు ఛీ..ఛీ అంటున్నారు వినవడుతుందా? ఛీదరించుకుంటున్నారు…కనబడుతోందా? మీరు మారరు అని జనం తిట్టుకుంటున్నారు…కనీసం అదైనా తెలుస్తోందా? మారండి బాబు అంటూ కార్యకర్తలు కోరుతున్నారు…వేడుకుంటున్నారు…కాళ్లా, వేళ్లా పడి బ్రతిమిలాడుకుంటున్నారు. అయినా కనికరించలేరా? పార్టీ కోసం త్యాగాలు చేయలేరా? కొంత కాలం నోరు కట్టేసుకోలేరా?… లేదా…మాదారి మాదే… మా మాట మాదే…మా తీరంతే…మా వ్యవహారంతా ఇంతే అంటారా? సొంత పార్టీలో కవ్వింపులు ఆపుతారా? ఆరోపణలు తగ్గిస్తారా? అన్నది తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి వాదుల అడుగులను నిశితంగా గమనిస్తున్నారు. నిన్నటిదాకా ఒక లెక్క…ఇకపై ఒక లెక్క అన్నట్లు హై కమాండ్ ఓ ఆర్డరైతే పాస్ చేసింది. కాని అవి అసమ్మతి నేతలకు చెవిక్కుతుందా? అసమ్మతి రాగాల ముందు ఏ సూక్తులు పనిచేయవని మళ్లీ, మళ్లీ మైకుల ముందు రెచ్చిపోతారా? హోటళ్లలో సమావేశాలు పెట్టకుండా వుంటారా? రేవంత్ పిపిసి కావడానికి ముందు నుంచే ఈ నిత్య అసమ్మతి వాదుల అంతర్గత ప్రజాస్వామ్యం మరింత పెంచుకున్నారు. ఈ సెగ ఇప్పటిది కాదు?: నిజానికి దుబ్బాక ఉప ఎన్నికలకు ముందే పిపిసి అధ్యక్షుడు రేవంత్ అన్నారు. సీనియర్లు అడ్డుకున్నారు. కాంగ్రెస్‌కు డిపాజిట్ రాకుండానే చేసుకున్నారు. హుజూర్ నగర్ ఎన్నికల సమయానికి అప్పటికే వర్కింగ్ ప్రెసిడెంటుగా వున్న రేవంత్ ఏదో తెలిసో తెలియకో సమిష్టి నిర్ణయం వుంటుందన్నారు. ఆ రోజుల్లోనే అందరూ గయ్యిమని ఆయనపై ఒంటికాలుపై లేచారు. ఉత్తమ్ పద్మావతిని నిలబెట్టి మళ్లీ ఓడిపోయారు. కనీసం నాగార్జున సాగర్ ఉప ఎన్నికల సమయంలోనే ఇక రేవంత్‌కే పగ్గాలన్న ప్రచారం మళ్లీ జరిగింది. ఇదంతా కొంత కాలం కాంగ్రెస్‌లో రెడ్డొచ్చే కథ మొదలాయే! అన్నట్లు సాగింది. ఆఖరుకు నాగార్జున సాగర్ నుంచి పోటీ చేసిన జానారెడ్డి అధిష్టానానికి లేఖరాసి, కొంత కాలం పిసిసి కొత్త కార్యవర్గం ఆపాలని సూచించారు. కారణం నాగార్జున సాగర్‌లో గెలవడం, పిసిపి పగ్గాలు తీసుకోవడం తరువాయి అన్నంత దురాలోచన చేశారు. ఏమైంది…బొమ్మ బొరుసైంది. సీనియర్ నేతను, తెలంగాణ వస్తే ముఖ్యమంత్రిని నేనే అని ఒకప్పుడన్నాడు. ఆఖరుకు తెలంగాణ ఇచ్చిన పార్టీలో స్టార్ వాల్ వంటి నాయకుడు ఓడిపోయాడు. ఇదే నేత గతంలో తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశాడు. కాని తెలంగాణ వచ్చాక గెలవడానికి ఆపసోపాలు పడ్డాడు. రెండుసార్లు వరసగా ఓడిపోయాడు. నేనున్నా…నేనే సిఎం?: ఇప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిని నేనే అని జానారెడ్డి అంటారు. నేను కూడా రేస్‌లో వుంటానంటాడు. అందుకే కాంగ్రెస్ గురించి ఆలోచించడానికి ప్రజలు కూడా తీరక చేసుకోవడంలేదు. కాకపోతే పిసిసి. అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అయ్యాడు. వద్దు వద్దంటుంటే పార్టీ ఎలా మా మాట కాదని రేవంత్‌ను తెచ్చిపెట్టారన్న కోపం కొంత మంది పెంచుకున్నారు. మాకంటే రేవంత్ పెద్ద నాయకుడా? అన్న అహం వారిలో నరనరం నిండిపోయింది. రేవంత్ పేరెత్తితే చాలు గయ్యిన మీడియా మీదకు కూడ లేవడం జరిగింది. కాని తాజాగా పరిణామాలతో సీనియర్లు దిక్కుతోచని పరిస్ధితిలో పడ్డారు. ఒకరకంగా చెప్పాలంటే కుడితిలో పడ్డారు. నోరు తెరవలేరు. మూసుకొని వుండలేదు… చెక్: రెక్కలు కర్తిరిస్తే గాని వినేలా లేరన్న సంగతి తెలుసుకొని కాంగ్రెస్‌పార్టీ జగ్గారెడ్డికి చెక్ పెట్టినంత పనిచేశారు. నిజానికి అలాంటి నేతలకే ముందు చుక్కలు చూపిస్తే తప్ప, మిగతావాళ్లు వినరు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వానికి కూడా జ్ఞానోదయం అయ్యిందనే అనుకోవాలి. కాంగ్రెస్‌నేతలు గతం నుంచి ఇంకా బైటకు రావడంలేదు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ముందు రోజులు కావు. అప్పటి పరిస్ధితులు నేడు లేవన్న సంగతి మర్చిపోతున్నారు. అప్పుడంటే ఎటు చూసినా కాంగ్రెస్ పార్టీయే వుండేది. ఎన్ని చీలికలు వచ్చినా అదే నాయకులు కనిపించేది. కాని ఇప్పుడు ఆ పరిస్ధితి లేదు. ప్రాంతీయ పార్టీలతో సమానమైపోయింది. ఆ స్వయం కృతాపరాధం ఇంకా మానుకోవడం లేదు. అదే పార్టీకి తలనొప్పులు తెచ్చిపెడుతోంది.
క్లారిటీ లేని సీనియర్లు?: ఇంతకీ సీనియర్లకు ఏం కావాలన్న దానిపై క్లారిటీ లేదు. ఎవరికి ఎవరికి సఖ్యత లేదు. ఐక్యత వారిలో ఎప్పుడూ లేదు. ఇప్పుడే సడెన్‌గా తెరమీదకు వచ్చింది. సహజంగా అసంతృప్తి అన్నది కాంగ్రెస్‌లో సహజం. కాకపోతే ఈసారి మాత్రం గతంలోకన్నా ఎక్కువగానే వుంది. కారణం పిపిసి. అధ్యక్షుడు మిగతావారికన్నా జూనియర్ కావడం. ఆయన ఏం చేస్తున్నారన్నది ఎవరికీ చెప్పకపోవడం. అంతే ఇంతకన్నా ఏమీ లేదు. తన సహజదోరణిలో రేవంత్?: ఒక ఆశయంతో ముందుకు సాగేవారు ఎన్ని ఆటంకాలైనా ఎదుర్కొంటారు. కాని వారేం చేస్తున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? అన్నది మాత్రం ఎవరి చెప్పరు. ఎట్టి పరిస్ధితుల్లోనూ బైట పడరు. పైకి చాలా కూల్‌గా వుంటారు. సరిగ్గా ఇప్పుడు రేవంత్ రెడ్డికూడా అదే అనుసరిస్తున్నాడు. ఈ మొండి పట్టుదలలో పదవిపోయినా పోతుంది. కాని తన లక్ష్య సాధనలో వెనక్కి తిరిగిచూసుకోవద్దన్న కసితో ముందుకు సాగతున్నారు. అది అర్ధం చేసుకోలేని సీనియర్లు తెల్లారి లేస్తే రేవంత్‌ది ఒంటెద్దు పోకడ. ఏం చేయాలనుకుంటున్నాడో మాకు చెప్పడం లేదు. మా సూచనలు తీసుకోవడంలేదు. మా జిల్లాకు వచ్చినా మాకు సమాచారం లేదు. ప్రతీది మీడియాకు చెప్పి చేయడం కాంగ్రెస్ పార్టీలో గతంలో లేదు..! ఇవన్నీ సీనియర్ల కోపానికి, అలకలకు కారణం. కాలం మారింది. తరం మారింది. ఇప్పుడు సోషల్ మీడియా యుగం. ప్రతి వ్యక్తిచేతిలో ప్రపంచం వుంది. దాన్ని రెప్ప వాల్చకుండా చూస్తున్నారు. ప్రపంచంలో ఏ మూలన చీమ చిటుక్కుమన్నా తెలుస్తుంది. గతంలోగా మంత్రాల బలం ఇప్పుడు అవసరం లేదు. తుప్పిళ్ల బలమే చాలు…ఏం చేయకపోయినా చేస్తున్నట్లు ప్రచారం కావాలి. అదే రేవంత్ చేస్తున్నాడు. సీనియర్ల కోసం ఎదరుచూస్తూ రోజులు గడపలేడు. వారి ఆశీస్సుల కోసమే సమయం వెచ్చించలేడు. నిత్యం వారి భజన చేస్తూ కూర్చుంటే పార్టీ సాగదు. ఆయన కోరిక నెరవేరదు. ఇప్పుడు గేలిచేసినోళ్లేతోనే కాలం కలిసొస్తే జేజేలు కొట్టొచ్చు. అందుకే సీనియర్లపై ఒక్క మాట ఆయన మాట్లాడడం లేదు. కాని ఇతరులతో మాట్లాడిస్తున్నాడా? లేదా అన్నది కూడా ఆయనకు తెలుసు? కాళ్లలో కట్టెలు పెట్టేవాడున్నప్పుడు ఎలా తప్పించుకొని వెళ్లాలో తెలుస్తుంది. వారిని దూరం పెట్టే అవకాశం కూడా దొరుకుతుంది. ఇదే రేవంత్ సరిగ్గా అమలు పర్చుతున్నాడు. సీనియర్లను అధిష్టానం ముందు దోషులను చేశాడు…ఇక్కడ మాత్రం ఎంతో కొంత తలనొప్పిని తగ్గించుకున్నాడు…చే జేతులా తమకు తాము పార్టీకి దూరమయ్యే అవకాశం రేవంత్‌కు ఇస్తున్నామన్న ఆలోచన మాత్రం సీనియర్లు చేయడం లేదు. ఇదే రేవంత్ బలం…వారికి అర్ధంకాని రాజకీయం…మరి రేపు..రేపు ఎలా వుంటుందో చూడాలి..!!!
రిజిస్ట్రేషన్ శాఖలో నకిలీ చలాన్ల అక్రమాలపై ఉన్నతాధికారులు దృష్టి సారిస్తున్నారు. గత కొంతకాలంగా రిజిస్ట్రేషన్ శాఖలో పలు ప్రాంతాల్లో కొందరు అధికారుల చేతుల్లో మోసపోయి అనే ఇబ్బందులను ఎదుర్కోంటున్న స్టాంప్ వెండర్స్ నేటిధాత్రిని ఆశ్రయించి తమ గొడును వెల్లబోసుకున్నారు. ఈ క్రమంలో వారి అనుభవిస్తున్న భాదలను అందుకు కారకులైన అధికారులపై నేటిధాత్రి గత కొంత కాలంగా వరుస కథనాలు ప్రచురిస్తున్నది. దీంతో రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు ఈ కథనాలకు స్పందించి వాస్తవ విషయాలను తెలుసుకునే పనిలో పడ్డారు. అక్రమాలు చేసినట్లు అధికారులపై వస్తున్న కథనాలపై సమగ్ర విచారణ జరిపే విధంగా కొందరు అధికారులకు ఇప్పటికే శాఖ ఉన్నతాధికరి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. అధికారం చేతిలో ఉందని రెచ్చిపోయి అమాయకపు వెండర్స్ నుండి లక్షల రూపాయలు దండుకుని దర్జాగా తిరుగుతూ మాకేమౌతుందిలే అని తిరుగుతున్న అధికారుల బాగోతం బట్టబయలయ్యే సమయం అసన్నమవ్వడంతో అక్రమాధికారులు ఇప్పటికే హైదరాబాద్‌లో మకాం వేసి విధులు నిర్వహిస్తున్న కార్యాలయాలకు రావడానికి జంకుతున్నారని విశ్వసనీయ సమాచారం.
` కదలనున్న అక్రమాలకు డొంకనకిలీ బాగోతం బయట పడిరది కొన్ని ప్రాంతాల్లోనే అయినా ఈ తతంగం రాష్ట్ర వ్యాప్తంగా జరిగినట్లు కేసుల పాలైన భాదితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించి వివాదం జరిగిన సమయంలో చాలా మంది అధికారులు అప్పటికప్పుడు వెండర్స్ నోరు నొక్కి, బెదిరింపులకు , బుజ్జగింపులకు దిగి బయటకు రాకుండా చూసుకున్నారనే ఆరోపణలు లేకపోలేదు. అయితే ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ సహా కొన్ని ప్రాంతాల్లో విధులు నిర్వహించి అక్రమాలకు పాల్పడిన అధికారుల బాగోతాన్ని విచారణ చేసే క్రమంలో మరింత మంది అధికారుల అక్రమాలు, నష్ట పోయిన భాదితుల వివరాలు బయటకు వచ్చే అవకాశాలు లేకపోలేదని రిజిస్ట్రేషన్ శాఖలో గుసగుసలు వినవస్తున్నాయి. దింతో ఇప్పటికే అక్రమాలకు పాల్పడిన అధికారులు తమ ఉన్నతాధికారుల్లో కొందరిని కలిసి తమ చుట్టూ ఎలాంటి వివాదాలు చేరకుండా చూడాలని కోరేందుకు అధికారుల దర్శనం కొరకు పడరాని పాట్లు పడుతున్నారట. దాంతో పాటు ఎంతోమంది అక్రమాలకు అండగా నిలిచిన అధికారిపైనే వార్తలు వచ్చి విచారణ జరిగే అవకాశం ఉండడంతో ఆయన అండతో రెచ్చిపోయిన అధికారులు తమ బాగోతం బట్టబయలౌతుందేమోనని లబోదిబోమంటున్నారు.
` భాదితులను విచారిస్తారా లేక మమ అనిపిస్తారా..?
రిజిస్ట్రేషన్ల శాఖలో అక్రమాలు వెలుగు చూడాలంటే కీలకంగా ఉన్న అధికారుల భాదితులను ఈ విచారణలో భాగస్వామ్యులను చేస్తేనే పూర్తి విషయాలు బయటపడే అవకాశం ఉంది. కాబట్టి భాదితులను వివరాలను సంబంధిత శాఖ ఉన్నతాధికారులు సేకరించి వారిని అత్యంత గోప్యంగా విచారణ చేసి అక్రమ అధికారులకు చిక్కకుండా తగిన రక్షణ కల్పించి విచారణ పూర్తి చేయగలిగితే అనేక మంది భాదితులకు న్యాయం జరగడంతో పాటు కోట్లాది రూపాయల అక్రమాలు బయటపడతాయి. దాంతో పాటు ప్రభుత్వ వ్యవస్థల్ని తమ సొంత వ్యవస్థలుగా వ్యవహరించి అక్రమాలకు పాల్పడిన అధికారులకు తగిన బుద్ది చెప్పినట్లు అవుతుందని భాదితులు , ప్రజలు అంటున్నారు. అయితే ఇదే శాఖలో ఉండే ఉన్నతాధికారులకు ఈ అక్రమాలకు పాల్పడిన వారికి గతంలో మంచి పరిచయాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కీలకంగా ఉన్న భాదితులను విచారణలో భాగస్వామ్యులను చేస్తారా లేక విచారణను మమ అనిపించి అన్యాయం చేస్తారా..? అనేది చూడాలి మరి.
` అధికారుల అక్రమాలకు భాద్యులమై క్షోభ అనుభవిస్తున్నాం డబ్బులు డీడీ కట్టి మేషిన్ లోడ్ చేసుకునే వెండర్స్ ను కొందరు అధికారులు తప్పుడు పద్ధతిలో డబ్బులను చెల్లించడానికి చలాన్లు ఇవ్వకుండా వెండర్స్ దగ్గర నుండి నగదును తీసుకుని మాకు మేషిన్ లోడ్ చేసి ఇచ్చారు. వాటిని మేము అధికారుల మీద భరోసాతో నాలుగు సంవత్సరాలు ఈ పద్ధతినే కొనసాగించాం. 2014లో నకిలీ చలాన్లు పెట్టినట్లు కార్యాలయం నుండి కాల్ వచ్చింది. తర్వాత ఈ విషయంపై జరిగిన విచారణలో కూడా మమ్మల్సి సంప్రదించకుండానే విచారణ పూర్తి చేశారు. దాంతో మాపై కేసులు నమోదయ్యాయి. అందుకు కారకులైన అధికారులను వదిలేశారు. ఈ వివాదం వలన కుటుంబాన్ని రోడ్డు పాలు చేసుకున్నాం. ఈ కేసు వలన చేయని తప్పుకు జైల్ జీవితాన్ని గడపడమే గాక కనీసం విదేశాల్లో ఉన్న మా కూతురును చూడలేక మానసికంగా క్షోభ అనుభవిస్తున్నాం. ఉన్నతాధికారులు ఈ విషయాన్ని క్షుణ్ణంగా విచారించి తమకు జరిగిన నష్టాన్ని , అధికారులు చేసిన అక్రమాలను గుర్తించి మాకు నష్టపరిహారం అందించడంతో పాటు కేసుల నుండి ఉపశమనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
ఓ భాదితుడు , పూర్వపు కరీంనగర్ జిల్లా ( పెద్దపల్లి జిల్లా )
హైదరాబాద్ , నేటిధాత్రి :
ఉద్యోగం అన్నది జీవితానికి ఉపాధి మార్గమా…అక్రమ సంపాదనకు లైసెన్సా అన్నది తెలియనంతగా అవినీతి పెరిగిపోయిందనడానికి రిజిస్ట్రేషన్ల శాఖ ఒక్కటి చాలు సాక్ష్యానికి….! ఈ ప్రపంచంలో గాలి, నీరు, ఆకాశం, అగ్ని అందరి సొంతం. కాని భూమి మాత్రం కొందరి సొంతం. ఇదే సర్వదరిద్రాలకు కారణం. సూది మొనంత కూడా భూమి ఇవ్వనన్నందుకే మహాభారతం జరిగింది. రాజ్యాలన్నింటికి ఇదే సూత్రం. ఇప్పటికీ దేశాలలో దురాక్రమణలకు బావదారిద్య్రం. మరి ఆ భూమి ఒకనాడు భుక్తి కోసం…గూడు కోసం…అదే నేడు వ్యాపారం కోసం…ఆస్ధుల కూడబెట్టుకోవడం కోసం…స్ధిరాస్థులుగా మలుచుకొని జీవితాంతం కాలుమీద కాలేసుకొని బతకడం కోసం…ఇదే ఆనాటి నుంచి అధికారులకు వరంగా మారింది. తెలంగాణ అన్న ఉనికే భూమి కోసం…దొరలు అక్రమంగా ఆక్రమించుకున్న భూములకు లెక్కలేసి, కాగితాలు సృష్టించి, అమాయకులను ఆనాడు అలా మోసం చేశారు…నేడు ప్రజా ప్రభుత్వాలలో, ప్రజల పన్నులతో జీతాలు తీసుకుంటున్నారు. అదే ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. జనాలను జలగాల్లా పీడిస్తున్నారు. రక్తం తాగుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అవినీతి ఊడలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కాని వాటిని కత్తిరించేవారులేకపోతున్నారు. ప్రభుత్వ ముద్రించి, అమ్మి, ఆదాయం సమకూర్చే స్టాంపులను, ఉద్యోగులు తయారు చేయడం ఏమిటి? వాటిని దర్జాగా కార్యాలయాల్లోనే అమ్మడం ఏమిటి? రిజిస్టర్లు తారు మారు చేయడం ఏమిటి? బ్యాంకులను కూడా బురిడీలు కొట్టించడం ఏమిటి? కోట్లుకు కోట్లు దోచుకుపోతున్నా ప్రభుత్వం చూసుకుంటూ ఊరుకోవడం ఏమిటి? ఆ శాఖ పెద్దలు సమాచారం తెలిసినా కదలకపోవడం ఏమిటి? పెద్దలే ఏకంగా తప్పు చేసిన ఉద్యోగులకు అండగా నిలవడం ఏమిటి? విచారణ అధికారులు వాళ్లే…తప్పు చేయించేది వాళ్లే అయితే వారికి అడ్డేది…అవినీతి అంతానికి దిక్కేది…?
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల్లో ఏ ఉద్యోగిని కదించినా చెప్పేది ఒక్కరి పేరే… ఆ ఒక్కరే సురేష్? ఇతని పేరే అందరూ ఎందుకు చెబుతున్నారు? ఇతని వల్లే జిల్లాలో మొత్తం శాఖ భ్రష్టు పట్టిపోయిందన్న మాటలు ఎందుకు అంటున్నారు? అందరూ చెప్పేది అతని గురించే…అన్ని వేళ్లూ అతని వైపే? 2014కు ముందే అనేక రకాల అవినీతి కార్యకలాపాలు చేసినట్లు శాఖలో చెప్పుకుంటారు. ఉన్నతాధికారులు పట్టుకున్నారు. ఉద్యోగం నుంచి తొలగించారు. కేసు కూడ నమోదు చేశారు. జైలుకు కూడా వెళ్లాడు. ట్రిబ్యునల్ తీర్పుతో మళ్లీ ఉద్యోగంలో చేరాడు…కేసు మాత్రం ఆగలేదు…ఆయన కూడా ఆగకుండానే సంపాదనలో మునిపోతున్నాడు. అందిన కాడికి దోచుకుంటున్నాడు..ఇదే బాధితులు చెబుతున్న మాట. ఆయన తర్వాత జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇతన్ని ఆదర్శంగా తీసుకొని మరో ఇద్దరు మహిళా ఉద్యోగులు కూడా ఇదే తరహాలో స్టాంపులు అమ్ముకున్నారు? దోచుకోవాల్సినంత దోచుకున్నారు. ప్రభుత్వానికి రూ. 70లక్షలకు పైగా కన్నం పెట్టారు. పట్టుబడ్డారు. ఉద్యోగాలు కోల్పోయారు…ట్రిబ్యునల్ పుణ్యమా? అని మళ్లీ విధుల్లో చేరారు. కాని కాజేసిన సొమ్ము మాత్రం జమ చేయలేదు. వీరందరికీ సాయం చేస్తున్న వ్యక్తిగా తెరమీద మళ్లీ సురేషే కనిపిస్తున్నాడు? శాఖలో అవినీతి ఉద్యోగులకు ఆసరాగా సదరు సురేష్ గుర్తింపులో వున్నాడు. అవినీతి చేసినా ఫరవాలేదు. ఉద్యోగాలు పోయినా ఫరావాలేదు…అడ్డూ అదుపు లేకుండా సంపాదించుకోండి…పట్టుబడినా మళ్లీ ఉద్యోగం తెచ్చుకోండి? అన్నది ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటూ పోతున్నారు.
రిజిస్ట్రేషన్ల శాఖను భ్రష్టు పట్టిస్తున్నారు. పైగా మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరని సవాలు కూడా విసురుతున్నారట? ఇక్కడ ఈ మాత్రమైనా పని చేస్తున్నాం…? మేమే లేకపోతే ప్రభుత్వానికి ఆదాయమే లేదన్నంతగా మాట్లాడుతున్నారట? ఇలా జిల్లా పెద్దలు మాట్లాడుతుంటే…కింది స్ధాయి ఉద్యోగులైన సురేష్ లాంటి వారు ఏం చేస్తారో తెలియంది కాదు…ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా? అన్న సామెత ఊరికే రాలేదు. ఇతని అవినీతి అక్రమాలపై, రైతులపై దౌర్జన్యంపై, రియలెస్టేట్ వ్యాపారుల వేధింపులపై పెద్దపెల్లి జిల్లాలో అనేక వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి?. అయినా యంత్రాంగం కదలడం లేదు? ఎందుకంటే వారికి వాటాలున్నాయన్న మాటలు బాధితులే అంటున్నారు.? ఇదిలా వుంటే ఈ వ్యక్తి లీలల్లో మరో కోణం కూడా వుంది. ఎవరైతే తనకు అడ్డుగా వున్నారన్న ఉద్యోగులను కళ్లల్లో పెట్టుకున్నాడంటే ఇక అంతే…ఖర్మకాలి ఒక వేళ అలాంటి అధికారులు ఉద్యోగం కోల్పోవాల్సి వస్తే…ఇక అంతే సంగతి? వారు ఉద్యోగంలోకి రారు..రాలేరు? అంతటి చక్రం తిప్పడంలో సురేష్ ఘనాపాటి అంటున్నారు. పోయిన ఉద్యోగాలు రావాలన్నా అతనే…రాకుండా చేయాలన్నా అతనే…అంటే ఇక అతని లీలలు ఎలా వున్నాయో! అర్ధం చేసుకోవచ్చు!! విద్యాశాఖలోనో, వైద్య శాఖలోనో…మరే ఇతర శాఖలోనూ సాధ్యమయ్యే పని కాదు. సంపాదనకు తావే లేదు…అయినా ప్రభుత్వ పెద్దలకు అతను కనిపించడం లేదా? శాఖ పెద్దలు ఇలా చూస్తూనే వదిలేస్తూనే వుంటారా? ఉపేక్షించడంలో కారణాలేమైనా ఇప్పటికైనా చెబుతారా? అని ప్రజలు అడిగి, అడిగీ విసిపోతున్నారు…
నీతి లేని, అవినీతికి అడ్డాలుగా కొన్ని శాఖలు చెబుతుంటారు. వాళ్లు ఉద్యోగాలు చేస్తున్నారా? అక్రమ సంపాదనల కోసం లైసెన్స్‌లు తీసుకున్నారా? అంటూ సమాజం పుట్టినప్పటినుంచి అడుతున్నదే…అవినీతి సాగుతున్నదే…కాని సామాన్య జనం ఆశ…ఇప్పుడైనా అవినీతి ఆగుతుందేమో! అన్న ఆశ…ఆ ఆశ తీర్చేవారికన్నా, మరింత దోపిడీ పెంచేవారు..వారిని ప్రోత్సహించేవారే వస్తున్నారు. ఎన్నికల సమయం వచ్చిన ప్రతీసారి ఇది కూడా ప్రతి ఎన్నికల్లో ఒక అస్త్రం. పరిపాలనలో అవినీతికి తావులేని పాలన అందిస్తామని చెబుతూనే వుంటారు. మనం వింటూనే వుంటున్నాం. కాని అవినీతి ఆగింది లేదు. అవినీతి రహిత సమాజం మనం చూస్తామన్న నమ్మకం ఏ తరానికి లేకుండా పోతోంది. ఇదేనా మన ప్రజాస్వామ్యంలో జరుగుతున్నది అని ప్రశ్నించుకోవడం…మళ్లీ మర్చిపోవడం…మనకు ఏ పనైనా తొందరగా కావాలి. అందరికన్నా ముందు కావాలి. అందుకు అధికారులు చేతుల్లోనైనా వుండాలి. లేకుంటే వారి చేతులు తడిపేందుకు ముందు మనమే సిద్దం కావాలి…ఇది కూడా అవినీతి కారణమౌతుంది. మేమెందుకు ఇవ్వాలి? అంటూ అందరూ ఎందుకు ప్రశ్నించరు? అవినీతిని అంతం చేయడం కోసం మీడియా నిరంతం కృషి చేస్తూనే వుంది. కాని అందుకు సహకరించడంలో ప్రజలు కూడా ముందుకు రావాలి. మా పని అయిపోతే చాలు…మా పని తొందరగా పూర్తయితే చాలు…అనే ధోరణి ప్రజల్లో కూడా కరెక్టు కాదు. అది కూడా అవినీతిని ప్రోత్సహించేలా చేస్తుంది. మరింత అవినీకి కారణమౌతోంది.
` సూత్రదారి, పాత్రదారి అతనే? ` స్టాంపుల అమ్మకంలో లూటీ…ఛలాన్ల మాయాలో బురిడీ? ` మాకు దిక్కేదంటున్న భాధితులు ` నకిలీ ఛలాన్ల పేరుతో వెండర్లకు టోకరా? ` తప్పు మాదంటేనే లైసెన్సుల పునరుద్దరణ ` ఏం జరిగినా మాదే బాధ్యత? ` అర్ధరాత్రి దాకా బాధితులకు బార్లో బుజ్జగింపులు? ` తప్పించుకున్నా అర్ధరాత్రి వెంబడిరతలు? ` రాత్రి ఒంటిగంటకు బలవంతగా సంతకాలు? ` అదే రాత్రి షాపు తెరిచి సంతకాలతో పాటు,స్టాంపులు? ` ఒకరి సంతకాలను చూపి ఇతరులపై ఒత్తిడి? ` ఓ జిల్లాకు చెందిన కీలక తెరాస నేత బాధితులకు బెదిరింపులు ` ఆ నేతకు, ఈ కేసుకు సంబంధం ఏంటి? ` ప్రైవేటు వ్యక్తులకు నియమించుకొని ఏమిటీ అక్రమ దందాలు ` దోచుకోవడానికి దొడ్డి దారులు? ` నొక్కేసిన బిల్లులు చెల్లింపుల్లో…అతని తిప్పలు? ` కాలం ఎదురు తిరగడంతో ఇప్పుడు అవస్థలు
హైదరాబాద్ , నేటిధాత్రి :
కాలం కలిసొస్తే చాలు కొంత కాలం తిరుగుండదు. కావాల్సిన కుర్చీ దొరికితే చాలు సంపాదనకు అడ్డూ అదుపు వుండదు. కొన్నిశాఖల్లో ఇది పరిపాటి. రిజిస్ట్రేషన్ శాఖలో నిత్య కృత్యమిది. అన్న ఆరోపణలు వినిపిస్తున్నవి. ఎవరో చూస్తారన్న భయం వుండదు? పై కుర్చీలను చల్ల బరిస్తే చాలు…ఇంకేముంది? నాకేమౌతుందిలే…నన్వెరు పట్టుకుంటారు లే….లెక్కలు…బొక్కలు ఎవరు చూస్తారు లే…పట్టుకున్నప్పుడు చూద్దాంలే…ఎంక్వౌరీ దాకా వస్తే అప్పుడాలిచిద్దాం లే…అవసరమైతే స్టాంపు వెండర్లు, ప్రాంకింగ్ వెండర్లను ఇరికించొచ్చు లే…ఎట్లైనా మనం తప్పించుకోవచ్చులే…పెద్ద తలకాయలన్నీ మనకు అనుకూలమే లే…సమయమొస్తే కాపాడుతారు లే…వాళ్లది వాళ్లకు ముట్టజెప్పినంక ఏం చేస్తారులే…అంతా గప్ చుప్…ఎక్కడి వాళ్లు అక్కడే….!? ఏం జరిగిందో బైట ప్రపంచానికి తెలియదొద్దు…ఎవరూ బైటకు చెప్పొద్దు…లేకుంటే బెదిరింపులు…కాని కాలం కాటేసే సమయం వస్తే అంతా బైట పడుతుంది. బాగోతం అంతా బజారుకెక్కుతుంది….ఇదే ఇక్కడ జరిగింది….
ఏళ్లు గడుస్తున్నా…చేసిన తప్పులకు శిక్షలేవు. సస్పెన్సుకు గురౌతారు..మూడు నాలుగు నెలలు సెలవులు తీసుకున్నంత సంబరంగా కాలం గడుపుతారు..మళ్లీ వచ్చి కుర్చీలో కూర్చుంటారు. ఈ మాత్రం దానికి ఇబ్బంది ఎందుకు? టెన్షన్ ఎందుకు? ఎంచక్కా ఎదురుచూస్తూ వుంటే చాలు…ఉద్యోగం అదే నడుకుంటూ వస్తుంది. కుర్చీలో కూర్చోమంటుంది. ఉద్యోగం చేసినంత కాలం సంపాదించుకోమని చెబుతుంది? ఇదే ఉద్యోగులు నమ్ముకుంటున్నది. ఇలా అయితే అవినీతి జరిగిందని తెలిసినా పట్టుకోవడాలు ఎందుకు? విచారణలు ఎందుకు? ఎవరైతే విచారణ చెస్తారో…మళ్లీ వాళ్లే తప్పులేదని రిపోర్టులివ్వడం ఎందుకు? పై అధికారి, విచారణ చేసేది ఒక్కరే అయినప్పుడు ఈ హడావుడి ఎందుకు? వారిని కుర్చీల్లోనుంచి పంపడం ఎందుకు? మళ్లీ పిలిచి మరీ కుర్చీలు వేయడం ఎందుకు? ఇది వ్యవస్ధ లోపమా? వ్యక్తులుగా సమాజంలో జనం లోపమా? ప్రభుత్వాల నిర్లక్ష్యమా???
ఎనమిదేళ్ల క్రితం జరిగిన కథకు ముగింపు లేదు. కథ కంచికి చేరింది లేదు. కాని బాధితులే ఏడుస్తున్నారు. కడుపు నిండా తింటున్నది లేదు. కంటినిండా నిద్ర పోతున్నదిలేదు. ఊరొదిలి వెళ్తున్నది లేదు. పండగలు, పబ్బాలు లేవు. అవినీతి ముద్రవేసి సమాజంలో దోషులుగా అమాయకులను చూపించి, చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు వాళ్లు తలెత్తుకోలేక, తమది తప్పేం లేదని ఎంత చెప్పినా వినేవారు లేక గొడగొడ ఏడుస్తున్నారు. మీది తప్పేం లేదన్న ఒక్క మాట చాలంటున్నారు బాధితులు..అంతకు మించి ఏమీ వద్దంటున్నారు. . సమాజంలో ఇలాంటి పరిస్ధితి ఎవరికీ రావొద్దంటున్నారు.
కరీంనగర్ జిల్లా రిజిస్రార్ కార్యాలయంలో సురేష్ అనే ఉద్యోగి చేసిన ఘన కార్యం మూలంగా ఎనమిది మంది నిత్య నరకం అనుభిస్తున్నారు. ఎప్పటిలాగే నలుగురు స్టాంపు వెండర్లు, నలుగురు ప్రాంక్లింగ్ వెండర్లు బిల్లులు చెల్లిస్తూ స్టాంపులు తీసుకుంటుండేవారు. కాని తీసుకున్న సొమ్ములు సురేష్ ప్రభుత్వ ఖజానలో జమ చేసేవారు. తన సొంత జేబులు నింపుకుంటుండేవారు. మూడేళ్ల కోసారి ఓ ముచ్చట అన్నట్లు ఆ శాఖలో అప్పుడప్పుడు తనికీలు జరుగుతుంటాయి. ఖజానకు కన్నం పడిరదన్న సంగతి తేలిపోయింది. సురేష్‌ను సస్పెండ్ చేశారు. జైలుకు పంపించారు. అదేంటో గాని ఇంత చేసినా ట్రిబ్యునల్ ఉద్యోగం చేసుకోవచ్చన్నది. కాకపోతే అంతా రికవరీ చేయించాలన్నది. మరి ఇప్పుడెలా…తన ఉద్యోగానికి భరోసా…ఖజానకు నొక్కేసినవి భర్తీ అన్నది తక్షణ కర్తవ్యం. దాంతో ఎవరినైతే దోషులంటూ సురేష్ ముద్ర వేశాడో…వారినే భ్రతిమిలాడితే చాలు. పనైపోతుంది. తన తప్పేం లేదని తేలిపోతుంది. అందుకు ఏం చేయాలి. తన అధికారాన్ని ఉపయోగించాలి. దాంతో సురేష్ నయానా, భయానా కూడా బెదించడం జరిగింది. భుజ్జగింపుల పర్వంలో ప్రాంక్లిన్ వెండర్‌ను సురేష్ బారుకు తీసుకెళ్లారు. గంటలు గంటలు బ్రతిమిలాడాడు. అసలు విషయం ఏమిటంటే తప్పు మాది…సురేష్‌ది ఎలాంటి తప్పులేదు…ఇది చెప్పాల్సింది.లిఖిత పూర్వకంగా లేఖ ఇవ్వాల్సింది… అంటే…తప్పుచేసిన సురేష్ తప్పించుకోవడానికి ఆ తప్పు ఏ తప్పు చేయని వెండర్లు నెత్తి మీద వేసుకోవాలి. అయితే చెల్లింపులు మాత్రం సురేషే చేసుకుంటాడు. కాని ఒక్కసారి సంతకం పెట్టి తప్పు మాదే…అంటే ఇక వెండర్లు దోషులమని ఒప్పుకున్నట్లే…దాంతో ఆ వెండర్ ససేమిరా? అన్నాడు. ఏ బార్‌లో భుజ్జగిస్తున్నారో అక్కడినుంచి సురేష్‌కు చెప్పకుండా తన ఇంటికి వెళ్లిపోయాడు. అయినా సురేష్ ఊరుకోలేదు. వెంబడిరచాడు. అర్ధరాత్రి ఆ వెండర్ ఇంటికి వెళ్లాడు. నయానో..భయానో సంతకం చేయించాడు….? ఆ వెండర్‌ను దోషిని చేసే ఆధారం సంపాదించాడు.
ఈ కాగితం చూపించి సురేష్ మరో ప్రాంక్లిన్ వెండర్‌ను కూడా కాగితం మీద సంతకం చేయమన్నాడు. కాని అతను ఎంత భ్రతిమిలాడినా ససేమిరా? అన్నాడు. సంతకం చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా నేను చూసుకుంటాను? అంటూ భరోసా ఇవ్వడమే కాదు, జిల్లా రిజిస్ట్రార్ కూడా మద్దతిస్తాడు? అని సురేష్ చెప్పాడు. దాంతో సదరు వ్యక్తి రిజిస్ట్రార్ దగ్గరకు వెళ్లడంతో సంతకం చేయాలా? వద్దా? అన్నది నీ ఇష్టం…దాని విషయంలో నేనేం చెప్పాలి? అన్నాడు. ఇదంతా ఏదో లేనిపోని వ్యవహారంలా వుందన్న సంగతి గమనించి ఆ వెండర్ నాటి జిల్లా ఎస్పీకి పిర్యాధు చేశాడు. జరిగిందంతా పూస గుచ్చినట్లు వివరించాడు. ఇది తెలిసిన జిల్లా రిజిస్ట్రార్ వెంటనే సురేష్‌తోపాటు, ఇతర ఎనమిది మంది వెండర్లు కూడా దోషులే అన్నట్లు పిర్యాధు చేశాడు.
ఇప్పుడు ఆలోచించండి….బాధితులు తప్పు మాదే అన్నట్లు సంతకం పెడితే జిల్లా రిజిస్ట్రార్ ఎలాంటి పిర్యాధు చేసేవారు కాదు. కాని ఓ ప్రాంక్లిన్ వెండర్ ససేమిరా అనడంతో అందర్నీ దోషులుగా ముద్రవేసే పన్నాగం పన్నారు. ఇదిలా వుంటే సురేష్ ఓ ముగ్గురు చేత సంతకాలు చేయించడమే కాకుండా, సదరు వెండర్లనుంచి తీసుకున్న సొమ్మును కొంత ఖజానలో జమ చేశారు. అయితే అసలు ట్విస్టు ఇక్కడే వుంది. వెండర్లు నకిలీ ఛలాన్లు తెచ్చారనే దోషులను చేశారు. ఒక వేళ అదే నిజమైతే తర్వాత తెల్లించాల్సివస్తే అదే వెండర్లు చెల్లించాలి. కాని బాధితులు చెల్లించలేదు. అసలు సూత్రదారి, పాత్రదారి సురేష్ ప్రత్యేకంగా నియమించుకున్న ఓ ప్రైవేటు ఉద్యోగి పేరు మీద ఛలాన్లు తీసి బిల్లులు చెల్లించారని బాధితులు వెల్లడిరచారు. అసలు ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి పేరు మీద ఎలా బిల్లులు చెల్లిస్తారు? ఒక తప్పు, పదేపదే తప్పులను చేయిస్తుంది. కాని పెద్దల ఆశీస్సులు కూడా పుష్కలంగా వుండడంతో ఖజానకు సొమ్మువచ్చిందా? లేదా? అన్నది చూసుకుంటే చాలన్నంత దోరణిలో సురేష్‌ను ఉన్నతాధికారుల కాపాడారు….మళ్లీ, మళ్లీ…మరింత…మరింత దోచుకోవడానికి మార్గం చూపించారు…..మరి బాధితులకు న్యాయం ఎవరు చేస్తారు? ఇంత గోల్ మాల్ గోవిందం ఏళ్ల తరబడి జరుగుతున్నా పట్టించుకుంటారు? బాధితుల గోడు ఎవరు తీర్చుతారు? వారికి న్యాయం ఎవరు చేస్తారు?
` తను సాగడు…ఇంకొకర్ని సాగనివ్వడు? ` తన సొంత మనుషులు తప్ప మరెవరినీ కలవడు? ` ` పార్టీని పట్టించుకోడు..కార్యకర్తలతో సమావేశమవ్వడు? ` నాయకులకు సమయమే ఇవ్వడు? ` దేశమంతా పుంజుకుంటున్న, ఇక్కడ పట్టించుకోడు? ` బిసి నేతలంటే పడదు..ఎస్సీ నాయకులను సంప్రదించడు? ` ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాడడు..ఉద్యమాలకు పిలుపునివ్వడు? ` రాష్ట్రంలో ప్రభల శక్తిగా పార్టీ ఎదుగుతున్నా, ఇక్కడి సంగతి పట్టించుకోడు? ` నియోకవర్గంలో సగటు కార్యకర్తల ఆందోళన..ఆవేదన..!
హైదరాబాద్ , నేటిధాత్రి : పట్టి పట్టి లింగం కడితే భక్తుడౌతాడా? పట్టింపు లేనప్పుడు పట్టం కడితే పట్టించుకుంటారా? ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు.. సాక్షాత్తు ఖైరాతాబాద్ నియోజకవర్గానికి చెందిన బిజేపి నాయకులు, కార్యకర్తలు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బిజేపి పాగా వేయాలని, అధికారంలోకి రావాలని యోచిస్తోంది. అందుకు
తగ్గట్టుగా రాష్ట్ర నాయకత్వం ఎంతో కృషి చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీలో జోష్ నిండుతోంది. దుబ్బాక ఎన్నికలో విజయం తర్వాత వరుస విజయాలు బిజేపి చవిచూస్తోంది. ఆ తర్వాత వచ్చిన జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో బిజేపి ఎంతో ప్రభావం చూపింది. అధికార తెరాసకు దిమ్మతిరిగే షాక్‌నిచ్చింది. మళ్లీ వంద సీట్లు మావే అన్న తెరాసకు నిలువరించింది. సీట్ల కోతకు కారణమైంది. బిజేపి జెండా రెపరెపలాడిరది. నాయకుల్లో ఆత్మస్ధైర్యాన్ని నింపింది. కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం నిండిరది. కాని ఖైతరాబాద్ నియోకవర్గంలో మాత్రం పరిస్ధితి భిన్నంగా ఉంది. నియోజవర్గ ఇన్‌చార్చి చింతల రాంచంద్రారెడ్డి పార్టీని పట్టించుకునే పరి
స్ధితే లేకుండా పోయింది. మాజీ ఎమ్మెల్యే చింతలకు పార్టీ మీద చింతే లేదంటున్నారు స్థానిక కార్యకర్తలు. ఆయన పార్టీని పట్టించుకోవడం ఎప్పుడో మానేశారంటున్నారు. నియోజక వర్గంలో ఆయన తిరగక నెలలు గడుస్తోందంటున్నారు. క్షేత్ర స్ధాయిలో సమీక్షలు లేవు. నాయకులకు బాధ్యతలు అప్పగించింది లేదు. మొత్తంగా నియోజకవర్గాన్ని ఆయన పట్టించుకుటున్నది లేదంటున్నారు. పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులను ఎదగనిర్వరు.. పార్టీలో జోష్ నిండనివ్వరు అని చాలా మంది బిజేపి నాయకులు దుమ్మెత్తిపోస్తున్నారు.
సహజంగా గెలిచినప్పుడు నాయకులు ప్రతి క్షణం నియోజకవర్గంలోనే తిరుగుతుంటారు. ఉప్పల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ చేసిన దాంట్లో కనీసం పదోవంతు కూడా చింతల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పనిచేయలేదంటున్నారు. ఎమ్మెల్యేగా ఉంటూనే నాడు ప్రభాకర్
సుమారు రూ.1500 కోట్లతో ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ లాంటి ప్రాజెక్టును కూడా తెచ్చిన సంగతిని నాయకులు గుర్తుచేసుకుంటున్నారు. అంతే కాదు తన నియోజకవర్గ పరిధిలోని చర్లపల్లి రైల్లే స్టేషన్ అభివృద్ధికోసం కూడా పెద్దఎత్తున నిధులు తెచ్చారని చెప్పుకుంటున్నారు. ఇక ఉప్పల్‌లో ఓ సామాన్య నాయకుడిగా ఇప్పటికీ నిత్యం ప్రభాకర్ ప్రజల్లో వుంటారని చెప్పుకుంటున్నారు. అలా మన నియోజవర్గంలో ప్రజల మధ్య ఉండే నాయకుడుంటే ఎంతో బాగుండన్న మాటలే సర్వత్రా వినిపిస్తున్నాయి. ఓ వైపు దుబ్బాక, మరో వైపు హుజూరాబాద్‌లలో గెలవడమే కాకుండా, రాష్ట్ర్ర ప్రభుత్వానికి కంటి మీద కునుకులేకుండా బిజేపి రాష్ట్ర కార్యవర్గం పని చేస్తోంది. కాని ఇక్కడ మాత్రం అధికార టిఆర్‌ఎస్‌కు అనుకూలంగా చింతల పనిచేస్తున్నాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ లాంటి డివిజన్లలో నాయకులు చేస్తున్న ఉద్యమాలకు చింతల ఏనాడు మద్దతిచ్చింది లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దేశమంతా బిజేపి ప్రభంజనం. ఇటీవల జరిగిన ఐదురాష్ట్రాల సార్వత్రిక ఎన్నికల్లో బిజేపి నాలుగింటిని కైవసం చేసుకొని మంచి ఊపు మీదుంది. తాజాగా జరుగుతున్న పార్లమెంటు సమావేశాలకు హజరైన ప్రధాని నరేంద్రమోడీకి స్వాగతం పలుకుతూ బిజేపి ఎంపిలు నినాదాలు చేయడాన్ని దేశమంతా
చూసింది. బిజేపి శ్రేణుల్లో సంతోషం నింపింది. రాష్ట్ర బిజేపి కార్యాలయలంలో సంబరాలు సాగాయి. హైదరాబాద్‌లోని అన్ని నియోజకవర్గాలలోనూ ఇన్‌ఛార్జిలు ఎంతో సంతోషంగా సంబరాలు నిర్వహించారు. కాని ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఇన్‌ఛార్జి కనిపించింది లేదు. నాయకులు, కార్యకర్తలుచేసిన సంబరాలలో
ఆయన పాల్గొన్నది లేదని నాయకులు అంటున్నారు. విజయాలు నాయకులకు స్పూర్తినిస్తాయి. కార్యకర్తలో జోష్ నింపుతాయి. మరి అలాంటి వేడుకలు ముందుండి నిర్వహించాల్సిన చింతల జాడే లేదని చెబుతున్నారు. కనీసం నాయకులతో సంప్రదించి సంబరాలు చేయమని కూడా చెప్పింది లేదని అంటున్నారు. రాష్ట్రంలో మళ్లీ ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం వుందన్న చర్చ జోరుగా జరుగుతోంది. బిజేపి రాష్ట్ర నాయకత్వం ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమంటోంది. గతంలో ఎమ్మెల్యేగా అనుభవం వున్న నేతగా, ఇన్‌చార్జిగా కొనసాగుతున్న చింతలకు మాత్రం ఆ సోయి లేనట్లుందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ నిర్ణీత సమయానికి ఎన్నికలు వచ్చే అవకాశం వున్నా, ఇప్పటి నుంచైనా పార్టీ పటిష్టతకు కృషి చేయాలి. నియోజకవర్గాన్ని పట్టించుకోవాలి. సహజంగా ఏ నాయకుడైనా ఓడిపోతే , మరింత కసిగా పనిచేయాలి. ప్రజల్లో వుండాలి. ప్రతిపక్ష పాత్ర పోషించాలి. ప్రభుత్వాన్ని ఎండగడుతూ ఉండాలి. ఉద్యమాలు చేయాలి.
పోరాటాలు సాగించాలి. ఖైరతాబాద్ నియోజకవర్గంలో అవన్నీ నిషేదమన్నట్లు తలిపిస్తోందంటున్నారు. మాజీ ఎమ్మెల్యే చింతలకు కనీసం పార్టీ బలపడాలన్న ఆరాటం కూడా లేకపోయిందని నాయకులు అంటున్నారు. నియోజకవర్గ పరిధిలో బిసి నాయకుల ఎదుగుదలను చింతల సహించలేపోతున్నారన్న అపవాదు కూడా వినిపిస్తోంది. అందుకు అనేక కారణాలు వినిపిస్తున్నాయి. నియోజవర్గ పరిధిలోని డివిజన్ల నాయకులతో ఆయన ఈ మధ్య కలిసింది, వారితో మాట్లాడిరది లేదు. ప్రజలు ఏమనుకుంటున్నారన్నది చర్చించింది లేదు. నాయకులతో సమావేశమయ్యింది లేదు. ఎన్నికలనప్పడే హడావుడి. అంతే తప్ప మరేమీ లేదంటున్నారు. ఇప్పటికైనా పార్టీ నాయకత్వం ఖైరతాబాద్ నియోజకవర్గం వైపు దృష్టిసారించాల్సిన అవసరం ఉందంటున్నారు. పార్టీని కాపాడుకుంటూ వస్తున్న వారిని గుర్తించాలి. వారితో పార్టీ సమావేశం కావాలి. కొత్త నాయకత్వాన్ని నియోజకవర్గానికి అందించాలి. పార్టీ కోసం అహర్నిషలు పనిచేస్తున్నవారు ఉన్నారు. ఇంత కాలం ఒకే సామాజిక వర్గం గుప్పిట్లో ఈ నియోజకవ్గం ఉంది. ఇకనైనా బలహీనవర్గాలకు అవకాశం కల్పించాల్సిన అవసరం కూడ ఆవుందన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇలాగే కొనసాగితే, చింతల పట్టించుకోకపోతే, పార్టీ రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించకపోతే ఎంతో బలంగా వున్న పార్టీకి ఖైరతాబాద్‌లో ఇబ్బందులే అంటున్నారు. నడిపించే నాయకుడే కరువౌతాడంటున్నారు
పాటకెందుకు కన్నీళ్లు? కళాకారుల వేదనలెన్నేళ్లు? ప్రభుత్వ పథకాల మీద పాటలెవ్వి? పాట లేని తెలంగాణ లేదు. పాటకు తెలంగాణ కట్టిన పట్టం మరెక్కడా లేదు ఆ పాటేమైంది? దాని జాడేమైంది? ప్రభుత్వ పధకాలమీద పాటెందుకు మూగబోయింది? తెలంగాణ పాట గొంతు నులుములుతున్నదెవరు? కళాకారుల ఉసురు పోసుకుంటున్నదెవరు? తెర వెనుక శక్తులెవ్వరు? ఆ వ్యక్తులెవ్వరు? కళకారులను బతకనివ్వరా? అధికారులకు కళాకారులు బానిసలకంటే హీనమయ్యారా?
హైదరాబాద్ ,నేటిధాత్రి: ఎక్కడైతే కళలు వర్ధిల్లుతాయో అక్కడ రాజ్యం, ప్రజలు సుభిక్షంగా, సుఖశాంతులతో వర్ధిల్లుతారంటారు. కళాకారుల సంతోషాలే కనిపించాలి. అందుకే పూర్వం రాజులు కవులు, కళాకారులకు పోషకులగా వుండేవారు. కళాకారులు కన్నీళ్లు పెట్టొద్దు. ఆకలితో అలమటించొద్దు. వారి ఆటపాటలతో సమాజంలో ఆనందం వెల్లివిరియాలి. ఆ కారణంతోనే అనాధిగా కళారూపాలు మన దేశంలో సంస్కృతిలో భాగమయ్యాయి. జీవన విధానమయ్యాయి. సంతోషాలకు సంకేతమయ్యాయి. మనసు నిర్మలానికి వేధికలయ్యాయి. పోరాటలకు చేయూతలయ్యాయి. ఎలుగెత్తే గొంతులయ్యాయి. ఎత్తిన పెడికిళ్లయ్యాయి. రణ నినాదాలయ్యాయి. సమాజ చైతన్యానికి దిక్సూచీలయ్యాయి. తెలంగాణ ఉద్యమానికి మార్గనిర్ధేశమయ్యాయి. దూంధాంల రూపంలో తెలంగాణ సాకారానికి కారణమయ్యాయి.
దుఃఖాన్ని అదుముకొని ఖర్చీప్ అడ్డం పెట్టుకొని కళాకారులు కన్నీళ్లు తుడుచుకొని పైకి నవ్వుతున్నారు. కడుపు రగిలిపోతూ కుమిలిపోతున్నారు. క్షణక్షణం నలిగిపోతున్నారు. పాట కన్నీరు పెడుతోంది. గొంత గోస పడుతోంది. కలం కదల్లేకపోతోంది. అడ్డంకులతో ఆగమాగమౌతోంది. అవమానాలతో తలెత్తుకోలేకపోతోంది. విలువ లేకుండా వెలితికి గురౌతోంది. నిన్నటి దాకా చప్పట్లు కొట్టిన వాళ్లు, ముఖం దాచుకుంటున్నారు. గౌరవించిన వాళ్లే చులకనగా చూస్తున్నారు. సమయానికి జీతాలివ్వక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కళాకారులు అలమటిస్తున్నారు. మలమల మాడుతున్నారు. చిన్నచూపుకు గురౌతున్నారు. ఇంకా చెప్పాలంటే చీధరించుకుంటుంటుంటే కూడా భరిస్తున్నారు. మహిళా కళాకారులను కొందరు వేధిస్తున్నారు? వేధనలకు గురిచేస్తున్నారు? పచ్చిగా చెప్పాలంటే కొందరు దుర్మార్గులు పాటను మంచానికి కట్టేస్తున్నారు. గొంతును నులిమేస్తున్నారు. దాంతో వాళ్లు దిశకన్నా కుమిలిపోతూ బతుకులీడుస్తున్నారు. ఇంత జరుగుతున్నా పట్టించుకునేవారు ఎవరు? తోడేళ్లలాంటి సమాజాన్ని ప్రశ్నించిన పాట వలువలొలుస్తున్నారు? పాటకు పట్టం కట్టాల్సినచోట , తనువును పడుపుగా మార్చుతున్నారు. కళాకారుల కన్నీటికి కారణమౌతున్నారు. పరుపులెక్కిస్తున్నారు? పరువులు తీస్తున్నారు? వారు భయంకరమైన బతుకులీడుస్తున్నారు. పాడే గొంతులతో రోధనలు విని కొందరు సంబరపడుతున్నారు. కళాకారులు కాపాడండని అడగలేకపోతున్నారు. తమ బాధలన కైగట్టి పాడలేకపోతున్నారు. పాట లేకపోయినా పరవాలేదు. పాచి పని చేసుకున్నా బతుకినా భద్రంగా వుంటామనుకుంటున్నారు కళాకారులు. కన్నీళ్లు కడుపులో దిగమింగుకుంటున్నారు. ఇంతకన్నా ఏం చెప్పలేక, కాన రాని మంటల్లో మాడిపోతూ, బతికుండగానే బూడిదౌతున్నారు.
ఇది తెలంగాణలో జై కొట్టి, గొంతెత్తి పాడి, ఆడిన కళాకారుల దుస్ధితి. దీన స్ధితి. వారి పడుతున్న ఇబ్బందులు, ఎదుర్కొంటున్న వ్యధలు వింటుంటే కన్నీరాగదు. తెలంగాణ ఉద్యమ కాలంలో కాలుకు బలపం కట్టుకొని తిరిగారు. ఎండననక, వాననక, చలిని కూడా తరిమి ఆడి పాడారు. కాళ్లకు ఆనెలొచ్చి ప్రాణాలుపోయింతన పనైతున్నా, తెలంగాణ పాటలో బాధను మర్చిపోయారు. ఆకలి చంపుకున్నారు. నిద్ర వదులుకున్నారు. జీవితమే తెలంగాణ అని ముందుకుసాగారు. తెలంగాణానే జీవితం చేసుకొని బతికారు.
కళాకారులంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌కు ప్రాణం. పాటంటే కేసిఆర్‌కు ఎంతో ఇష్టం. తెలంగాణను కదిలించిందే కళాకారులని బలంగా నమ్ముతారు. ఓ సందర్భంలో సీమాంధ్రకు పది చానళ్లున్నా, తెలంగాణలో ఐదు వందల చానళ్లకు మించిన గొంతులున్నాయన్నారు. ఒక్కొక్క గొంతు ఒక్కో ఛానల్‌తో సమానమన్నారు. అంటే ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణ కళాకారులకు ఎంతటి విలువలను అందించారో అర్ధం చేసుకోవచ్చు. అలాగే తెలంగాణ వచ్చాక కళాకారులకు స్వాతంత్య్ర సమరయోధులకిచ్చే గౌరవం కల్పించారు. వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి వారిని గౌరవించారు. వారిని సమున్నతంగా చూడాలనకున్నారు. ప్రత్కేకంగా తెలంగాణ సాంస్కృతికి శాఖను కూడా ఏర్పాటు చేశారు. వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ఇంత వరకు బాగానే వుంది. కాని ముఖ్యమంత్రి కేసిఆర్ లక్ష్యాలకు అధికారులు తూట్లు పొడుస్తున్నారు. కళాకారులకు పని లేకుండా చేస్తున్నారు. జీతాలు సరిగ్గా ఇవ్వకుండా వేదిస్తున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన కళాకారుల చేత ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై అనేక పాటలు రాయించొచ్చు. కళారూపాలు ప్రదర్శించొచ్చు. కాని ఆపని అధికారులు చేయడం లేదు. ప్రపంచమే అబ్బురపడే అనేక రకాలైన పధకాలు తెలంగాణలో అమలౌతున్నాయి. రైతు బంధు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. సాగునీటి ప్రాజెక్టులు. రిజర్వాయర్లు. మిషన్ భగీరథ మంచినీటి సరఫరా. మేకలు, గొర్రెల పంపిణీ, మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్దరణ. చెరువుల్లో చేపల పెంపకం. కులవృత్తులకు ఆదాయాలకు చూపిన మార్గాలపై ఇప్పటికే అనేక పాటలు రావాల్సివుండే… కాని రాలేదు. ఇక ఆసరా, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ఇచ్చే ఫించన్లపై కూడా ఎంతో ప్రచారం సాగాలి. కళాకారులకు చేతినిండా పని కల్పించాలి. కాని అదేదీ జరడంలేదు. కారణం ఎవరు? దాని వెనక వున్న వ్యక్తులెవరు? అదృష్యశక్తులెవరు? ప్రభుత్వం వెంటనే తెలుసుకోవాలి. కళాకరుల జీవితాల్లో తిరిగి వెలుగులు నింపాలి.
ఇంతకీ కళాకారులు ఉసురుపోసుకుంటున్నారో అందరకీ తెలుసు. కాని కళాకారులు చెప్పుకోలేక మధనపడుతున్నారు. సమాచార శాఖ అధికారుల ఆగడాలు. సాంస్కృతిక శాఖ డైరక్టర్ అనుసరిస్తున్న విధానాలు. జిల్లాస్ధాయిల్లో డిపిఆర్వోలు కళాకారుల కన్నీళ్లకు కారణమౌతున్నారని అంటున్నారు. జీతాలు సరిగ్గా ఇవ్వక వేధిస్తున్నారని అంటున్నారు. పైగా మహిళా కాళాకారుల చేత చెప్పుకోలేని పనులు చేసేందుకు ఒత్తిళ్లు చేస్తున్నారట. అందుకు జీతాలు ఆపుతూ వారిని వేధిస్తున్నారట. ఇలా ప్రభుత్వ ఉన్నతాధికారులు కళాకారులను ఇబ్బందులకు గురిచేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్న మాటలే వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సాంస్కృతిక శాఖలో ఏం జరగుతోంది. కళాకారుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్న అధికారులెవ్వరో గుర్తించి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కళాకారులు కోరుతున్నారు. కళాకారులంటే ఆడమన్నట్లు ఆడే కోతులు కాదు. పోతు రాజులు. వాళ్లే రంగమెక్కారంటే అధికారుల బతుకులు తలకిందులే!!
`రోత మాటల సర్వసంగ పరిత్యాగి!! ` తన చీటి తాను చింపుకున్న చినజీయరుడు ` తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురయ్యాడు! ` నోటి దూల తెచ్చిన తంటా..పాపం పండితే వచ్చే మాటల తీట? ` దైవ దూషణతోనే ఎవరికైనా పతనం మొదలు ` తెలంగాణ గడ్డమీద సమ్మక్క ఎవరని..అదెవరని సంబోధిస్తావా? ` ఇంతకీ నువ్వెవరో.. తెలుసుకొనే మాట్లాడావా? ` తెలంగాణ అంటేనే ప్రకృతి శక్తులకు నియలం… ` ఆ ప్రకృతి శక్తులే సమ్మక్క ,సారక్క ప్రతిరూపాలు ` తెలంగాణ ఉనికే సమ్మక్క..సారక్క స్పూర్తి ` విముక్తి విజయాలు తెలంగాణ సొంతం
హైదరాబాద్ , నేటిధాత్రి : అహం తలకెక్కితే అల్పుడౌతాడు. పాపం పండే రోజు దాపురిస్తే దైవ దూషణకు దిగుతాడు. ఇదే వ్యక్తి పతనానికి నాంది. పురాణాలు చెప్పిందిదే…దేవుడు కూడా దూషించేవాడిని పది మందికి పరిచయం చేసి మరీ, దైవ దూషణ చేయింది దుర్గతిని ప్రసాదిస్తాడు. ఇలాంటి గతి పడుతుందని నిరూపిస్తాడు. అప్పుడు నోరెత్తడానికి అందరూ భయపడతారు. కాలం గడిచే కొద్ది మనిషిలో, సమాజంలో మార్పు సహజం. ప్రతి సారి ఒక దుర్మార్గున్ని జనింపజేసి, దైవ దూషణ చేయిస్తాడు. పతనం ఎలా వుంటుందో అన్నది పదే పదే చూపిస్తాడు. ఇక్కడ సరిగ్గా అదే జరుగుతోంది. చిన జీయరుడు యాదగిరి నర్సన్న పేరు మార్చిన నాడే అతని పతనం మొదలైనట్లు తెలంగాణ జనమే అనుకున్నారు. అన్నట్లుగానే సరిగ్గా గుడి పూర్తయ్యేలోగా చినజీయరుడి చీటి చిరిగే సమయం ఆసన్నమైంది. ఇంతకన్నా దైవం వున్నాడన్న దానికి మరో సంకేతం లేదేమో! అని కూడా అనుకోవాలి. కాలం కలిసి రాకపోతే తాడే పామౌతుందంటారు..పదేళ్ల కింద చేసిన పాపపు వ్యాఖ్యలు ఇప్పుడు వెలుగులోకి వచ్చి, జీయరుడి చీకటి బతుకును కథకథలుగా చెప్పుకునేలా చేస్తోంది. ప్రకృతి దూషణ అన్నది ఎంత పాపమో తెలిసి కూడా దైవ దూషణ చేశాడు. సహజంగా జనం మేధావి మాటలు తొందరగా నమ్మరట. పిచ్చోడి మాటలు వెంటనే నమ్మేస్తారట. తెలంగాణ అంటేనే ఒక శక్తి. ఒక ఉద్యమ స్పూరి. చరిత్రంతా తిరగేసినా ఎదిరించే తత్వంతో సాధించిన విజయం. అది ప్రకృతి విజయమైనా….ప్రజల విజయమైనా…తెలంగాణకు ఒక్కటే…తెలంగాణ ప్రతి ఊరిలోనూ ప్రకృతి దేవతలు, గ్రామ దేవతల ఆలయాలుంటాయి. అలాగే తెలంగాణలో సమ్మక్క సారక్క జాతరలే కాదు, గద్దెల కొలువులు అనేక జిల్లాల్లోనూ వుంటాయి. అక్కడ కూడా సమ్మక్క సారక్కలు పూజలందుకుంటారు. మేడారం వెళ్లలేని వాళ్లు, తమ గ్రామాల్లోనే గద్దెల నిర్మాణంతో అమ్మలను కొలుస్తారు. తెలంగాణ అంతటి విశిష్టత, ప్రాశస్త్యం సమ్మక్క..సారక్కలకు వుంది. ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర. పేరుకే గిరిజన జాతరైనా కోట్లాది మంది ప్రజలు కోరుకునే వేల్పులు ఆ తల్లులు. అలాంటి తల్లులను దూషించిన నోరు చేసిన పాపం ఊరికే పోతుందా? ఆ పాపం వెంటాడకుంటుందా? చినజీయరుడి కధను తలికిందులు చేయకుండా వుంటుందా? తెలంగాణ సమాజమంతా ఒక్కసారిగా భగ్గుమంటోంది. తెలంగాణ సమాజ ఆగ్రహానికి గురైనవారు చరిత్రలో గతిలో ఎందరో నీచులున్నారు. రాముడు, కృష్ణుడు పురాణ పురుషులు. వారు ముందు వీరులు. ఆ తర్వాతే దేవుళ్లు. కారణజన్ములై ప్రజలకు మంచి నేర్పేందుకు, లోక రక్షణ కోసం అవతరించారు. ఆదర్శవంతమైన సమాజ నిర్మాణం కోసం కృషి చేశారు. సత్యం, ధర్మాలకు ప్రతీకలుగా, ఆద్యులుగా నిలిచారు. చెడు మీద విజయాలు సాధించి వీరులయ్యారు. ప్రజల ఆరాధ్యులయ్యారు. ఇక్కడ సమ్మక్క..సారక్క కూడా అంతే…ముందు వారు వీరవనితలు. చెడుమీద పోరాటం చేసిన వాళ్లు. తమను అణిచివేస్తున్నవారి మీద తిరుగుబాటు చేశారు. యుద్ధం చేశారు. ప్రజల కోసం ప్రాణాలు త్యాగం చేశారు. తర్వాత దేవతలయ్యారు. కొన్ని వందల సంవత్సరాలుగా ప్రజలకు అండగా వుంటున్నారు. ఆయురారోగ్యాలు ప్రసాదిస్తునారు. తెలంగాణ తోపాటు పొరుగున వున్న చత్తీస్‌ఘడ్, మహారాష్ట్రలోని అనేక ప్రాంతాలకు ఇలవేల్పులయ్యారు. అలాంటి సమ్మక్క సారక్కల గురించి తెలిసీ తెలియక తిక్కవాగుడు వాగడమే తప్పు. పైగా వారినిద్ధేశించి అది అంటూ సంభోధించడం చిన్న జీయరుడి అహంభావానికి నిదర్శనం. తెలంగాణ దృష్టిలో సమ్మక్క `సారక్కలు ఆది దేవతలు…వన దేవతలు వాళ్లు… వాళ్లను తూలనాడడం క్షమించరానిది. తెలంగాణలో బతుకుతూ తెలంగాణ ఉద్యమాన్ని కళ్లతో చూసిన అనుభవం చినజీయరుడకి వుంది. తెలంగాణలో కొన్ని కోట్ల కుటుంబాలకు ఇలవేల్పులైన వన దేవతలనుద్ధేశించి చేసిన వెలికి వ్యాఖ్యలపై చినజీయరుడుకి కనువిప్పు కలగాల్సిన అసవరం వుంది. తిన్నింటి వాసాలు లెక్కించడం అనేది ఏమిటన్నది రెండుసార్లు చినజీయరు నిరూపించుకున్నట్లైంది. తన బుద్దేంటో తనే స్వయంగాచెప్పినట్లైంది. ఇంకా తెలంగాణ సమజం ఉపేక్షించే స్ధితిలో లేదు. ద్వైతానికి, అద్వౌతానికి తేడా తెలియని చినజీయరు విశిష్టాద్వైతం గురించి మాట్లాడడం అంటే తేలు మంత్రం రాని వాడు పాము మంత్రం చెప్పినట్లే అని మేధావులు ఏనాడో చెప్పారు. సమ్మక్క` సారక్క జాతర అనేది ఒక వ్యాపారమా? మరి చినజీయరు చేస్తున్నదేమిటి? సమతా మూర్తి సందర్శనకు టిక్కెట్లెమిటి? సమతా మూర్తి విగ్రహం దైవ స్వరూపమేమీ కాదు. భువినుంచి రామానుజుడు దిగి రాలేదు. చినజీయరుడు దైవ దూత అసలే కాదు…పాపపు కూతలు కూసే వాడని తనను తాను నిరూపించుకున్నాడు. ఆ మధ్య కులాలు మాసిపోకూడదు. ఏ కులం వారు ఆ కులవృత్తిని చేయాలి. మాంసం తినేవారు జంతువుల్లాగా ప్రవర్తిస్తారు. కోడిని తిన్నవారు కోడిలాగే వ్యవహరిస్తారంటూ సమాజ ఆహార వ్యవహారాల మీద దాడి చేశాడు. అప్పుడే తెలంగాణ సమాజం తిరగబాల్సివుండే. కాని వదిలేశారు. గట్టిగా నిలబడలేదు. కాని ఇప్పుడు తెలంగాణలోని ఏ సమాజం చినజీయరుడిన వదిలేయొద్దు. ఆయనతో క్షమాపణ చెప్పడమే కాదు భవిష్యత్తులో ధర్మప్రవచనాల పేరుతో చిల్లర మాటలు మాట్లాడనని కూడా చెప్పించాలి. తెలంగాణ మీద సాంస్కృతిక దాడి అంటే ఇదే…ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత ఉద్యోగ నియామకాల విషయంలోనూ ఇలాగే జరిగింది. నాడు తెలంగాణ విద్యార్ధులు, యువత అంతా ఉర్ధూ మీడియంలోనే చదువుకున్నారు. ఉద్యోగాల విషయంలో తెలుగు సరిగ్గా రాకపోవడంతో ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు ఇలాగే వ్యవహరించారు. తెలంగాణ యాసను అవమాన పర్చారు. సాక్ష్యాత్తు కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ సమజాన్ని అవమానించారు. తెలంగాణలో 1969 ఎప్రిల్ నెలలో ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో గద్వాలలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో తెలంగాణ వారికి తెలివిలేదంటూ వెకిలి వ్యాఖ్యలు చేశారు. ఈ పరంపర ఇలా సాగుతుండంతోనే తెలంగాణ అస్ధిత్వాన్ని కోరుకున్నది. అలాంటిది తెలంగాణ వచ్చాక కూడా తెలంగాణలో వుంటూ, తెలంగాణ ఆచార వ్యవహారాల మీద, సంస్కృతీ సంప్రదాయాల మీద, గుళ్ల మీద, గ్రామ దేవతల మీద కూడా చినజీయరుడు వ్యాఖ్యలు చేయడం సహించరానిది. ఆంధ్రప్రాంతంలో కూడా అనేక జారతలున్నాయి. అక్కడ కూడా అనేక మంది దేవతలు కొలువైవున్నారు. జాతరలు నిర్వహిస్తారు. అక్కడ అలాంటి వ్యాఖ్యలు చినజీయర్ చేస్తాడా? కాని ఏ ధైర్యంతో నీచ పలుకులు పలుకాడు? ఎంత అహంకారముంటే తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలలో ఒక ముఖ్య భాగమైన సమ్మక్క. సారక్కలను గురించి మాట్లాడతాడు? తెలంగాణ అంటేనే ప్రకృతి. తెలంగాణ అంటేనే ప్రకృతి శక్తి. ఇక్కడ పూలను పూజిస్తారు. పూలలో కూడా గౌరమ్మను చూసుకుంటారు. పూలతో పూజలు చేస్తారు. ఆ పూలతోనే జీవితం ముడివేసుకుంటారు. ప్రకృతిని ఆరాధిస్తారు. అందులో సమ్మక్క సారక్కలు భాగమయ్యారు. వన జీవనంలో వేడుకలకు దేవతలయ్యారు. కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాదిస్తున్నారు. అలాంటిది సమ్మక్క, సారక్కలపై చినజీయరుడి అల్పత్వాన్ని సూచించే మూర్ఖపు వ్యాఖ్యలు ఎవరూ క్షమించొద్దు. ఎవరికీ తెలియని ఓ వ్యక్తిని తెచ్చి సమతా మూర్తి అని పరిచయం చేసి, వ్యాపారం చేసే వ్యక్తి తెలంగాణకు చీడపురుగవుతున్నాడని తెలంగాణ సమాజం భావిస్తోంది. అతనికి అధిక ప్రాధాన్యతన్విడంతోనే తరతరాలుగా కొలుస్తున్న యాదగిరి నర్సింహస్వామి పేరును చెరిపేసే కుట్ర చేసినప్పుడే అతని స్వరూపం తెలిసిపోయింది. తన ఎదుగుదలకు ఎంతో సహకరించిన ముఖ్యమంత్రి కేసిఆర్ పేరు సమతా మూర్తి విగ్రహావిష్కరణ శిలాఫలకంలో చేర్చనప్పుడే అసలు బుద్ది తేలిపోయింది. సద్భుద్ధి లేని వారు సర్వసంగ పరిత్యాగైనా, దుర్భుద్దికి అన్నో తమ్ముడౌతాడో గాని మనిషి కాలేదు. మానవత్వం నటిస్తే సరిపోదు. మనిషినని చెప్పుకుంటే ఎవరూ నమ్మరు. కోపమొచ్చేలా వ్యవహరిస్తే తెలంగాణ ప్రజలు తరుముతారో…తంతారో కూడా తెలిసి కూడా వెలికి వ్యాఖ్యలు చేయడాన్ని సహించడం అంటూ ఉండదు.
హైదరాబాద్ , నేటిధాత్రి :
కలం పట్టిందేనాడు లేకపోయినా కాషాయం దరిస్తే చాలు. పుస్తకం పట్టకపోయినా పురాణాలు వల్లె వేసినట్లు మాట్లాడితే చాలు. బడిబాట సరిగ్గా పట్టకపోయినా సరేకబతుకు పాఠాలు చెప్పడం వస్తే చాలు. హైందవ సమాజంలో మోసగాళ్లకు సమాజంలో పేరు… ప్రఖ్యాతులు…హారతులు, ఆహ్వానాలు…పెద్దరికాలు..పేరంటాలు…పూజలు,పునస్కారాలు…దీవెనలకోసం సాష్టాంగ నమస్కారాలు….విరాళాలు..అభిమానులు…అనుచరులు….సమూహాలు…సంఘాలు..మఠాలు, పీఠాలు….దైవాంశసంబూతులంటూ భజనలు, కొబ్బరి కాయలు……ఏళ్లకేళ్లు వేధాలు నేర్చుకున్నవారు కూడా ఇలాంటి వాళ్ల ముందు పనికిరారు. వాళ్లసలు వెలుగులోకే రారు. ఎక్కడో ఏ గుడిలోనో నెల జీతంతో బతుకుతుంటారు. నాలుగు శుభకార్యాలు చేస్తే వచ్చే సంభావనతో కాలం గడిపేస్తుంటారు. కాని కాశాయం వంటి మీద వేసుకుకొని, కషాయపు మాటలు కలగాపలం చేస్తే చాలు ప్రచారానికి ప్రచారాలు. వివాదాలకు వివాదాలు…అదే సమాజంలో గుర్తింపులు గుడులు, మనులు…మాన్యాలు..స్ధలాలు, భవంతులు, ఆశ్రమాలు…మాటకు మాట పెంచుకుంటూ పోతే అదే వేధికలు. ఇంకేముందు జనం దృష్టింతా వారిపైనా..ధ్యాసంతా వారి జపంలోనే..నాలుగు వెకిలి నవ్వులు నవ్వి, తనకంటే ఎవరూ ఎక్కువ కాదన్నట్లు పల్లికిలిస్తే అదే స్వామీగా గుర్తింపు…ఇంకేముంది సంపాదనకు సంపాదన..దనార్జనకు ధనార్జన. లెక్కా పత్రం ఏదీ అసవరంలేదు. వారి పేరు మీద బ్యాంకు అకౌంట్లు లేకుంటేనే మరీ మేలు….చెప్పుకోవడానికి, తప్పించుకోవడానికి ఎంతో పనికొస్తుంది. అయినా ఇంత వరకు కూడా బాగానే వుంటుంది. కాని సమాజంలో కులం పేరు చెప్పి కుంపట్లు పెట్టడం అన్యాయం. మతం పేరు చెప్పి మత్తును కల్పించడం పాపం. రెండూ కలగాపులంగం చేసి చిచ్చు రేపడం నేరం. దాన్ని సహిస్తూ పోవడం కూడా సమాజంలో పెద్ద లోపం.
మనకు సంస్కృతీ సంప్రదాయాలు ఒకరు మనకు నేర్పించాలా? చరిత్రలో క్రీపూ ఐదు శతాబ్ధాలకు ముందే దేశంలో జైన, బౌద్ద మతాలు వెలిశాయి. తర్వాత ఇస్లాం, కిస్టియన్ మతాలు ప్రవేశించాయి. బౌద్దం పుట్టిన మన దేశంలోనే దాని ఆనవాలు చెప్పుకోవడానికి మిగల్లేదు. జైనం కనిపించినా హిందూ సమాజంలో బాగమే అంటున్నాము. ఇక మిగతా రెండు మతాలు కూడా ప్రపంచమంతా విస్తరించినా మన దేశంలో పెద్దగా ప్రభావం చూపలేదు. క్రీశ.726లోనే మన దేశంపై మొదటి సారి అరబ్బుల దాడి మొదలైంది. ఆ తర్వాత వచ్చిన సుల్తానులు, లోడీలు, తుక్లలు, ఖిల్జీలు, లోడీలు, మొగలలు ఇలా మన దేశాన్ని పాలించారు. వారంతా ముస్లింలే. అంత దాకా ఎందుకు మన తెలంగాణలో 1948 సెప్టెంబర్ 17 వరకు కూడా పాలన చేసింది ముస్లింలే. కాని నాడైనా, నేడైనా నూటికి 80శాతం మంది హిందువులే….ఎంత మంది పరాయి పాలకులొచ్చినా హైందవ సంస్కృతిని నాశనం చేసింది లేదు. కొత్తగా ఎవరూ సమానత్వం గురించి, మానవత్వం గురించి కొత్తగా చెప్పాల్సిన అసవరం లేదు. కాని కొంత మంది సమాజోద్దరణ, సంస్కృతి పరిరక్షణ పేరుతో కషాయం ధరించి నామాల పేరుతో పంగనామాలు పెట్టడానికి, సమాజాన్ని రెండుగా చీల్చడానికి భయలుదేరుతున్నారు. నోరుంది కదా! అని ఏది పడితే అది మాట్లాడొచ్చన్న అహంభావంలో వున్న కొంత మంది చిన్న జీయర్ లాంటివారు తమను తాము అధికంగా ఊహించుకున్నప్పుడే సమాజంలో కొన్ని ఇబ్బంది కరమైన పరిస్ధితులు ఎదురౌతున్నాయి.
కుడి చేతితో చేసిన సాయం ఎడమ చేతికి తెలియకుండా వుండాలన్నది పురాణాలు చెప్పిన మాట. ఆ మాట చిన్న జీయరుడికి తెలుసా? తెలంగాణలోనే, దేశంలో అనేక ఆశ్రమాలున్నాయి. అనాధలైన పిల్లలను చేరదీస్తున్నాయి. కొన్ని లక్షల మందికి సేవ చేస్తున్న సంస్థలున్నాయి. కొంత కాలం క్రితం వరకు ఆంధ్రప్రదేశ్‌లో సత్యసాయి బాబా సేవలంటే అవి. ఆయన బతికున్నంత కాలం ఏనాడు కులాల ప్రస్తావన రాలేదు. మతాల ప్రస్తావన తేలేదు. హైందవ సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపజేశాడు. హిందూ మత గొప్పదానాన్ని మాత్రమే వివరించాడు. దేశ, విదేశాలన్న భేధం చూపలేదు. విద్వేశాలకు తావు లేకుండా ప్రవచనాలు చెప్పే వారు. ప్రభుత్వాల నుంచి కాని పనిని ఆయన చేసి చూపించారు. అనంత పురం మొత్తానికి ఆ రోజుల్లోనే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇంటింటికీ మంచినీళ్లందిచాడు. ఉమ్మడి రాష్ట్రమే కాదు, ఇప్పటికీ గుండె ఆపరేషన్ల విషయంలో ముందు గుర్తొచ్చేది సత్య సాయిబాబా ఆశ్రమం. అక్కడ వైద్యాలయం…ఆయన చేసినసేవలకు దేశమంతా ప్రశంసించింది. ప్రపంచం కొనియాడిరది. ఎంతో మంది విదేశీలు కూడా హిందుత్వం స్వీకరించేలా చేసింది. వారంతా వారి వారి దేశంలో కూడా హైందవ సంస్కృతిని ఫరిడమిల్లేలా చేసింది. అందుకే మనమంతా ఆయన్ను దైవంగా కొలిచింది. అంతే కాని ఆయన నామాల గురించి, నాటకాల గురించి, కులాల గురించి చెప్పలేదు. ఆ బేధాలు ఏనాడు చూపలేదు. ప్రజలనుంచి వచ్చిన విరాళాలతో ఆయన ప్రజా సేవ చేశారు. పేదలను ఆదుకున్నాడు. ఆరోగ్యాలు కాపాడాడు. అంతే కాని చినజీయర్‌లాగా విగ్రహాల పేరుతో వందల కోట్లు ఖర్చు చేయలేదు. గుడులు నిర్మించి వ్యాపారం చేయలేదు. ఆశ్రమాలకు టిక్కెట్లు ఏర్పాటు చేయలేదు.
సమ్మక్క సారక్క బ్రహ్మలోకం నుంచి ఊడిపడ్డారా? అంటావా ఎంత ధైర్యం. ఎంత అహంభావం. వాళ్లేమైనా దేవుళ్లా..కాదా..అని నువ్వెలా డిసైడ్ చేస్తావు? అలా అనడానికి నీకు వున్న అర్హతేమిటి? దాంతోపాటు కులాలుండాలా? సమతా మూర్తిగా పిలువబడుతున్న రామానుజాచార్యులు సమాజంలో అందరూ సమానమే అన్నప్పుడు కులాలెందుకు? వాటి అడ్డుగోడలెందుకు? ఆధిపత్యాలెందుకు? అణగారిన వర్గాలన్న మాటలెందుకు? వారిని పై ఈ చిన్న చూపులెందుకు? కుల రహిత సమాజం కోసం ప్రజాస్వామిక వాదులు, మేధావులు కృషి చేస్తుంటే తప్పా…? నీ కెలాగు విద్య లేదు. విజ్ఞానం అసలే లేదు. చరిత్ర తెలియదు. చారిత్రక సత్యాలు నేర్చుకోలేదు. దేవుళ్లతోనే పరాచికాలాడేంత లేకి మాటలు మాట్లాడడం నీ పతనానికి పరాకాష్ట. చిన్న జీయరా! నీ ఆశ్రమంలో ఉద్యోగ నియమాకాలపై వస్తున్న వార్తలు నిజమే అని తేలితే మాత్రం ఇక సమాజం నుంచి ముఖ్యంగా తెలంగాణ బహుజనుల నుంచి వ్యతిరేకత తప్పదు. తెలంగాణ నుంచి తరుముడు తప్పదు. నువ్వు పారిపోక తప్పదు. పోరాటం తెలంగాణకు కొత్త కాదు. కప్పం కట్టమని దండెత్తి, దాడి చేయాలని చూసిన కాకతీయులనే సహించని సమాజం సమ్మక్కది. అడవుల్లో పశువులను మేపుకుంటే గడ్డికి పన్ను కట్టమని ఒత్తిడి చేస్తే తిరుగుబాటు చేసిన కొమరభీం చరిత్ర తెలంగాణది. జల్, జంగిల్, జమీన్ అని ఆది వాసి బిడ్డల కోసం కొట్లాడిన రాంజీ, ఆయన మనవడు కొమరం భీమ్‌లతో పెట్టుకున్న నిజామే పారిపోక తప్పలేదు. పోయి, పోయి ఆ తెగతోనే పెట్టుకున్నావు. మరోవైపు నీ ఆశ్రమంలో పని వారిగా దళితులు కావాలన్న ప్రకటనలతో బ్యానర్లున్నట్లు చెప్పుకుంటున్నారు. దళిత సమాజం ఒక్కసారి కన్నెర్ర చేస్తే ఇక ముచ్చింతల్‌లో ఆశ్రమం ఆదోగతి పాలే…
` రామేశ్వరరావు అనుకున్నదొక్కటీ…అయిందొక్కటీ?
భక్తికి రామేశ్వరరావు వైబోగం తెవాలనకున్నాడు. దాంతో తన భూముల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు చేసుకోవాలనుకున్నాడు. పేదరికం అనుభవించిన కసితో సంపాదన మార్గంలో పడ్డాడు. కాస్తో కూస్తో భూమి మీద పెట్టిన సంపాదనకు రెట్టింపు రావడం చవి చూశాడు. ఎన్ని మందులమ్మినా రాని సంపాదన నాలుగు మాటలు చెబితే రావడం చూశాడు. నాలుగు ప్లాట్లమ్మితే ఏడాది సంపాదన పోగౌతుంది. ఇదేదో మంచిగా వుందనుకున్నాడు. తన వ్యాపారం పెరగాలంటే పక్కన కాషాయం వుంటే ఎదరులేదనుకున్నాడు. చినజీయర్‌ను పక్కన పెట్టుకున్నాడు. తన నెత్తిన తానే కుంపటి తెచ్చి పెట్టుకున్నాడు. ఇప్పుడు దించుకోలేడు. వుంచుకోలేదు. తెలంగాణలో ఇంత కాలం వ్యాపారి అన్న పేరున్న రామేశ్వరరావు, గ్రామీణ వ్యవస్ధలో అలజడి రేపే వాడిని తెచ్చిపెట్టుకున్నాడు. భోగిని తెచ్చుకున్నాని అనుకున్నాడు… దేవతలనే తూలనాడే మానసిక రోగిని తెచ్చుకున్నానని అనుకోలేదు…. తనును కాదని వైభోగం చూసుకునే కషాయ స్వామిని తెచ్చుకున్నానని తెలుసుకోలేకపోయాడు. పులి మీద స్వారి…కూర్చోలేడు..దిగలేదు…..ఒకనాడు నేను వ్యాపారిని అని గర్వంగాచెప్పుకున్న రామేశ్వరరావు, నేనేంటో అని చెప్పుకోవడానికి కూడా ధైర్యం చేయలేని స్ధితికి నెట్టబడ్డాడు. అంతా మాయా…భూమాయ!!!
హైదరాబాద్ , నేటిధాత్రి : సమ్మక్క రాజ్యం మీద దండెత్తిన కాకతీయ ప్రతాపరుద్రుడికే పతనం తప్పలేదు. నువ్వెంత…నీ బతుకెంత అని దళిత, గిరిజన సంఘాలు చినజీయరుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చినజీయరుడు నమ్మకం ప్రకారం శపిస్తున్నాయి. ఇప్పటికైనా అమ్మను శరణాగతి కోరుకోకపోతే అథోగతే అని దళిత, గిరిజన సంఘాలు సూచిస్తున్నాయి! హెచ్చిరిస్తున్నాయి. ప్రజారంజక పాలకులుగా చరిత్రకెక్కిన కాకతీయుల వంశంలో రెండోప్రతాపరుద్రుడు క్రూరుడై, సామంతులపై సమరం ప్రకటించాడు. అదే సమయంలో ఆదివాసుల సామంత రాజ్యానికి రాణిగా ఉన్న సమ్మక్క దేవత కాకతీయులను తరిమి తరిమి వేటాడిరది. కాకతీయుల సైన్యం కదన రంగం విడిచి పారిపోయేలా చేసింది. కాకతీయ సైన్యం హాహాకారాలతో వెనుదిరిగేలా తన ఉగ్రరూపం ప్రదర్శించింది. వీర వనితగా తన రాజ్యాన్ని, ప్రజలను కాపాడుకున్నది. తన రాజ్యం నాశనం చేయాలని చూసిన ప్రతాపరుద్రుడి తర్వాత కాకతీయ వంశం లేకుండా చేసింది. అదీ సమ్మక్క తల్లి మహత్యం. భవిష్యత్ కాలానికి తన అభయాన్ని అందిస్తూ అదృష్యమై, కుంకుమ భఱిణ రూపంలో కరుణించింది. నాటి నుంచి పూజలందుకుంటోంది. రెండేళ్లకోసారి జాతర రూపంలో భక్తులకు దర్శనమిస్తోంది. మేడరాజు రాజ్యాన్ని, సమ్మక్క భర్త, కూతురు సారలమ్మ, కొడుకు జంపన్నల మరణానికి కారణమైన కాకతీయ వంశం అంతటితో సమాప్తం చేసింది. కాకతీయ రెండో ప్రతాపరుద్రుడు డిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ సేనల వశమై, బంధీ అయ్యి, నర్మదా నదిలో దూకి చనిపోయాడు. సమ్మక్క కుమారుడైన జంపన్న సంపెంగ వాగులో ఎలా దూకి ఆత్మ హత్య చేసుకోవాల్సివచ్చిందో అదే శిక్ష ప్రతాపరుద్రుడు కూడా అనుభవించాడు. ఇది కథ కాదు నిజం. చిరిత్ర లిఖించుకున్న యాధార్ధ సంఘటన. అసలు తెలంగాణ అంటే ఏమిటో తెలియకుండా ఈ ప్రాంత గాలి పీలుస్తూ, నీరు తాగుతూ సమ్మక్కను దూషించి బతికి బట్టకట్టడం అసాధ్యం. తెలిసో తెలియక చేసిన వాఖ్యలు అని అందరూ అనుకుంటున్న సమయంలో తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని సమర్ధించుకుంటున్న చిన్న జీయరుడు ఇప్పటికైనా సమ్మక్క చరిత్ర తెలుసుకోవాలి. తప్పైందని సమ్మక్క తల్లిని వేడుకోవాలి. తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పుకోవాలని ఆదివాసీ వారసులు డిమాండ్ చేస్తున్నారు.
సమ్మక్క, సారక్క అనే ఇద్దరు మహిమాన్విత మూర్తులకు గుడి లేదు. ప్రహారీ కూడా లేదు. వున్నవి రెండు గద్దెలు. అమ్మల ప్రతిరూపాల్లో రెండు కొయ్యలు. పవిత్రకు ఆనవాళ్లు. రెండేళ్లకోసారి కుంకుమ భరిణ రూపంలో నిజదర్శనాలు. అందుకు పెద్ద, పేద, బీద, బిక్కి అన్న తేడా లేదు. అందరూ సమానమే. కులం, మతం అడ్డు రాదు. నమ్మేవాళ్లందరికీ ఆ అమ్మలు కొంగు బంగారమే…వాళ్లుకు ప్రీతికరమైంది బెల్లమే. అమ్మవార్ల కరుణాకటాక్షాల కోసం ఊళ్లన్నీ ఇంటికి తాలాలు వేసి, అడవి బాట పట్టడమే…ఇంత గొప్ప సంస్కృతి సంప్రదాయాలకు సమ్మక్క సారలమ్మ జాతరకు దారులే… అక్కడో గంట లేదు. దర్శనాలకు టిక్కెట్లు లేవు. అలాంటి పవిత్రమైన చోటును గూర్చి అల్పెపు మాటలు మాట్లాడిన చినజీయరుడు తన పాపపంకిలమైన నోరును పాపపక్షాలన చేసుకోవాల్సిందే… ఆగమం ఏం సూచించింది..నిగమం ఏం నేర్పింది? నిజం ఏం చెప్పింది? అవన్నీ తెలుసని భీరాలు పలికే నీవేం చెబుతున్నావ్…?మత్తులో వున్నావా? గమ్మత్తుగా మాట్లాడుతున్నానని అనుకుంటున్నావా? సమ్మక్క అదేమిటా? శివ, పార్వతుల గురించి నీచంగా మాట్లాడతావా? నువ్వెంత నీ బతుకెంత? అని చినజీయరుడి వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం నిప్పులు చెరుగుతోంది. సృహలో వుండే మాట్లాడుతున్నావా? నిసృహ కోల్పోయి మాట్లాడుతున్నావా? నువ్వు చేసిన వ్యాఖ్యలపై ప్రజలే సవరించుకోవాలా? అంత అహంకారమా? తెలిసే మాట్లాడతున్నావా? తెలివిగా మాట్లాడుతున్నానని అనుకుంటున్నావా? అని తెలంగాణ సమాజం చినజీయరుడిని నిలబెట్టి కడిగేస్తోంది. నిలువెల్లా విషం నింపుకొని తెలంగాణ గడ్డమీద నిలబడి, తెలంగాణ ఇలవేల్పు సమ్మక్కను దూషించిన చినజీయరుడిని సహించేది లేదని తెలంగాణ సమాజం హెచ్చరిస్తోంది.
ఒక తప్పు పది తప్పులు చేయిస్తుంది. తప్పుమీద తప్పు తల రాతను తలకిందులు చేస్తుంది. ఒక అబద్దం వెయ్యి అబద్దాలను మోసకొస్తుంది. బతుకు బజారు పాలు చేస్తుంది. ఇది చినజీయరుడుకి తెలియక కాదు..అహం…అదే మనిషిని విచక్షణ కోల్పేయేలా చేస్తుంది. విజ్ఞతను నశింపజేస్తుంది. అతి ప్రసంగాలకు దారి తీస్తుంది. అందర్నీ తూలనాడేలా చేస్తుంది. అందరూ నాకన్నా తక్కువే అన్న భ్రమల్ని కల్పిస్తుంది. కంటికి పొరలు తెప్పిస్తుంది. కన్నూ, మిన్నూ కానకుండా చేస్తుంది. వినేశ కాలం ముంచుకొచ్చి విపరీత బుద్ధిని ప్రదర్శించేలా చేస్తుంది.
గతంలో తెలిసో, తెలియకో సమ్మక్క`సారక్కల జాతర మీద సరైన అవగాహన లేకనో ఆ వ్యాఖ్యలు చేసి వుండొచ్చు. అప్పుడు నాకు ఎవరైనా తప్పుడు సలహాలిచ్చైనా వుండొద్దు. తెలంగాణ ఉనికి, పరిస్ధితులు, ఆచార వ్యవహారాలపై పూర్తి స్దాయిలో తెలియని తనంతో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను. తెలంగాణ సమాజం పెద్ద మనసుతో నా అర్ధం చేసుకోండి…తెలియక చేసిన వ్యాఖ్యలకు క్షమించండని ఒక్క మాట మాట్లాడితే పోయేది. అలా కాకుండా తన వ్యాఖ్యలపై తెలంగాణ సమాజమే సరిదిద్దుకోవాలన్నట్లు మాట్లాడడాన్ని ఎవరూ స్వాగతించడం లేదు. అతన్ని ఉపేక్షించాలని కోరుకోవడం లేదు. సమ్మక్క సారక్క జాతరలో అసాంఫీుక కార్యకాలపాలు సాగుతున్నాయన్న నోటిని చినజీయర్ శుద్ది చేసుకోవాల్సిన అవసరం వుంది. తప్పు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. కాని తప్పుడు కూతలు కూస్తూనే వున్నాడు. తన రోత మాటల్లో తప్పేమీ లేదన్నట్లు మాట్లాడుతున్నాడు.
వింటున్నావా …చూస్తున్నావా రామేశ్వరరావు.ఓ చిన్న మనిషిని తెచ్చి, తనకు తాను పేద్ద మనిషినని భ్రమపడేలా చేసిన అసలు సూత్రదారి, పాత్రదారిగా కళ్లముందు కనిపించే మరో నామాల స్వామి రామేశ్వరరావు ఎక్కడా అని తెలంగాణ జనం ప్రశ్నిస్తోంది? తప్పు చేసేవారే కాదు వారి పక్కన న్నావారు కూడా శిక్షను అనుభవించాల్సిందే… ఆంధ్రప్రదేశ్‌లో అడ్రస్ సరిగ్గా లేని వ్యక్తిని తెచ్చి, స్వామిని చేసి, తెలంగాణ ఇలవేల్పులను తూలనాడిన వ్యక్తితో తెలిసే సహవాసం చేశావా? లేక తెలియకుండానే ఇంత కాలం సాగావా? అని రామేశ్వరరావును సైతం తెలంగాణ సమాజం ప్రశ్నిస్తోంది. కాషాయ దారణలో, సేవా ముసుగులో వున్న సన్యానిని, సర్వసంగ పరిత్యాగి అని భ్రమపడి తెచ్చావా? లేక తిన్నింటి వాసాలు లెక్కబెడతాడాని తెలియక తెచ్చావా? నిన్నటిదాకా వేడుకలన్నీ దగ్గరుండి చేసిన రామేశ్వరరావు, ఎందుకు నోరు విప్పడం లేదన్నది కూడా తెలంగాణ సమాజం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇంకా అదే స్వామికి అండగా వుంటావా? లేక దూరం పెడతావా? తెలంగాణ నుంచి ఎక్కడినుంచి పట్టుకొచ్చావో? అక్కడికి పంపిస్తావా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వింటున్నావా? ఎట్టిపరిస్ధితుల్లో చినజీయరుడు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి, అమ్మవార్లను దర్శించుకొని, తప్పైందని ప్రకటిస్తే తప్ప ఈ వివాదం సమసిపోదు. తెలంగాణ ప్రజలు ఊరికేనే వదిలిపెట్టరు. పంతాలు ప్రజలు మీద ఎవరికీ ఉండొద్దు. ప్రజల ఆగ్రహానికి ఎవరూ గురికావొద్దు.
ముందే చెప్పిన నేటిధాత్రి… ప్రతిపక్షాలు ఊహించని ట్విస్టు! నీటి గోసలు తీరాయి… ఎండల్లో కూడా నీళ్లు దుంకుతున్నాయి… రైతు మోములు వెలుగుతున్నాయి. మన నిధులతో కాళేశ్వరమొచ్చింది. మల్లన్న సాగర్ లాంటి రిజర్వాయర్లు వచ్చాయి. బావుల్లో నీళ్లు, బోర్లఎల్లవోస్తున్నాయి… రైతు బంధులందుతున్నాయి…. గ్రామీణరోడ్లు సైతం రెండు వరసలయ్యాయి… ప్రతిపక్షాలు ఊహించనన్ని కొలువులు త్వరలో రాబోతున్నాయి… తెలంగాణ యువతలో పండగ… తెలంగాణలో ప్రతిపక్షాలెందుకు దండగ?
ఆలోచన ఆచరణాత్మకంగా వుండాలి. నిర్ణయం నిర్మాణాత్మకంగా వుండాలి. అది కేసిర్ మార్గనిర్ధేశనంలా వుండాలి. అవును.. ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా సరైన సమయంలో సరైన నిర్ణయాలు చేయడం అన్నది ఒక్క కేసిర్‌కే సాధ్యం. ఇక తెలంగాణలో మరిన్న కొలువల జాతరకు శ్రీకారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత లక్షాముప్పై మూడు వేల కొలువులు భర్తీ చేశారు. కాని ఏక కాలంలో ఎనభైవేలకు పైగా ఉద్యోగాల కల్పన కోసం ఏక కాలంలో వరుస నోటిఫికేషన్లు రావడం అన్నది తొలిసారి. ఇప్పుడే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ రకమైన ఉద్యోగాల కల్పన ఏనాడు జరగలేదు. కలలో కూడా ఊహించలేదు. తెలంగాణ వస్తే ఏమొస్తుందన్న వారికి బుధవారం శాసన సభలో ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రకటన కూడా మరొక సమాధానమనే చెప్పాలి. త్వరలో నోటిఫికేషన్ అన్న పదాన్ని చాలా మంది రాజకీయంగా వినియోగించుకోవాలని చూసినా, లాభం లేకపోయింది. గతంలో టిఎస్‌పిఎస్సీ ద్వారా వేలాది ఉద్యోగాల కల్పన జరిగినా ప్రభుత్వ లక్ష్యాలు, ప్రాధాన్యత క్రమాన్ని అనుసరించారు. ప్రతిపక్షాలు ఎన్ని రకాల విమర్శలకు దిగినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కొట్లాడినవారికే తెలుస్తుంది పోరు విలువ. మోసి నోడికే తెలుస్తుంది కావడి బరువు విలువ. అని పెద్దలు ఊరికే చెప్పలేదు. ముఖ్యమంత్రి కేసిఆర్ పదే పదే ఈ మాటను అడ్డదిడ్డం మాట్లాడేటోనిది కత్తా,నెత్తా అని అందుకే అంటారు. తెలంగాణ కొట్లాడితే తెలుస్తుంది. ప్రాధాన్యతాంశాలేమిటో? వాటి విలువేమిటో? వాటి అనుసరణలేమిటో? అనుభవాలేమిటో? నోరుంది కదా! అని మాట్లాడేవారికే తెలుస్తుంది? మాటలు కాదు. చేతలు కావాలి. కళ్ల ముందు కనిపించాలి. అభివృద్ధి ఆవిష్కరణ జరగాలి. అప్పుడే నిజానికి, అబద్దానికి దూరం తెలుస్తుంది. అధికారంలో వున్నంత కాలం ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు రూపాయి ఇవ్వమన్నా తలెత్తి చూడలేని, నోరెత్తి మాట్లాడలేని వాళ్ల అసలు రంగు ప్రజలకు ఏనాడో తెలిసిందే…
ముందే చెప్పిన నేటిధాత్రి: మన నీళ్లు మనకు రాని రోజులు. మన నిధులు మనకు ఖర్చు కాని రోజులు. మన నియామకాలు మనకు అందని రోజులు. అందుకే ముఖ్యమంత్రి కేసిఆర్ తన ఆచారణ, తెలంగాణ బంగారు తెలంగాణ ఆవిష్కరణ నీళ్లతో మొదలు పెట్టారు. మన నిధులతో ప్రాజెక్టులు కట్టారు. మన నియామకాలు పెద్దఎత్తున సమయం చూసి అందిస్తాడని నేటి ధాత్రి దిన పత్రికి ముందే చెప్పింది. వరుస క్రమంలో త్వరలో అందుతాయని చెప్పింది. నేటి ధాత్రి అక్షరం నిజరూపదాల్చే సమయం ఆసన్నమైంది. ముఖ్యమంత్రి కేసిఆర్ నోట అదే మాట వెలువడిరది. ఇంత వరకు దేశంలో ఏ రాష్ట్ర్రంలో ఏక కాలంలో ఎనభైవేలు పైగా ఉద్యోగాల ప్రకటన చేసిన సందర్భం లేదు. ఏది చేసినా అది కేసిఆర్‌కే సాధ్యమని మరోసారి రుజువు చేశాడు. తెలంగాణ ఉద్యమం గుండెకాయ లాంటిదని, రాష్ట్ర సాధనతో దాన్ని మా చేతుల్లో పెట్టిన తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు తామే ప్రతిరూపమని కేసిఆర్ మరోసారి రుజువు చేశారు.
నీళ్లు` పరవళ్లు: ఆచరణాత్మక, గుణాత్మక, నిర్మాణాత్మక ప్రాధాన్యత లేకుంగా ముఖ్యమంత్రి కేసిఆర్ ఏ పని చేయరు. ఇది ఇప్పుడే కాదు. తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినప్పటినుంచి గమనిస్తే తెలుస్తుంది. ముందు ప్రజల మనోభావాలు తెలుసుకోవడానికి అప్పుడే అందివిచ్చన స్ధానిక సంస్ధల ఎన్నికలను వినియోగించుకున్నారు. ప్రజల్లో తెలంగాణ ఆకాంక్ష ఎంత బలంగా వుందో ముందు తెలుసుకున్నారు. అప్పటినుంచి నుంచి ఇక కేసిఆర్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2002లో వచ్చిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ప్రజల ఆలోచన ఓటు రూపంలో తెలిసిపోరుంది. తెలంగాణ ఆకాంక్ష బలంగా వ్యక్తమైంది. గ్రామీణ ప్రాంతాలలో కూడా తెలంగాణ సాధన లక్ష్యం ఎంత బలీయంగా వుందో అర్ధమైంది. దాంతో పల్లెలను ముందు కదిలించాలని ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టారు. సహజంగా మన దేశ సమాజం వ్యవసాయ ఆధారిత జీవనం. ఏది జరిగినా ముందు రైతు నుంచే ఆలోచన మొదలవ్వాలి. టెక్నాలజీ రంగంలో దిగ్గజంగా చెప్పుకునే జపాన్ లాంటి దేశాల్లో కూడా రైతులకు ఏమాత్రం ఇబ్బంది కల్గినా ప్రభుత్వాలు కూలిపోతాయి. ఇది మనదేశంలోనూ అంతే. ముందు రైతులు సంతృప్తిగా వుండాలి. వారు సంతోషంగా వుండాలి. కాని తెలంగాణ రైతులు తెలంగాణ రాకముందు సంతోషంగా లేరు. ఆనందం అన్నది కనిపించింది లేదు. నీళ్లు లేవు. నిధులు లేవు. తెలంగాణ పల్లెల్లో చదువులు లేవు. కొలువులు లేవు. ఉపాధి లేదు. వ్యాపారం లేదు. పంటలు లేవు. పండగలు లేవు. ఎప్పుడూ మొగులకు మొహం పెట్టి చూడడం తప్ప చేసేదేమీలేదు. దాంతో ఊరొద్దు. ఊపిరితో వుండాలంటే ఈ పల్లె వద్దని వదిలేసి, పట్టణాలకు వలసలు పోయిన వాళ్లేంతో మంది తెలంగాణలో గోసను చూశారు. అందుకే తెలంగానలో ముందు నీళ్లు నడయాడాలి. కళ్ల ముందు నీళ్ల పరవళ్లు కనిపించాలి. రైతు కన్నీళ్లను కాకుండా పంట పొలంలో పారే నీళ్లను చూడాలి. ఇదే కేసిఆర్ మొదటి సంకల్పం. అదే నేడు ఆవిష్కృతమైన కాళేశ్వరం. తెలంగాణ భవిష్యత్తు తరాలకు వారసత్వం సంపదగా, దేశమంతా గొప్పగా చెప్పుకునేంతే గొప్ప జలయజ్ఞం కాళేశ్వరం. అలాంటి నీటి పరవళ్లు చూస్తుందని తెలంగాణ కలగనలేదు. కాని తెలంగాణ వచ్చింది. నీటి కాలువలు వచ్చాయి. పొలాలకు నీళ్లు పారుతున్నాయి. బావులు నిండుతున్నాయి. బోర్లు ఎల్లబోస్తున్నాయి. ఇవన్నీ సాక్ష్యాత్కారం కోసం నిధులు కావాలి.
మన నిధులు మనకే: నిధుల కోసం నాడు తెలంగాణ ఎమ్మెల్యేలు, మంత్రుల మాట ఒకప్పుడు చెల్లేదే కాదు. ఉమ్మడి రాష్ట్ర పాలకులు విదిల్చే మెతుకుల్లాంటి నిధులనే గొప్పగా అబ్బురపడి ప్రచారం చేసుకున్న కాలం. విజయవాడ హైవే అంటే ఒకప్పుడు ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. అదే మన తెలంగాణలో అలాంటి రోడ్లుకు కేంద్రం ప్రభుత్వంలో ప్రధానిగా వున్న పి.వి. నర్సింహారావు పుణ్యమాని సికింద్రబాద్ నుంచి కరీంనగర్‌కు రాజీవ్ రహాదారి వచ్చింది. అంతకు మించి గొప్పగా చెప్పుకోవడానికి ఏదీ లేని రోజులవి. ఆఖరుకు తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వము అన్నంతదాకా వచ్చింది. పైగా రాష్ట్ర అభివృద్ధి పేరుతో జలయజ్ఞం కోసం హైదరాబాద్ పరిసరాల్లో వున్న ప్రభుత్వ భూములను అమ్మి మరీ సీమాంధ్ర ప్రాంత అభివృద్ధికి వెచ్చించారే గాని, తెలంగాణ కోసం ఏనాడు ఆలోచించలేదు. కాని నేడు మన రాష్ట్రం. మన పాలన. మన నిధులు. దాంతో నీటి పారుదల రంగంలో విప్లవాత్మకమైన మార్పులు. కలలో కూడా ఊహించని ప్రాజెక్టులు. కొత్తగా మల్లన్న సాగర్ లాంటి అపురూపమైన చెరువులు. ప్రపంచంలోనే అంతటి కెపాసిటీతో లేని నీటి రిజర్వాయర్లు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఏడేళ్లలో సాగురంగంలోనూ, నీటి పారుదల రంగంలోనూ అధ్భుతమైన విజయాలు సొంతం చేసుకున్న ఏకైక రాష్ట్ర్రం తెలంగాణ. అదే ఉమ్మడి రాష్ట్రంలో వుంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే వుండేది. ఒకప్పుడు ప్రధామంత్రి గ్రామీణ సడక్ యోజన పుణ్యమాని బాగు పడిన గ్రామీణ రోడ్లకు తెలంగాణ వచ్చాకే మహార్ధశ వచ్చింది. రెండు లైన్లతో ప్రతి పల్లెను కనెక్టు చేస్తూ రహదారులు ఏర్పడ్డాయి. వరంగల్ లాంటి ప్రాంతాలకు కూడా విశాలమైన రోడ్ల సౌకర్యం పెరిగింది. అంటే ఇదంతా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మూలంగా వచ్చిన అభివృద్ధి. మన నిధులు మనకే అన్నది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కేసిఆర్ ఎందుకు పదేపదే ప్రజలను చైతన్యం చేసేవారో ఇదే తార్కాణం.
ఇక నియామాకాలు: చాలా మందికి తెలియని విషయమేంటంటే తెలంగాణ వచ్చాక సుమారు లక్షా ఏడు వేల ఉద్యోగాలను గుర్తించారు. అంతకు మించి ఉద్యోగాలు ఇచ్చారు. ముప్పై వేలకు పైగా పోలీస్ రిక్రూట్ మెంటు ద్వారా పెద్దఎత్తున ఉద్యోగ కల్పన జరిగింది. ఆ తర్వాత టిఎస్‌పిఎస్ ద్వారా సమారు ముప్పై తొమ్మిది వేల వరకు ఉద్యోగాలు భర్తీ చేశారు. వీటికి తోడు విఆర్వోలు, పంచాయితీ సెక్రెటరీల నియామకాలు కూడా జరిగాయి. ఇవే కాకుండా విద్యుత్ శాఖలో ఇరవై రెండు వేల ఉద్యోగాల రెగ్యులరైజేషన్ జరిగింది. సమారు ఏడు వేల వరకు వ్యవసాయ శాఖలో భర్తీలు జరిగాయి. ఒకప్పుడు ఉద్యోగాల భర్తీ అంటే కేవలం గ్రూపులు, డిఎస్సీలు మాత్రమే కనిపించేవి. తెలంగాణ వచ్చాక ఒక్క డిఎస్సీ తప్ప మిగతా ఉద్యోగాల కల్పన జరిగింది. కాని పెద్దఎత్తున ఏర్పాటైన గురుకులాలలో, మోడల్ స్కూళ్లలో అద్యాపక, ఇతర నియామకాలు జరిగాయి. అయినా తెలంగాణ సమాజంలో కొంత అసంతృప్తి వున్న మాట వాస్తవం. తెరాస రెండోసారి అధికారంలోకి వచ్చాక ఎలాంటి నోటిఫికేషన్ రాకపోవడంతో ప్రతిపక్షాలు రాజకీయం చేయడానికి అస్త్రం దొరికిందన్న సంతోషంలో ఇప్పటిదాకా వున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ బుధవారం అసెంబ్లీలో చేసిన ప్రకటనతో ఏం మాట్లాడాలో అర్ధం కాక, దీనిపై రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఏది ఏమైనా ఒకేసారి ముఖ్యమంత్రి కేసిఆర్ ఇన్ని ఉద్యోగాల భర్తీకి పూనుకుంటాడని ఊహించలేదు. గతంలో చెబుతూ వస్తున్నట్లు ఏ నలభై వేల ప్రకటన రావొచ్చని అనుకున్నారు. కాని వాళ్ల ఊహలు తలకిందులయ్యే ప్రకటన రావడంతో ప్రతిపక్షాలు ఇక తమ భవిష్యత్తు ఏమిటన్న మీమాంసలో పడ్డట్లే కనిపిస్తున్నాయి. దాంతో ఉద్యోగాలు భర్తీ అయినప్పుడు కదా? అన్న ధీర్ఘాలు తీస్తున్నారు. అయినా ఉద్యోగాలను స్వాగతించక తప్పని పరిస్ధితి ఎదురైనందుకు లోలోన మధనపడుతున్నారు. మళ్లీ ఈసారి కూడా తమ ఉనికి, పాత్ర గల్లంతే..నా? అనుకుంటున్నారు..ట!
` సేవలకుకు అడుగడుగునా అడ్డంకులు
` రాజకీయ, వ్యాపార ముసుగులో వైద్య సేవకు విఘాతం
` బీదలకు ఆరోగ్యమే లక్ష్యంగా వచ్చిన వారిపై అధికార జులుం
` ప్రంపంచంలో ప్రైవేటు డాక్టర్లు రూ. 1 కే సేవ చేస్తున్న ధాఖాలాలున్నాయా..?
` చేసే వారిని ప్రోత్సహించి ప్రభుత్వ అధికారిగా భాద్యత నిలుపుకోరా..?
` మీ అభ్యంతరం నిర్వాహకులపైనా లేక బీదలకు వైద్యం అందడం ఇష్టం లేదా..?
` అన్ని అనుమతులున్నా అవాంతరాలేందుకు
` సేవ ఇష్టం లేని వారితో చేతులు కలిపి ప్రజలకు అన్యాయం చేయోద్దు
` సీజీ ఆసుపత్రి పట్ల అధికారుల తీరుపై మండిపడుతున్న ప్రజలు
` ప్రభుత్వ పెద్దలు , ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్న ప్రజలు , నిర్వాహకులు
బ్యూరో ( హైదరాబాద్ ) , నేటిధాత్రి : ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణను ఆరోగ్య తెలంగాణ గా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలతో ముందుకెళుతున్న క్రమంలో ప్రజలకు అందుతున్న అత్యంత చౌకైన ఆరోగ్య సేవలను ప్రజలకు అందకుండా చేస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారు ఆరోగ్య శాఖ అధికారులు. ఇప్పటికే రాష్ట్రంలో కరోన సమయంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో దోపిడికి అధికారులు ప్రత్యక్షంగా , పరోక్షంగా సహకరించి ప్రజలు ఉసురు పోసుకున్నారని వస్తున్న విమర్శలను నిజం చేసేలా వ్యవహరిస్తున్నారు ఆరోగ్య శాఖ అధికారులు.
తాజాగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ డీఎంహెచ్‌వో వెంకటి ఓ చారిటీ ఆసుపత్రికి విషయంలో వ్యవహరిస్తున్న తీరు స్థానిక ప్రజల్లో తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నది. రాష్ట్రంలో ప్రధాన నగరాల్లో బీద , మధ్య తరగతి ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించేలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న బస్తీ దవాఖానాల రూపంలో కొందరు వైద్యులు ప్రజలకు ఎంతటి ఆరోగ్య ఆపద వచ్చినా అత్యాధునిక సాంకేతికత , సౌకర్యాలతో వైద్య సేవలను అందించడానికి కొందరు సామాజిక స్పృహ, సమాజ సేవాభావం ఉన్న వైద్యులు కలిసి ఓ ఆసుపత్రిని సోంత ఖర్చులతో ఏర్పాటు చేసి ప్రజలకు సేవలందిస్తున్నారు. అంతా బాగానే సాగుతున్న క్రమంలో కొందరు వ్యక్తులు బీదలకు అందుతున్న వైద్య సేవలను చూసి ఓర్వలేక చేస్తున్న కుట్రల్లో ఆరోగ్య శాఖ అధికారులు పాత్ర వహిస్తూ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. చదువుకున్న ప్రతి ఒక్కరు వ్యాపారం ఉద్యోగం గురించి , ధనార్జనే ధ్యేయంగా జీవితాలు గడుపుతున్న నేటి రోజుల్లో తాము చేస్తున్న ఉద్యోగానికి న్యాయం చేస్తూనే తమకు ఉన్న సమయంలో బీద ప్రజలకు , నాణ్యమైన వైద్యాన్ని ఆర్ధిక కారణాల చేత పొందలేక పోతున్న అభాగ్యులకు అండగా ఉండాలనే గొప్ప హృదయంతో ముందుకోచ్చిన వారిపైన ఆసుపత్రి నిర్వహణకు సంబంధించిన అన్ని అనుమతులున్నప్పటికి కావాలనే ఈ ప్రజా వైద్య సేవను ఎటిఆ్ట పరిస్థితుల్లో అడ్డుకోవాలని చూస్తున్న కొందరు దూర్మార్గుల ఆలోచనలకు అధికారులు వంత పాడేలా వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు. రాజకీయ, వ్యాపార ముసుగులో వైద్య సేవకు విఘాతం
ప్రజలకు సేవ చేయడంలో పరోక్షంగా , ప్రత్యక్షంగా ఉన్న రాజకీయ , వ్యాపార రంగాలకు చెందిన వ్యక్తులే ఇప్పుడు ఈ చారీటీ ఆసుపత్రిని అడుగడుగునా అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయని సమాచారం.
తమకు రావాల్సిన లాభాలను , ప్రజల రక్తం తాగడానికి మరిగిన కలియుగ రాక్షసుల అనందాన్ని ఈ ఆసుపత్రి కళ్ళముందే అడ్డుకుంటుండడంతో దిక్కు తోచని ఈ దుర్మార్గులు అధికారులకు తప్పుడు సమాచారాలను ఇచ్చి చర్యలకు ఒత్తిళ్లు తీసుకు వస్తుండడంతో అధికారులు అన్ని పరిశీలించకుండానే చర్యలు తీసుకోవడానికి ముందుకోచ్చి ప్రజలకు ఆసరాగా ఉన్న ఆసుపత్రి సేవలను దూరం చేశారు. ఈ విషయమై ఆ నోట ఈ నోట ప్రజలు చర్చించుకుంటున్న క్రమంలో అధికారుల ఎంట్రీకి , ఆసుపత్రి సేవల నిలుపుదలకు కొందరు రాజకీయ, ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేసే రాక్షసుల హస్తం ఉన్నట్లు ఆసుపత్రి సేవలు పొందిన ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రజలకు మంచి చేయడానికి ముందుకు రాని వారు కేవలం వారి స్వార్ధ ప్రజయోజనాలకు చారీటీ సేవలను అడ్డుకొవడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్త చేస్తూనే ఇలాంటి దుర్మార్గుల వివరాలను ,సీజీ ఆసుపత్రికి ఉన్న అన్ని అనుమతులను ఏకకాలంలో బహిరంగ పర్చి తప్పుదారి పట్టించే వారికి తగిన బుద్ధి చెప్పడంతో పాటు ప్రజాక్షేత్రంలో వారికి తగిన బుద్ది చెప్పాలని సమాజ సేవకులు కోరుకుంటున్నారు.
` ప్రభుత్వ పెద్దలు , ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్న ప్రజలు , నిర్వాహకులు కేవలం నిరుపేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా చేసుకుని తమ స్వంత డబ్బులను పెట్టి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసుకుని సమాజసేవకు ముందుకోచ్చి వారి ఆలోచనలను ప్రతి ఒక్కరు సమాజంలో గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మానవ సేవను చేయడానికి సమయం లేక కొందరు , సమయం ఉండి కూడా చేయలేక కొందరు ముందుకు సాగుతున్న ఈ సమాజంలో ప్రాణాలను కాపడడమే లక్ష్యంగా సాగుతున్న ఓ మహత్తర కార్యక్రమాన్ని అడ్డుకొవడం మూర్ఖత్వం. లక్షలాది రూపాయల జీతాలను కాదని జీవితంలో కొంతైనా ప్రజలకు సేవ చేయాలని స్పకల్పించుకున్న వ్యక్తుల ఆలోచనను, వారి ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి అడగడుగునా ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేసే వ్యవస్థలు అడ్డుపడ్డప్పటికి మానవీయ కోణంలో అధికారులు ఆలోచించి ప్రజలకు సేవలను అందేలా చూడాల్సిన భాద్యత ఎంతైనా ఉంది. రాష్ట్ర రాజధానిలో ఉన్న వేలాది ఆసుపత్రులకు సంబంధించి అన్ని అనుమతులు ఉన్నాయని ఖచ్చితంగా అధికారులు చెప్పగలరా..? కేవలం అడ్డుకోవాలనే ఆలోచన ఉన్న ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకుని ఆటంకాలను కల్పిస్తున్న వ్యక్తులకు సహకరించకుండా ఉంటూ అవసరమైనా ఏవైనా అనుమతులు సేవ కోణంలో పని చేస్తున్న వ్యవస్దలు పొంది ఉండకపోతే వారి సలహాలు సూచనలిచ్చి పొందేదుకు సమయమిచ్చి వారి సేవలను నిర్విరామంగా కొనసాగేలా చూడాల్సిన బాద్యత అధికారులపై ఉందని గుర్తెరిగితే మంచిది. సమాజంలో అర్హత లేని వైద్యులు , అనుమతి లేని ఆసుపత్రులు రాష్ట్రంలో ఎక్కడో ఏ మూలనో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న విషయాన్ని తెలిసినప్పటికి స్థానిక పరిస్థితులకు తలొగ్గి ఉంటున్న వ్యవస్థలు సమాజ సేవలకు అన్ని ఆటంకాలు కలిగించకుండా అవసరమైన సహాయ సహకారాల్సి అందిస్తారని ఆశిద్ధాం.
నేను రెండు చెప్పాను?
అవి ఫోన్‌లో చెప్పలేను?
ఆ రెండిరటిలో ఒకటి బిల్డింగ్ అనుమతుల విషయం?
రెండోది మీరు వారినే అడగండి?
పర్మిషన్ ఇవ్వడానికి సిద్దమే…కాని!
బిల్డింగుకు మున్సిపల్ అనుమతులు లేవు?: డిఎంహెచ్‌వో…
అన్ని రకాల అనుమతులున్నాయి: ఆసుపత్రి వర్గాలు
జిహెచ్‌ఎంసికి చెల్లిస్తున్న బిల్లులు కూడా కూడా వున్నాయి!
లెటెస్టు రసీదులివిగో….
పేదల ఆసుపత్రుని అడ్డుకోవడం దుర్మార్గం.
స్వార్ధపరులకు సహకరిస్తున్న వైద్య శాఖ అధికార గణం.
అడ్డుకునేవారిని బూచీగా చూపి ఆపుతున్న వైనం.
అప్పిచ్చువాడు, వైద్యుడు, ఎప్పుడూ పారుతూ వుండే దగ్గర ఏరు వున్న చోట బతకాలి! అని పెద్దలు చెప్పారు. ఆపదలో ఆదుకునేవాడు. అవసరాన్ని గుర్తించి, అడగ్గానే సాయం చేసే ఆప్తుడు అందరికీ వుండాలి. అది ఎలాంటి సాయమైనా సరే. ఇక వైద్యుడు. ఆరోగ్యమే మహాభాగ్యం. అంతకు మించి అవసరం ఏదీ లేదు. ఆరోగ్యంగా లేక ఎంత సంపద వున్నా ఒట్టిదే. ఎప్పుడూ నీరు అందుబాటులో వుండాలి. నీరే ప్రాణాధారం. నీటితోనే అన్నీ మిలితమై వుంటాయి. మన తినే ప్రతి వస్తువు నీరు లేకుండా తయారు కాదు. అది తిన్న తర్వాత కూడా నీరు లేకుండా మనం బతకలేం. అంటే ఏమిటి? మనం నివసించే పరసరాలలో ఇవి మూడు ఖచ్చితంగా వుండాలి. అలాంటి వైద్యుడు దొరకడమే ఈ రోజుల్లో ఇబ్బంది. వైద్యం కూడా మరీ ఖరీదైన కాలం. ఏ అనారోగ్య సమస్య ఎదురైనా లక్షల రూపాయలు అన్న మాటే గాని, వందలు, వేలు అన్న మాటే వినపడని రోజులు. మరి అలాంటి కాలంలో రూపాయి వైద్యం అంటే ఏడారిలో ఒయాసిస్సు అనుకోవాల్సిందే. కాని దానిని కూడా కొందరు స్వార్ధపరులు అడ్డుకుంటున్నారు. వైద్య సేవను కూడా దూరం కొట్టుకుంటున్నారు. ఇది నిజంగా దౌర్భాగ్యమైన విషయం. ఎవరైనా ఆసుపత్రి దగ్గర వుంటే ఏ ఆపదొచ్చినా వైద్యం అందుబాటులో వుంటుందని సంతోషపడాలి. అందుకే మన పెద్దలే ఈ విషయం ఎప్పుడో చెప్పారు. వైద్యుడు లేని ఊళ్లో నివాసమే వద్దన్నారు. మరి ఆధునిక సమాజంలో వైద్యం ఎంతో అవసరం. ముఖ్యం కూడా. అందుకే ప్రతి వ్యక్తి జీవిత భీమాతోపాటు, ఆరోగ్య భీమా కూడా తప్పనిసరి చేయించుకుంటున్నారు. పాశ్చాత్య దేశాల్లో ఖచ్చితంగా ప్రతి వ్యక్తి ఆరోగ్య భీమా చేసుకోవడం అక్కడ ప్రభుత్వ నిర్ధిష్ట ఆదేశం. కాని మన దేశంలో ప్రతి వ్యక్తి ఆరోగ్య భీమా చేసుకునేంత శక్తి వుందా? అసలు వైద్యం చేయించుకునేందుకే దిక్కు లేదు. వైద్యం కూడా అంతగా అందుబాటులో లేనే లేదు. అందువల్ల ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం అనేక ఆసుపత్రులు రావాలి. వైద్యం కొత్త పుంతలు తొక్కాలి. పేదలకు అందుబాటులో వైద్యం అందాలి. అలాంటి వైద్యమంతా మనదేశ ప్రజలకు కావాలి. అదేంటో గాని రాంనగర్‌లో మాత్రం అందుకు భిన్నం. ఆ కాలనీలో పేదల ఆసుపత్రి వుండొద్దట? మనకేమైనా అయితే వెంటనే డాక్టరు కావాలి. కాని ఆసుపత్రి ఇప్పుడు మాత్రం దగ్గరలో ఏర్పాటు చేయొద్దా? ఇది మరీ వచిత్రంగా వుంది.
స్వార్ధపరులు ఎప్పుడూ వుంటారు?: ఓ వైపు మా ఊరికి ఆసుపత్రి కావాలి. మా కాలనీలో ప్రభుత్వాసుపత్రి లేక ఇబ్బంది అవుతుంది. మాకు కూడా బస్తీ దవఖానాలు కావాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఒక్క హైదరబాద్ నగరంలోనే 300కు పైగా బస్తీ ఆసుపత్రులు ఏర్పాటు చేశారు. అయినా అనేక ప్రైవేటు ఆసుపత్రులు కూడా వేల సంఖ్యలో పనిచేయాల్సివస్తోంది. వందల సంఖ్యలో కార్పోరేట్ ఆసుపత్రులు సేవలందిస్తున్నాయి. సహజంగా ఎక్కడైనా వెయ్యి మందికి ఒక నిపుణుడైన వైద్యుడు అసవరం. కనీసం ఐదు వేల మందికైనా ఒక వైద్యుడు అందుబాటులో వుండాలి. కాని మన దేశంలో యాభైవేల మందికి కూడా ఒక వైద్యుడు అందుబాటులోలేడు. ఇక పల్లెల్లో సంగతైతే చెప్పాల్సిన అవసరంలేదు. నియోజకవర్గ వర్గ కేంద్రాలలో కూడా సరైన వైద్యం అందుబాటులో లేదు. ఇలాంటి పరిస్ధితుల్లో ప్రజలకు ఉచిత వైద్యం అందించాలనుకోవడం గొప్ప విషయం. మానవత్వానికి నిదర్శం. రామనగర్ గుండు ప్రాంతంలో పేద ప్రజలకు రూపాయి ఫీజుతో వైద్యం చేసేందుకు ఒక ధారీసీత సూర్య గంగాధర గుప్తా సంకల్పించాడు. ఆయనకు అలాంటి ఆలోచన రావడమే గొప్ప. అలాంటివారిని స్వాగతించాలి. వారికి అసరమైన చేయూతనందించాలి. అది వదిలేసి తమ వీధిలో ఆసుపత్రి ఏర్పాటు చేయొద్దు. ఆ భవనానికి సరైన అనుమతులు లేవు. అంటూ బిజేపికి చెందిన కొంత మంది నేతలు ధర్నాలు చేసి, ఆసుపత్రిని అడ్డుకున్నారు. సాంకేతికపరమైన అంశాలేమైనా వుంటే అవి అధికారులు చూసుకుంటారు. దానికి ఓ ప్రాసెస్ వుంటుంది. అన్ని అనుమతులు ఇవ్వాల్సింది ఆయా శాఖలు. కాని ప్రైవేటు వ్యక్తులు జోక్యం చేసుకుంటున్నారు.
అసలు సంగతి ఇదీ?: గంగాధర్‌గుప్తా తన సొంత బిల్డింగ్‌లో పేదల వైద్యశాల ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఆ ఆసుపత్రిలో పనిచేసే సిబ్బందికి అవసరమైన వసతి కోసం ఓ బిల్డింగ్ కిరాయికి తీసుకోవాలనుకున్నాడు. సమీపంలో బిజేపి నాయకుడైనా నాయుడు ఇళ్లును అడగడం జరిగింది. అతను నెల కిరాయి లక్షల్లో చెప్పడం జరిగింది. అంత చెల్లించలేమని చెప్పి, ఆ పక్కనే వున్న మరో బిల్డింగ్ కిరాయి తక్కువ వస్తుందని తెలిసి దాన్ని తీసుకున్నారు. ఇక్కడే నాయుడికి కోపం వచ్చింది. నా బిల్డింగ్‌ను కాదని వేరే బిల్డింగ్ తీసుకుంటారా? ఇక మీరు ఆసుపత్రి ఎలా నడిపిస్తారో చూస్తాను…అంటూ గంగాధర్ గుప్తాకు వార్నింగ్ ఇచ్చినంత పనిచేశాడు. తన బిల్డింగ్ కిరాయికి తీసుకోకుంటే, చెప్పినంత అద్దె చెల్లించకుంటే ఆసుపత్రి నడవనియ్యమని చెప్పినంత పనిచేస్తున్నాడు. అధికారులు అతనికి వస్తాసు పలకుతున్నారు. శివాజీ సినిమాలో జరిగిన వాటిని నిజం చేస్తున్నారు. గంగాధర్ గుప్తాను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు? కొంత మందితో కలిసి రాస్తారోకో చేయించారు. ఇక్కడ ఆసుపత్రి వుంటే ఇన్‌ఫెక్షన్లు సోకుతాయంటూ ఎక్కడా లేని వింత వాదనల చేయిస్తున్నారు. అమాయకులైన మహిళల చేత ప్రకటనలు ఇప్పిస్తున్నారు. నానా రాద్దాంతం చేస్తున్నారు. పేదలకు ఉచిత వైద్యం అందించడానికి వచ్చేవారిని ఇలా ఇబ్బందులకు గురి చేయడం అన్నది సరైంది కాదు.
అన్ని రకాల అనుమతులున్నాయి: ప్రభుత్వం నుంచి గంగాధర్ గుప్తా ఆసుపత్రి నిర్వహణకోసం ఇచ్చిన బిల్డింగ్‌కు అన్ని రకాల అనుమతులున్నాయి. చెల్లించాల్సిన టాక్స్‌లన్నీ చెల్లిస్తున్నాడు. తాజాగా కూడా చెల్లించిన రసీదులు కూడా వున్నాయి. అయినా అనుతులు లేవని ఎవరో ధర్నాలు, చేయడం రాస్తారోకోలు చేయడం ఏమిటి? వాటి మూలాలు తెలుసుకోకుండా జిల్లా వైద్యాధికారులు కూడా ఆసుపత్రికి అనుమతులు ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
నేను రెండు చెప్పాను?: డిఎంహెచ్‌ఓ వెంకటి
రాంనగర్‌లో పేదలకు ఉచిత వైద్యం అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన జిజి ట్రస్టు ఆసుపత్రికి ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదన్న విషయాన్ని నేటిధాత్రి డిఎంహెచ్‌వో వెంకటిని వివరాల చెప్పాలని కోరింది. ఆసుపత్రి బిల్డింగ్ విషయంలో జిహెచ్‌ఎంసి అనుమతి లేదని వెంకటి చెప్పడం జరిగింది. దానితోపాటు మరో విషయంకూడా ఆసుపత్రి వర్గాలకు చెప్పడం జరిగిందని వెంకటి అంటున్నారు. మొదటిది జిహెచ్‌ఎంసి అనుమతి, మరి రెండోది ఏమిటని నేటిధాత్రి ప్రశ్నిస్తే, ఆ విషయం నేను ఫోన్‌లో చెప్పలేనన్నారు. ఆ విషయం వారికి కూడా చెప్పడం జరిగిందన్నారు. అంటే అర్ధమేమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ విషయంకూడా ఎలాంటి జంకూ బొంకూ లేకుండా వెల్లడిస్తున్నారంటే అధికారులు ప్రజారోగ్యంతో ఎలా ఆటలాడుకుంటున్నారో అర్ధం చేసుకోవచ్చు. డిఎంహెచ్‌వో అంటే ఓ వైద్యుడే. ఆయన వైద్యం మొదలు పెట్టిన నాడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో తెలిసిందే. ప్రజలకు వైద్యం చేసే విషయంలో నిపుణులైన వైద్యులకు ఎలాంటి అవరోధాలు ఎదురుకాకుండా వుండాలనే డిఎంహెచ్‌వో వంటి ఉద్యోగాలను డాక్టర్ల చేత భర్తీ చేస్తారు. ఇలాంటి వ్యవహారాలలో ఇతర ఉద్యోగులు న్యాయం చేయలేరనే వైద్యులను నియమిస్తారు. అయినా సాటి వైద్యులు ఏర్పాటు చేసే ఆసుపత్రులను ఇబ్బంది పెట్టడం అన్నది సరైంది కాదు. పైగా పేదలకు మేలు చేసే ఆసుపత్రులను ప్రోత్సహించాలి. వారికి మరిన్ని సౌకర్యాలుకల్పించాలి. అంతే కాని ఇలా ఇబ్బందులకు గురిచేస్తే సేవ చేయడానికి ఎవరూ ముందుకు రారు. ఇప్పటికే వైద్యులకు, ఇతరర వైద్య సిబ్బందికి రెండు నెలలుగా జీతాలు కూడా గంగాధర్ గుప్తా చెల్లిస్తున్నారు. హస్పిటల్‌లో పనిచేసే వైద్యులు కూడా ఎంతో సేవాభావంతో పని చేస్తున్నవారే. కేవలం జీతాల కోసమే పనిచేయడం లేదు. వాళ్లు పేద ప్రజలకు సేవ చేయాలన్న ఆశయంతో పనిచేస్తున్నారు. ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చినవారు చిరునవ్వుతో ఇంటికి వెళ్లేలా వైద్యం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని ముందుకొచ్చారు. ఇలాంటి ఆసుపత్రినిలో వైద్య సేవలు అందకుండా జిల్లా వైద్యాధికారులు కూడా అడ్డుకోవడం అన్నది సరైంది కాదు. వెంటనే ఆసుపత్రికి అనుమతిచ్చి పేదలకు వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చే బాధ్యతను డిఎంహెచ్‌వో నెరవేర్చాలని ప్రజలు కోరుతున్నారు. ఎవరో స్వార్ధ పరులు ఇచ్చిన పిర్యాధులను పక్కన పెట్టి పేదల ఆరోగ్యం గురించి ఆలోచించాలని జనం కోరుతున్నారు.
తరాలు మారినా జనం గుండెల్లో నవ్వుల రాజు రాజశేఖరుడు.
పేదల జీవితాలలో వెలుగులు నింపిన దేవుడు.
ఐదేళ్ల పాలనలో వెయ్యేళ్ల కీర్తి సంపాదించుకున్నాడు.
ఇప్పటికీ ప్రతి పథకంలో వైఎస్ఆర్ వున్నాడు.
తండ్రి ఆశయ సాధనే జీవిత లక్ష్యమైన తనయుడు జగన్.
వైఎస్ఆర్ కలలుగన్న సమాజ నిర్మాణంలో తనయుడు.
పేదల జీవితాలలో వెలుగుల కోసమే ఇద్దరూ… సేవ చేయాలన్న భావన అప్పటికప్పుడు పుట్టే కాదు. తన ఆలోచనల పొరల్లో దాగి వున్న మంచి మనసుకు తార్కాణం. చరిత్రలో గొప్పగా మిగిలిపోయిన వారి జీవితాలు ఒక్కసారిగా వెలుగులోకి రావు. ఉన్న ఫలంగా అన్నీ సమకూవు. ఇక్కడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి , జగన్ విషయంలోనూ జరిగింది. సుదీర్ఘ కాలం పాటు ప్రజలకు సేవ చేసిన వ్యక్తి రాజశేఖరరెడ్డి. ఒక్క రూపాయికే వైద్యం చేసిన గొప్ప నాయకుడు. కాకపోతే అప్పటికి నాయకుడు కావాలని అనుకోలేదు. అవుదామన్న ఆలోచన రాజశేఖరరెడ్డికి లేదు. పేదల వైద్యుడిగా అతి కొద్ది సమయంలోనే ప్రజల మన్ననలు పొంది నాయకుడయ్యాడు. వైద్యుడిగా కొద్ది మందికే సేవ అందించగలుగుతున్నాను. ప్రజా ప్రతినిధిగా మరెంతో సేవ చేసే అవకాశం కోసమే రాజకీయాలలోకి వచ్చారు. ఇక తన తండ్రి ఆశయ సాధన కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలలోకి వచ్చారు. రాజకీయంగా ఎదుర్కోవల్సిన అనేక అవరోదాలు ఇద్దరూ ఎదురుకున్నారు. నాయకుడుగా ఎదిగిన వైఎస్ఆర్ ఒక దశలో రాజారెడ్డి హత్య ఎంతో కుంగదీసింది. కాకపోతే రాజకీయాలలో ప్రజాసేవలో ప్రజల గుండెల్లో నిలిచిపోవాలని కసి పెరిగింది. అలాగే జగన్ విషయంలోనూ జరిగింది. ప్రజల ఓదార్పుతో జగన్ జన నాయకుడయ్యాడు. చరిత్రలో ఇలా ప్రజల గుండెల్లో తండ్రీకొడుకులు గూడుకట్టుకున్నారు. వైఎస్. రాజశేఖరరెడ్డి దేవుడయ్యాడు. జగన్ ప్రజల గుండెల్లో రాజుగా వెలుగొందుతున్నాడు. యుగకర్తలు అని కొనియాడబడుతున్నారు. హైదరాబాద్, నేటిధాత్రి : నాయకుడు జనంలో నుంచి పుడతాడు. జగన్‌లాగా వుంటాడు. జనం కోసం బతుకుతాడు. జనమే తానై బతుకుతాడు. జనం కోసమే పరితపిస్తాడు. జనాన్ని జాగృతం చేస్తాడు. జనం కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. జనం కోసం జైలును కూడా లెక్క చేయలేదు. జనం కోసం అహర్నిషలు కృషి చేస్తాడు. ఎండనక, వారనక నడుస్తాడు. బాటసారిగా మారుతాడు. వారి సమస్యలు తెలుసుకుంటాడు. వారి మధ్యలోనే నిత్యం వుంటాడు. తనంటే జనమని, జనమంటే జగనని నిరూపించాడు. చిన్న వయసులోనే పట్టుదలకు పర్యాయ పదం నేర్పాడు. లక్ష్య సాధనకు మార్గం చూపాడు. యువతరానికి ఆదర్శమయ్యాడు. సమాజ సేవ కోసమే తన జీవితం అంకితం చేశాడు. జగన్ నేనే అన్న మాట తనని ఎంత ప్రభావితం చేసిందో ప్రపంచానికి చూపించాడు. జయించడానికి ఓపిక వుంటే చాలు, ప్రపంచం దాసోహమంటుందని నిరూపించాడు. విజయాన్ని సొంతం చేసుకున్నాడు. విజయవంతంగా పాలనలో సంక్షేమ రాజ్య భావనను రుచిచూపించాడు.యుగకర్తగా మారాడు. ఆయనే జగన్…ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి. ఆ మూడక్షరాలు జగన్ అన్న పదం మూడక్షరాలు. జనం అన్న పదాన్ని నరనరాన జీర్ణించుకున్నాడు. అందుకే జనమంటే ఆయనకు పిచ్చి. జనం కోసం పనిచేయడం ఆయనకు లక్ష్యసిద్ధి. జనమే తన జపంగా నవతరం కోసం తన యువతరం జీవితాన్ని త్యాగం చేసిన నాయకుడు. ప్రపంచంలో ఎక్కడా జల్లడ పెట్టి వెతికినా జనం కోసం తన జీవితాన్ని ఎంతటి కష్టమైనా చిరునవ్వుతో ఎదుర్కొన్నాడు. నిందలు, నీలాపనిందలెన్నివేసినా, చిరునవ్వు మాటన బిగపట్టి అదుముకున్నాడు. కన్నీరు సముద్రమైనా, ఇంకిపోయేలా చేసుకున్నాడు. పైకి తన గాంభీర్యం తప్ప, మరేం కనిపించకుండా చూసుకున్నాడు. ఆత్మాభిమానాకి పర్యాయమయ్యాడు. జనం మనిషి జగన్ అయ్యాడు. జగనే జనం, ఈ తెలుగు జగమే జగన్ అనిపించుకున్నారు. ఆయన ఆ మూడక్షరాలే ఆయన విజయం. ఎవరెస్టు శిఖరం. తండ్రైనా, కొడుకైనా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తన రాజకీయ జీవితం కూడా రహదారి మార్గంగా సాగలేదు. ఆయన వేసుకున్న దారిని ఆయన పదిల పర్చుకుంటూ, ప్రజల గెండెల్లో తనను పదిలం చేసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ, తనపై పార్టీలో రోజు రోజుకూ నమ్మకం నింపుతూ, అనుకున్న మేర అవకాశాలు రాకపోయినా, అవాంతరాలెదురైనా, ఎక్కడా తొనకలేదు. ఒక దశలో వైఎస్ రాజశేఖరరెడ్డిని కూడా తన అభిమానులు, అనుచరులు కొత్త పార్టీ ఏర్పాటు చేయాలని కూడా ఒత్తిడి తెచ్చిన సందర్భాలున్నాయి. కాని ఆయన ఎక్కడా పార్టీ లైన్ దాటలేదు. పార్టీని వీడాలన్న ఆలోచనలు చేయలేదు. తనేంటో కాంగ్రెస్‌లోనే వుంటూ నిరూపించుకోవాలనుకున్నారు. పట్టుదలను తన చిరునామా చేసుకున్నారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన వైఎస్ రాజశేఖరరెడ్డి కొంత కాలం మంత్రిగా పనిచేసినా, అతి చిన్న వయసులో ఉమ్మడి రాష్ట్రంలో పిపిసి అధ్యక్షుడయ్యారు. కాని ఆయన పరిధి దాటలేదు. 1983లో ఆయన పిసిపి అధ్యక్షుడుగా వున్న కాలంలోనే ఎన్టీఆర్ వచ్చి ప్రభంజనం సృష్టించారు. తర్వాత 1989లో తెలుగుదేశం ఓడిపోయి, మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా, వైఎస్‌కు అవకాశం కల్సిరాలేదు. ఆ సమయంలో పిసిపి అధ్యక్షుడుగా వున్న మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత ఆయన పదవి కోల్పోవడానికి పరోక్షంగా వైఎస్ రాజశేఖరరెడ్డి అన్న ప్రచారం చేసి, వైఎస్‌ను పార్టీకి దూరం చేయాలని చూశారు. కాని ఏనాడు వైఎస్ ఎక్కడా నోరు జారలేదు. తర్వాత నేదురుమల్లి జనార్ధన రెడ్డిని ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత కోట్లవిజయభాస్కరరెడ్డి సిఎం అయ్యారు. అయినా ఎక్కడా వైఎస్ తనకు అన్యాయం జరుగుతోందని, తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అనుకోలేదు. పార్టీని నమ్ముకొని ముందుకు సాగారు. 1999 ఎన్నికల సమయంలో మళ్లీ పిసిసి పగ్గాలు అందుకున్న వైఎస్ ఉచిత విద్యుత్ పధకం తెరమీదకు తెచ్చారు. కాని సొంత పార్టీ నేతలే ఎద్దేవా చేశారు. ఉచిత విద్యుత్ అమలు చేస్తే విద్యుత్ తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సిందే అని సొంత పార్టీనేతలు అన్నా పట్టించుకోలేదు. కాని ప్రజలు బలమైన ప్రతిపక్ష స్ధానం కాంగ్రెస్‌కు ఇచ్చారు. వైఎస్‌ను ప్రతిపక్షనేతను చేశాయి. దాంతో ఇక వైఎస్ ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. కాలం గడుస్తోంది. రెండోసారి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే విద్యుత్ చార్జీలు పెంచడంతో మొదలైన ప్రజా వ్యతిరేకతను తనకు అనుకూలంగా మల్చుకొని, రాజకీయంగా తన భవిష్యత్తును, రాష్ట్ర భవిష్యత్తును తన చేతిలోకి తీసుకోవాలన్న మధనం మొదలైంది. ఇంకేముంది రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పాదయాత్ర మొదలు పెట్టారు. ఆయన పాదయాత్రను కూడా అడుగడుగునా సొంత పార్టీ నేతలే ఎదుర్కొనే ప్రయత్నం చేశారు. కాని ఆయన ఆగలేదు. వెనక్కితిరిగిచూసుకోలేదు. మాట తప్పనని, మడమ తిప్పనని ప్రజలకు చెప్పుకుంటూ, ముందుకు సాగారు. ఏ ఉచిత విద్యుత్ పధకాన్ని ఎగతాలి చేశారో వారి నోరు మూయించేందుకు అదే ఉచితవిద్యుత్ పేరుతో ప్రజలను నమ్మించారు. రైతు బాంధవుడుగా రైతు గుండెల్లో చిరస్ధాయిగా వైఎస్ నిలిచిపోయారు. అదే దారిలో నడిచిన వైఎస్ జగన్ రాజకీయం కూడా పూల పానుపు కాలేదు. దివంగత వైఎస్ కన్నా, ఎక్కువ ఒడిదొడుకులు, ఎదురు దెబ్బలు తినాల్సివచ్చింది. అసలు ఆ వయసులో జగన్ కాకుండా మరెవరు వున్నా, ఈ రాజకీయాలెందుకు, ఈ వయసులో నాకు ఈ ప్రజా సేవ ఎందుకు అని పారిపోయేవారేమో? కాని జగన్ అలా చేయలేదు. కాలాన్ని సైతం లెక్క చేయలేదు. ఎదురు తెన్నులను తనకు ఎలా అవకాశంగా మల్చుకోవాలో మధించారు. తొలిసారి ప్రజాజీవితంలోకి జగన్ అదేంటో గాని వైఎస్ ముఖ్యమంత్రి కాకముందునుంచే జగన్ అనే పేరు యువతకు బాగా కనెక్టు అయ్యింది. వైఎస్ ప్రతిపక్షనేతగా వున్న కాలంలోనే జగన్ క్రేజ్ విపరీంతగా పెరిగింది. ఇలా ఒక ప్రతిపక్ష నేత కొడుకుకు యువతలో అంత క్రేజ్ వుండడం ప్రపంచంలోనే ఎవరూ లేరు. ఇక వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్‌కు యువతలో విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోయింది. కాని ఆయన ఎక్కడా కనిపించేవారు కాదు. కాని ఆయనకు అలా పేరు ఆదిలోనే కలిసొచ్చింది. వైఎస్ ముఖ్యమంత్రిగా వున్న కాలంలో ఏనాడు జగన్ సెక్రెటెరెయేట్ వచ్చిందిలేదు. హడావుడి చేసింది లేదు. కాని తర్వాత కాలంలో ఆయన ఎదుర్కొన్న ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. కాలం పగపట్టింది. ప్రకృతికి కన్ను కట్టుంది. జననేత వైఎస్‌ను జనానికి దూరం చేసింది. కానరాని లోకాలకు తీసుకెళ్లింది. కాని ఆయన జనం గుండెల్లోనుంచి ఏ దేవుడు దూరం చేయలేదు. ఆయన చేసిన సేవలు ఇంకా ప్రజలు మననం చేసుకుంటున్నారంటే ఆయన ప్రజలను ఎంత ప్రభావితం చేశారో అర్ధం చేసుకోవచ్చు. ఆ రోజుల్లో అంతగా ప్రజల గుండెల్లో గూడుకట్టుకొని పోయిన నేతల్లో ముందువరసలో వైఎస్ వుంటారు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వందల మంది గుండెలు ఆగిపోయాయంటే ఆయనను ప్రజలు ఎంత గుండెల్లో పెట్టుకున్నారో అర్ధం చేసుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ దేవుడి పూజ గదుల్లో వైఎస్ ఫోటోలు పెట్టుకొని పూజిస్తున్నారంటే ఆయన చేసిన సేవ ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చు. ఉచిత విద్యుత్ అన్న ఒక మాట నమ్మి, పార్టీని అధికారంలో కూర్చోబెట్టిన ప్రజలను ఏదో చేయాలి. ఎంతో చేయాలి. వారికి సంక్షేమ రాజ్యభావన ఎలా వుంటుందో చూపించాలనుకున్నాడు. ప్రజాస్వామ్య ఫలాలు ఎలా అందించాలో చూపించాడు. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాడు. పేదలకు విద్యను, వైద్యను రెండిరటీనీ ఏక కాలంలో అందుబాటులోకి తీసుకొచ్చి, ప్రజలకు దేవుడయ్యారు. రాజుగా ఆయన కీర్తిని చూడలేకపోయిన దేవుడు ప్రజలు ఎక్కడ తనను మర్చిపోతారో అని వైఎస్‌ను తీసుకెళ్లారు. పేదల దేవున్ని ఆ దేవుళ్లు ప్రజలకు దూరం చేశారు. కాని ఆయన కీర్తిని శాశ్వతం చేశారు. విద్య 2004కు ముందున్న విద్యావిధానంలో సమూల మార్పులు చేసి, ప్రజలకు కొత్త తరం ఆవిష్కరణలకు మార్గం వేసిన ప్రజా రంజక పాలకుడు వైఎస్. ఆయన బాటలోనే నేడు జగన్ కూడా పయనిస్తున్నాడు. ఒకనాడు పేదలకు విద్య అందని ద్రక్ష. అందులోనూ ఉన్నత విద్య పేదలకు అందుబాటులోవుండేది కాదు. ఇంజనీరింగ్ విద్య అంటే సగటు పేద విద్యార్ధి కలలు చెదిపోయేవి. చదవాలన్న కాంక్ష, ఆకాంక్ష వున్నప్పటికీ పేదరికం ఉన్నత విద్యలకు దూరం చేసేది. దాంతో వృత్తి విద్యలకు పేద విద్యార్ధులు దూరమయ్యారు. ప్రభుత్వ రంగంలో వుండే అరకొర సీట్లలో మెరిట్ విద్యార్ధులు మాత్రమే చేరేందుకు అవకాశాలుండేవి. కాని ప్రపంచం అడ్వాన్స్ అవుతోంది. ప్రపంచమంతా ఐటి అన్న పదం ఉర్రూతలూగిస్తున్న కాలమది. అసలు ఇంజనీరింగ్ అంటే ఎంత సేపు బిల్డింగులు, కల్వర్టులు, రోడ్లు, ప్రాజెక్టులు అన్న అభిప్రాయం వుండేది. కాని ఇంజనీరింగ్ విద్యలో కూడా ఎన్నో రకాల కోర్సులున్నాయన్నది దివంగత నేత వైఎస్ తెచ్చిన ఫీజు రీఎంబర్స్ మెంటు విద్యావిధానం ద్వారా వెలుగులోకి వచ్చాయని చెప్పాలి. అదే ఆయన చేపట్టి వుండకపోతే, ప్రపంచంతో మనం పోటీ పడే పరిస్ధితి వుండకపోయేది. మన ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ఇలా వుండేదికాదు. ఎప్పుడైతే ప్రతి పేద విద్యార్ధి ఉన్నత విద్య చదువుకోవాలని అందించిన ప్రోత్సహం, రూపాయి ఖర్చు లేకుండా అంటు ఫీజు రీఎంబర్స్ మెంటుతోపాటు, విద్యార్ధులకు మళ్లీ ప్రత్యేకంగా స్కాలర్‌షిప్‌లు ఇవ్వడంతో రూపాయి చేతినుంచి ఖర్చులేకుండా కొన్ని లక్షల మంది ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు. కొన్ని లక్షల మంది నేడు ఐటి నిపుణులుగా విదేశాలలో జీవనం సాగిస్తున్నారు. బంగారు భవిష్యత్తును చూస్తున్నారు. గ్రామాల్లో నిరుపేద జీవితాలు అనుభవించిన ఎంతో మంది ఐటి నిపుణులు ఇప్పుడు విదేశాలలో కూడా సొంతంగా కంపనీలు ఏర్పాటు చేసి, ఎంతో మందికి వారు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. వారి జీవన ప్రమాణాలు పెంచుకున్నారు. అదే దారిలో నడస్తున్న జగన్ అమ్మ ఒడిపేరుతో ఉన్నత విద్యావంతులకే కాకుండా, చిన్న పిల్లలకు కూడా ఏటా రూ.15వేలు అందిస్తూ, పేదలందరికీ ఉచిత విద్య కల్పన చేస్తున్నారు. ఇదీ స్పూర్తిదాయకమైన పాలన అంటే… వైద్యం..ఆరోగ్యశ్రీ అసలు ఆరోగ్య శ్రీ అన్నది ప్రజల జీవితాలతో పెనవేసుకొని పోయి, ఇంకా వందేళ్లయినా, తెలుగు జాతి ప్రజలు మర్చిపోలేని పధకం చరిత్రలో నిలిచిపోనున్నది. కొన్ని తరాలు గుర్తుపెట్టుకునే పథకంగా గుర్తింపు పొందింది. నేను రాను బిడ్డో అన్న పదం మూలంగా సామాన్యులకు వైద్యం అందక ఎంతో మంది గ్రామీణ ప్రజలు ఆరోగ్యాలను నిర్లక్ష్యం చేయడమో, లేక రోగాలు ముదిరి మీద పడుతున్నా వైద్యం చేయించుకునే స్ధోమత లేకనో ప్రాణాలు పోవడం అన్నది చూసి చలించిన ప్రజా వైద్యుడు వైఎస్ తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకం అమలు చేశాడు. ఎందుకంటే ఆయన స్వతాహాగా వైద్యుడు. వైద్య విద్య పూర్తి చేసుకున్న వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయాలక రాకముందు, ఏర్పాటుచేసిన ప్రజా వైద్య శాలలో ఆయన వైద్యం చేసినందుకు తీసుకునే ఫీజు. రూపాయి. ఎలాంటి పరిస్ధితిల్లో ఒక పేషెంటు వచ్చినా కేవలం రూపాయికే వైద్యం అందించిన దేవుడు వైఎస్. అందుకు దేవుడు ఆయనను ముఖ్యమంత్రిని చేసిన తర్వాత ఆరోగ్య శ్రీ అనే పథకాన్ని తెచ్చి, ప్రజల ఆరోగ్యాలకు భరోసా కల్పించారు. ఎలాంటి వైద్యం కాని పెద్దపెద్దోళ్లు చేయించుకునే ఖరీదైన వైద్యం రూపాయి జేబునుంచి ఖర్చు చేసుకోవాల్సిన అవసరం లేకుండా, ఎంత పెద్ద ఆపరేషన్ అవసరమైనా ఉచితంగా వైద్యం అందించి, తిరిగి ఇంటికి వెళ్లడానికి దారి ఖర్చులు కూడా ఇచ్చి పంపించే ఏర్పాటు చేసిన గొప్ప మానవతా వాది వైఎస్. అందుకే ఇంకా తరాలైనా వైఎస్ ప్రజల గుండెల్లోనే చిరంజీవిగా వుంటారు. ఆయన ఆరోగ్య శ్రీ పధకం పుణ్యమా అని కొన్ని వేల కుటుంబాలు లబ్ధిపొందాయని చెప్పడంలో సందేహంలేదు. ఇక అత్యవసర వైద్య సేవలు కావాల్సివచ్చినప్పుడు అందుబాటులో ఎలాంటి వాహనం లేని గ్రామాల ప్రజలకు, ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే ఆసుపత్రులకు తరలించేందుకు, గర్భిణీ స్త్రీలు, గుండె సంబంధిత వ్యాధులకు అత్యవసర వైద్య చికిత్సలు అందేందుకు 108 వాహనాలు ఏర్పాటు చేయడంతో కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడబడ్డాయి. అంతేకాకుండా ఒకప్పుడు చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయాలంటే కొన్ని లక్షలు ఖర్చయ్యేవి. అలాంటి వైద్యం అందాలని చిన్నారులెవరైనా గుండె సంబంధిత వ్యాధులతో చనిపోకుండా చర్యలు తీసుకున్నారు. ఎంత ఖర్చైనా చేసేలా వెసులుబాటు కల్పించారు. దాంతో కొన్ని వేల మంది చిన్నారులు ఇప్పుడు బతికి ఆనందంగా జీవితాలు గడుపుతున్నారు. ఇలా వైద్య రంగంలో ఆయన తెచ్చిన మార్పులు, పేదలకు కార్పోరేట్ వైద్యం అందుబాటులోకి తెచ్చి పెదలకు దేవుడయ్యాడు. పేదల దేవుడయ్యాడు. రాజశేఖరుడు అమరుడైనా, దేవుడై పూజలందుకుంటున్నాడు. గూడు నిర్మాణాలు` ఇందిరమ్మ ఇండ్లు నిజంగా వైఎస్ పాలనా కాలం ఒక స్వర్ణయుగమని చెప్పాలి. ఎందుకుంటే ఆయన అధికారంలోకి వస్తూనే రైతులకు ఇచ్చిన మాటతోపాటు, విద్య, వైద్యం, పేదలకు గూడు సౌకర్యాలు కల్పించడం వల్ల సుమారు ఉమ్మడి రాష్ట్రంలో 35 లక్షల మంది కుటుంబాలకు పక్కా ఇండ్ల నిర్మాణం జరిగింది. తెలుగు రాష్ట్రాలలో ఏ ఊరికెళ్లినా, ఏ పట్టణానికి వెళ్లినా ఇందిరమ్మ కాలనీ అంటూ ప్రత్యేకంగా కొన్ని వందలాది ఇళ్ల నిర్మాణాలు జరిగాయంటే మాటలు కాదు. ఇప్పుడున్న పాలకులు కనీసం వందల ఇండ్ల నిర్మాణాలు చేయడానికి నానా రకాలుగా మాట్లాడుతుంటే, ఐదేళ్ల కాలంలో ధరఖాస్తు చేసుకున్న ప్రతి కుటుంబానికి ఇండ్లు ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డి. అదే బాటలో నడుస్తున్న జగన్ తన ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో 25లక్షల ఇండ్లు నిర్మించి పేదలకు అందిస్తానని చెప్పారు. ఇది స్పూర్తి. సంక్షేమ రాజ్యభావనకు తండ్రీ కొడుకులు ఆదర్శమూర్తులు. సంక్షేమ రాజ్య నిర్మాణానికి యుగకర్తలు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.