అంతర్ రాష్ట్ర దోపిడీ దొంగల ముఠా సభ్యుడు అరెస్ట్.

హనుమకొండ జిల్లా నేటిధాత్రి: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇంటిలో ఒంటరిగా

వున్నవారికి చంపుతామని బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాలోని సభ్యుడుని సిసిఎస్ మరియు లింగాలఘనపూర్ పోలీసులు సంయుక్తంగా కలసి అరెస్ట్ చేశారు.

 ముఠాలోని మిగితా ఏడుగురు సభ్యులు సోను, బడేబాయి, తారీఫ్, నిస్సారుద్దీన్,

రాహుల్ తో పాటు పేర్లు తెలియని మరో ఇద్దరు ప్రస్తుతం పరారీలో వున్నారు.

అరెస్ట్ చేసిన నిందితుడి నుండి మూడు లక్షల పదివేల రూపాయల విలువగల 60 గ్రాముల బంగారు అభరణాలతో పాటు రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ అరెస్ట్ కు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ పోలీసులకు చిక్కిన నిందితుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం , బదాయున్ జిల్లాకు చెందిన ఫర్మాన్ ఖాన్ (వయస్సు 22) ముంబైలో పండ్ల వ్యాపారం చేసేవాడు. ఇదే సమయంలో డబ్బు కోసం స్థానికంగా వుండే మరో నిందితుడితో కలసి ట్రాక్టర్ బ్యాటరీలను చోరీ చేసిన సంఘటనలో జైలుకు వెళ్ళాడు. నిందితుడు ఫర్మాన్ ఖాన్ జైలు నుండి విడుదలైన తరువాత ముఠాలోని సభ్యుడు తారీఫ్ సూచన మేరకు వరంగల్ లో రెడ్డిపాలెంలో నివాసం వుంటున్న మిగితా నిందితులను కలుసుకున్నాడు. నిందితులందరు సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నారు. ఇందుకోసం గతంలో ఈ ముఠాలోని నిందితుడు సోనుసింగ్ గతంలో పత్తి మిల్లులో పనిచేయడంతో వరంగల్ జిల్లాలోని గ్రామలపై అవగాహన కలిగివున్నాడు. దీనితొ గ్రామాల్లో ఒంటరిగా వున్న మహిళలను చంపుతామని బెదిరించి బంగారం, డబ్బు దోచుకోవడం ద్వారా సులభంగా డబ్బు సంపాదించవచ్చని ముఠా సభ్యుడు సోనుసింగ్ ఆలోచన మేరకు ఈ ముఠా తమ వద్ద ఉన్న అంబాసిడర్ కారులో వరంగల్ మరియు చుట్టప్రక్కల జిల్లాల్లో రెక్కీ నిర్వహించారు. ఇందులో భాగంగా ముఠా సభ్యులు గత నెల 23వ తారీఖున సాయంత్రం సమయంలో కారులో హనుమకొండ – హైదరాబాద్ ప్రధాన మార్గంలో రెక్కీ నిర్వహించారు. నిందితులకు లింగాలఘనపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నెల్లుట్ల గ్రామంలో మహిళ ఒంటిరిగా వున్న ఇంటిలో చోరబడి సదరు మహిళను చంపుతామని బెదిరించి బీరువాలోని 250గ్రాముల బంగారు అభరణాలతో పాటు, 70వేల రూపాయల నగదు, ఏటియం కార్డులను చోరీ చేసి ఈ ముఠా తిరిగి వరంగల్ రెడ్డిపాలెంలో నివాసం వుంటున్న ఇంటికి చేరుకున్నారు. కొద్ది రోజుల అనంతరం ఈ ముఠా సభ్యులు ఇదే రీతిలో ఆదోనీ, నారాయణపేట జిల్లాల్లో కుడా దోపిడీలకు పాల్పడ్డారు.

దోపీడీల అనంతరం ఈ ముఠా చోరీ చేసిన సోత్తులో కొంత బంగారం, డబ్బును ప్రధాన నిందితుడు సోనుసింగ్ ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేసిన ముఠా సభ్యుడు ఫర్మాన్ ఖాన్ కు ముట్టజెప్పడంతో నిందితులు వారివారి స్వగ్రామాలకు తిరిగి వెళ్ళారు.

ఈ నెల్లుట్లలో జరిగిన దోపీడీ ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు క్రైమ్స్ అదనపు డిపిపి పుష్పా అదేశాల మేరకు సిసిఎస్ మరియు లింగాలఘన్ పూర్ పోలీసులు సంయుక్తంగా కలసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో నిందితులను గుర్తించిన పోలీసులు ఈ ముఠా సభ్యుల కదలికలపై నిఘా పెట్టారు. ఇందులో భాగంగా నిందితులు తిరిగి వరంగల్ నగరంలో సంచరిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం రావడంలో శనివారం ఉదయం వరంగల్ రైల్వే స్టేషన్ లో ముఠా సభ్యులకై ఆరా తీస్తుండగా, పోలీసుల చూసి పారిపోవుటకు ప్రయత్నించిన నిందితుడు ఫర్మాన్ ఖాన్ ను పోలీసులు పట్టుకోని అతనిని తనీఖీ చేయడంతో నిందితుడి బంగారు అభరణాలు గుర్తించిన పోలీసులు నిందితుడిని విచారించగా నిందితుడు ముఠాతో పాల్పడిన దోపీడీని అంగీకరించాడు.

ఈ దోపిడీ దొంగల ముఠా సభ్యుడుని అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఏసిపి క్రైమ్స్ డేవిడ్ రాజు, సిసిఎస్ ఇన్స్ స్పెక్టర్లు రమేష్ కుమార్, శ్రీనివాస్ రావు, లింగాలఘన్ పూర్ ఇన్స్ స్పెక్టర్ సంతోష్, సైబర్ క్రైం ఇన్స్ స్పెక్టర్ జనార్ధన్ రెడ్డి, ఏఏఓలు సల్మాన్‌పాషా, ప్రశాంత్ సిసిఎస్ ఎస్.ఐలు రాజేందర్,యాదగిరి, లింగాలఘనపూర్ ఎస్.ఐ రఘుపతి, ఏఎస్ఇ వీరస్వామి, తిరుపతి, హెడ్ కానిస్టేబుళ్ళు సదయ్య, రవికుమార్, మహమ్మద్ éలీ, జంపయ్య, కానిస్టేబుళ్ళు విశ్వేశ్వర్, చంద్రశేకర్, వంశీ,లింగాలఘనపూర్ కానిస్టేబుల్ భాస్కర్ ను పోలీస్ కమిషనర్ అభినందించారు. ఈ పత్రికా సమావేశంలో అదనపు డిసిపి వైభవ్ గైక్వాడ్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!