పేదల దేవుడు కేసిఆర్‌: మాలోతు కవిత

`మాలోతు కవితతో కట్టా మాట…మంతి.

`అన్ని వర్గాల అభ్యున్నతి అనేది ఒక్క కేసిఆర్‌ హయాంలోనే చూస్తున్నాం

`ఒక రకంగా చెప్పాలంటే కేసిఆర్‌ పాలన స్వర్ణ యుగం.

`గిరిజన ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలౌతున్నాయి.

`పోడు సాగుకు కూడా రైతు బంధు అనేది విప్లవాత్మక నిర్ణయం

`గిరిజన ప్రజలకు గిరిజన బంధు అమలుతో ఆ వర్గాల జీవితాలలో వెలుగులు నిండుతాయి.

`రిజర్వేషన్లు పెంచితే విద్య, ఉద్యోగ రంగాలలో అనేక అవకాశాలు వస్తాయి.

`ఒక్క తెలంగాణే కాదు దేశమంతా గిరిజన ప్రజల జీవితాలలో మార్పులు రావాలి.

`అందుకు కేసిఆర్‌ జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర కావాలి.

`కేసిఆర్‌ ప్రధాని అయితే దేశ రాజకీయాలలో కూడా మార్పులొస్తాయి.

`దేశమంతా తెలంగాణలో అమలౌతున్న పథకాలు అందుబాటులోకి వస్తాయి.

`ఒక్క మాటలో చెప్పాలంటే దేశం సుభిక్షమౌతుంది.

`అన్ని రంగాలలో అభ్యున్నతి సాధిస్తుంది.

`గుప్తుల కాలం మర్చిపోయి కేసిఆర్‌ కాలం స్వర్ణ యుగమని చెప్పుకుంటారు.

`సమాజం గురించి కేసిఆర్‌ అంత తపన పడే నాయకుడిని ఎక్కడా చూడలేదు.

`దేశం కోసం ఇంతలా ఆలోచిస్తున్న నాయకుడు ఈ తరంలో లేడు…

`అందుకే కేసిఆర్‌ గ్రేట్‌ లీడర్‌…

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ముఖ్యమంత్రి కేసిఆర్‌ లాంటి ఉదాత్తమైన నాయకుడు దేశ రాజకీయాల్లోనే లేరు. ఆయన లాంటి ఉత్తమైన నాయకుడు మరొకరు కనిపించరు. ఇది అతిశయోక్తికాదు. ఎంతో దూరదృష్టి వుంటే తప్ప అంతటి నాయకుడు ఎవరూ కాలేరు. సంపూర్ణమైన నాయకుడు అంటే కేసిఆర్‌. ఆయనను చూసి భవిష్యత్తు తరం రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సింది ఎంతో వుంది. ఒక నాయకుడికి ప్రజలంటే ప్రేమ వుండాలి. ప్రజలకు ఏం కావాలో తెలియాలి. ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో అంచనా వేయగలగాలి. ప్రజలు నాయకులనుంచి ఏ ఆశిస్తారన్నది బాగా తెలిసి వుండాలి. నిత్యం ప్రజలకు అందుబాటులో వుండాలి. నిత్యం ప్రజల గురించే నాయకుడు ఆలోచిస్తూ వుండాలి. ఇలాంటి ఉత్తమైన గుణగణాలన్నీ కేసిఆర్‌లో వున్నాయి. అందుకే ఆయన తెలంగాణ సాధించగలిగారు. అసలు తెలంగాణ ఉద్యమమంటే అందరూ చేసేదేలే…ఇప్పుడు కొత్తగా ఏముంటుందిలే…అన్నవాళ్లే చాలా మంది. కాని తెలంగాణ జెండా ఎత్తి, కొత్త తరం రాజకీయ ఉద్యమ పోరాటాన్ని మిలితం చేసిన కేసిఆర్‌ తెలంగాణ సాధించడం అన్నది ఎవరూ ఊహించింది కాదు…..అందుకే తెలంగాణ ఉద్యమం అన్నది చరిత్రలో ఒక సువర్ణాక్షరమైతే…కేసిఆర్‌ ఉద్యమ జీవితం ఒక సువర్ణాధ్యాయం. అంటున్న మహాబూబాబాద్‌ ఎంపి. మాలోతు కవితతో ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు మాటా…మంతి! తెలంగాణ ఉద్యమం మొదలైన నాడు అందరూ తెలంగాణ వస్తే చాలు అనుకున్నారు. ఎందుకంటే ఆనాడు ఆత్మగౌరవం మాత్రమే వినపడేది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ద్వితీయ శ్రేణి పౌరులుగా బతుకుతున్నారన్న భావన సర్వత్రా వ్యక్తమయ్యేది. అలా సామాన్య ప్రజలైనా, నాయకులైనా అంతే…సీమాంధ్ర నాయకత్వం ఏదైనా సరే…అందరూ తలూపాల్సిందే…తలొంచాల్సిందే.. తెలంగాణలో వారిని ఎదిరించి మాట్లాడే శక్తి వున్న నాయకులే లేని రోజులవి. అలాంటి సమయంలో తెలంగాణ అనే పదమే మాట్లాడేందుకు వీలు లేని పరిస్ధితి. అసెంబ్లీలో తెలంగాణ అన్న పదాన్నే నిషేదించారు. వెనుకబడిన ప్రాంతం అనాల్సివచ్చేది. అయితే ఇది కూడా తెలంగాణ ఉద్యమానికి ఎంతో దోహదం చేసింది. తెలంగాణ అనొద్దన్న ఉమ్మడి రాష్ట్ర పాలకులే వెనుకబడిన ప్రాంతం అనొచ్చన్నారు. తెలంగాణ వెనుకబడిన ప్రాంతం అంటే తెలంగాణ ప్రజల దృష్టిలో వెనక్కి నేట్టేబడిన ప్రాంతంగా మనసుల్లో ముద్రపడిపోయింది. సరిగ్గా అదే సమయంలో తెలంగాణ జెండా ఎత్తిన కేసిఆర్‌ ప్రజలను కదలించిన విధం మాత్రం అపురూమనే చెప్పాలి. తెలంగాణ ఉద్యమం అంటే చాలు..ముందు నిట్టూర్చేవాళ్లే ఎక్కువ. తర్వాత భయపడేవారు కూడా ఎక్కువే. జై తెలంగాణ అంటే నక్సలైట్‌ అనే ముద్ర వేసే రోజులవి. అలాంటి సమయంలో దిక్సూచీలా మారి, తెలంగాణను ఒక దివిటీగా మారి, చైతన్య దీప్తిగా మారి వెలుగు వైపు ప్రజలను నడిపించిన నాయకుడు కేసిఆర్‌. తెలంగాణ ఉద్యమం నడిచినంత కాలం తెలంగాణ వస్తే చాలనుకున్నాం. 

మన నిధులు మనకే అంటే సరే ఎంతో కొంత మన అభివృద్ధి మనమే చేసుకోవచ్చు అనుకున్నాం. కాని తెలంగాణ వస్తే ఇంత ప్రగతి సాధిస్తుందని కలలో కూడా ఊహించలేదు. తెలంగాణ వస్తే ఇంత తక్కువ సమయంలో తెలంగాణ రూపు రేఖలు ఇంత గొప్పగా ఆవిషృతమౌతాయని ఎవరూ అనుకోలేదు. తెలంగాణ చరిత్ర తెసిన వారు కూడా ఊహించలేకపోయారు. తెలంగాణ వచ్చిన ఇంత అతి తక్కువ కాలంలో కోటి ఎకరాల మాగాణ అవుతుందని అనుకున్నామా? తెలంగాణ సస్యశ్యామలం కావాలనుకున్నాం. అందుకు కనీసం ఓ ఇరవై ముప్పై ఏళ్లు పడుతుందేమో అనే అందరూ అనుకున్నారు. కాని ముఖ్యమంత్రి కేసిఆర్‌ అధ్భుతాలు సృష్టించారు. అన్ని వర్గాల అభ్యున్నతి సాధించింది. కేవలం ఆరు నెలల్లో చిమ్మ చీకట్ల నుంచి తెలంగాణలో వెండివెలుగులు ఆవిష్కారమాయ్యయి. ఒకనాటి తెలంగాణ పరిస్ధితి గుర్తు చేసుకుంటే, ఇప్పటికీ అప్పటికి ఎంత తేడా అన్నది తెలిసిపోతుంది. సహజంగా ఒక ముఖ్యమంత్రి ప్రజలకు ఏం చేయాలన్నదానిపై కొన్ని పమితులలోనే ఆలోచన చేశారు. అంతటితో అవే గొప్ప పధకాలు అని ప్రచారం చేసుకున్నారు. కీర్తించుకున్నారు. కాని ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఏక కాలంలో ఇన్ని రకాల పధకాలు అమలు చేసి, తెలంగాణలో సమస్యలు లేని కాలాన్ని సృష్టిస్తాడని ఎవరూ అనుకోలేదు. అసలు దేశంలో తెలంగాణలో అమలు జరుగుతున్న పథకాలలో కనీసం ఒక్క శాతం కూడా అమలు కావడం లేదు.గత కొన్ని దశాబ్ధాలుగా దేశమంతా అమలౌతున్న రేషన్‌ బియ్యం, వృద్థులకు పెన్షన్‌ ఇవి తప్ప మరే పథకాలు ఇతర రాష్ట్రాలలో లేవు. అయితే ఇక్కడ కూడా తెలంగాణ ప్రత్యేకమే. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎంతటి ప్రజా నాయకుడో అర్ధం చేసుకోవచ్చు. మన రాష్ట్రంలో సీలింగ్‌ లేని రేషన్‌ అందిస్తున్నాం. పైగా ప్రతి వ్యక్తికి ఆరు కిలోలు ఇవ్వడం జరుగుతోంది. వీటికి తోడు చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా? అసలు కళ్యాణ లక్ష్మి అనే పథకం పేదింటి ఆడపిల్ల జీవితానికి ఒక వరంగా మారింది. ఆడ పిల్ల పెళ్లి చేయడం అంటే సగటు తండ్రికి ఎంత కష్టమో! కళ్లారా చూసిన ముఖ్యమర్రతి కేసిఆర్‌ అధికారంలోకి రాగానే ప్రకటించారు. అంటే ఆయన తెలంగాణ వస్తే, అందులోనూ అధికారంలోకి వస్తే ఎలాంటి పధకాలు అమలు చేసుకోవచ్చో అన్నవి ముందే నిర్ణయం తీసుకున్నారు. ఇలా ఇంత ముందుచూపు వున్న నాయకుడు ప్రపంచంలో ఎవరైనా వున్నారా? ఒక్క కేసిఆర్‌ తప్ప మరెవరూ కనిపించరు. అంత గొప్ప నాయకుడు కేసిఆర్‌.తెలంగాణ ప్రజలు గత ఎనమిది సంవత్సరాల కాలంలో అనుభవిస్తున్న అనేక సంక్షేమ పథకాలు దేశం మొత్తం అమలు కావాలి.

ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ పార్టీలు, కేంద్రంలో అధికారంలోవున్న బిజేపి, అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీల నాయకులు ముఖ్యమంత్రి కేసిఆర్‌లా ఆలోచించలేదు. పనులు అమలు చేయలేరు. ఎందుకంటే తెలంగాణ వచ్చిన నుంచి తెలంగాణలో ఏమేమి అమలౌతున్నాయో! కేంద్రంలోపాటు, అన్ని రాష్ట్రాలూ చూస్తున్నవే…కాని మన రాష్ట్రాల్లో అమలు చేయాలని ఆయా రాష్ట్రాలు అనుకోవడం లేదు. దేశం మొత్తం అమలు చేయొచ్చని కేంద్రం అనుకోవడం లేదు. ఈ పార్టీలు అధికారంలో వున్నంత కాలం తెలంగాణ పధకాలు దేశంలో అమలుకావు. అందుకే దేశమంతా తెలంగాణలాగా ప్రగతిని సాధించాంటే, దేశమంతా సస్యశ్యామలం కావాలంటే ముఖ్యమంత్రి కేసిఆర్‌ దేశ నాయకుడు కావాల్సిందే. కేసిఆర్‌ దేశానికి ప్రధాని కావాల్సిందే…! ఇది నా ఒక్కదాని ఆలోచన కాదు..దేశంలోని కోట్లాది మంది ప్రజలు, వేలాది మంది నాయకులు కోరుకుంటున్న మాట. బిజేపి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ఎంత సేపు పన్నులెలా వేయాలి. ప్రభుత్వ ఆస్ధులెలా అమ్మాలి. ప్రైవేటు వ్యక్తులకు ఎలా దోచిపెట్టాలి. సామాన్యుడి నడ్డి ఎలా విరువాలి. ఎన్ని రకాలుగా ప్రజల నుంచి ముక్కు పిండి పన్నులు వసూలు చేయాలి. నల్ల దనం పేరు చెప్పి, నోట్ల రద్దు చేసి దేశాన్ని అతలాకుతలం చేశారు…నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజలను ఆగం చేస్తున్నారు. ఎంతో గొప్ప పని చేసినట్లు అర్ధరాత్రి పార్లమెంటులో జిఎస్టీ అమలు చేస్తున్నట్లు చెప్పి, ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు తెస్తాయని నమ్మించారు. ఇప్పుడు పాలు, పెరుగు మీద కూడ పన్నులేసి ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. అసలు బిజేపి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక చెప్పుకోవడానికి ఒక్కంటే ఒక్క పధకమైనా ప్రారంభించారా? అమలు చేశారా? ఒక్క సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం జరిగిందా? పాత పధకాలకు పేర్లు మార్చుడం, కొత్త పన్నులు వేయడం తప్ప మోడీ ప్రభుత్వం చేసిందేమీ లేదు…మత రాజకీయాలు తప్ప, మానవత్వాన్ని ప్రదర్శించింది లేదు. పేదలను ఆదుకున్నది లేదు. ఆ పరిస్ధితి పోవాలి. కొత్త తరం నాయకత్వం దేశానికి కావాలి. అందుకు కేసిఆర్‌ నాయకత్వం కావాలి. దేశమంతా సాగునీటితో కళకళలాడాలి. దేశమంతా సస్యశ్యామలం కావాలి. దేశంలో అవకాశం వున్న ప్రతీ చోట కాళేశ్వరం ఆలాంటి ప్రాజెక్టుల నిర్మాణం జరగాలి. నదుల నీటిని ఒడిసిపట్టాలి. పొలాలకు మళ్లించాలి. అందుకోసం అనేక రిజర్వాయర్ల నిర్మాణం జరగాలి. చెరువులు పునరుద్దరన సాగాలి. దేశంలోని ప్రతి ఊరికి సురక్షితమైన మంచినీరు అందాలి. తెలంగాణలో విజయవంతమైన మిషన్‌ భగీరధ కార్యాక్రమం దేశమంతా అమలు కావాలి. ప్రతి గడపకు మంచినీరు చేరాలి. ఇలా అనేక సంక్షేమకార్యక్రమాలు దేశమంతా అమలుకావాలి. అందుకు కేసిఆర్‌ దేశ ప్రధాని కావాలి. దేశానికి దిశా నిర్ధేకుడై స్వర్ణ యుగం తేవాలి. గుప్తుల కాలం స్వర్ణయుగమని ఇంకా చెప్పుకుంటున్న మనం…కేసిఆర్‌ కాలం మరో స్వర్ణయుగమని చెప్పుకునే రోజులని భవిష్యత్తులో తరతరాలు చెప్పుకోవాలి. కేసిఆర్‌ హయాంలోని అందే దీర్ఘకాలిక ప్రణాళికల ప్రయోజనాలు తరతరాలు అందాలి. దేశం సగర్వంగా తలెత్తుకోవాలి.

వైద్యరంగం పైన ప్రజలకు అపారమైన నమ్మకం గౌరవం పెరిగాయి : మంత్రి హరీష్ రావు

హైదరాబాద్‌,నేటిధాత్రి:

జీ తెలుగు న్యూస్ ఛానల్ వాళ్ళు నిర్వహించిన హెల్త్ కాంన్ క్లేవ్ అండ్ అవార్డ్స్ 2022 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. వైద్య రంగంలో అద్భుతమైన సేవలు అందిస్తున్న వైద్యులను,వైద్య సిబ్బందిని మంత్రి సన్మానించి సత్కరించారు.

కరోనా సమయంలో వైద్యులు అందించిన సేవను గుర్తుచేసి మంత్రి అభినందించారు. మంత్రితో పాటు ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, వైద్యరంగ నిపుణులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ:

 

ఇటీవలి కోవిడ్-19 మహమ్మారి తర్వాత ప్రజారోగ్యం మీద బాగా అవగాహన పెరిగింది. ప్రజలు, ప్రభుత్వాలు ప్రజారోగ్య ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాయి. ప్రభుత్వ రంగంలో గాని, ప్రయివేటు రంగంలో గాని పెద్ద ఎత్తున ప్రజారోగ్యంపై దృష్టి పెట్టి అవసరమైన అన్ని వసతులు సమకూర్చుకుంటున్నాయి. 

 

మరి ముఖ్యంగా కరోనా సమయంలో సేవలందించిన వైద్యుల పైన వైద్యరంగం పైన ప్రజలకు అపారమైన నమ్మకం గౌరవం పెరిగాయి.

 

ఇక మైనది ఎందుకంటే ఇందులో వైద్యులు ఇది వృత్తిలా కాకుండా బాధ్యతగా చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి.

 

చాలా సందర్భాల్లో పర్సనల్ లైఫ్ ని ఫ్యామిలీ లైఫ్ ని కూడా పక్కనపెట్టి ధర్మాన్ని బాధ్యతగా నిర్వహించాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ అవార్డు పొందే డాక్టర్లే కాదు యావత్ వైద్యులకు వైద్య సిబ్బందికి సిబ్బందికి నా యొక్క అభినందనలు.

 

తెలంగాణ ప్రభుత్వం ఎనిమిదేండ్ల కృషికి మంచి ఫలితాలు వచ్చాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి పట్టణ ప్రగతి వల్ల మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు తగ్గాయి. 

 

తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఆరోగ్య సూచికలలో కూడా గణనీయమైన పురోభివృద్ధి సాధించాం. ఇటీవల రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వైద్యరంగంలో తెలంగాణ చేస్తున్న కృషిని ప్రశంసించింది. వైద్య సేవల మీద ఎక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందని వెల్లడించింది. 

 

నగరాల్లో పట్టణాల్లో స్లమ్ ఏరియాలు ఎక్కువ ఉంటాయి. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బస్తీల సుస్తీ పొగొట్టాలని బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడం జరిగింది. 390 బస్తీ దవాఖానాల ద్వారా పేదలకు వైద్యం అందే ప్రయత్నంలో ఉన్నాం. జీహెచ్ఎంసీ పరిధిలోఇప్పటికే 259 బస్తీ దవాఖానాల ద్వారా వైద్యం అందుతోంది.

 

తెలంగాణలో వైద్య రంగాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని విధాల కృషి చేస్తున్నాము, ఎక్కడైనా వైద్యరంగంలో మంచి విధానాలు ఉంటే వాటిని సమీక్షించి అధ్యయనం చేసుకొని తెలంగాణ ప్రజలకు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంది.

త్వరలో గిరిజన బంధు…

తెలంగాణలో సంక్షేమ విప్లవం.

ముందే చెప్పిన నేటిధాత్రి….

అందరికంటే ముందే ఈ విషయాన్ని నేటిధాత్రి వెలుగులోకి తెచ్చింది

 నేటిధాత్రి చెప్పినట్లుగానే కేసిఆర్‌ ప్రకటించారు. 

ఒక్కసారిగా మారిపోయిన రాజకీయ వాతావరణం…

బిజేపికి దిమ్మతిరిగే సమాధానం…

సెస్టెంబర్‌ 17 కానుకగా గిరిజనులకు మూడు వరాలు ప్రకటించిన కేసిఆర్‌.

పోడుసాగు చేసుకునే గిరిజనులకు కూడా రైతు బంధు అమలు

తెలంగాణలో పది శాతం వున్న గిరిజనులకు ప్రత్యేకంగా పది శాతం రిజర్వేషన్లు.

దాంతో గిరిజనులకు మరిన్ని విద్య, ఉద్యోగ అవకాశాలు…

దళిత బంధులాగానే గిరిజన బంధు…

ప్రతి ఇంటికి రూ.10లక్షలు.

త్వరలో కార్యాచరణ ప్రకటన

స్టేజీ మీదే కేసిఆర్‌ కాళ్లు మొక్కిన మంత్రి సత్యవతి రాధోడ్‌..

గిరిజన సంఘాల హర్షాతిరేకాలు..

కేసిఆర్‌ చిత్ర పటాలకు క్షీరాభిషేకాలు..

కేసిఆర్‌ జిందాబాద్‌ నినాదాలతో మారు మ్రోగిన ఎన్టీఆర్‌ స్టేడియం…

ఎంత సంతోషంగా కేసిఆర్‌ సభకు వచ్చారో…అంతకు రెట్టించిన ఆనందంతో తమ తమ ప్రాంతాలకు తిరుగు ప్రయాణమైన గిరిజనులు.

తెలంగాణలో మరో కొత్త పధకం అమలు కాబోతోంది. గిరిజన, ఆది వాసీ ప్రజలకు ఒక శుభవార్త అందింది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ మదినుంచి జాలు వారింది. సెప్టెంబర్‌ 17న తెలంగాణ జాతీయ సమైక్య దినోత్సవం రోజు ముఖ్యమంత్రి కేసిఆర్‌ నోటి నుంచి త్వరలో గిరిజన బంధు అనే పధకం ప్రకటన వెలువడిరది. ఇప్పటికే తెలంగాణలో దళిత బంధు అమలౌతోంది. త్వరలో గిరిజన బంధుకు శ్రీకారం జరగనుంది. ఈ విషయం గత కొద్ది రోజుల ముందే నేటిధాత్రి చెప్పింది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆలోచనల్లో గిరిజన బంధు అమలు ఆలోచన మొదలైందని నేటిధాత్రి చెప్పింది. ఈ ప్రకటన కూడా అతి త్వరలో వెలువడనుందన్న సంగతి కూడా నేటిధాత్రి రాసింది. అన్నట్లుగానే హైదరాబాద్‌లో గిరిజన, ఆది వాసీ, బంజారా భవన్‌లను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం జరిగిన అశేష జనవాహిని గిరిజన ఆదివాసీ ఆత్మీయ సమ్మేళనం సభలో గిరిజన బంధు అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రకటించారు. అంతే కాకుండా ఆ వర్గాలకు మరిన్ని వరాలు కురిపించారు. ఇంత కాలం వున్న పోడు సమస్యలు త్వరలో తీరుతాయన్నారు. అందుకు కమిటీ వేసినట్లు వెల్లడిరచారు. అలాగే పోడు సాగు చేసుకునే గిరిజన రైతులకు ఇక నుంచి రైతుబంధు సాయం కూడా అందిస్తామన్నారు. అలాగే తెలంగాణలో వున్న పది శాతం గిరిజనులకు ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. ఒకేరోజు గిరిజనులకు మూడు వరాలు కురిపించారు. ఆ వర్గాలకు మరింత మేలు చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. ఇప్పటికే తండాలను ప్రత్యేక పంచాయతీలు చేశారు. గ్రామ పరిపాలనలో వారిని కూడా భాగస్వామ్యం చేశారు. తండాల అభివృద్దికి మార్గం వేశారు. ఎన్నోఏళ్లుగా అపరిషృతంగా వున్న ఆ సమస్యను తీర్చారు. ఇప్పుడు గిరిజనుల జీవితాల్లో మరిన్ని వెలుగులు నింపే గిరిజనబంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గిరిజన బంధుతో వారి జీవితాలకు దశ, దిశ చూపించనున్నారు. 10శాతం రిజర్వేషన్లతో వారికి మరిన్ని విద్యావకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మార్గం సుగమం చేస్తున్నారు. వారం రోజుల్లో జీవో విడుదల చేస్తామన్నారు. తెలంగాణలోని రైతులందరికీ అందుతున్నట్లే పోడు సాగు చేసుకునే గిరిజనుందరికీ రైతు బంధు అమలు చేస్తామని చెప్పడంతో గిరిజన వర్గాలో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. ఒక్కసారిగా ఎన్టీఆర్‌ స్టేడియంలో ఉద్వేగ భరితమైన వాతావరణం నెలకొన్నది. గిరిజన ఆదివాసీల కరకళ ద్వానాలతో సభ మారు మ్రోగిపోయింది. కేసిఆర్‌ జిందాబాద్‌ అంటే నినాదాలు మిన్నంటాయి. గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాధోడ్‌ సంతోషాన్ని ఆపుకోలేక ముఖ్యమంత్రి కేసిఆర్‌కు పాదాభివందనం చేశారు. 

ఎన్టీఆర్‌ మైదానంలో లక్షలాది మంది గిరిజనుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఈ ప్రకటనలు చేసి, వారిని సెప్టెంబర్‌ 17 కానుకగా అందించారు. తెలంగాణ ఒక సంక్షేమ రాష్ట్రంగా అవతరిస్తోంది. తెలంగాణ ఒక సంక్షేమ జీవనానికి వేధికౌతుంది. అందుకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలన ఒక స్వర్ణయుగం కానున్నది. అసలు ఇలాంటి పధకాలు గురించి ఏనాడు ఏ ముఖ్యమంత్రి ఆలోచించలేదు. అమలు చేయలేదు. కనీసం ఊహలకు కూడా అందని పధకాలను కలలో కూడా కలగనలేదు. మార్గదర్శకుడంటే కేసిఆర్‌లా వుండాలి. మార్గ నిర్ధేశకుడు కేసిఆర్‌ ఆలోచించాలి. సంక్షేమ వాది కేసిఆర్‌లా నిర్ణయాలు తీసుకోవాలి. సంక్షేమ సారధి కేసిఆర్‌లా అమలు చేయాలి. మొత్తంగా ప్రజల సుసంపన్న జీవితాలను కాంక్షించే నేతలు కేసిఆర్‌లా వుండాలి. కేసిఆర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి. అందరూ కేసిఆర్‌లా పాలించాలి. అప్పుడు దేశం సుభిక్షంగా వుంటుంది. ప్రజలంతా నిత్యం పండగలా గడుపుతారు. ప్రతి రంగం అభివృద్ధి చెందుతుంది. ప్రతి సామాజిక వర్గం ఉన్నతంగా జీవిస్తుంది. ఎవరూ ఊహించని దెబ్బ కొట్టడమే కేసిఆర్‌ రాజకీయ చాణక్యమని మరోసారి నిరూపించారు. సెప్టెంబర్‌ 17 పేరుతో రాజకీయం చేయాలనుకున్న బిజేపి ఆశలు ఆవిరిచేశారు. ఇప్పటికే అమలౌతున్న దళిత బంధు మీద రకరకాల కామెంట్లు చేస్తూ, దళిత వర్గాలకు దూరమైన బిజేపిని గిరిజనులకు, ఆదివాసీలకు దూరం చేసే స్కెచ్‌ కేసిఆర్‌ వేశారు. అదును చూసి సెప్టెంబర్‌ 17న ప్రకటించారు. దాంతో ఆయా వర్గాల ఓట్లను గంప గుత్తగా తన ఖాతాలో వేసుకునేందుకు కేసిఆర్‌ వేసిన ఎత్తు ముందు బిజేపి చిత్తైందనే చెప్పాలి. ఇలాంటి ప్రకటన చేస్తాడని బిజేపి అంచనా వేయలేకపోయింది. అందులోనూ సెప్టెంబర్‌ 17న కేసిఆర్‌ గిరిజన బంధు ప్రకటన చేస్తాడని అసలే ఊహించలేకపోయింది. అంతే కాకుండా ఏకంగా మూడు రకాల వరాలు కూడా ఒకే వేధిక మీద నుంచి కేసిఆర్‌ ప్రకటించాడు. బిజేపిని చిక్కుల్లో పడేశారు. ముందు నుయ్యి వెనక గొయ్యిలా బిజేపికి మార్గం లేకుండా చేశారు. తెలంగాణలో గిరిజన రిజర్వేషన్లను పెంచి అమలు చేస్తాం…అందుకు సహకరిస్తారా? లేదా? అని సవాలు విసిరారు. దాంతో రాష్ట్ర బిజేపి నేతల్లో పచ్చి వెలక్కాయ పడ్డంత పనైంది. నిజానికి ముఖ్యమంత్రి కేసిఆర్‌కు ఊపిరాడనివ్వకుండా చేస్తున్నామన్న సంతోషంలో బిజేపి వుంది. కాని ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయ వాతావరణం మారిపోయేలా, బిజేపిని ఉక్కిరి బిక్కిరి చేసేలా కేసిఆర్‌ వేసిస పథకంతో దిమ్మ తిరిగిపోయిందనే చెప్పాలి. కేంద్ర హోం మంత్రి రాజకీయం కూడా తుస్సుమన్నది అని చెప్పకతప్పదు. ఇదిలా వుంటే గిరిజనులు, ఆదివాసీలకు రైతు బంధు అమలు చేయడం అన్నది ఒక సంచలన నిర్ణయమని చెప్పకతప్పదు. గిరిజన రిజర్వేషన్లు పెంచుకోవడం అన్నది తెలంగాణ రాజకీయాల్లో ఒక నూతన అధ్యాయం. తెలంగాణ ప్రతిపాదనను బిజేపి అంగీకరిస్తుందా? దళిత వర్గాల ముందు దోషిగా నిలబడుతుందా? అన్నది త్వరలో తేలిపోతుంది. దాంతో బిజేపి రాజకీయానికి తెలంగాణలో స్కోప్‌ లేకుండాపోతుంది. వున్న స్పేస్‌ కూడా కనుమరుగౌతుంది. బిజేపిలో వున్న గిరిజన, ఆదివాసీ నేతలు కూడా టిఆర్‌ఎస్‌ వైపు అడుగులేయక తప్పని పరిస్దితిని కేసిఆర్‌ సృష్టించారు. తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టి ముఖ్యమంత్రి కేసిఆర్‌కు ఊపిరిసల్పకుండా చేద్దామనుకున్న బిజేపికి ఊహించని గిఫ్ట్‌ను కేసిఆర్‌ ఇచ్చినట్లైంది. తెలంగాణ రాజకీయాలను కలుషితం చేయాలని చూస్తుంటే చూస్తూ ఊరుకోనని కేసిఆర్‌ చెబుతూనే వస్తున్నాడు. కాని బిజేపియే పెడ చెవిన పెట్టింది. తమ రాజకీయం ముందు అందరూ దిగదుడుపే అని అనుకున్నది. కాని కేసిఆర్‌ కొట్టే రాజకీయ కౌకు దెబ్బల రుచి బిజేపికి ఇప్పుడిప్పుడే మొదలైందని తేలిపోయింది. 

గిరిజన ఆది వాసీ ఆత్మీయ సమ్మేళనానికి లక్షలాదిగా తరలి వచ్చిన వారినిద్దేశించి కేసిఆర్‌ మాట్లాడారు. ఒకడు కులం పేరుతో, మరొకడు మతం పేరుతో తెలంగాణలో విద్వేశాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, అలాంటి విద్వేశాలకు తెలంగాణలో తావివ్వొద్దని సిఎం కేసిఆర్‌ కోరారు. తెలంగాణ కోసం కులమతాలకతీతంగాం 58 సంవత్సరాలు కొట్లాడాం…తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నం. ఉమ్మడి రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్‌ 5శాతం వుండేది. తెలంగాణలో వారి జనాభా 10శాతం వుంది. తెలంగాణలో గిరిజనులక 10శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం వుంది. రాజ్యాంగంలో ఎక్కడా రిజర్వేషన్లు 50శాతానికి మించి లేదని రాసి లేదన్నారు. తమిళనాడులో అమలౌతున్న రిజర్వేషన్‌ చట్టాన్ని తెలంగాణలో కూడా అమలు చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఆదివాసీ బిల్లును ఆమోదించాలని కోరారు. త్వరలో పోడు భూముల సమస్య పరిష్కారానికి అవసరమైన కమిటి ఏర్పాటు జరిగింది. అందుకు జివో. నెంబర్‌140 కూడా జారీ చేయడం జరిగిందన్నారు. తెలంగాణలో గిరిజన సంస్కృతిని కాపాడుకుంటున్నామన్నారు. అచ్చం పేటలో అడవుల్లో వుండే చెంచులతో సహా, ఆదిలాబాద్‌లో వుండే ఆదివాసీలకు కూడా పెన్షన్లు అందిస్తున్నామన్నారు. గిరిజన, ఆదివాసీల పండుగలు ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. తెలంగాణ స్వరాష్ట్రం కావడం వల్లనే ఇవన్నీ సాద్యమౌతున్నాయని కేసిఆర్‌ చెప్పారు. అలాగే వచ్చేరోజుల్లో గిరిజన రిజర్వేషన్లు 10శాతం అమలు చేసుకుంటామని కేసిఆర్‌ వెల్లడిరచారు. సబ్బండ వర్గాలన్నీ కలిసి కొట్లాడిన తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.

మరో కల్లోలం లోకి జారిపోవద్దు: ముఖ్యమంత్రి కేసిఆర్‌.

`తెలంగాణలో ఘనంగా సమైక్యతా దినోత్సవం.

`జాతీయ జెండా ఆవిష్కరించి, తెలంగాణనుద్దేశించి ప్రసంగించిన సిఎం.

`తెలంగాణ త్యాగధనుల త్యాగాలను స్మరించుకున్న కేసిఆర్‌.

`స్వార్థపూరిత రాజకీయ శక్తుల పట్ల తెలంగాణ సమాజం అప్రమత్తంగా వుండాలని సూచన.

`పచ్చగా, ప్రశాంతంగా వున్న తెలంగాణలో మతోన్మాద శక్తులు పేట్రేగిపోతున్నాయి.

` సంకుచిత రాజకీయ శక్తులు కాచుకొని కూర్చున్నాయి.

`మానవత్వాన్ని కబలించే కుట్ర చేస్తున్నాయి.

`మనుషుల మధ్య విద్వేశ పూరిత మంటలు రగిలిస్తున్నాయి.

`రెచ్చగొట్టే వ్యాఖ్యలతో సమాజాన్ని కలుషితం చేస్తున్నాయి.

`జాతి జీవనాడిలో కలకలం రేపాలని చూస్తున్నాయి.

`తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తున్నాయి.

`త్యాగధనుల త్యాగాలను సైతం మలినం చేయాలని చూస్తున్నాయి.

`రెప్ప పాటు కాలం కూడా ఆదమర్చిపోవద్దు.

`చైతన్య వంతమైన తెలంగాణ సమాజంలో సంకుచితాలకు తావులేదు.

`సంక్షేమ తెలంగాణలో చిచ్చుపెట్టాలని చూస్తున్న వారి ఉచ్చులో యువత పడొద్దు.

`పెడదారిలో రాజకీయం చేయాలని చూస్తున్న వారి మాయలో పడొద్దు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఒక్కసారి చేసిన పొరపాటు 58 సంవత్సరాల పాటు అనుభవించాం. తెలంగాణ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిరది. ఆనాడే మనం మోసపోయాం. దోపిడీకి గురయ్యాం. శాపగ్రస్త జీవితాలు అనుభవించాం. తెలంగాణ కోల్పోయిన అస్ధిత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఎంతో కాలం పోరాడాల్సివచ్చింది. ఎంతో మందిని కోల్పోవాల్సివచ్చింది. ఎంతో మంది త్యాగాలు చేయాల్సివచ్చింది. తెలంగాణ కొన్ని తరాలు వేధన అనుభవించింది. ఈ చరిత్రంతా మన కళ్లముందే కనిపిస్తోంది. వాటిని తల్చుకుంటే ఇప్పటికీ నా కళ్లలో నీటి సుడులు తిరుగుతుంటాయని ముఖ్యమంత్రి కేసిఆర్‌ అన్నారు. సెప్టెంబర్‌ 17ను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ తెలంగాణ ప్రజలకు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరించి, ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కేసిఆర్‌ మాట్లాడుతూ ఎన్నటికీ తెలంగాణలో అశాంతి, అలజడులు రావొద్దు. కళ్లోలంలోకి జారి పోవద్దని తెలంగాణ సమాజానికి సూచించారు. ఎంత వేగంగా అభివృద్ధి సాధిస్తున్నామో, అంతే వేగంగా ప్రగతిని కొనసాగించాలన్నారు. జాతి నిర్మాణంలో తెలంగాణ పాత్ర గొప్పగా ఆవిషృతం కావాలి.అందుకు తెలంగాణ ఉజ్వల పాత్రను పోషించాలి. భారత జాతి సమైక్యత, సమగ్రత కోసం , అభ్యున్నతి కోసం మన వంతు కృషి చేద్దామని ముఖ్యమంత్రి కేసిఆర్‌ అన్నారు. పచ్చగా, ప్రశాంతంగా వున్న తెలంగాణలో మతోన్మాదశక్తులు పేట్రేగిపోతున్నాయి. సంకుచిత రాజకీయ శక్తులు కాచుకొని కూర్చున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చీలికకు దుష్టపన్నాగం పన్నుతున్నాయి. సామాజిక సంబంధాల మధ్య ముళ్ల కంపలు నాటుతున్నాయి. మనుషుల మధ్య విద్వేశపూరిత మంటలు రగిలిస్తున్నాయి. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో సమాజాన్ని కలుషితం చేస్తున్నాయి. జాతి జీవనాడిలో కలకలం రేపుతున్నాయి. మానవత్వాన్ని కబలించే కుట్రలు చేస్తున్నాయి. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలవాల్సిన సెప్టెంబర్‌ 17ను సైతం వక్రీకరిస్తున్నారు. చరిత్రను కలుషితం చేస్తున్నారు. విచ్చిన్న కరశక్తులుగా మారుతున్నారు. చిల్లర రాజకీయాల కోసం ప్రజల మధ్య దూరం పెంచే కుయుక్తులు పన్నుతున్నారు. ఘనమైన తెలంగాణ చరిత్రను వక్రీకరించే కుటిల రాజకీయం చేస్తున్నారు. తెలంగాణ త్యాగాలను సైతం మలినం చేస్తున్నారు. ఎంతో క్రియాశీలకమైన, చైతన్యవంతమైన మేధో సంపత్తి కల్గిన తెలంగాణ సమాజాం అప్రమత్తంగా వుండాల్సిన సమయమిది. జాతి జీవనాడిని తెంచేయాలని చూస్తున్న వారి పట్ల అప్రమత్తంగా వుండాలి. రెప్ప పాటు కాలం ఆదమర్చినా తెలంగాణ సమాజం కల్లోలంలోకి కూరుకుపోయే ప్రమాదం వుందని ముఖ్యమంత్రి కేసిఆర్‌ హెచ్చరించారు.ఒకసారి కాదు, మూడు సార్లు తెలంగాణ సమాజమంతా ఏకమై పోరాటం చేసిన చరిత్ర ప్రపంచంలో ఒక్క తెలంగాణదే. 

భూస్వాములకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ పోరాటంతోపాటు, ఇండియా జాయిన్‌ ఉద్యమం, 1969 ఉద్యమం, తర్వాత ముఖ్యమంత్రి కేసిఆర్‌ నేతృత్వంలో సాగిన ఉద్యమాల గురించి ముఖ్యమంత్రి ప్రస్తావిచారు. తెలంగాణ అస్తిత్వ, రైతాంగ పోరాటాన్ని ప్రారంభించిన రావి నారాయణ రెడ్డి నుంచి మొదలు కొని భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఎంతో మంది తెలంగాణ వీరులను ముఖ్యమంత్రి కేసిఆర్‌ స్మరించుకున్నారు. ఆదిలాబాద్‌లో జల్‌, జంగిల్‌, జమీన్‌ పేరుతో పోరాటం సాగించిన తెలంగాణ యోధుడు కొమరంభీమ్‌, వరంగల్‌ జిల్లాలో దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ పోరాటాలు గుర్తు చేశారు. తెలంగాణ స్టేట్‌ కాంగ్రెస్‌ ఏర్పాటు చేసి, జాయిన్‌ ఇండియా ఉద్యమానికి శ్రీకారం చుట్టిన రామానంద తీర్ధ రగిలించిన స్వాతంత్య్ర ఉద్యమాలను ప్రస్తావించారు. గ్రంధాలయ ఉద్యమంలో తెలంగాణ ప్రజల్లో చైతన్యం రగిలించిన మట్టి మనుషులు పుస్తకం రచయిత వట్టికోట అల్వారు స్వామితో చైతన్యం గురించి వివరించారు. తెలంగాణ టైగర్‌ నల్లా నర్సింహులు, భీమ్‌ రెడ్డి నర్సింహారెడ్డి వంటి యోధుల పోరాటాలను, త్యాగాలను ముఖ్యమంత్రి కేసిఆర్‌ గుర్తు చేశారు. వారి త్యాగాలను కొనియాడారు. వారి పోరాట స్పూర్తి రగిలించిన చైతన్యం మలి దశ తెలంగాణ ఉద్యమానికి ఎంత ఉపయోగపడిరదో చెప్పారు. తెలంగాణ ఉద్యమం కోసం తాను చేసిన పోరాటం గురించి వివరించారు. తానే స్వయంగా పూరించిన తెలంగాణ పోరాట శంఖం మరోసారి గుర్తు చేశారు. తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి, మరణం అంచుల వరకు వెళ్లి తెలంగాణ సాధించిన విధం ప్రజల కళ్లముందే వుందని గుర్తు చేశారు.

తెలంగాణ సాధించున్నాక తెలంగాణ రాష్ట్రంలో అమలౌతున్న ప్రగతిని ముఖ్యమంత్రి కేసిఆర్‌ వివరించారు. తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా పురోగమిస్తోతందని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి ముందు ప్రజలు ఏం కలలు గన్నారో, ఆ తెలంగాణ ఆవిషృతమౌతోందన్నారు. తెలంగాణ సిద్ధించిన తొలి ఏడాదిలోనే తెలంగాణలో చిమ్మచీకట్లను పారద్రోలిన, విద్యుత్‌ వెలుగులు నిండిన తెలంగాణ ఆవిషృతం గురించి వివరించారు. దేశానికే తెలంగాణ ఒక టార్చి బేరర్‌గా నిలిచిందన్నారు. తాగు, సాగు నీటిరంగంలో ఎదురైన సవాళ్లును తెలంగాణ ఎలా అధిగమించిందో చెప్పారు. ప్రజా సంక్షేమ రంగంలో తెలంగాణ దేశానికి ఎలా ఆదర్శంగా నిలుస్తుందో వివరించారు. పారిశ్రామిక, ఐటి, ఫార్మా రంగాలలో తెలంగాణ ఎన్ని అధ్భుతాలను సృష్టించిందో చెప్పారు. సంపదనను పెంచాలి.

ప్రజలకు పంచాలనే లక్ష్యంతో పేదిరిక నిర్మూలన, సమసమాజ నిర్మాణం పేరుతో సంక్షేమ రంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేసిన సంగతిని గుర్తు చేశారు. వ్యవసాయ రంగంలో అతి తక్కువ కాలంలో తెలంగాణలో ఆవిషృతమైన విజయం దేశానికే ఆదర్శమన్నారు. ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన ఆరు నెలల కాలంలో రైతాంగానికి 24 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేసిఆర్‌ అన్నారు. అంతే కాదు వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణే అని అన్నారు. అన్ని రంగాలకు 24 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కరువు కాటకాలతో తల్లడిల్లిన తెలంగాణలో నేడు సస్యశ్యామల తెలంగాణగా వర్ధిల్లుతోందని సిఎం అన్నారు. అనేక రైతు విధానాలను అమలు చేయడం వల్ల తెలంగాణలో కోటి ఎకరాల్లో సాగు సాగుతుండడం మనందరికీ గర్వకారణమన్నారు. పంటల దిగుబడి విపరీతంగా పెరిగి, తెలంగాణ సమృద్ధి రాష్ట్రంగా విలసిల్లుతోందన్నారు. విద్య, వైద్య రంగాలలో విప్లవాత్మకమైన మార్పులు తీసకొచ్చిన ఘనత కూడా మనదే అన్నారు. ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణమే కాదు, ఆరోగ్య రంగంలో తెలంగాణ అధ్భుతమైన ప్రగతిని సాధించిందన్నారు. ఇలా తెలంగాణ అన్ని రంగాల్లో అధ్భుతమైన ప్రగతితో దూసుకుపోతుంటే బిజేపి చేస్తున్న రాజకీయ కుయుక్తుల గురించి పరోక్షంగా ప్రస్తావించి ఆ పార్టీని తూర్పారపట్టాడు. అసలు తెలంగాణలో జాతీయ సమైక్యత ఆవశ్యకతను వివరిస్తూనే తెలంగాణ గురించి పూర్తి చరిత్రను ప్రజల ముందుంచారు. భూస్వాముల కాలం నుంచి పోరాట యోధులను పోరాటాలను గుర్తు చేస్తూ, ప్రజల్లో చైతన్యం నింపిన చైతన్య దీప్తిలాంటి నాయకుల సేవలు స్మరిస్తూ వచ్చారు. తెలంగాణ ఒక రాష్ట్రంగా వర్ధిల్లుతున్న సమయం నుంచి భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో తెలంగాణను ఆంధ్రలో కలపడం మూలంగా తెలంగాణకు జరిగిన నష్టం గురించి వివరించారు. 58 ఏళ్లపాటు పడిన కష్టాల గురించి, అనుభవించిన గోసల గురించి సిఎం. ఏకరుపెట్టారు. తర్వాత 1969లో ఉద్యమం, 2001 టిఆర్‌ఎస్‌ ఆవిర్భావం తర్వాత జరిగిన ఉద్యమాలను గుర్తుచేసుకున్నారు. తెలంగాణసాధించి సాగింగిన ప్రగతిని మన కళ్లముందు ఆవిష్కరించారు. బిజేపి చేస్తున్న రాజకీయ విన్యాసాలను కూడా వివరించారు. ప్రజలను అప్రమత్తంగా వుండాలని కూడా సూచించారు. చైతన్యం నిండిన తెలంగాణ సమాజాన్ని ఎవరూ మోసం చేయలేరని కూడా సిఎం చెప్పారు.

హనుమకొండ కాంగ్రెస్ భవన్ లో తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు

టిపిసిసి అధ్యక్షులు శ్రీ. రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేడు (17-09-2022) హనుమకొండ కాంగ్రెస్ భవన్ లో జాతీయ జెండా హనుమకొండ & వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ. నాయిని రాజేందర్ రెడ్డి గారు ఎగరవేశారు.*

 

అనంతరం ఈ సందర్భంగా శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ

1948, సెప్టెంబర్ 17న నిజాం నవాబు పాలిస్తున్న రాచరిక పాలన నుంచి హైదరాబాద్ రాష్ట్రానికి స్వాతంత్రం తెచ్చి తెలంగాణ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛ వాయువులు అందించడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర అత్యంత కీలకమని, బ్రిటిష్ రాచరిక పాలన ను అంతమొందించేందుకు జాతీయ కాంగ్రెస్ ప్రజా మద్దతుతో అనేక పోరాటాలు,

ఉద్యమాలు చేసి వందలాది మన మహా నేతలు నెలల తరబడి జైల్లో మగ్గి, సంవత్సరాల పాటు అలుపెరగని పోరాటాల ఫలితంగా బ్రిటిష్ పాలకులు 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు

దేశంలో అంతర్భాగంగా ఉన్న 560 సంస్థానాలను అప్పటి ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రు, అప్పటి హోమ్ శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ లు దేశంలో విలీనం చేసుకున్నారు. అలాగే అప్పట్లో మహారాష్ట్ర, కర్ణాటక లోని కొన్ని ప్రాంతాలతో కూడిన హైదరాబాద్ సంస్థానం కూడా దేశంలో విలీనం చేయాలని హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది. కానీ నిజాం సర్కార్, రజాకార్ల హైదరాబాద్ రాష్ట్రాన్ని స్వతంత్ర దేశంగా కానీ, పాకిస్తాన్ లో విలీనం అనే ప్రతిపాదనలు తెచ్చారు. అప్పుడు హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అత్యంత కీలకంగా వ్యవహరించి జాతీయ కాంగ్రెస్ నాయకులతో మన కాంగ్రెస్ నాయకులు రామనంద తీర్థ, జమలపురం కేశవరావు, బూర్గుల రామకృష్ణారావు తదితర మహా నాయకులు చర్చించి అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు, అప్పటి హోమ్ శాఖ మంత్రి సర్ధార్ వల్లభాయ్ పటేల్ లతో చర్చలు జరిపి ఆపరేషన్ పోలో ద్వారా హోమ్ శాఖ మంత్రి శ్రీ సర్ధార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ కి వచ్చి హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశం లో విలీనం చేసుకొని హైదరాబాద్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రాన్ని అందించారు.తర్వాత బాషప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు లో భాగంగా ఆంద్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక మూడు రాష్ట్రాలు ఏర్పడడంతో హైదరాబాద్ రాష్ట్రం మూడు భాగాలుగా విడిపోయి 10 జిల్లాల్లో తెలంగాణ గా, మూడు జిల్లాలు కర్ణాటక, మూడు జిల్లాలు మహారాష్ట్రలో కలిసిపోయాయి. తర్వాత 60 ఏళ్లపాటు మళ్ళీ 10 జిల్లాలతో కూడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలయిందని ఆ ఉద్యమాన్ని కూడా కాంగ్రెస్ గౌరవించి 10 జిల్లాలతో కూడిన ప్రత్యేక తెలంగాణ ను కూడా కేంద్రంలోని శ్రీమతి సోనియా గాంధీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2014 లో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్ధాలను నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీ ఇలా దేశానికి స్వాతంత్రం తెచ్చింది,

హైదరాబాద్ రాష్ట్రానికి స్వేచ్ఛ వాయువులు అందించి రజాకార్ల నుంచి విముక్తి అందించిందని తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.

ఇంత గొప్ప ప్రజాసరాలను తీర్చిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న పెద్దఎత్తున కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేయాలని నేడు టిఆర్ఎస్ బిజెపి పార్టీలు చేస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు ఈ దేశానికి రాష్ట్రానికి స్వాతంత్రం ప్రజలకు స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని అందించిన కాంగ్రెస్ పార్టీ చరిత్రను ఎవరు అపహాస్యం చేయాలని చూసిన ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు.

 ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య గారు మాజీ నగర మేయర్ శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ గారు మహ్మద్ అయూబ్ బంక సరల బొమ్మతి విక్రం అజీజుల్లా బేగ్ పెరమాండ్ల రామకృష్ణ బంక సంపత్ యాదవ్ పులి రాజు అంకూస్ రాహుల్ రెడ్డి సతీష్ సారంగం రమేశ్ తదితరులు పాల్గొన్నారు

ఎస్ ఆర్ యూనివర్సిటీలో ప్రారంభమైన “డిజైన్ నౌ” సదస్సు

హనుమకొండ జిల్లా, నేటిధాత్రి: హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలంలోని అనంతసాగర్ ఎస్ ఆర్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఐ సి టి అకాడమీ సహకారంతో శుక్రవారం రోజున మూడు రోజుల వర్క్ షాప్ డిజైన్ నౌ ప్రారంభమైంది ఈ వర్క్ షాప్ ముఖ్యఅతిథి అండ్ రిసోర్స్ పర్సన్ కె కళ్యాణి సదస్సును ప్రారంభించింది .అనంతరం ఆమె మాట్లాడుతూ మెకానికల్ కాంపోనెంట్ మోడలింగ్ అండ్ డిజైన్ ఎంతో ప్రాధాన్యతతో కూడిన అంశమని ఫ్యూషన్ 360 సాఫ్ట్వేర్ అందుకు ఉపయోగపడుతుందన్నారు. షేక్ గౌస్ పాషా రిలేషన్ మేనేజర్ ఐ సి టి అకాడమీ మాట్లాడుతూ ఐ సి టి అకాడమీ ఎన్నో కోర్సులను అందిస్తుందని విద్యార్థులకు నూతనంగా సంకేతిక అంశాలను అందిస్తుందని ఆయన తెలిపారు. అలాగే డాక్టర్ వినోద్ వెంకటేశ్వరన్ మెకానికల్ ఇంజనీరింగ్ హెడ్ మాట్లాడుతూ 100 మంది విద్యార్థులు హాజరవుతున్నారని విద్యార్థులకు మెకానికల్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ ఎంతో అవసరమని అన్నారు ఈ సదస్సుకు బి రాజేష్ కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నారు. 5 శేషంట్స్ ద్వారా విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు.. ఈ శిక్షణ విద్యార్థులు సద్విగనం చేసుకోవాలని మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అండ్ ఐ సి టి అకాడమీ కోరారు..

చీడ వదిలింది!

`ఈ మాటలంటోది ఎవరో కాదు స్వయానా ఉద్యోగులే?

`మనోహర్‌ స్థానంలో రామ్మూర్తికి అదనపు బాధ్యతలు

` కొత్త డైరెక్టర్‌ ఎంపికపై సెర్చ్‌ కమిటీ ఏర్పాటు!

`అల్పుడిని అందలమెక్కిస్తే అంతా మెక్కేసాడు?

` నిమ్స్‌ పరువు తీశాడు?

`ఇన్సిట్యూట్‌ను భ్రష్టు పట్టించాడు?

`నిధులు నీళ్లలా ఖర్చు చేశాడు?

`ప్యాచ్‌ వర్కులు చేసి పైసలను పుట్కాలు బుక్కినట్లు బుక్కాడు?

`మొదటి నుంచి నేటిధాత్రి హెచ్చరిస్తూనే వుంది!

`నిమ్స్‌ను ఆగం చేస్తున్నాడు చూడండని ఎన్నో సార్లు మొత్తుకున్నాం?

`నేటిధాత్రి చెప్పిందే నిజమైంది?

`నేటిధాత్రి నాలుగేళ్ల అక్షర పోరాటం…విజయం!

`నిమ్స్‌ కే మరకతెచ్చిపెట్టాడు…నమ్మకాన్ని నిండా ముంచాడు?

`ఇప్పటికైనా మనోహర్‌ అక్రమాలు తవ్వితేనే మేలు?

`భవిష్యత్తులో నిమ్స్‌ సొమ్ము ఎవరు తినాలన్నా జంకుతారు?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

చెప్పిందే నిజమైంది. ప్రభుత్వం తనపై వేటు వేసేందుకే మనోహర్‌ ప్రైవేటులో చేరారని చెప్పింది. ఉద్యోగులు కూడా అదే వాస్తవమని కూడా చెబుతున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్‌రావు బాధ్యతలు చేపట్టిన తర్వాత నిమ్స్‌పై డైరెక్టర్‌ మనోహర్‌పై వస్తున్న ఆరోపణలు, విమర్శలపై దృష్టిపెట్టినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన మనోహర్‌ ఇక తప్పుకోవడమే మేలు అన్న నిర్ణయానికి వచ్చి, సానుభూతికోసం ప్రయత్నం చేశాడు. గుండె చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. కాని ఒక ప్రతిష్టాత్మకమైన అటానమస్‌ హెల్త్‌ ఇన్సిట్యూట్‌కు డైరెక్టర్‌ అన్న సంగతి మర్చిపోయినట్లున్నారని తిట్టుకునేలా చూసుకున్నారు. నిమ్స్‌లో కాదని ప్రైవేటు ఆసుపత్రిలో చేరి, ఆ వ్యవస్ధకు చెడ్డపేరు తెచ్చారని జనం మాట్లాడుకుంటే వెంటనే ఆ పదవి నుంచి తనను తప్పిస్తారని కూడా ఆయనకు తెలుసు. కాగలకార్యం గంధరవ్వులే తీర్చుతారని తెలిసి, తెలిసి గుండె నొప్పి చికిత్స చేయించకున్న మనోహర్‌ను ప్రభుత్వం పక్కన పెట్టింది. ఆయన స్ధానంలో ఎట్టకేలకు డీన్‌ రామ్మూర్తికి అదనపు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. పూర్తి స్ధాయి డైరెక్టర్‌ను నియమించేందుకు అవసరమైన సెర్చ్‌ కమిటీని కూడా ప్రభుత్వం ప్రకటించింది. త్వరలో కొత్త డైరక్టర్‌ నియామకం జరిగనున్నది. అయితే అప్పటి వరకు రామ్మూర్తి తాత్కాలిక డైరెక్టర్‌గా విధులు నిర్వహించనున్నారు. ఒక వ్యవస్ధను నిర్వహించాల్సిన వ్యక్తికి ఎంత అంకిత భావం వుండాలి. 

ఎంత ఆదర్శవంతమైన నిర్వహణ కావాలి. ఆ వ్యవస్ధ మహోన్నత చరిత్రను కాపాడే పాత్ర పోషించాలి. దాని గొప్పదనం ద్విగుణీకృతమయ్యేందుకు తోడ్పడాలి. అందుకు ఎంతో కృషి చేయాలి. తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఆ వ్యవస్ధను మరింత పటిష్టం చేసే దిశగా పనిచేయాలి. దానికి మరింత పేరు తెచ్చేదిగా ఆ వ్యక్తి పని తనం వుండాలి. కార్యశుద్ధి కావాలి. తన హాయం కూడా ఎంతో గొప్పదని భవిష్యత్తు తరం చెప్పుకునేదిగా వుండాలి. తన కాలాన్ని ఆదర్శంగా తీసుకొని ముందు తరాల వాళ్లు మరింత గొప్పగా ఆ వ్యవస్ధను తీర్చిదిద్దేలా వుండాలి. మరి నిమ్స్‌ డైరెక్టర్‌గా ఇంత కాలం పనిచేసిన మనోహర్‌ ఈ విషయాలన్నింటికీ గాలికి వదిలేశాడని అంటున్నారు. అంతే కాదు అందులో పనిచేసే సిబ్బంది అంతా తిట్టుకుంటున్నారు. ఎంతలా అంటే ఇంత కాలం నిమ్స్‌కు పట్టిన చీడ వదిలిపోయిందంటున్నారు. నిమ్స్‌కు పట్టిన పీడ వదిలిపోయిందని కూడా అంటున్నారు. ఇలా నిమ్స్‌ చరిత్రలో ఇన్ని రకాల మాటలు పడుతున్న డైరెక్టర్‌ మరొకరు లేరు. తెలంగాణ వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం ఎంతో నమ్మకంతో మనోహర్‌ను నిమ్స్‌ డైరెక్టర్‌గా నియమించింది. నిజానికి నిమ్స్‌ డైరెక్టర్‌ అంటే సమయాన్ని బట్టి వైద్యం చేయాలి. పరిపాలన చేయాలి. విద్యార్దులకు పాఠాలు కూడా బోధించాలి. ఇలా అనేక రకాల డైమన్షన్లు ఆ డైరెక్టర్‌లో వుండాలి. తెలంగాణ వచ్చాక నిమ్స్‌ చరిత్రను మరింత ద్విగుణీకృతం చేసేందుకు అంకితమైన భావం వున్న వ్యక్తి వుంటే చాలని అందరూ అనుకున్నారు. అలాగే ప్రభుత్వం కూడా అనుకున్నట్లుంది. మనోహర్‌ను డైరెక్టర్‌గా నియమించింది. 2015 ఆగష్టులో మనోహర్‌ నిమ్స్‌ డైరెక్టర్‌ అయ్యాడు. కొత్తగా వచ్చిన రాష్ట్రం కావడంతో అన్ని రకాల రంగాలు, అన్ని రంగాల ప్రజలు, అన్ని తరగతుల వ్యవస్ధలను తీర్చిదిద్దుకొవాల్సిన సమయంలో ప్రభుత్వం కొన్ని సార్లు కొందరు అధికారుల మీద విమర్శలు వచ్చినా పెద్దగా పట్టించుకోలేదు. ఇదే అలాంటి వారికి వరమైపోయింది.అలాగే మనోహర్‌కు కూడా ఉపయోగపడిరది. పైగా వారి పదవీ కాలాలు పొడిగించుకునేందుకు వీలు పడిరది. ఇదే నిమ్స్‌కు శాపమైంది. నేటిధాత్రి గత నాలుగేళ్లుగా నిమ్స్‌లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై అక్షర శంఖం పూరించి, ప్రతి విషయాన్ని గురించి ప్రభుత్వం దృష్టికి తెచ్చే ప్రయత్నం చేసింది. 

ఎప్పటికప్పుడు అందిన సమాచారం మేరకు కొన్ని పదలు సంఖ్యలో వార్తలు ప్రచురించింది. అయినా మనోహర్‌ లీలలు ఆగలేదు. దోపిడీ ఆపలేదు. ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆశాఖ కదల్లేదు. ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. నేటిధాత్రి చెప్పిన విషయాలను కూడా ప్రతిపక్షాలు చెప్పినట్లు కొట్టిపారేసుకున్నది. ఇప్పుడు అవే నిజమయ్యాయి. మనోహర్‌మీద నిమ్స్‌లో ఎంత వ్యతిరేకత వుందో ఇప్పుడిప్పుడే ప్రభుత్వానికి కూడా తెలిసివచ్చింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా హారీష్‌రావు వచ్చిన తర్వాత మనోహర్‌కు చురుకు తగిలినట్టు తెలుస్తోంది. నిమ్స్‌లో జరుగుతున్న అవకతకల మూలంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా వుంది. ఇది గమనించిన మంత్రి హరీష్‌రావు గత ఆరేళ్లుగా నిమ్స్‌లో ఏం జరుగుతోందన్న దానిపై దృష్టిపెట్టినట్లు సమాచారం. ఎలాగైనా తన కమ్మ చిరిగేలా వుందన్న సంగతి తెలిసిన మనోహర్‌ కొత్త నాటకానికి తెరతీసినట్లు ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. ఈ ఆరేళ్ల కాలంలో మనోహర్‌ కొన్ని వందల కోట్లు దుర్వినియోగం చేసినట్లు కూడా అనేక ఆరోపణలున్నాయి. అన్ని కోట్లు ఖర్చు పెట్టినా కొత్తగా జరిగిన నిర్మాణాలు లేవు. కొత్త భవనాలు లేవు. పాత భవనాలు కూల్చికొత్తవి కట్టిన ధాఖలాలు లేవు. కాని మరమ్మత్తుల మాత్రం బోలెడున్నాయి. రంగులకు లెక్కెలేదు. పనిచేయలని ఫ్యాన్ల స్ధానంలో కొత్తవి కొనలేదు. పాతవాటికే నాలుగింతల ఖర్చు చేసి మరమ్మత్తులు చేసినట్లు చెప్పుకుంటున్నారు. ఇలా అవకాశం వున్న ప్రతి చోట మరమ్మత్తులు చేయడంలోనే మరిన్ని నిధులు మింగొచ్చన్న కొత్త విధానం మనోహర్‌ కనుక్కున్నారని అంటున్నారు. అందుకు తన సోదరుడినే ఏకంగా నిమ్స్‌ నిర్మాణాల పర్యవేక్షణలో నియమించుకున్నారని ఉద్యోగులు చెప్పుకునే మాట. అల్పుడిని అందలమెక్కిస్తే అంతా దోచేశాడు..లూటీ చేసి, మెక్కేశాడని ఉద్యోగులు కథలు కధలుగా చెప్పుకుంటున్నారు.

ఎంతో ప్రతిష్టాత్మకమైన నిమ్స్‌పై ప్రజల్లో వున్న నమ్మకాన్ని తుంచేశాడని అంటున్నారు. గతంలో సామాన్యులతోపాటు, విఐపిలకు కూడా నిమ్స్‌లోనే చికిత్సలు జరిగేవి. ఎంత పెద్ద మేజర్‌ ఆపరేషన్లైనా నిమ్స్‌లోనే చేసేవారు. దేశంలోని అనేక రాష్ట్రాలనుంచి కూడా నిమ్స్‌కు వచ్చి వైద్యం చేయించుకుంటారు. అంత నమ్మకమైన ఇన్సిట్యూట్‌ అది. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసిఆర్‌ కూడా నిమ్స్‌లోనే దీక్ష చేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌కు వైద్య పర్యవేక్షణ నిమ్స్‌లోనే జరిగింది. అంతే కాదు గతంలో మంత్రులైనా, ముఖ్యమంత్రులైనా సరే వారికి ఏదైనా అత్యవసర చికిత్సలన్నీ నిమ్స్‌లోనే జరిగేవి. కాని డైరెక్టర్‌ మనోహర్‌ అయ్యాక, పరిస్దితి మారిపోయింది. అనేక వివాదాలకు నిమ్స్‌ వేధికైంది. ప్రజలు నిమ్స్‌ వైపు చూడకుండా కార్పోరేట్‌ ప్రైవేటు ఆసుపత్రుల వైపు చూసేలా నిమ్స్‌ ప్రతిష్ట దెబ్బతీశాడు. అదే సమయంలో తాను కూడా ప్రైవేటులో చేరి, నిమ్స్‌కు వున్న ఆ మాత్రం క్రెడిబిలిటీని కూడా దెబ్బతీసే ప్రయత్నం చేశాడు. అందువల్ల అలాంటి డైరెక్టర్‌ పదవిలో కొనసాగడం ప్రజలు కూడా హర్షించడం లేదు. గత నాలుగేళ్లుగా నిమ్స్‌ డైరెక్టర్‌ మనోహర్‌ మీద అక్షర యుద్దం ప్రకటించిన నేటిధాత్రి ఎట్టకేలకు అక్షర విజయం సాధించిందనే చెప్పాలి. ఎందుకంటే ఆది నుంచి నిమ్స్‌లో జరిగే అవకతకలన్నీ బైట పెట్టింది నేటిధాత్రి మాత్రమే. ఒక రకంగా చెప్పాలంటే నిమ్స్‌లోని ప్రతి ఉద్యోగి కూడా నిమ్స్‌కు సంబంధించిన వార్తలు ఏవైనా నేటిధాత్రిలో వచ్చాయా? అని పత్రికను చూస్తాయంటే అతిశయోక్తి కాదు. నమ్మినందుకు నిమ్స్‌ ప్రతిష్టను గంగపాలు చేసిన మనోహర్‌ చేసిన అక్రమాలపై విచారణ జరపాలని ప్రజలు కోరుతున్నారు. భవిష్యత్తులో నిమ్స్‌లో అక్రమాలకు పాల్పడకుండా, నిమ్స్‌ సొమ్ము తినాలన్నా జంకేలా ప్రభుత్వ చర్యలు వుండాలని కోరుతున్నారు.

కదిలిస్తున్న కేసిఆర్‌ రగిలిస్తున్న రాహుల్‌

`రాజకీయ పార్టీల ఐక్యం కోసం కేసిఆర్‌

`ప్రజల్లో చైతన్యం కోసం రాహుల్‌…

`సామాన్య బాగోగుల కోసం కేసిఆర్‌..

`యువ నాయకత్వం కోసం రాహుల్‌…

`దేశమంతా తెలంగాణ పథకాల అమలు చేయాలని కేసిఆర్‌

`ధరల భారం తగ్గిస్తామంటున్న రాహుల్‌…

`కొత్త రాజకీయ శక్తిగా కేసిఆర్‌…

`త్యాగాలను గుర్తు చేస్తూ రాహుల్‌…

`సంక్షేమ రాజ్య నిర్మాణం కోసం కేసిఆర్‌….

`పాదయాత్ర ను నమ్ముకుంటున్న రాహుల్‌.

`ఇద్దరి రాజకీయం ఒకటే…

`దారులు వేరు…

`కారు, కాంగ్రెస్‌ కలిస్తే ఎప్పటికైనా తిరుగుండదు.

 హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఒకరు ఉత్తరాదినుంచి రాజకీయ పార్టీలను కదిలిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి కేసిఆర్‌. మరొకరు దక్షిణాదినుంచి ప్రజల్లో రాజకీయం చైతన్యం కోసం పాదయాత్ర చేపట్టారు. ఆయన రాహుల్‌ గాంధీ. ఇద్దరూ కలిసి బిజేపి ముక్త్‌ భారత్‌ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ గత ఎన్నికల ముందే దేశంలో ప్రత్నామ్నాయ రాజకీయ శక్తి కావాలన్నారు. అందుకు అవసరమైన ప్రణాళిక తానే మొదలు పెడతా! అన్నారు. అన్నట్లుగానే ఆయన ఇప్పటికే దేశమంతా తిరుగుతున్నారు. వీలు చిక్కినప్పుడల్లా దేశంలో క్రియాశీలక పాత్ర వహిస్తున్న నాయకులను కలుస్తున్నారు. దేశ రాజకీయాలపై చర్చిస్తున్నారు. బిజేపి ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువుపెడుతున్నాడు. బిజేపి తప్పులను ఎత్తు చూపుతున్నాడు. ప్రజల్లోనే ఎండగడుతున్నాడు. అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అన్నట్లు బిజేపి కేంద్ర ప్రభుత్వం ప్రజల మేలు కన్నా, ప్రధాని మోడీ అనుయాలకు దేశాన్ని దోచి పెడుతున్నారని విరుచుకుపడుతున్నాడు. దేశం నుంచి బిజేపిని పారద్రోలితే గాని ప్రజలకు విముక్తి కాదని కేసిఆర్‌ చెబుతున్నాడు. పేద ప్రజల నుంచి ముక్కు పిండి జిఎస్టీల పేరుతో ఉప్పు , పప్పు, పాలు, పెరుగు మీద, ఆఖరుకు స్మశాన వాటికల వినియోగం మీద కూడా పన్నుల మీద పన్నులేసి సామాన్యుల నడ్డి విరుస్తున్నారని విరుచుకుపడుతున్నాడు. అలా వసూలు చేస్తున్న సొమ్మును షావుకార్లు పాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. పేద ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలు దేశానికి భారం అంటూ, షారుకార్లు రుణపడిన బ్యాంకు రుణాలు మాఫీ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ప్రజలపై మోయలేని బారాన్ని మోపుతున్న బిజేపి సర్కారును గద్దెదించితే తప్ప ప్రజలకు మోక్షం లేదని అంటున్నాడు. దేశంలో బిజేపి వివక్షపూరితమైన రాజకీయాలు చేస్తోందని కేసిఆర్‌ మండిపడుతున్నాడు. విషం చిమ్మే కుయుక్తులను నమ్ముకొని, ప్రజల బలహీనతలను ఆసరా చేసుకొని బిజేపి రాజకీయాలు చేస్తోందంటున్నాడు. ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని దుయ్యబడుతున్నాడు. బిజేపి మతం చుట్టు రాజకీయాలను పరిభ్రమింపజేస్తోందని, అది దేశానికి ఏమాత్రం మంచిది కాదని హితవు పలుకుతున్నాడు. బిజేపి ధర్మం వల్లిస్తూ పేదలను వంచిస్తున్న బేజేపి ముక్త్‌ భారత్‌ జరగాలని, దేశంలో సంక్షేమ రాజ్య స్ధాపన జరగాలని కేసిఆర్‌ కోరుకుంటున్నారు. రైతు రాజ్యం రావాలని రాజకీయ పార్టీలను ఏకం చేస్తున్నాడు. ప్రభుత్వ రంగ సంస్ధలు, ఆస్ధులను అమ్ముతూ, ప్రాంతీయ పార్టీల మనుగడును చిదిమిస్తే, మిధ్యగా వుండాల్సిన కేంద్రం పెత్తనం పేరుతో బీజేపీ దేశ రాజకీయాలను భ్రష్టుపట్టిస్తోందని కేసిఆర్‌ రాష్ట్రాలు తిరిగి పార్టీలకు ప్రజలకు వివరిస్తున్నారు.

రైతు జీవితాలతో ఆడుకున్న ప్రభుత్వాలు మనుగడ సాధించలేదని చెబుతున్నాడు. రైతుకు అన్యాయం చేసిన వారు చరిత్ర హీనులౌతారని హెచ్చరిస్తున్నాడు. రైతుక్షేమం కాంక్షిన వారికే ఈదేశంలో, భారత చరిత్రలో చోటు అని గుర్తు చేస్తున్నాడు. ప్రజావ్యతిరేక, పేదల వ్యతిరేక బిజేపిని తరిమికొట్టడమే కాదు, మళ్లీ దేశంలో సంక్షేమ రాజ్య నిర్మాణంకోసం ప్రాంతీయ పార్టీలు ఏకమైన రాష్ట్రాల హక్కులను కాపాడుకోవాలని కోరుకుంటున్నారు. ఆ దిశగా కేసిఆర్‌ అడుగులు వేస్తున్నాడు. అంతే కాదు తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు, విజయవంతంగా పూర్తి చేసిన కార్యక్రమాలు, ప్రాజెక్టుల నిర్మాణాలు, మంచినీటి సౌకర్యాలు, చెరవుల పునరుద్దరణ, పేదింటి అమ్మాయిల పెళ్లికి భరోసా, పెద్దలకు పెద్దకొడుకుగా అండగా నిలిచే ఆసరా వంటి పధకాలన్నీ దేశం మొత్తం అమలు కావాలని కోరుకుంటున్నారు. ఆకలి కేకలు లేని సమాజ నిర్మాణం జరగాలి. పేద, పెద్ద అన్న ఆర్ధిక అంతరం తొలగాలి. రైతు రాజు కావాలి. పాడి, పంట మళ్లీ పూర్వపు రోజులు చూడాలి. రైతు సంతోషంగా వర్ధిల్లాలి. ప్రజలకు ఆహార భద్రత కలగాలి. సాగుకు అనుబంధ రంగాలన్నీ మళ్లీ పుంజుకోవాలి. ఆహార ఉత్పత్తులో స్వయం సమృద్ధి సాధించాలి. విద్య, వైద్య రంగాల్లో వినూత్నమైన మార్పులు రావాలి. ప్రతి పేద వారికి మెరుగైన ఉచిత వైద్యం అందుబాటులోకి రావాలి. రైతుకు రైతు బంధు వంటి చేయూత అందాలి. మెరుగైన సమాజామే కాదు, ఉన్నతమైన సమాజం నిర్మాణం కావాలి. ఇది కేసిఆర్‌ లక్ష్యం. అందుకోసం జాతీయ రాజకీయాలలోకి కేసిఆర్‌ ఆగమనం…అందులో భాగంగా ఆయన పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీతో రెండు సార్లు సమావేశమయ్యారు. రాజకీయాలు చర్చించారు. ఏకతాటిపైకి ప్రాంతీయ పార్టీల రాజకీయాలు రావాలని కోరారు. అలాగే బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ను కలిశారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్‌ తాఖరేతోపాటు, రాజకీయ కురువృద్దుడైన శరద్‌ పవార్‌తోను కూడా సిఎం. కేసిఆర్‌ కలిశారు. అలాగే కర్నాటకకు చెందిన మాజీ సింఎం. కుమార స్వామితో పలు మార్లు చర్చలు జరిపారు. బెంగుళూరు వెళ్లి మాజీ ప్రధాని దేవేగౌడతో కూడా సమావేశమయ్యారు. తమిళనాడు సిఎం. స్టాలిన్‌తో అనేక దఫాల చర్చలు జరిపారు. ఉత్తర ప్రదేశ్‌ మాజీ సిఎం. అఖిలేష్‌ యాదవ్‌తో అనేక సార్లు బేటీ జరిగింది. దేశంలో ఏడాదిన్న కాలం పాటు ఉద్యమాలు చేసి, ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు పంజాబ్‌ వెళ్లారు. వారికి తెలంగాణ ప్రభుత్వం తరుపున ఆర్ధిక సాయం అందించారు. రైతు నాయకులతో మాట్లాడారు. వారిని తెలంగాణకు ఆహ్వానించి, మూడు రోజుల పాటు ప్రగతి భవన్‌లో చర్చలు జరిపి, రైతుల కోసం ఏం చేస్తే బాగుంటుందన్నదానిపై బ్లూప్రింట్‌ తయారు చేశారు. ఇలా కేసిఆర్‌ తన జాతీయ రాజకీయాల రూట్‌ మ్యాప్‌ తయారు చేస్తున్నారు. దసరా తర్వాత కొత్త రాజకీయ పార్టీ ప్రకటించేందుకు కూడా సన్నద్దమౌతున్నారు. దక్షిణాధి నుంచి పాదయాత్ర మొదలు పెట్టిన రాహుల్‌గాంధీ ప్రజల్లో చైతన్యం నింపే ప్రయత్నం మొదలు పెట్టారు.

ప్రజలంటే ఆయనకు, ఆయన కుటుంబానికి ఎంత ప్రేమో ఆయన చెరగని చిరునవ్వులో చూపిస్తున్నారు. ప్రజలందరి చెంతకు వెళ్తున్నారు. పాదయాత్రలో అందరితోనూ కలుపుగోలుగా వుంటున్నారు. పాదయాత్ర అన్నది దేశ రాజకీయాల్లో ఒక క్రియాశీలకమైన ఘట్టమనే చెప్పాలి. దేశ స్వాతంత్య్రం కోసం మొదలైన పోరాటంలో ఉప్పు సత్యాగ్రహగంతో పాదయాత్రల పర్వం మొదలైందనే చెప్పాలి. గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమం నుంచి దండి వరకు సుమారు నెల రోజులకు పైగా మహాత్మాగాంధీ సాగించిన ఉప్పు సత్యాగ్రహం పాదయాత్ర దండికి చేరుకునే సరికి జన ఉప్పెనగా మారింది. ఎక్కడిక్కడ ఉప్పు తయారీ జరిగింది. అదీ పాదయాత్ర పవర్‌ అని ఆనాడే తేలిపోయింది. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్ర పవరేమిటో తెలిసింది. దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మొదలుపెట్టిన పాదయాత్రతో రాజకీయాలను పూర్తిగా ప్రభావితం చేయొచ్చని తెలిసింది. అయితే ప్రజాసమస్యల పరిష్కారానికి మాత్రమే పాదయాత్రలు గతంలో జరిగేవి. కాని రాజకీయాల మార్పు, ప్రభుత్వాల మార్పు కు కూడా పాదయాత్ర తోడ్పడుతుందని తేలింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి జగన్‌, ఆయన సోదరి షర్మిల, ప్రస్తుతం బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్‌ సాగిస్తున్న పాదయాత్రలు కూడా చెప్పుకోవచ్చు. అయితే తెలంగాణలో కృష్ణానదీ జాలల కోసం అందరికంటే ముందే తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాదయాత్ర చేసిన సందర్భం తెలంగాణలో వుంది. ఇప్పుడు అదే స్పూర్తితో రాహుల్‌ గాంధీ కన్యా కుమారి నుంచి కాశ్మీర్‌ వరకు సాగనున్న జోడో యాత్ర మాత్రం కాంగ్రెస్‌కు మళ్లీ పునరుజ్జీవం కల్పిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. మన దేశ మీడియా రాహుల్‌ గాంధీ పాదయాత్రను పట్టించుకోకపోయినా, ప్రజలు పట్టించుకుంటున్నారు. రాహుల్‌ పాదయాత్రకు ప్రజలు తండోప తండాలుగా తరలివస్తున్నారు. ఎంతో సింపుల్‌గా వుండే రాహుల్‌ గాంధీ ఆహార్యం, ప్రజల్లో ఆయన మమేకమౌతున్న విధానం, పాదయాత్రల్లో హడావుడి కాకుండా, కంటైనర్లలో బస చేయడం వంటి సింప్లీ సిటీ వ్యవహారం ప్రజలను ఎంతో ఆకర్షిస్తోంది. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు రాహుల్‌ గాంధీ పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్‌కు ఎంతో ప్రయోజనం చేకూర్చుతుంది. పార్టీ బలోపేతానికి తోడ్పడుతుంది. చరిత్రలో రహాల్‌ గాంధీకి కూడా చోటు దొరినట్లే అన్నది తేలిపోతోంది. ఎందుకంటే దేశ రాజకీయాల పరంగా చూస్తే పాదయాత్ర అన్నది ప్రస్తావిస్తే రాహుల్‌ గాంధీ గుర్తుకొస్తారని చెప్పడంలో సందేహం లేదు. దేశమంతా పాదయాత్ర అన్నది అంత ఆషామాషీ వ్యవహరం కాదు. కాంగ్రెస్‌లో కొత్త రక్తం, యువ రక్తం రాబోతోందని చెప్పడానికి ఇదే సంకేతం…భవిష్యత్తు కాంగ్రెస్‌దే అని చెప్పడానికి కూడా ఇదొక నిర్వచనం. ..మళ్లీ కాంగ్రెస్‌ పునర్వైభవానికి శ్రీకారం.

ఆసరాకు ఆధార్‌ దందా!

`వయస్సు పెంచమంటావా నాయనా!!

`తహసీల్దారు కార్యాలయాలే అడ్డా…!

`ఆసరా పెన్షన్ల పేరుతో దళారులతో కలిసి ఉద్యోగుల అడ్డగోలు దందా?

`తహసీల్దారుల అండ…కార్యాలయ సిబ్బందికి పండగే పండగ.

`తహసీల్దారు లాగిన్‌ ఐడి ఉద్యోగుల చేతికి, తంతు పూర్తి కాగానే పాస్‌ వర్డ్‌ కొత్తది…

`తహసీల్దారు కార్యాలయాల్లో సరి కొత్త ఆదాయమార్గం…

`ఆధార్‌ కార్డుల్లో వయస్సు పెంపులు 

`ఆధార్‌లో వయస్సు మార్పుకు మినిమమ్‌ నాలుగువేలు..

 

`అవసరాన్ని బట్టి ఎన్ని సంవత్సరాలు కలిపితే అన్ని రెండు వేలు అదనం.

`తెలంగాణ వ్యాప్తంగా తహసీల్దారు కార్యాలయాల్లో నిత్యం ఇదే పని…

`కొత్త ఆసరా లబ్ధిదారుల అప్లికేషన్లు కోసం అధికారుల అవినీతి.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

సక్రమంగా సంపాదించాలనుకునేవారికి అవకాశాలు కరువు. అడ్డగోలు సంపాదనకు మరిగిన వారికి ఊరంతా అరువు అని ఓ సామెత. ప్రజలు మభ్యపెట్టి, మాయ చేసి, ఆశచూపి, ప్రభుత్వాలను మోసం చేసి, తన పబ్బం గుడుపుకునే వాళ్లు ఎక్కువయ్యారు. అవినీతి అధికారులు వారికి తోడౌతున్నారు.ప్రజలను తోడేళ్లలా తోడేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను బురిడీ కొట్టించే పనులు చేస్తున్నారు. అందిన కాడికి దండుకుంటున్నారు. లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. అక్రమ మార్గాలను అన్వేషిస్తున్నారు. ప్రజల బలహీనతలతో ఆడుకుంటున్నారు. మోసం, నమ్మక ద్రోహమే భుక్తిగా చేసుకొని దళారీ అవతారంతో బతుకు వెళ్లదీస్తున్నారు. దర్జా వెలగబెడుతున్నారు. వారిని నమ్మిన పాపానికి అమాయకులు నేరస్ధులను చేస్తున్నారు.

నెల నెల వేలాది రూపాయలు జీతం తీసుకునే అధికారులు కూడా అలాగే తయారౌతున్నారు. అక్రమార్కులకు సహకరిస్తున్నారు. రాజకీయ ముసుగులో వున్న కొందరు దళారులకు అధికారులు కొమ్ముకాస్తున్నారు. వారికి ఆత్మీయులౌతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలనే అడ్డాలుగా చేసుకొని అడ్డగోలు సంపాదనను తెగబడి అడ్డదిడ్డంగా సంపాదించుకుంటున్నారు. మీకింత, మాకింత అనుకుంటూ వాటాలు పంచుకుంటున్నారు. పెద్దమనుషుల్లా చెలామణి అవుతున్నారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు అమాయకులను చేసి ప్రజలకు లేని పోని ఆశలు కల్పించి, వారి నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని ఆసరా పింఛన్లు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో ఇదే అదునుగా కొందరు దళారులు దందా మొదలుపెట్టారు. అందుకు తహసిల్థార్‌లు సహకరిస్తున్నారు. కార్యాలయంలోని ఉద్యోగులు , కాంపూటర్‌ ఆపరేటర్లు ఈ కార్యాలు చేసి పెడుతున్నారు. ఆధార్‌ కార్డులలో వయసు ఎక్కువ చేసి, ఆసరాకు దరఖాస్తుచేసుకునే వెసులుబాటు చేస్తున్నారు. ఇలా తెలంగాణలో ఇప్పటికే కొన్ని వేల మందికి ఆధార్‌లలో మార్పులు చేయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఓ పెద్దవ్వ నీకు ఫించన్‌ వస్తుందా? 57 ఏండ్లున్నొళ్లకే ఒస్తది కదా? నీ ఆధార్‌ కారట్‌లో ఎంతున్నవని వుంది? ఎమ్మె బిడ్డ…తీసుకరాపో…సూత్త…ఇగో…మూడేండ్లు తక్కువుంది…ఆ మూడేండ్లు కలిపితే అయిపాయే…నీకు పింఛన్‌ వస్తది…గట్లేట్ల చేత్తరు బిడ్డ…నేం చేపిత్త…మరి కర్సయితది పెట్టుకుంటువా? ఫించన్‌ వస్తదంటే పైసలిత్త? ఎంత? ఐదు వేలు…! గంతనా? వుత్తగనే అయితదా? ఎమ్మార్వోకియ్యాలే…ఆఫీసుల పనిజేసెటోల్లకియ్యాలే…వుట్టిగనే అయితదా పెద్దవ్వ! అయితేమాయ్‌ తియ్యి బిడ్డ…తెచ్చిత్త…! ఓ పెద్దయ్య…! పించన్‌ ఒస్తుందా? లేదే! ఇప్పియ్యాల్నా? ఇప్పిత్తవా? కర్సువెట్టుకోవాలే…మరి…ఎంతైతది బిడ్డ…ఎంతనే ఓ ఆరువేలు ఇత్తివాంటే సాలు…! ఆరు వేలెక్కడియిబిడ్డ…! తినెతందుకే కట్టం కావట్టే…! ఆడాదికి ఇరవై నాలుగు వేలత్తయి…ఆరు వేలు అనుకుంటే వస్తయా? సరే…తెత్తాగు…! ఆధార కారటు సూడ తే…! అమాయకులైన గ్రామీణ పేదలతో దళారులు చేస్తున్న మోసాలు…! ఇవి ఇప్పుడు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో జరుగుతున్న తంతు…! పింఛన్‌ వయసుకు దగ్గరున్నవారు…లేక యాభై ఏళ్లు దాటిన వారికి వల వేసే దందా సాగుతోంది. దసరాకు కొత్త పించన్లు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ దందా మొదలైంది. సహజంగా ఆధార్‌ కార్డుల్లో ఏవైనా లోపాలు వుంటే సవరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆధార్‌ సెంటర్లు ఏర్పాటు చేసింది.

కొన్ని బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసింది. అక్కడ ఆధార్‌లలో మార్పులు అంటే కొంత తిరకాసు వ్యవహారమే…! మార్పులకు గెజిటెడ్‌ సంతకాలు అవసరం…లేకుంటే సంబంధిత కౌన్సిలర్ల సంతకాలు…ఇలా కొన్ని రకాల ఇబ్బందులు తప్పవు. అన్ని పూర్తి చేసుకున్నా ఆ ఆధార్‌ కార్డు రావడానికి కనీసం వారం నుంచి పది రోజులు పట్టొచ్చు. ఆదార్‌ సెంటర్‌ ఆపరేటర్‌ మళ్లీ ఏదైనా పొరసాటు చేస్తే మళ్లీ దాన్ని పునర్దురించుకోవాలంటే మరో పది రోజులు…ఇదంతా కాలయాపన. పైగా రోజుల తరబడి ఎదురుచూపు. టోకెన్‌ తీసుకోవాలి. రెండు రోజులు పెట్టొచ్చు…! ఇవన్నీ పూర్తి చేసుకునేలోపు పుణ్యకాలం పూర్తి కావొచ్చు. ప్రభుత్వ ప్రకటించిన గడవు వెళ్లిపోవచ్చు. ఇదంతా ఎందుకు అనుకుంటే చాలు. కాలు కదపకుండా వుండేలా కొందరు దళారులు, తహసిల్ధార్‌ కార్యాలయంలో సిబ్బంది కలిసి ఐదు నిమిషాల్లో ఆధార్‌కార్డులో వయసు సవరించేస్తారు. ఆసరా పెన్షన్‌ ధరఖాస్తు చేసుకోవడానికి సహకరిస్తారు…! ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న అతి పెద్ద కుంభకోణం. అమాయకులైన ప్రజల నుంచి వేలకు వేలు వసూలు చేస్తున్నారు. వయసు సరిచేయడంలో సుమారు రూ.4 వేలు వసూలు చేస్తున్నారు. అది కూడా ఓ నాలుగైదు సంవత్సరాలు సరి చేయాలంటే మాత్రం పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. తాజాగా వరంగల్‌ రూరల్‌ జిల్లాకు చెందిన నర్సంపేట డివిజన్‌, నెక్కొండలో ఇద్దరు వ్యక్తుల సంభాషణ వెలుగులోకి వచ్చింది. గత కొంత కాలంతా ఈ దందా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోందని తెలుస్తోంది. ఓ వ్యక్తి తహసిల్తార్‌కార్యాలయంలోని కంపూటర్‌ ఆపరేటర్‌కు ఫోన్‌ చేసి, ఆదార్‌ కార్డులో వయసు ధృవీకరణలో మార్పు చేయాలని కోరితే…ఎంత పట్టుకురావాలో కూడా స్పష్టంగా చెబుతున్నారు. ఇదంతా భహిరంగ రహస్యమే అన్నంత దర్జాగా ఈ దందా నిర్వహిస్తున్నారు.తహసిల్ధార్‌ల ప్రమేయంతో విచ్చలవిడిగా జరుగుతోంది. ఇలాంటి వ్యవహారాలు జరగాలంటే తహసిల్ధార్‌ సహాకారం ఎంతో అవసరం. అంతే కాదు ఆయన లాగిన్‌ ఐడి కూడా ఎంతో అవసరం. సంబంధిత కంప్యూటర్‌ ఆపరేటర్‌కు తహసిల్ధార్‌ లాగిన్‌ ఐడి ఇచ్చేస్తాడు. తంతు పూర్తి కాగానే మళ్లీ ఆ తహసిల్ధార్‌ తన పాస్‌ వర్డ్‌ చైంజ్‌ చేసేస్తాడు..ఇలా చేసినందుకు ప్రతి కార్టు సవరణకు తహసిల్ధార్‌లకే రూ.2వేలు ఇస్తున్నట్లు కూడా ఓ ఆపరేటర్‌ వెల్లడిరచిన ఆడియో సర్కులేట్‌ అవుతోంది. అంటే ఇంత విచ్చలవిడిగా ఈ వ్యవహారం సాగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆసరా పథకాన్ని ప్రకటించారు.

గతంలో రూ. వెయ్యి రూపాయలు ఇచ్చేవారు. గత ఎన్నికల ముందు ఈ ఫించన్లను రూ.2016 చేశారు. పైగా ఆసరా ఫించన్ల అర్హుత వయసు గతంలో 59 సంవత్సరాలు వుండేది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం 57 సంవత్సరాలకు తగ్గించారు. దాంతో అనేక మంది ఆసరాకు అర్హులయ్యారు. ఇదే అదునుగా కొందరు అవకాశవాదులు ఆసరా ఫించన్ల పధకాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. అధికారులతో కుమ్మక్కై అసలు పథకాన్ని భ్రష్టు పట్టించే వ్యవహారం నడిపిస్తున్నారు. గతంలో వయసు మళ్లిన వారికి ఫించన్‌ రావాలంటే ఎంత కష్టమో అందరికీ తెలుసు. తర్వాత రూ. 200 వచ్చేది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కేసిఆర్‌ రూ. వెయ్యి ప్రకటించారు. మళ్లీ దాన్ని రూ.2వేలకు సవరించారు. దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా కేవలం తెలంగాణలో మాత్రమే రూ.2వేలు ఆసరా ఫించన్లు అందుతున్నాయి. పైగా 57 ఏళ్ల వయసు వుంటే చాలు ఫించన్లు అందజేస్తున్నారు. ఇది దళారులకు అవకాశంగా మారింది. అమాయకులకు వయసు సరిచేసి, వారికి తేనిపోని ఇబ్బందులు తెచ్చే దందా సాగుతోంది. పైగా ప్రభుత్వ పథకం లక్ష్యానికి తూట్లు పొడిచేలా వున్నారు. ఆ పధకం నీరుగార్చేలా దళారులు, అధికారులు స్వార్ధం కోసం పథకాన్నే భ్రష్టు పట్టిస్తున్నారు. భవిష్యత్తులో అర్హులైన వారికి కూడా పించన్లు అందకుండా పోయే ప్రమాదాన్ని సృష్టిస్తున్నారు. ప్రభుత్వం కూడ అందుకు కేటాయించే బడ్జెట్‌ విపరీతంగా పెరిగిపోతే అసలు పధకం అమలుపైనే నీలి నీడలు కమ్ముకునే ప్రమాదం లేకపోలేదు. లేకుంటే ప్రభుత్వమే ఏదైనా ఎంక్వైరీ వేస్తే అసలుకే మోసం రావొచ్చు. అమాయకులైన ప్రజల మీద కూడ కేసులు నమోదు కావొచ్చు. ప్రజలరా తస్మాత్‌ జాగ్రత్త…దళారులు చెప్పారు కదా? అని అర్హత లేకున్నా, వయసు లేకున్నా పించన్‌ కొసం అడ్దదారులు తొక్కితే తీరని నష్టం జరగొచ్చు.

దేశానికి శక్తి, యుక్తి కేసిఆరే!

కట్టాతో సుబ్బారావు మనసులో మాట.

`చిత్తశుద్ధి,లక్ష్యశుద్ది, కార్యసిద్ధి కలిస్తే కేసిఆర్‌…

`పట్టువదలని విక్రమార్కుడు కేసిఆర్‌…

`సంక్షేమ రథ సారథి కేసిఆర్‌…

`తెలంగాణలో నిరంతర విద్యుత్‌ కలగన్నామా!

` రైతుకు ఇంతటి భరోసా ఎప్పుడైనా చూశామా!

` తెలంగాణ వస్తే చాలనుకున్నాం…

`పరాయి పాలన పోవాలనుకున్నాం….

`తెలంగాణ సాధించడమే ఒక అధ్భుతమని అనుకున్నాం..

`తెలంగాణ వస్తే కేసిఆర్‌ ఇన్ని అద్భుతాలు సృష్టిస్తాడని అనుకోలేదు…

`చెరువులకు మళ్ళీ పూర్వ వైభవం ఊహకందని విషయం.

`కాళేశ్వరం ఒక భగీరథ ప్రయత్నం…

`తెలంగాణ వున్నంత వరకు కేసిఆర్‌ కీర్తి అజరామరం…

`కేసిఆర్‌ జాతీయ రాజకీయాలలో సక్సెస్‌ అవుతారు…

`కేసిఆర్‌ ప్రధాని కావడం ఇప్పటి తరానికి అవసరం…

`దేశమంతా సస్యశ్యామలం కావాలి.

`రైతు సుభిక్షమైన దేశ నిర్మాణం కావాలి.

`అన్ని వర్గాల అభ్యున్నతి కేసిఆర్‌ తోనే సాధ్యం…

`చూస్తూ వుండండి…కేసిఆర్‌ జాతీయ రాజకీయాలను శాసించడం చూస్తాం…

`కేసిఆర్‌ పిఎం కావడం ఖాయం..

`దేశాన్ని ప్రపంచంలో నెంబర్‌ వన్‌ చేయడం తధ్యం.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

స్వేదం చిందించి, రెక్కలు ముక్కలు చేసుకొని, ఆరు గాలం కష్టపడి, కండలు కరుగుతున్నా, డొక్కలీడ్చుకుపోతున్నా, పొలం చూసి మురిస్తూ, సాగు చేసి, దేశానికి అన్నం పెట్టే రైతన్న అంటే ముఖ్యమంత్రి కేసిఆర్‌కు ఎంతో ప్రేమ. ఆ రైతు మేలు కోరే ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసిఆర్‌. దేశంలో ఇన్ని రాష్ట్రాలు వున్నా ఏ రాష్ట్రంలో రైతు గురించి ఇంతగా ఆలోచించే ముఖ్యమంత్రి ఎక్కడా లేడు. అదీ కేసిఆర్‌ ప్రత్యేకత…రైతు కోసం కేసిఆర్‌ సాగిస్తున్న పాలన. రైతు రాజ్యమే రామరాజ్యమని నమ్మి, అన్ని వర్గాల అభ్యున్నతి రైతు చిరునవ్వుల్లోనే వుందని నమ్మే ఏకైకనేత కేసిఆర్‌. రైతు సల్లగుంటే దేశమంతా సల్లగుంటుందని కేసిఆర్‌కు తెలుసు. పల్లె పచ్చగుంటే దేశమంతా పచ్చగుంటుందని కేసిఆర్‌కు మాత్రమే తెలుసు. సాగు కూడా ఒక విద్యనే…ఆ సాగు కూడా చైతన్యమే…బతుకంతా మెతుకులోనే…ప్రతి వ్యక్తి జీవితమంతా భూమితోనే ముడినడి వుంటుంది. ఆ జీవితమంతా సంతోషంగా, ఆనందంగా వుండాలంటే ముందు రైతు సుభిక్షంగా వుండాలి. రైతు క్షోభపడకుండా వుండాలి. అప్పుడు దేశ వికాసానికి తిరుగుండదు. మన దేశం ప్రపంచంలో తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు తిరుగుండదు. అది వర్తమాన రాజకీయాల్లో ఒక్క కేసిఆర్‌తోనే సాధ్యం…కేసిఆర్‌ మాత్రమే సుసాధ్యం చేసే నాయకుడు..అంటున్న రిటైర్డు రిజిస్ట్రార్‌, ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఉద్యోగ సంఘాల, కార్మిక సంఘాల తెలంగాణ ఉద్యమ జేఏసి చైర్మన్‌ పరిటాల సుబ్బారావు, ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో తన మనసులోని మాట…సహజంగా ఎవరికైనా ముందు లక్ష్య సిద్ది కావాలి. తర్వాత చిత్త శుద్ది వుండాలి. అవి రెండూ కేసిఆర్‌లో మనసు నిండా వున్నాయి. తర్వాత కార్యశుద్ది కావాలి. దానికి పర్యాయపదమే కేసిఆర్‌. ఆయన తల్చుకుంటే సాధించలేనిది లేదని ఇప్పటికే ప్రపంచానికి నిరూపించారు. కాని ఒక విజయుడిగా మాత్రమే ఆయన అక్కడే ఆగిపోలేదు. తనలోని పోరాట యోధుడు విశ్రమించలేదు. తెలంగాణలోని ప్రతి ఒక్కరూ తెలంగాణ వస్తే చాలనకున్నారు. పరాయి పాలన పోతే చాలనుకున్నారు. కాని ఒక్క కేసిఆర్‌ మాత్రమే తెలంగాణ వస్తే ఏం జరగాలన్నది ఆలోచించారు. ఏం చేస్తే తెలంగాణ సస్యశ్యామలమౌతుందో నిర్ణయం తీసుకున్నారు. ఎన్ని సౌకర్యాలు కల్పిస్తే తెలంగాణ తిరుగులేని శక్తి కాగలుతుందని లెక్కలేసుకున్నారు. అసలు తెలంగాణకు ఏం కావాలన్నదానిపై పూర్తి అవగాహనతో ముందుకు సాగారు. ఆయన తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టిన నాడే పూర్తి నమ్మకంతో అడుగువేశారు… తెలంగాణ అభివృద్ధి కాంక్షతోనే అడుగులో అడుగువేశారు. అదే నేడు బంగారు తెలంగాణ నిర్మాణ దశ. అసలు ఎవరూ ఊహించలేదు. తెలంగాణ వస్తే నీళ్లొస్తాయంటే ఇలా ప్రతి పల్లెలోని చెట్టూ, పట్టా, చెలిమె తానాలాడేంత నీళ్లొస్తాయని కలగనలేదు. చెరువులు మళ్లీ నిండుతాయనుకోలేదు. వాటి రూపురేఖలు మళ్లీ పాత కాలం రోజులను తలపిస్తాయని కల గనలేదు. కొన్ని దశాబ్ధాలుగా పల్లెల్లోని చెరువుల్లో తట్టెడు మట్టి తీయని రోజులు నుంచి, చెరువుల్లో పూడికలు తీసే దాకా వస్తుందని అనుకున్నామా? తెలంగాణలోని 46వేల చెరువులు బాగు పడతాయని అనున్నది కాదు. నేడు గంగాళాల్లా ఎండా కాలంలో కూడ నీళ్లతో చెరువులు నిండుతాయనుకున్నామా? ఇదంతా ముఖ్యమంత్రి కేసిఆర్‌ అద్భుత సృష్టి కాదా! ఒకప్పుడు తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మాణం కోసం ఎందరు ప్రయత్నం చేసినా, నాటి ఉమ్మడి పాలకులు కాదన్నారు. కుదరదన్నారు. తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం సాధ్యం కాదన్నారు. ఎత్తిపోతలు తమ వల్ల కాదన్నారు.

చెరువులే చెల్లా చెదురు చేసిన వాళ్లు, రిజర్వాయర్లు నిర్మాణం గురించి ఏనాడు ఆలోచించలేదు. కాని నవతరం నాయకుడు, తెలంగాణ స్వాప్నికుడైన కేసిఆర్‌ కాళేశ్వరం నిర్మాణం చేసి, సాధ్యం కాదన్నది సుసాధ్యం చేశాడు. తెలంగాణలో గోదారి నీళ్ల పరవళ్లను గడపడగకు తెచ్చాడు. తెలంగాణ వచ్చినా పాలకుడుగా ఏ నాయకుడు వున్నా, తెలంగాణలో ఇప్పుడు మన కళ్లముందు సాక్ష్యాత్కారమౌతున్న ఏపని చూసే వాళ్లం కాదు… కోతలు లేని కరంటు అసలే చూసేవాళ్లం కాదు…ఉక్కపోతలు లేని రోజులు గడిపేవాళ్లం కాదు… మరి నేడు రెప్పపాటు కరంటు లేని తెలంగాణను కళ్లారా చూస్తున్నాం…ఉక్కపోతులో మగ్గిపోయిన జీవితాలను నేడు సంతోషంగా గడుపుతున్నాము. రైతుకు రైతు బంధు అనే పధకం ఒకటి అమలు చేసే అవకాశం వుందన్నది గతంలో ఏ నాయకుడైనా ఆలోచించారా? కనీసం వారి మదిలోకి అలాంటిది అమలు చేయొచ్చన్నది కలగన్నారా? ఎంత సేపు సాగు దండగ తప్ప, పండగ చేద్దామన్న వారు లేరు. కాని నేడు వ్యవసాయం ప్రతి ఇంటి పండుగగా మార్చిన ఏకైక నాయకుడు కేసిఆర్‌. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో అమలౌతున్న పధకాలు మరే రాష్ట్రంలో భూతద్దం వేసి వెతికినా ఒక్కటి కూడా కనిపించదు. తెలంగాణను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపి, సంక్షేమ సారధిగా దేశమంతటా మన్ననలు పొందుతున్న ముఖ్యమంత్రి కేసిఆర్‌, ప్రజాసంక్షేమ, చైతన్యప్రగతి ప్రయాణం తెలంగాణతోనే ఆగిపోకూడదు. దేశం మొత్తం సస్యశ్యామలం కావాలి. అందుకు కేసిఆర్‌ నాయకత్వమే దేశానికి కావాలి. ఎందుకంటే స్వాతంత్య్రం వచ్చిన నుంచి ఎంతో మంది ప్రధాన మంత్రులు పనిచేశారు. రాష్ట్రాలన్నీంటిలో చూస్తే కొన్ని వందల మంది ముఖ్యమంత్రులు పాలించారు. కాని ఏ ఒక్క నాయకుడైనా రైతు గురించి ఆలోచించారా? జై కిసాన్‌ అన్నారు…కాని రైతుల బాగోగులు పట్టించుకున్నారా? గత పాలకులు నినాదాలకు పరిమితయ్యారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆచరణకు శ్రీకారమయ్యాడు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ఆరాధ్యుడయ్యాడు. అనేక రకాల సంక్షేమ పధకాలకు ఆధ్యుడయ్యాడు. ఎనమిది సంవత్సరాలుగా తెలంగాణలో అమలౌతున్న అనేక సంక్షేమ పధకాలు మాకు కావాలని దేశంలోని ప్రజలంతా కోరుకుంటున్నా, కేంద్ర ప్రభుత్వానికి చెవికెక్కడం లేదు.

ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చెవి మీద పేను కూడా పారడం లేదు. తెలంగాణలో సక్సెస్‌ ఫుల్‌గా పధకాలు అమలౌతున్నాయని తెలిసిన తర్వాత కూడా వాటిని అమలు చేద్దామన్న సోయి ఎవరికీ లేదు. అందుకే కేసిఆర్‌ నడుంబిగించాడు. కేసిఆర్‌ను మించిన నాయకుడు దేశంలోనే లేడు. ఆయనలా విజన్‌ వున్న నాయకుడు అసలే లేడు. గతంలో కేసిఆర్‌ తెలంగాణ ఉద్యమ బావుటా ఎగుర వేసిన నాడు ఆయన వెంట నడిచాం…ఆయన ఆశయ సాధనలో అడుగులో అడుగు వేశాం…తెలంగాణ కోసం కేసిఆర్‌తో కలిసి తెగించి కొట్లాడాం…ఇప్పుడు కూడా దేశం కోసం కేసిఆర్‌తో నడిచేందుకు మేమంతా సిద్దంగా వున్నాం…దేశ సౌభాగ్యం కోసం కేసిఆర్‌ లక్ష్య సాధనలో కలిసి పనిచేసేందుకు ఎల్లవేళలా సిద్దంగా వున్నాం…చాలా మందికి కేసిఆర్‌ అర్ధం కాడని అంటుంటారు…! మేధావి ముసుగేసుకున్న స్వార్ధ పరులకు కేసిఆర్‌ ఎప్పుడూ అర్ధం కాడు. సామాన్యులకు మాత్రమే ఆయన అర్దమౌతాడు. ఎందుకంటే ఆయన చెప్పే సాత్వికమైన తెలంగాణ యాసకూడా మర్చిపోయిన సోకాల్డ్‌ మేదావులకు కేసిఆర్‌ ఎప్పుడూ అర్ధం కాడు. పేదలను ప్రేమించే నాయకుడు ఎప్పుడూ అతితత్వమున్న వారికి నచ్చరు. అందుకే కేసిఆర్‌ పామరులకు అర్ధమైనంత తొందరగా పండితులకు అర్ధం కాదు. తెలంగాణ కోసం పిడికిలి బిబించి, జెండా ఎత్తిన నాడు కేసిఆర్‌ తో నడిచించి సామాన్యులే…! కాని మేధావి ముసుగేసుకున్న వారు ప్రశ్నించారు? అనుమానం వ్యక్తం చేశారు… శుభం పలకరా? అంటే అపశకునాలు పలికారు…తెలంగాణ వచ్చేదా…అని ఎగతాళి చేశారు. కాని ప్రజలు నమ్మారు. రైతులు నమ్మారు. వారి కోసమే కేసిఆర్‌ తెలంగాణ ఉద్యమం చేశారు. తెలంగాణ వచ్చాక ఆ సామాన్యుల కోసమే కేసిఆర్‌ పనిచేస్తున్నాడు. పధకాలు రచిస్తున్నాడు. అమలు చేస్తున్నాడు. వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు. బంగారు తెలంగాణ సామాన్యులకు వరంగా అందిస్తున్నాడు. పేదింటి చెల్లికి అన్నగా అండగా నిలస్తున్నాడు. పెద్దలకు పెద్ద కొడుకై ఆసరాగా నిలస్తున్నాడు. జనం గుండెల్లో కొలువై వున్నాడు. పేద వారు బాపు అంటున్నారు…విద్యావంతులు సార్‌ …అంటున్నారు..ఇంతకంటే ఒక నాయకుడికి ఇంకేం కావాలి. దేశాన్ని పాలించేందుకు ఇంత కన్నా ఏం అర్హత కావాలి. అందుకే కేసిఆర్‌ ప్రధాని కావాలి. దేశాన్ని సుభిక్షం చేయాలి. దేశమంతా తెలంగాణ పధకాలు అమలు కావాలి. దేశమంతా కేసిఆర్‌ పాలన స్వర్ణయుగమని కొనియాడాలి. అది మా లాంటి వాళ్లం కళ్లారా చూడాలి.

పచ్చి అవకాశవాది..!

`రవీందర్‌ సింగ్‌కు వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య!

`ఏకంగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ పైనే గతంలో చేయకూడని వ్యాఖ్యలు చేశాడు.

`కవితకు పదవికేం తొందరొచ్చిందన్నాడు?

`వినోద్‌ కుమార్‌ పదవి లేకుండా మూడు నెలలు కూడా వుండలేడా? అని రవీందర్‌ సింగ్‌ ప్రశ్నించాడు.

`పార్టీ ముఖ్యులను తేలిక చేసి మాట్లాడాడు!

`గత ఎన్నికలలో మంత్రి గంగుల కమలాకర్‌ ఓటమికి శత విధాల కృషి చేశాడు?

`తన అనుచరుల ప్రాంతాలలో బిజేపికి మెజారిటీ?

`ఆది నుంచి గంగుల మీద విషం చిమ్ముతూనే వున్నాడు?

`ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలంగాణలో కుటుంబ పాలన అన్నాడు?

 `కేసిఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు కూడా చేశాడు?

`నమ్మించి మోసం చేయడం టిఆర్‌ఎస్‌ అధినేతకు అలవాటే అని కూడా అన్నాడు?

`హుజూరాబాద్‌ లో ఈటెలకు సపోర్ట్‌ చేసినట్లు అనేక ఆరోపణలు!

`రవీందర్‌ సింగ్‌కు పదవీ కాంక్ష తప్ప ప్రజాశ్రేయస్సు పట్టదు?

`మేయర్‌గా వున్నంత కాలం స్మార్ట్‌ సిటీ పనులు చేపట్టలేదు?

`కాంట్రాక్టర్‌ను ఎందుకు బెదిరించాడు?

 

`ఈ మధ్య మరీ శృతిమించుతోన్న రవీందర్‌ సింగ్‌ ఆగడాలు?

`పార్టీకి తీరని నష్టం చేసేలా రవీందర్‌ సింగ్‌ వ్యవహారం?

`గంగులను అడుగడుగునా అప్రదిష్ట పాలు చేయాలని చూస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది!

`రవీందర్‌ సింగ్‌ ను పార్టీ నుండి బహిష్కరించాలని టిఆర్‌ఎస్‌ శ్రేణుల పిర్యాధులు?

`అర్హతకు మించి ఆశలు పెట్డుకొని, పార్టీ పరువు బజారుకీడుస్తున్నాడంటూ విమర్శలు!

`రవీందర్‌ సింగ్‌ వంటి చీడ పురుగులను ఏరేయాల్సిందే అంటున్న శ్రేణులు!

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఆశావహులు వేరు. అవకాశ వాదులు వేరు. ప్రతి రాజకీయ పార్టీలోనూ ఆశావహులు చాలా మందే వుంటారు.

కాని వారు అవకాశవాదులైనప్పుడే పార్టీలకు ఇబ్బందులు. తలవంతపులు కూడా…అంతే కాదు వారి వ్యక్తిగత రాజకీయ జీవితానికి కూడా తిప్పలే…అయినా కోరికోరి కష్టాలు తెచ్చుకుంటుంటారు.

అనుకున్నదే తడువుగా అందలమెక్కాలని అనుకుంటుంటారు. ఓపిక అన్నది లేకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కుంటారు. కొన్ని సార్లు పార్టీకి తీరని నష్టం తెచ్చిపెడుతుంటారు. నీడనిచ్చ చెట్టును కొట్టేయాలనుకుంటారు?

అలాంటి వారి పట్ల వ్యక్తులైనా, వ్యవస్ధలైనా అప్రమత్తంగా వుండడం అవసరం. ఎందుకంటే నైరాశ్యం పేరుతో అవకాశవాదులెప్పుడూ పార్టీ నాశనాన్ని కోరుకుంటుంటారు. స్వయంగా పార్టీని ముంచే పనిలో నిమగ్నమై వుంటారు. పైకి ఎంతో తియ్యగా కనిపిస్తున్నా,

లోలోన చేదేక్కి వ్యవహరిస్తుంటారు. విషం చిమ్ముతుంటారు. గూడు కట్టుకొని వున్న అసంతృప్తిని ఎప్పుడు వెళ్లగక్కుదామా? అని ఎదురుచూస్తుంటారు. పార్టీ ఎంత నిలబెట్టినా, పార్టీనే తాను నిలబెట్టానని చెప్పుకుంటారు. అతి విశ్వాసం ప్రదర్శిస్తుంటారు. అక్కసును వ్యక్తం చేస్తూ వుంటారు. లేని కయ్యాలు సృష్టించి పార్టీని కూల్చే పనిలో పడతారు…పైకి అమాయకులుగా, లోన అపరిచితులుగా వ్యవహరిస్తుంటారు. కరీంనగర్‌ టిఆర్‌ఎస్‌లో అలాంటి నేత మాజీ మేయర్‌ రవీందర్‌ సింగ్‌ అంటున్నారు. పార్టీని అదును చూసి, ప్రతీసారి ఇరుకున పెట్టే ప్రయత్నం శతవిధాల ప్రయత్నం చేయడమే ఆయన రాజకీయం అంటూ పార్టీ నాయకులే విమర్శిస్తున్నారు. తాజాగా ఆయన అనుచరులు మంత్రి గంగుల కమలాకర్‌ను అప్రదిష్టపాలు చేయడానికి పన్నిన కుటిల ప్రయత్నం వెలుగులోకి వచ్చింది. అంటే వెనకటి గుణమేల మాను వినరా సుమతి! అనే పద్యాన్ని నిజం చేస్తున్నారు. పార్టీకి తీరని ద్రోహం చేస్తున్నారు. మంత్రిని ఇరుకున పెట్టడమే కాదు, ఇబ్బందుల పాలు చేస్తున్నామంటూ టిఆర్‌ఎస్‌లోని రవీందర్‌ సింగ్‌ వర్గం ఫోన్‌ సంబాషణలు ఇప్పుడు సంచనలమయ్యాయి. రవీందర్‌సింగ్‌కు వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య అని టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులే చెబుతున్నారు. 

తనకు పదవుల యావ తప్ప , ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశ్యమే ఆయనకు లేదని వారు అంటున్నారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలోనే రవీందర్‌ సింగ్‌ ఎమ్మెల్సీ ఆశలు పెట్టుకున్నారు. ఉద్యమంలో పాల్గొనడం వేరు…రాజకీయాల్లో ప్రభావం వేరు…అన్నది తెలుసుకోకుండా తనను తాను అతిగా ఊహించుకోవడం రవీందర్‌ సింగ్‌కు అలావటే అని పార్టీ నేతలే అంటున్నారు. ఎమ్మెల్సీ ఆశ తీరలేదు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ 2014లో రవీందర్‌ సింగ్‌ను కరీంనగర్‌ మేయర్‌ను చేశారు. అయినా ఆశ తీరలేదు. పదవుల మీద మోజు తీరలేదు. మేయర్‌ పదవి అన్నది ఆయనకు చాల చిన్న పదవిలా కనిపించింది. ఒకే నాయకుడికి పదే పదే అవకాశాలు ఇస్తూ, పోతే ఇతర నాయకులకు ఎప్పుడు పదవులు అందుతాయన్న కనీస సోయి కూడా లేకుండా రవీందర్‌ సింగ్‌ రాజకీయాలు చేయడం కొత్త కాదన్నది పార్టీ నేతల మాట. అందుకే తాజాగా రవీందర్‌ సింగ్‌పై కరీంనగర్‌ కు చెందిన అనేక మంది కార్పోరేటర్లు పార్టీకి పిర్యాధులు చేశారు. రవీందర్‌ సింగ్‌ అవకాశ వాద రాజకీయాలు పార్టీకి తీరని నష్టమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆయన మేయర్‌గా వున్న సమయంలోనే కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీ పనులు చేపట్టలేదు. కాంట్రాక్టర్‌ తాను అడిగింత ఇస్తేనే పనులు చేయనిస్తానని అనడంతో, పనులు అక్కడే ఆగిపోయానని అంటున్నారు. అంటే కరీంనగర్‌ స్మార్టు సిటీ కావడం కూడా రవీందర్‌కు ఇష్టం లేదని, ఆ పనులు చేస్తే పార్టీకి మంచి పేరు రావడం ఇష్టంలేకనే రవీందర్‌ సింగ్‌ పనులు జరగన్విలేదన్నది ఓ వాదన. గంగుల కమలాకర్‌ టిఆర్‌ఎస్‌లోకి రాకముందే కరీంనగర్‌ ఎమ్మెల్యే. 

ఆయనను తానే పార్టీలోకి తీసుకొచ్చానని రవీందర్‌ సింగ్‌ చెప్పుకోవడంలోనే డొల్లతనం వుంది. ఒక ఎమ్మెల్యే స్ధాయి వ్యక్తిని కార్పోరేటర్‌ స్ధాయి నాయకుడు పార్టీలోకి తేవడం అన్నదే ఆలోచించడానికి వీలులేనిది. పార్టీ పరంగా, పార్టీ ఆదేశాల మేరకు తాను కూడా కృషి చేశానని చెప్పడంలో తప్పులేదు. ఒక వేళ పార్టీ మీద అంత ప్రేమ, ముఖ్యమంత్రి కేసిఆర్‌ మీద అంత గౌరవం వుంటే, గత అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి గంగుల కమలాకర్‌ ఓటమికోసం రవీందర్‌ సింగ్‌ ప్రయత్నాలు చేశారన్నది ఎందుకు తెరమీదకు వచ్చింది. కరీంనగర్‌ మొత్తం మెజార్టీ వచ్చి, రవీందర్‌ సింగ్‌కు చెందిన అనుయాయులు, ఆయన వర్గీయులు, బంధువులు వున్న ప్రాంతాల్లో బిజేపికి ఎందుకు మెజార్టీ వచ్చిందనేది కూడా రవీందర్‌ సింగ్‌ సమాధానం చెప్పాలని గతంలోనే పార్టీ నేతలు ప్రశ్నించారు. అయినా గంగుల కమలాకర్‌ వాటిని పట్టించుకోకుండా అందర్నీ కలుపుకుపోతూనే వున్నారు. కాకపోతే ప్రతి సారి గంగుల కమలాకర్‌ను అప్రదిష్టపాలు చేయడానికి పదే పదే రవీందర్‌ సింగ్‌ అనేక రకాల వ్యూహాలు పన్నుతూనే వున్నారన్నది అందరికీ తెలిసిందే అంటున్నారు. తాజాగా ఓ ప్రాంతంలో ఎలుకలు, పందికొక్కుల పేరు చెప్పి, మంత్రిని అప్రదిష్టపాలు చేయడానికి, మంత్రి ఏం పట్టించుకోవడం లేదని అబాసుపాలు చేయడానికి రవీందర్‌ సింగ్‌ అనుచురులు డ్రైనేజీలు తవ్వడం ఏమిటి? జేసిబిలు తెచ్చి, రాత్రికి రాత్రిరోడ్లు తవ్వేయడం ఏమిటి? తిరిగి వాటిని వెంటనే పూర్తి చేయాలని కమీషనర్‌ను బెదిరించడం ఏమిటి? కలెక్టర్‌కు పిర్యాధు చేస్తామని కమీషనర్‌కు చెప్పడమేమటి? ఏకంగా మంత్రి పరవు తీయాలని గణేష్‌ నిమజ్జనం తర్వాత కలెక్టరేట్‌ ముందు ధర్నాలు చేస్తామని చెప్పడమేమిటి? ఇదేనా సొంత పార్టీ నేతలు చేయాల్సిన పని? ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిన నాయకులే , ప్రభుత్వాన్ని,మంత్రిని ఇబ్బందులకు గురిచేసి, ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చేలా చేయడమేమిటి? గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో రవీందర్‌ సింగ్‌ చేసిన హడావుడి..హంగామా అంతా ఇంతా కాదు…

ఏకంగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ను సైతం రవీందర్‌ సింగ్‌ ఎలా వ్యాఖ్యానించారో ప్రజలందరికీ తెలుసు. ఏకంగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఇచ్చిన మాట మీద నిలబడడు అంటూ, అందరికీ ఆశ చూపి, వంచిస్తాడన్న మాటలు కూడా మాట్లాడాడు. పైగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తానే గెలిచి, పార్టీకి బుద్ది చెబుతాన్నారు. అంతంత మాటలు మాట్లాడినా కేవలం ఉద్యమ సమయంలో కలిసి పనిచేశాడన్న కారణంతోనే రవీందర్‌ సింగ్‌ను పార్టీలో కొనసాగనిచ్చారు. టిఆర్‌ఎస్‌ కార్పోరేటర్‌గా వుంటూనే, బిజేపిలో చేరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశాడు. ఇది పార్టీ నియమావళికి విరుద్దం. అయినా పార్టీ ఆయనను క్షమించింది. ఓ దశలో తాను మేయర్‌గా పనిచేసి, మళ్లీ కార్పోరేటర్‌గా పోటీ చేయడం నామోషీగా ఫీలైన నాయకుడు రవీందర్‌ సింగ్‌…..మహారాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన దేవేంద్రఫడ్నవీస్‌, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. అంతే కాని రవీందర్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలు ఎంత అహాంకారపూరితమైనవో చెప్పకకనే చెప్పొచ్చు. అంతే కాదు గతంలో నిజామాబాద్‌ ఎంపిగా కల్వకుంట్ల కవిత ఓడిపోయిన కొద్ది కాలానికే మళ్లీ ఎమ్మెల్సీ అయ్యింది. ఆమెకు ఒక న్యాయం మాకు ఒక న్యాయమా? అని అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వ్యక్తి రవీందర్‌ సింగ్‌. ఇక ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ వినోద్‌ కుమార్‌ మీద కూడా ఆయన అనేక సార్లు అనుచిత వ్యాఖ్యలు చేశారు. పదవి పోయి పట్టుమని మూడు నెలలు కూడా వినోద్‌ కుమార్‌ వుండలేకపోయాడంటూ రవీందర్‌ సింగ్‌ విమర్శించాడు. తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి నిలబడడం మూలంగానే ఎంపిటిసీలకు నిధులొచ్చాయని కూడా చెప్పుకున్నాడు. ప్రభుత్వం ఎన్ని వందలకోట్ల రూపాయలు ఖర్చు చేసినా, హుజూరాబాద్‌ ఎన్నికల్లో ఏం జరిగిందని ప్రశ్నించారు. పరోక్షంగా ఈటెల రాజేందర్‌కు ప్రచారం చేశారన్న అపవాదును ఎదుర్కొన్నారు. అసలు టిఆర్‌ఎస్‌లో వుండి, టిఆర్‌ఎస్‌ అభ్యర్ధికి సపోర్టు చేయకుండా, పార్టీ నుంచి బైటకు పంపించబడ్డ ఈటెల రాజేందర్‌ గెలుపును పదే పదే గుర్తు చేస్తూ, అనేక సార్లు పార్టీని కించపర్చిన ఘనత రవీందర్‌ సింగ్‌ది. అయినా ఆయన అనేక సార్లు క్షమించి వదిలేసింది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ కూడా అవన్నీ కడుపులో పెట్టుకొని వదిలేశాడు. తాజాగా ముఖ్యమంత్రి డల్లీ, బీహార్‌, పంజాబ్‌ పర్యటనలో ఆయనను వెంట బెట్టుకొని వెళ్లారు. అయినా ఆయనలో మార్పు రాలేదు. పార్టీకి నష్టం చేకూర్చే పనులు మానుకోలేదుని పార్టీ నాయకులే అంటున్నారు. ఇదిలా వుంటే ఆయన అనుచరులు మంత్రి గంగుల కమలాకర్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన ఆడియో బైటకు రావడంతో తనకు ఏమీ తెలియదన్నట్లు, బిజేపి ఎంపి. బండి సంజయ్‌కుమార్‌ మీద ప్రెస్‌ మీట్‌ పెట్టినంత మాత్రాన చేసిన తప్పులు మాఫ్‌ అయిపోతాయనుకుంటున్నాడు. 

నానాటికీ రవీందర్‌ సింగ్‌ ఆగడాలు శృతి మించిపోతున్నాయని గ్రహించిన టిఆర్‌ఎస్‌ నాయకులు, కార్పోరేటర్లు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంటు కల్వకుంట్ల తారకరామారావు, కరీంగనగర్‌ జిల్లా మంత్రి గంగుల కమలాకర్‌కు పిర్యాధులు చేశారు. పార్టీ నుంచి రవీందర్‌ సింగ్‌ను సస్పెండ్‌ చేయాలని కోరారు. అంతేకాదు రవీందర్‌ వ్యహార శైలిని వెంటనే ముఖ్యమంత్రి కేసిఆర్‌ దృష్టికి తీసుకెళ్లాలని ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బోయిన పల్లి వినోద్‌కుమార్‌కు కూడా పార్టీ నాయకులు పిర్యాధు చేశారు. ఇక రోడ్డును తవ్వి, కార్పోరేషన్‌కు నష్టం కల్గించిన వారిపై పోలీసు కేసు కూడా నమోదైంది. మున్సిపల్‌ కార్పోరేషన్‌ అధికారుల పిర్యాధు మేరకు రోడ్డు, డ్రైనేజీని తవ్వి, మంత్రిని అప్రదిష్టపాలు చేయడానికి చూసిన వారిపై కూడా పోలీసు కేసు నమోదైంది. రవీందర్‌ సింగ్‌, ఆయన అనుచరుల ఆగడాల మూలంగా పార్టీకీ తీరని నష్టం కల్గుతోందని, వెంటనే ఆయనను పార్టీనుంచి సస్పెండ్‌ చేయాలని పార్టీ శ్రేణులు పెద్దఎత్తున డిమాండ్‌ చేస్తున్నాయి.

మునుగోడు మాదే: వద్దిరాజు రవిచంద్ర

కట్టాతో కాసేపు ముచ్చట…

`తెలంగాణలో బలమైన పార్టీ మాదే…

`తిరుగులేని, ఎదురులేని నాయకుడు ముఖ్యమంత్రి కేసిఆరే…

`అన్ని సర్వేలు మాకే అనుకూలం…

`సంక్షేమ పథకాలే టిఆర్‌ఎస్‌ ను గెలిపిస్తాయి.

`ఆసరా పెన్షన్‌ దారులను ప్రతిపక్షాలు మాయచేయలేవు…

`ఇతర రాష్ట్రాలలో అధికారంలో వున్నా తెలంగాణలో ఇచ్చినంత ఆసరా ఫింఛను ఎందుకివ్వడం లేదు?

`డిల్లీలో కూడా మంచి నీళ్లకు దిక్కులేదు?

`గుజరాత్‌ లో 24 గంటల కరంటు సరఫరా కావడం లేదు!

 `రైతులకు 24 ఉచిత విద్యుత్‌ ఒక్క తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడా లేదు.

`రైతు బంధు, రైతు భీమా మరే రాష్ట్రంలో కనిపించదు?

`దళిత బంధు ఒక్క తెలంగాణ లోనే అమలు…

`ముఖ్యమంత్రి కేసిఆర్‌ దేశ ప్రధాని అయితే దేశమంతటా ఈ పథకాలు అమలౌతాయని ఎదురుచూస్తున్నారు?

`అలాంటిది మునుగోడు గెలవడం మాకు నల్లేరు మీద నడక…

`ప్రజలంతా మా వైపే….

`ప్రతిపక్షాల హడావుడి, గోల తప్ప మరేం లేదు…

`ఎమ్టీ వెసెల్స్‌ మేక్‌ మచ్‌ నాయస్‌…సామెత ప్రతిపక్షాలకు అన్వయించుకోవచ్చు?

`వారిని నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు…

`రేవంత్‌ రెడ్డి ప్రచారానికి పోతే మహిళలు ముఖం మీదే వెళ్ళిపొమ్మని చెప్పారు?

`రాజ్‌ గోపాల్‌ రెడ్డి నాంపల్లి గ్రామానికి వెళ్తే ఎందుకొచ్చావని నిలదీశారు?

`ఈ రెండు సంఘటనలు చాలు కారుకు ఎదురులేదని చెప్పడానికి…

 

హైదరాబాద్‌,నేటిధాత్రి:
తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితికి తిరుగులేదు. ఎదురు లేదు. ప్రతిపక్షాలకు అసలు తెలంగాణలో తావు లేదు. ప్రజలు వారిని నమ్మే పరిస్ధితి అసలే లేదు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ను ఎదుర్కొనే శక్తి ఏ పార్టీకి లేదు. దేశం మొత్తం మీద కేసిఆర్‌ లాంటి సంక్షేమ సారధి మరొకరు లేదు. తెలంగాణ అమలౌతున్నన్ని సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవు. తెలంగాణలో ప్రజలకు అందుతున్న పధకాలలో కనీసం పదో వంతు సంక్షేమ పథకాలు కూడా మరే రాష్ట్రంలోనూ లేవు. అమలు కావడం లేదు. అలాంటిది మునుగోడు ఉప ఎన్నికపై తర్జన భర్జన ఎందుకు? మునుగోడు మాదే…గెలిచేది మేమే…ప్రతిపక్షాలకు మునుగోడులో స్ధానమే లేదు. బిజేపికి క్షేత్రస్ధాయి బలం లేదు. బలగం లేదు. యంత్రాగం లేదు. కాంగ్రెస్‌ను వీడి బిజేపిలో చేరిన రాజగోపాల్‌రెడ్డి అంటే ప్రజల్లో నమ్మకం లేదు. ఆయనపై విశ్వాసంలేదు. ఆయన పార్టీ ఎందుకు మారిండో మునుగోడు నియోజకవర్గంలో చిన్న పిల్లవాడినడిగినా చెబుతాడు. ఇక ఆయన కోసం గత ఎన్నికల్లో పనిచేసిన వాళ్లు ఎంత కోపంతో వున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్య నాంపల్లి అనే గ్రామంలో ప్రచారానికి వెళ్లిన రాజగోపాల్‌రెడ్డిని గ్రామస్ధులంతా తరిమేసినంత పనిచేశారు. ఆయనను కనీసం పది నిమిషాలు కూడా అక్కడ వుండన్విలేదు. అలాంటిది తాను మళ్లీ గెలుస్తానన్న భీరాలు తప్పతే, గెలిచేది లేదు. ఆయనకు ఓట్లు పడేది లేదు. ఇక కాంగ్రెస్‌ పరిస్ధితి అంతకన్నా మెరుగైన పరిస్దితి కూడా ఏమీ లేదు. ఆ పార్టీకి నాయకత్వం లేదు. ప్రజల్లో ఆదరణ లేదు. మొత్తం మీద కాంగ్రెస్‌కు ఎలాంటి సీన్‌ లేదు. మొన్ననే రేవంత్‌రెడ్డి మునుగోడులోని ఓ తండాకు ప్రచారం పేరుతో వెళ్తే ఏం జరిగిందో తెలిసిందే. రేవంత్‌ రెడ్డి ముఖం పట్టుకొని ఓ మహిళ ఇక్కడి నుంచి వెళ్లిపో… అని గర్జించింది. ఆ కోపం చూసి అక్కడినుంచి రేవంత్‌ రెడ్డి జారుకోవడం తనవంతైంది. కాంగ్రెస్‌ నాయకుల ముందు ఆయన పరువు పోయినంత పనైంది. అదంతా మీడియాలో వచ్చిందే…జనమంతా చూసిందే… కాంగ్రెస్‌కు మింగుడుపడందే…ఆదిలోనే రేవంత్‌ అటు పార్టీలోనూ, ఇటు ప్రజల్లోనూ ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నారో అందరూ చూసిందే…అయినా పార్టీ అంతా లుకలుకలే…అంతే కాదు ఆపార్టీకి చెందిన స్టార్‌ క్యాంపైనర్‌ తమ్ముడే బిజేపి తరుపున పోటీ చేస్తున్నాడు. అన్న వెంకటరెడ్డి తన తమ్ముడికి ఓట్లేయాలని కోరుతున్నారన్న వార్తలు వినిపిస్తూనే వున్నాయి. ఇంకే ముంది కాంగ్రెస్‌కు మునుగోడులో ఏం మిగిలింది. రాజగోపాల్‌ రెడ్డి రూపంలో వున్నదే పోయింది. కొత్త గా కాంగ్రెస్‌కు వచ్చేదిలేదు. ఆ పార్టీకి ఓట్లు పడేది లేదు….అయినా మేం మెహర్భానీకి వెళ్తాం…తమను తాము మోసం చేసుకుంటామని అనుకుంటే చేసేదేముంది? జనం కూడా ఆ రెండు పార్టీలను చూసి జాలి పడుతున్నారే తప్ప, వారి ముఖం చూడడానికి కూడా ఇష్టపడడం లేదు.

తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ బలమైన పార్టీ.
త్వరలో జాతీయ స్ధాయిలో వెలుగొందేందుకు సిద్ధమౌతున్న పార్టీ. దేశమంతా తెలంగాణలో అమలౌతున్న పథకాలన్నీ తమ రాష్ట్ర ప్రజలకు కూడా కావాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలలో తెలంగాణతో సరిహద్దు కల్గిన ప్రాంతాలన్నీ తెలంగాణలో కలపాలని కోరుతున్నారు. అంతే కాదు కర్నాకటకు చెందిన ఓ ఎమ్మెల్యే కూడా తమను తెలంగాణలో కలపాలని కోరినట్లు వార్తలు చూసిందే. ఎందుకుంటే తెలంగాణలో అమలౌతున్న ఏ ఒక్క పధకం కూడా కర్నాటకలో లేదు. కేసిఆర్‌లా రాజనీతిజ్ఞత వున్న నాయకుడు లేదు. ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే నాయకుడు లేదు. పాలకులు కూడా ప్రజల కోసం పనిచేస్తున్నట్లు లేదన్నది పొరుగు రాష్ట్రాలలో వినిపిస్తున్న మాటే…
మునుగోడు విషయంలో అన్ని సర్వేలు టిఆర్‌ఎస్‌కే అనుకూలంగా వున్నాయని చెబుతున్నాయి.
అంతే కాదు రాష్ట్రంలోని ప్రతిపక్షాలు చేయించే సర్వేల్లో కూడా టిఆర్‌ఎస్సే గెలుస్తుందని చెబుతున్న సంగతి తెలిసిందే. టిఆర్‌ఎస్‌ సుమారు 41శాతంతో అన్ని పార్టీలంటే ముందుంజలో వుంది. అన్ని సర్వేల్లోనూ ఇదే తేలుతోంది. మునుగోడులో సుమారు 2లక్షల40వేల ఓట్లు వున్నట్లు సమాచారం. అందులో సంక్షేమ పధకాలు అందుకుంటున్న కుటుంబాలన్నీ టిఆర్‌ఎస్‌కే ఓటు వేస్తాయన్నది జగమెరిగిన సత్యమే. ఎందుకంటే రైతుబంధు నుంచి మొదలు, ఆసరా పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, కళ్లుగీత కార్మికుల పెన్షన్లు, చేనేత పెన్షన్లు, బీడి కార్మికుల పెన్షన్లు అందుకునే వారు మెజార్టీ ప్రజలున్నారు. వారంతా ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వంపై సంపూర్ణమైన విశ్వాసంతో వున్నారు. ఇక ఇరవై నాలుగు గంటల కరంటు సరఫరాలో చిన్నా చితక వ్యాపారాలు చేసుకునేవారికి ఉపాధి మరింత పెరిగింది. గతంలో కరంటు లేక ఇన్వర్టర్ల మీద ఆధారపడిన వారు ఇప్పుడు వాటి అవసరం లేకుండాపోయింది. నాణ్యమైన కరంటు అందుతోంది. ఇక రైతులకు కూడా ఇరవై నాలుగు గంటల కరంటు అందుతోంది. ఓ వైపు పెరిగిన భూగర్జ జలాలు, మరో వైపు నిరంతరంగా నాణ్యమైన కరంటు…పెట్టుబడి సాయం కింద రైతు బంధు…అన్ని రకాల సౌకర్యాలు గతంలో సమకూర్చాలన్న ఆలోచన చేసిన నాయకుడే లేడు. పాలకులు లేరు. మరి దేశంలోనే ఇన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చని ప్రజల గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు కేసిఆర్‌. ఇక పేదింటి ఆడ పిల్ల పెళ్లి భారం కాకూడదని, ప్రభుత్వం తరుపున కళ్యాణ లక్ష్మి, షాదీ ముభారక్‌ పేరుతో లక్షనూటపదహారు రూపాయలు ఇస్తున్నారు. తాజాగా దళిత బంధు పేరుతో ఎంతో మంది దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న నాయకుడు కేసిఆర్‌. మరి అలాంటి టిఆర్‌ఎస్‌ను ప్రజలు కాదనుకుంటారా? బిజేపి, కాంగ్రెస్‌ లాంటి వారిని నమ్మి, మళ్లీ తమ జీవితాలను ఆగం చేసుకుంటారా? గతంలో డెబ్బై ఏళ్ల గోస పడరాని కష్టాలు పడ్డ ప్రజలు, మళ్లీ బిజేపి,కాంగ్రెస్‌లను నమ్మేందుకు సిద్ధంగా లేరు. వారి మాయ మాటలు వినేందుకు ఇష్టపడడం లేదు. నిజంగా బిజేపికి ప్రజల మీద ప్రేముంటు, ప్రేద ప్రజలను ఆదుకోవాలనుకుంటే పెరుగుతన్న నిత్యావసర ధరలేమిటి? పెట్రోలు, డీసెల్‌ పెంపులేమిటి? గ్యాస్‌ ధర నియంత్రణ లేకుండా పెరుగుడేమిటి? ఇదేనా బిజేపికి ప్రజల మీద వున్న గౌరవం. ఓ వైపు జిఎస్టీ పేరుతో బాదుడు…మరో వైపు దేశం కోసం, ధర్మం కోసమంటూ సమాజాన్ని చీల్చుడు…మతం పేరుతో బిజేపి రాజకీయాలు ఎంతో కాలం సాగవు…
ముఖ్యమంత్రి కేసిఆర్‌ దేశంలోనే ప్రస్తుతం వున్న రాజకీయ నాయకుల్లో తిరుగులేని నాయకుడు.

ఎదురు లేని నాయకుడు. ఏ రాష్ట్రంలో కనిపించని ప్రగతిని తెలంగాణలో చూపించిన నాయకుడు. తెలంగాణ రాష్ట్రంవచ్చిన ఇంత తక్కువ కాలంలో ఇక మిగిలిపోయిన పనులంటూ లేకుండా అనేక పనులు పూర్తి చేశాడు. అసలు తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణమే జరగదని చెప్పి నేలపై, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుతోపాటు, అనేక రిజర్వాయర్లు నిర్మాణం చూశాడు. సాధ్యం కాదన్న వాటిని సుసాధ్యం చేసి చూపించాడు. అసలు తెలంగాణలో ఇలా నీటి పరవళ్లు చూస్తామని గతంలో ఎవరూ అనుకోలేదు. తెలంగాణ రాకపోతే ఉమ్మడి రాష్ట్రంలో ఇంకెప్పటికీ సాధ్యమయ్యేవి కాదు. కాకతీయ కాలంలో రూపకల్పన చేసిన చెరువుల ఆనవాలు లేకుండా చేసిన ఉమ్మడి పాలకుల దాష్టికాన్ని దిగమింగుకొని బతికిన తెలంగాణ ప్రజలకు మొత్తం 46వేల పైచిలుకు చెరువులు మళ్లీ గంగాళాలు చేశాడు. నీళ్లతో నింపేశాడు. ఎండాకాలం, వానా కాలం, ఆ కాలం, ఈ కాలం అని తేడా లేకుండా అన్ని కాలాలు చెరువుల్లో నీటి చుక్క ఇంకిపోకుండా చూసుకుంటున్నారు. మరి ఇలాంటిపరిస్ధితి దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలోనైనా వుందా? అంతెందుకు దేశంలోనే అత్యధిక చెరువులున్న రాష్ట్రం తమిళనాడు. మరి అక్కడ చెరువులన్నీ ఖాళీ…చెన్నై నగరమే మంచినీటి కోసం కటకటలాడడం చూస్తూనే వున్నాం. కాని మన తెలంగాణలో ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీటిని మిషన్‌ భగీరధ ద్వారా అందిస్తున్నాము. ఇలా దేశమంతా ప్రజలకు మంచినీరు అందించాలన్నదే కేసిఆర్‌ కల. అందుకే జాతీయ రాజకీయాల్లో ఆయన కీలక భూమిక పోషించేందుకు సిద్దమౌతున్నారు.

కేసిఆర్‌ ప్రధాని కావడం ఖాయమే

`రాజనీజ్ఞుడి అడుగులు రాటుదేలే వుంటాయి.

`సంకల్ప దీక్షకు సాధన తోడు కావడం కేసిఆర్‌ లో గతంలో చూసిందే..

`అదును చూసి రాజకీయ ఎత్తుగడలు వేయడంలో కేసిఆర్‌ దిట్ట.

`తెలంగాణ ఉద్యమం కాలంలోనూ ఎంచుకున్న మార్గమే ఇప్పుడూ…

`అయినా ఎవరికీ అర్థం కానిదే…

`ఒక్కో మెట్టు…ఒక్కో అడుగు…

`ముందు ప్రాంతీయ పార్టీల ఏకం….

`నితీష్‌ కు అర్థమైన కేసిఆర్‌ వ్యూహం… తనూ అదే దారిలో పయనం…

`ఉత్తరాధిలో ప్రాంతీయ పార్టీలలో కదలిక…బిజేపికి నష్టం తప్పదిక.

`ముందు సామాజిక చైతన్యం…

`ఆ తర్వాత రైతు సంక్షేమం…

`సాగు నీటి రంగ సంస్కరణలు…

`ప్రాజెక్టుల నిర్మాణాలు….

`రైతుకు ఉచిత విద్యుత్‌…

`దేశమంతటా రైతు బంధు….దళిత బంధు

`అదును చూసి గిరిజన బంధు…

`తెలంగాణ లో అమలవుతున్న అన్ని పథకాలు దేశం మొత్తం…

`జన సంక్షేమం, దేశ సౌభాగ్యం…సర్వతోముఖాభివృద్దే సంకేతం.

`అన్ని వర్గాల అభ్యున్నతే కేసిఆర్‌ లక్ష్యం.

`తిరుగులేని రాజకీయం… దేశానికి కేసిఆర్‌ రూపంలో నవ శకం.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

దేశం క్లిష్ట పరిస్ధితుల్లో వుంది. ఇది గతంలో ఓ సినిమాలో పాపులర్‌ డైలాగ్‌. అది ఇప్పుడు రాజకీయంగా నిజమే అనిపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ కకావికలమైంది. ప్రతిపక్షాలు చెల్లాచెదురయ్యాయి. బిజేపికి ప్రాంతీయ పార్టీలతో పనిలేదు. కాంగ్రెస్‌ దరి చేరేందుకు ప్రతిపక్షాలకు నమ్మకం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ధైర్యం లేదు. ఒక వేళ కాంగ్రెస్‌ పుంజుకుంటే తప్ప ఆలోచించలేని క్లిష్ట రాజకీయ పరిస్ధితి దేశంలో వుంది. ఇదే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితికి కలిసొచ్చే అంశం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి భారతీయ రాష్ట్ర సమితి అయితే ఇక దేశ రాజకీయాల్లో ఆ పార్టీకి తిరుగే లేదట. ఇది ఓ జోతిష్యుడు కూడా చెబుతున్న మాట కూడా. ముఖ్యమంత్రి కేసిఆర్‌ బ్రహ్మ మానసపుత్రుడు అంటూ ఆ జ్యోతిష్యుడు చెప్పే విషయాలు కొన్ని నిజాలుగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే పట్టుదలకు అలాంటి వారు మారుపేరుగా వుంటారన్నది తెలుస్తోంది. జీవితాంతం అలుపెరగని పోరాటం చేస్తారన్నది కూడా కేసిఆర్‌ విషయంలో ఇప్పటికే నిజమైంది. కేసిఆర్‌ తొలి రాజకీయ అడుగులు వేసిన నాటి నుంచి ఆయన ఏదో ఒక రాజకీయ సంచలనానికి వేదికౌతూనే వస్తున్నారు. ఎందుకంటే సిద్ధిపేటలో ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచించి కూడా సామాన్యమైన నాయకుడి మీద కాదు. ఒక రకంగా ఒకప్పటి తెలంగాణ యోధుడు. ఆ మదన్‌ మోహన్‌కు కేసిఆర్‌ శిష్యుడి లాంటి వారు. గురువును కూడా రాజకీయంగా ఓడిరచగల రాజకీయ చాణక్యం ఆయన సొంతం. అలాగే తెలుగుదేశం పార్టీలో వున్న సమయంలో చంద్రబాబుకు అధికారం దక్కడంలో కీలకభూమిక పోషించిన కేసిఆర్‌ను పక్కన పెట్టి చంద్రబాబు తప్పు చేసినా, అది తెలంగాణ రాజకీయాలకు మేలు చేసింది. తెలంగాణ ప్రాంతానికి ఎంతో ఉపయోగపడిరది. అదే ఉమ్మడి రాష్ట్రంగా వుంటే తెలంగాణ ఇంకా ఎండి ఎడారి అయ్యేది. నీటి చుక్కలేని భీడు భూములే మిగిలేవి. తెలంగాణలో అన్నమో రామచంద్రా అని ఆకలి కేకలు వినిపించేవి. ఎండాకాలంలో పశు గ్రాసం కూడా దిక్కు లేకుండాపోయేది. పాడి, పంటల జాడ లేకుండా పోయేది. విధాత రూపంలో వచ్చిన కేసిఆర్‌ చేపట్టిన తెలంగాణ సాధన సంకల్పం మూలంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించడమే కాదు, బంగారు తెలంగాణ దిశగా అడుగులు పడ్డాయి. తెలంగాణ సస్యశామలమైంది. తెలంగాణలో నీటి సిరుల పరవళ్లు లేడిపిల్లల్లా దుంకుతున్నాయి. ఎండిపోయిన చెరువులు ఎప్పుడూ నిండి వుంటున్నాయి. పల్లెలకు నీటి గోస తీరింది. పంట పొలాలకు నీరు పుష్కలమైంది. ఒకనాడు నారు నాడే సక్కగ నీరుండేది కాదు. కరంటు చాలేది కాదు. ఆరు గాలం కష్టపడి, అప్పులు చేసి విత్తు వేసి, నారు పెట్టి, నాట్లేసి, ఎరువులు, పురుగు మందులు చల్లి, చంపిపాపలా పైరును కాపాడుకుంటే, పంట చేతికొచ్చే నాటికి కరంటు కష్టాలు వెంబడిరచేవి. నీటి జాడలు అడుగంటిపోయిన బోర్లు ఎండిపోయేవి. చుక్క నీటికోసం పొలం తల్లడిల్లేది. రైతు గుండె ఆవిరయ్యేది. కాని ఆ కాలం చూసిన రైతు ఇప్పుడు కళ్లనిండా నీళ్లు చూస్తు పరవశిస్తున్నాడు. పరవళ్లు తొక్కుతున్న నీటిని చూసి సంబరపడుతున్నాడు. పొలమంతా నీటిని చూస్తూ, ఇంకిన తన కన్నీళ్లను ఆనందబాష్పాలుగా రప్పించుకొని కేసిఆర్‌కు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాడు. బలమైన సంకల్పం వున్న వారు ఎప్పుడూ ఏదో ఒకటి సాధిస్తూనే వుంటారు.

ఒకనాడు నా తెలంగాణ ఎందుకు ఎండిన బీడులని ఏడ్చిన కేసిఆర్‌, దేశంలో కూడా రైతు వేధనను చూసి చలించిపోయాడు. తెలంగాణలో అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని కేసిఆర్‌ ప్రజల సంక్షేమం కోసం అన్వయించాడు. తెలంగాణలో సాధ్యం కావని అనుకున్న ప్రతి పనిని చేసి చూపించాడు. తెలంగాణ రాకపోతే అందరూవున్నా ఆర్ధిక ఆసరా లేక చీత్కారాలకు గురవౌతున్న పెద్ద మనుషులకు ఫించన్‌ రూ. 2000 వచ్చేవా? గతంలో ఉమ్మడిరాష్ట్రంలో ఇచ్చిన రూ.200 వందలు రూ.5వందలు అయ్యేవేమో! కాని ప్రస్తుతం అందుతున్నంత పించన్‌ కలలో కూడా ఊహకందేది కాదు. అలాగే దివ్వాంగులకు రూ.3500 అన్నది ఊహించడానికే కష్టంగా వుండేదేమో! ఇక తెలంగాణలో చెరువులు బాగు పడేవా? చెరువుల్లో నీటి జాడలుండేవా? ఇరవై నాలుగుగంటల కరంటు సాద్యమయ్యేదా? రైతు బంధు అనేది ఒకటి వినిపిచేందా? ఎప్పటిలాగా కష్టమైనా ఊరునే నమ్ముకొని వుండేవాళ్లు అప్పులు చేసి సాగు చేసేవారు. ఎంతో మంది చిన్న సన్న కారు రైతులు తెలంగాణలోని తమ ఇండ్లు, భూములు వదిలేసి హైదరాబాద్‌, బొంబాయి వలస వెళ్లే రోజులు వుండేవి. కాని నేడు తెలంగాణ రాష్ట్రానికే ఉత్తరాధి నుంచి కొన్ని లక్షల మంది వచ్చి అటు ప్రాజెక్టులలో, ఇటు ఇండ్ల నిర్మాణాలలో, పొలం పనుల్లో, రైసు మిల్లుల్లో పనిచేస్తున్నారు. కారణం ఆయా రాష్ట్రాలో వారికి సరైన ఉపాధి లేదు. సాగుకు నీరు లేదు. వ్యవసాయం సాగడం లేదు. ఇది తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసిఆర్‌ దేశమంతా పచ్చని పందరి చేయాలనుకుంటున్నాడు. ఎక్కడ చూసినా పచ్చ దనం వెల్లివిరియాలని కోరుకుంటున్నారు. పాడి పంటలతో ఒకనాడు దేశం ఎలా వర్ధిల్లిందో అలా చూడాలనుకుంటున్నారు. మన దేశ ఏకానమిలో ఇప్పటికీ కీలక భూమిక వ్యవసాయ రంగానిదే. దాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్తు తరం మరింత నష్టపోతుంది. అందుకే కేసిఆర్‌ ఒకనాడు తెలంగాణ కోసం ఎత్తిన జెండాను, ఇప్పుడు దేశం కోసం మరోసారి ఎత్తుబోతున్నాడు. మరోసారి పిడికిలి బిగించి, దేశంలో సంక్షేమ రంగానికి స్వర్ణయుగం తెవాలనుకుంటున్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో వుండేందుకు అవసరమైన మార్గదర్శకాలను రూపకల్పన చేస్తున్నారు. ఎద్దేడ్చిన ఎవుసం, రైతేడ్చిన రాజ్యం బాగు పడదని పెద్దలు ఊరికే చెప్పలేదు. 

2014లో అధికారంలోకి వచ్చిన బిజేపి ఈ ఎనమిదేళ్ల కాలంలో ఏం సాధించింది అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే విద్య, వైద్య, సాగు, వ్యవసాయ రంగాలన్నీ కుదేలయ్యాయి. కేంద్రంలో బిజేపి ప్రభుత్వం వచ్చాక దేశంలో ఎక్కడైనా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందా? చెప్పడానికి సమాధానం లేదు. కనీసం ఏ రాష్ట్రానికైనా సహకరించారా? అంటే అదీ లేదు. కనీసం బిజేపి పాలిత రాష్ట్రాలలోనైనా సాగు నీటి ప్రాజెక్టుల గురించి ఆలోచించారా? అంటే అదీ లేదు. కాని తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ వల్ల తెలంగాణలో సాధ్యమే కావనుకున్న అనేక ప్రాజెక్టులు నిర్మాణం జరిగాయి. అందులో కాళేశ్వరం అన్నది ఒక చారిత్రక ఘట్టం. కొన్ని వందల సంవత్సరాల పాటు కేసిఆర్‌ పేరును సువర్ణాక్షరాలతో లిఖించేది. అసలు తెలంగాణలో రిజర్వాయర్లనిర్మాణం అన్నది చేయొచ్చని ఎవరైనా ఊహించారా? తెలంగాణను కేసిఆర్‌ సస్యశ్యామలం చేసి చూపించారు. ప్రపంచానికి ఒక పాఠం నేర్పించారు. కాని బిజేపి నేర్చుకోలేపోయింది. స్వతంత్ర భారత దేశంలో రైతులు కొన్ని నెలల పాటు రోడ్డెక్కి పోరాటం సందర్భం గతంలో ఎన్నడూ లేదు. కాని బిజేపి పాలనలో ఎదురైంది. దేశంలో కొత్త ప్రాజెక్టులు లేవు. రైతులకు కరంటు సరఫరా లేదు. సాగుకు అవసరమైన నీరు లేదు. పెట్టుబడి సాయం లేదు. సరైన ఎరువుల సరఫరా లేదు. వాటి ధరలకు కళ్లెం లేదు. పెట్రోల్‌, డిజిల్‌ ధరలకు రోజూ రెక్కలే…గ్యాస్‌ తగ్గుడన్న మాట లేకుండా పెరిపోతోంది. ప్రతి వస్తువు మీద పన్నే…జిఎస్టీ పేరుతో బాదుడే…దేశ ప్రజలకు ఇవన్నీంటినుంచి నుంచీ విముక్తి కావాలి.

రైతులకు నీరు కావాలి. అందుకు సాగునీటి ప్రాజెక్టులు కట్టాలి. రైతుకు ఇరవై నాలుగు గంటల విద్యుత్‌ కావాలి. దేశమంతా పాడిపంటలతో సమృద్ది చెందాలి. దేశంలోని రైతుందరికీ రైతు బంధు అందాలి. రైతుకు తొలకరి నాడే సాయం అందాలి. పెట్టుబడి ఎదురుచూసే రోజులు పోవాలి. పండిన పంటను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసే ప్రభుత్వం రావాలి. దేశంలో ప్రజలంతా ఆర్ధికంగా బాగుపడాలి. తెలంగాణలో అమలౌతున్న దళిత బంధు ను దేశమంతా విస్తరించాలి. అంతే కాకుండా మైదాన ప్రాంతానికి దూరంగా, సమాజానికి మరింత దూరంగా దుర్భర జీవితాలు అనుభవిస్తున్న గిరిజనులకు కూడా గిరిజన బంధు రావాలి. పేదింటి ఆడపిల్ల పిల్లకు కళ్యాణ లక్ష్మి దేశమంతా కావాలి. ఫించన్లు దేశమంతా పెరగాలి. డిల్లీలో కూడా అందని మంచినీటి సౌకర్యం తెలంగాణలో అందుతున్న మిషన్‌ భగీరథ అమలు కావాలి. దేశమంతా సురక్షితమైన మంచినీరు అందాలి. మహారాష్ట్రలోని లాతూర్‌లో ఏటా వేసవిలో మంచినీటిని ట్రైన్లలో సరపరా చేయడాన్ని చూస్తున్నాం. అది శాశ్వత పరిష్కారం కాదు. అక్కడ కూడా ఇంటింటికీ మంచినీరు అందించాలి. అది ఒక్క కేసిఆర్‌తోనే సాధ్యం. ఎందుకంటే ఇవన్నీ విజయవంతంగా అమలు చేసి, సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణను మొదటిస్ధానంలో నిలిపిన కేసిర్‌ వల్లనే దేశంగా ఈ పధకాల అమలు సాధ్యమౌతాయి. అందుకే దేశ ప్రజలంతా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ వైపు ఆసక్తిగా చూస్తున్నారు. కొత్త జాతీయ పార్టీ ఎప్పుడు ప్రకటిస్తారా? అని ఎదురుచూస్తున్నారు. దేశంలోని రైతాంగమంతా చర్చించుకుంటుంది. కేసిఆర్‌ వస్తే రైతు రాజ్యం వస్తుందని అనుకుంటున్నారు. దేశం సస్యశ్యాలమౌతుందని చర్చించుకుంటున్నారు. దేశంలో ముక్తు బిజేపి అన్నది కేసిఆర్‌తోనే సాధ్యమన్నది నిరూపించేదాకా కేసిఆర్‌ విశ్రమించడని మాత్రం తెలుస్తోంది..! పట్టువదలని విక్రమార్కుడు కేసిఆర్‌…విజయాలే తప్ప అపజయాలు లేని రాజనీతి దురందురుడు కేసిఆర్‌..! నవతరం రాజకీయ నాయకుడు కేసిఆర్‌….దేశాన్ని ఏలే సత్తా వున్న ఏకైక నేత కేసిఆర్‌.

నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ దంపతులు

నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ దంపతులు

వరంగల్ దేశాయిపేట చిన్నవడ్డెపల్లి చెరువు వద్ద గణేష్ నిమజ్జనం సందర్బంగా సందర్శించి,నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..

జాగ్రత్తలు పాటించాలని,ప్రజలు గణేషుని ప్రతిమలను నిమజ్జనం చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని,అదికారులు అప్రమత్తంగా ఉండి నిమజ్జనం సాఫీగా ఎలాంటి సమస్య లేకుండా జరిగేలా చూడాలని ఎమ్మెల్యే నరేందర్ సూచించారు..

శివనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నవరాత్రులు పూజలందుకున్న గణేషుని నిమజ్జనం సందర్బంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ – వాణి దంపతులు..

ఆపత్కాలంలో అండగా సీఎంఆర్ఎఫ్ : ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..

ముఖ్యమంత్రి సహాయ నిధిపేదలకు వరమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు. 

శుక్రవారం హన్మకొండలోని వారి నివాసంలో పరకాల,నడికూడ,ఆత్మకూరు,దామెర మండలాలకు చెందిన 11 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరు చేసిన చెక్కులను ఎమ్మెల్యే అందచేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. గ్రామాలలో అనారోగ్యంతో భాదపడుతూ చికిత్స చేసుకోలేని పరిస్థితిలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఒకవరంలా మారిందని అన్నారు.

 

సీఎంఆర్ఎఫ్ ఆపత్కాలంలో ఎంతోమంది నిరుపదలకు ఆసరగా నిలుస్తుందన్నారు.

పేద ప్రజలను ప్రభుత్వం ఎల్లప్పడు అండగా ఉంటుందన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు.

 

 దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. 

 

 వివరాలు:

ఆత్మకూరు మండలం – రూ.212000/-

దామెర మండలం – రూ.110500/-

పరకాల పట్టణం – రూ.41000/-

పరకాల మండలం – రూ.138400/-

నడికూడ – రూ.200000/-

 

కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మీ బాగోతం బీబీనగర్ ఎయిమ్స్ కి వెళ్లి చూడండి

గవర్నర్ పై మంత్రి హరీష్ రావు ఫైర్*

రాష్ట్ర వైద్య వ్యవస్థపై గవర్నర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను

ఒక డాక్టర్ అయ్యుండి వైద్యుల మనోభావాలు దెబ్బతీసే మాట్లాడడం బాధాకరం.

కేంద్ర ప్రభుత్వం ప్రశంసిస్తే మీరు విమర్శిస్తున్నారు..

సీఎం కేసీఆర్ నాయకత్వంలో వైద్యారోగ్య వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందింది.

ఎయిమ్స్ బీబీనగర్ ఆస్పత్రి వెళ్లి చూడండి, కనీస వసతులు కూడా లేవు

ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు

వికారాబాద్ జిల్లా తాండూరు లో నిర్వహించిన ఆశ కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొన్న మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రరెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, జెడ్ పీ ఛైర్మెన్ సునీతా మహేందర్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

ఈరోజు తాండూరు వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా ఆశా, ANM లకు చేరెల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం సంతోషంగా ఉంది. 

ANM సబ్ సెంటర్లు పల్లె దవాఖానలుగా చేస్తున్నాం. 3200 పల్లె దవాఖాన ఏర్పాటు చేస్తున్నాం. డాక్టర్ లేదా స్టాఫ్ నర్స్ ఇక్కడ ఉండి సేవలు అందిస్తారు. 

కొత్త పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా నడుస్తున్నది. సీఎం కేసీఆర్ గారు మిమ్మల్ని ప్రగతి భవన్ పిలిచి, మాట్లాడి మీ కోరిక మేరకు జీతాలు పెంచారు.

ఎక్కడ 2000, ఎక్కడ 9750 రూపాయలు. 

మధ్యప్రదేశ్ లో ఈరోజు కూడా 3000 మాత్రమే ఇస్తున్నారు. ఛత్తీస్ గడ్ లో 4000 ఇస్తున్నారు. మనం మాత్రం 9750 ఇస్తున్నాం.

పని చేస్తే ప్రేమగా చూసుకుంటాం.బాగా పని చేసిన వారికి పిలిచి హైదరాబాద్ లో సన్మానం చేసాము. 

వికారాబాద్ జిల్లా అన్ని విధాల అభివృద్ధి చెందుతున్నది.

మొత్తం రంగారెడ్డి జిల్లాలో ఒక్క ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లేదు అని నేను ఉద్యమం సమయంలో అడిగాను. తెలంగాణ ఏర్పాటు తర్వాత మూడు జిల్లాలుగా మారి, డిగ్రీ కాలేజీలు కాదు మూడు మెడికల్ కాలేజీల ఏర్పాటు జరిగింది.

మొన్ననే సీఎం కేసీఆర్ గారు రూ. 235 కోట్లతో వికారాబాద్ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. వారం రోజుల్లో 30 కోట్లతో నర్సింగ్ కాలేజీ ప్రారంభిస్తాము. 

రూ. 15 కోట్లతో 50 పడకల ఆయుష్ ఆసుపత్రి వికారాబాద్ లో ఏర్పాటు చేస్తున్నాం. 

గవర్నర్ గారు వైద్యుల మనో దైర్యం దెబ్బతీసేలా మాట్లాడటం దురదృష్టకరం.

ఒక డాక్టర్ అయి ఉండి అలా మాట్లాడటం బాధాకరం. ఇది తగదు.

తెలంగాణలో వైద్యం బాగోలేదని ఎలా అంటారు. తీవ్రంగా ఖండిస్తున్నాను.

సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర ఆరోగ్య రంగం ఎంతో అభివృద్ధి చెందింది.

కేంద్ర ప్రభుత్వమే ఈ విషయాన్ని అనేక సార్లు వెల్లడించింది.

ఒక వైపు కేంద్రం ప్రశంసలు కురిపిస్తే, మీరు విమర్శలు చేస్తారు.

మాతా శిశు మరణాలు తగ్గుదలలో తెలంగాణ అగ్ర స్థానంలో కొనసాగుతున్నది.

ఏ బిజెపి పాలిత రాష్ట్రంలోనూ ఇంత పురోగతి లేదు. దేశంలో ఆరోగ్య రంగంలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది.

కేసీఆర్ కిట్, ఇతర చర్యల వల్ల 2014 లో 30 శాతం ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 66 శాతం చేరాయి.

హెల్త్ అండ్ వెల్నెస్ ర్యాంకింగ్లో తెలంగాణ నెంబర్వన్ స్థానంలో ఉంది.

మలేరియా నివారణలో 2 నుండి కేటగిరీ 1 కి రాష్ట్రం అభివృద్ధి చెందింది అని కేంద్రం వెల్లడించింది.

 

*ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతం చేయడం వల్ల, ఆశాలు ఏఎన్ఎంలు మా వైద్యాధికారులు ఎంతో కృషి చేయడం వల్ల సాధ్యమైంది.*

 

*ఇది గవర్నర్ గారికి ఎందుకు అర్థం కావడం లేదు.ఒక డాక్టర్ గా మీరు తెల్సుకుని మాట్లాడాలి.*

 

*గవర్నర్ గారు.. కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న బీబీనగర్ ఏయిమ్స్ ఆస్పత్రిని ఒక్కసారి వెళ్లి చూడండి.* 

 

*ఇదే సమయంలో మా తెలంగాణ జిల్లాల్లోని మెడికల్ కాలేజీలు చూడండి.*

 

*తెలంగాణ మెడికల్ కాలేజీల్లో ఉన్న సౌకర్యాల్లో 10 పైసలు కూడా ఏమ్స్ లో లేవు.*

 

*పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఎయిమ్స్ తయారైంది. పేషెంట్లు లేరు డెలివరీలు కావు. కనీస సౌకర్యాలు ఉండవు.*

 

*డాక్టర్ల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడటం బాధాకరం.*

తెలుగు భాష కోవిదుడు కాళోజి.

సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు రాజారాం యాదవ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి; తెలంగాణ వైతాళికుడు తెలుగు భాష కోవిదుడు ప్రజా కవి కాళోజి నారాయణ రావు జయంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో సర్పంచ్ నానబోయిన రాజారాం ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కాళోజి ప్రజా జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని తెలంగాణ ప్రభుత్వం కాలోజీ జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం జరిపి గౌరవిస్తుందని అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ ఆరోగ్య విశ్వ విద్యాలానికి పేరు పెట్టడం హర్షానీయమని రజాకార్ల నిరంకుషత్వానికి వ్యతిరేకంగా కళమెత్తిన దీశాలి అలాంటి మహనీయుడు స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని అలాగే కాళోజి జయశంకర్ సార్ వరంగల్ గడ్డపై పుట్టడం మన అదృష్టమని వారి సేవలను కొనియాడారు కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి సాధన పెళ్లి ధర్మేందర్, అన్నగారిన వర్గాల వ్యవస్థాపక అధ్యక్షుడు పరికి కోర్నిల్, వార్డు సభ్యుడు పరికి నవీన్, పోడేటి కిషోర్ మల్టీపర్పస్ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు

గణేష్ ఉత్సవ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ రేగా కాలిక

కరకగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,. నేటిధాత్రి… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో గణేష్ ఉత్సవ కమిటీ తరఫున నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని భక్తులకు అన్నం వండించిన ఎంపీపీ రేగా కాలిక ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య ప్రధాన కార్యదర్శి బుడగం రాము ఆత్మ కమిటీ డైరెక్టర్ కొంపల్లి పెద్ద రామలింగం ఉపాధ్యక్షులు జాడి రామనాథం సీనియర్ నాయకులు సాంబశివరావు రేగా సత్యనారాయణ యువజన అధ్యక్షులు గుండ్ల రంజిత్ కుమార్ రాచర్ల రమాదేవి మీడియా అధ్యక్షులు చిట్టి మల్ల ప్రవీణ్ కుమార్ గ్రామస్తులు భక్తులు మరియు తదితరులు పాల్గొన్నారు

ఏబీవీపీ ఆధ్వర్యంలో కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడి

చనిపోయిన విద్యార్థుల కుటుంబానికి 50లక్షలు ప్రభుత్వ ఉద్యోగం ఇయాలని కలెక్టర్ ఆఫీస్ ముట్టడి ధర్నా నిర్వహించడం జరిగింది అలాగే కలెక్టర్ గారికి వినతిపత్రం ఈయడం జరిగింది అన్ని సమస్యలు పరిష్కారం

చేస్తామని కలెక్టర్ గారు హామీ ఈయడం ఆందోళన విరమించారు ఈ సందర్బంగా ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ మారావేనీ రంజిత్ కుమార్ మాట్లాడుతూ

జిల్లాలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించిన ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్లో కనీస మౌలిక వసతులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు*

ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్స్ లలో కనీస మౌలిక వసతులు భోజనం సరిగా లేక మరుగుదొడ్లు మూత్రశాలలు ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో గురుకుల హాస్టల్ లో కూడా విద్యార్థులు అధిక సంఖ్యలో 600 సంఖ్యలో విద్యార్థులు ఉంటున్నారు కానీ మరుగుదొడ్లు మాత్రం నాలుగు ఐదు

మూత్రశాలలు ఉన్నాయి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు జిల్లాలో ఇప్పటివరకు హాస్టల్స్ లలో విష జ్వరాలతో ఐదుగురు మృతి చెందడం జరిగింది దీనికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ రాజీనామా చేయాలి అలాగే బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం 50 లక్షల ఎక్సగేసియా బాధ్యత కుటుంబాలను ఇయాలని డిమాండ్ చేశారు హాస్టల్స్ లో గురుకులాల్లో కేజీబీవీ లో anm లను ఏర్పాటు చేయాలి ఆసిఫాబాద్ కేంద్రంలో st హాస్టల్ పాఠశాలలో హిందూ ఇంగ్లీష్ సోషల్ ఉపాధ్యాయులు లేక చదువు తీవ్ర ఇబ్బందూలకు గురవుతున్నారు వెంటనే సమస్యలు పరిష్కారం చేయాలి హాస్టల్స్ లలో విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జ్ మెస్ చార్జీలు పెంచాలని శిధిలా వ్యవస్థలో* *ఉన్నటువంటి sc st bc minority హాస్టల్ ను నూతన భవనం ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలి అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని హాస్టల్స్ వెంటనే నూతన భవనాలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని విజసమస్యను పరిష్కరించలి*

రాష్ట్రములో *జైల్ ల కన్నా హీనంగా ఉన్నాయి సంక్షేమ హాస్టల్స్ ఈ సందర్బంగా ఏబీవీపీ రాష్ట్ర కో కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రములో హాస్టల్స్ దుర్భర పరిస్థితులలో ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది సన్న బియ్యం ఇస్తున్నరు అంటున్నారు కానీ సన్న బియ్యం పేరుతో అక్రమాలు పెద్ద అవినీతి జరుగుతుంది పాలిష్ బియ్యం హాస్టల్స్ లో వాడుతున్నారు మెరిగేలా పురుగుల అన్నం తింటున్నారు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న మెనూ ప్రకారం ఎక్కడ భోజనం పెడుతలేరు బెడ్స్* *లేక కిందనే అపరిశుభ్రంగా ఉండడం వాళ్ళ దోమలు కుట్టడం తో జ్వరాలు డేగ్యూ రావడం రావడం తో విద్యార్థులు అనారోగ్యనికి గురవుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం పక్క భవనాలు లేక అద్దె భవనంలో ఇరుకిరుకు గదులల్లో ఉంటున్నారు పక్క భావనలు నిర్మించాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్స్ లో సన్న బియ్యం అందిస్తున్నం అని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏమి లేదు దొడ్డు బియ్యం వస్తున్నాయి మెరిగేలు పురుగుల అన్నం తిన్నడంతో రోగాల బారిన** *పడుతున్నారు వెంటనే నాణ్యమైన ఆహారం అందించాలి మెస్ క్యాస్మోటిక్ చార్జీలు సరిపోక తీవ్ర ఇబ్బందూలకు గురవుతున్నారు మెస్ క్యాస్మోటిక్ చార్జీలు పెంచాలి శాశ్వత వార్డెన్ లను నియమించలి చివరికి స్విపర్స్ లేక విద్యార్థులు స్విపర్స్ గా పని చేస్తున్నారు మరుగుదొడ్లు శుభ్రం శుభ్రం లేక రోగాల బారిన పడుతున్నారు ప్రతి రోజు ఏదో ఒక జిల్లాలో ఆహారం బాగా లేక విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు అంటే సమస్యలు ఎంత తీవ్రతరం ఉందొ అర్ధం అవుతుంది వెంటనే అన్ని సమస్యలు పరిష్కారించాలని డిమాండ్ చేస్తున్నం లతో ఆడుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం పక్క భవనాలు లేక అద్దె భవనంలో ఇరుకిరుకు గదులల్లో ఉంటున్నారు పక్క భావనలు నిర్మించాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్స్ లో సన్న బియ్యం అందిస్తున్నం అని* *గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏమి లేదు దొడ్డు బియ్యం వస్తున్నాయి మెరిగేలు పురుగుల అన్నం తిన్నడంతో రోగాల బారిన పడుతున్నారు వెంటనే నాణ్యమైన ఆహారం అందించాలి మెస్ క్యాస్మోటిక్ చార్జీలు సరిపోక తీవ్ర ఇబ్బందూలకు గురవుతున్నారు మెస్ క్యాస్మోటిక్ చార్జీలు పెంచాలి శాశ్వత వార్డెన్ లను నియమించలి చివరికి స్విపర్స్ లేక విద్యార్థులు స్విపర్స్ గా పని చేస్తున్నారు మరుగుదొడ్లు శుభ్రం శుభ్రం లేక రోగాల బారిన పడుతున్నారు ప్రతి రోజు ఏదో ఒక జిల్లాలో ఆహారం బాగా లేక విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు అంటే సమస్యలు ఎంత తీవ్రతరం ఉందొ అర్ధం అవుతుంది వెంటనే అన్ని సమస్యలు పరిష్కారించాలని డిమాండ్ చేస్తున్నం ఈ కార్యక్రమం ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్

ఏబీవీపీ జిల్లా కన్వీనర్ జుమ్మడి అరుణ్ కుమార్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులలు రవి ఏబీవీపీ ఆసిఫాబాద్ నగర కార్యదర్శి కృష్ణ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

ఘనంగా కాళోజీ గారి జయంతి

శంకరపట్నం నేటిధాత్రి

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం, కన్నాపూర్ గ్రామంలోని గ్రామపంచాయతీ ఆవరణంలో, శుక్రవారం రోజున గ్రామ సర్పంచ్ కాటం వెంకటరమణారెడ్డి మరియు గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో,కాలోజీ నారాయణరావు జయంతిని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ,కాలోజీ నారాయణరావు గారు ప్రజాకవిగా, మరియు తెలంగాణ ఉద్యమకారుడుగా, మనకు సుపరిచితుడు. ఆయన తన కలంతో సమాజ శ్రేయస్సు కోసం కవిత్వం రాసిన మహాకవి. అంతేకాకుండా, అరాచక పాలనకి వ్యతిరేకంగా ఆయన కలము నెత్తి సమాజానికి మంచి సందేశాన్నిచ్చిన మహాకవి కాళోజి గారు. ఈయన స్వతంత్ర సమరయోధుడు కూడా,కావున తెలంగాణ ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవం గా చేసి ఆయనను గౌరవించింది. అంతేకాకుండా వరంగల్ లోని వైద్య కళాశాలకు ఆయన పేరు పెట్టినది.అంత గొప్ప మహనీయుడు కాళోజి గారు ఆయన కు భారత దేశంలో అత్యున్నత పురస్కారం అయిన పద్మ విభూషణ్ పొందినాడు.ఇంతటి మహనీయుడు కాళోజీ నారాయణరావు గారి జయంతిని, రాష్ట్ర పండుగగా గుర్తించినారని ఈ సందర్భంగా తెలిపినారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మోతే భాగ్యలక్ష్మి- ఎల్లారెడ్డి, కార్యదర్శి పరశురాములు,మాది హక్కుల దండోరా వర్కింగ్ ప్రెసిడెంట్ క్యా దాసి భాస్కర్, వార్డు సభ్యులు సమ్మయ్య, కరోబార్ సమ్మయ్య, మరియు పోశయ్య, మల్లారెడ్డి, గ్రామపంచాయతీ పాలకవర్గ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version