మున్సిపల్ లో నిధుల దుర్వినియోగంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు

జమ్మికుంట, (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : జమ్మికుంట మున్సిపాలిటీలో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ మెజార్టీ పాలకవర్గ సభ్యులు మున్సిపల్ ఉన్నతాధికారులకు మరియు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జమ్మికుంటలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఎక్కడ చూసినా అదే చర్చ జోరుగా జరుగుతోంది. గత కొంత కాలంగా మున్సిపల్ చైర్మన్ కు పాలకవర్గ సభ్యులకు మధ్య పాలనలో వారిలో ఉన్నటువంటి బేధాభిప్రాయాలు ఒక్కసారిగా బయటికి వస్తున్న క్రమంలో ఉప ఎన్నిక నేపథ్యమాఅని వాటినీ బయటకి పొక్కకుండా ఇన్ని రోజులు కాపాడినటువంటి పాలకవర్గ సభ్యులు. ఉప-ఎన్నిక పూర్తికాగానే ఈ నెల 16న పాలకవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పొందుపరచిన ఎజెండా అంశాలు చూసిన పాలకవర్గ సభ్యులు ఒక్కసారిగా విస్మయానికి గురి అయినట్లు చెప్పారు. పలు అభివృద్ధి పనుల పేరుతో పాలకవర్గ సభ్యుల అనుమతి లేకుండానే 90 శాతం ముందస్తుగా బిల్లులు చెల్లించారని.

అభివృద్ధి పేరుతో నిధుల దుర్వినియోగం జరిగిందని. సదరు పనుల పై పూర్తి విచారణ చేపట్టాలని 17 మంది కౌన్సిల్ సభ్యులతో కూడిన ఫిర్యాదు కాపీ మున్సిపల్ ఉన్నతాధికారులతో పాటు కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో 30 కౌన్సిల్ స్థానాలు ఉండగా… కేవలం ఒక్క కౌన్సిల్ మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థిగా ఉండగా.. మిగతా 29 మంది కౌన్సిలర్లు తెరాస మద్దతుదారులే అయినప్పటికీ…. వారిలోపనే 17 మంది కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశంలో జరుగుతున్నటువంటి పొందుపరచిన ఎజెండా అంశాలను తప్పుబడుతూ…. వాటిలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ… కలెక్టర్ తోపాటు మున్సిపల్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడం చూస్తుంటే.. ఏ స్థాయిలో మున్సిపల్ కార్యాలయంలో అవినీతి జరుగుతుందో అర్థమవుతుంది. ఏకఛత్రాధిపత్యంగా మున్సిపల్ చైర్మన్ అన్ని తానై వ్యవహరించడం చూస్తుంటే అసలు పాలన సజావుగా జరుగుతుందా… ఒక వ్యక్తే కేంద్రీకృతమై పాలన జరుగుతుందా అనేఅటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో మీడియాకు సమావేశాలు జరిగినప్పుడు పాల్గొనేందుకు అవకాశం ఉండగా.. ఉన్నతాధికారుల నుంచోలి ఆదేశాలు లేవ్వంటు సమావేశాల్లో మీడియాను అనుమతించకుండా తూతూ మంత్రంగా వాళ్ల సమావేశాలు నిర్వహించుకోవడం పరిపాటిగా మారింది. ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు కౌన్సిలర్ల సమన్వయంతో దృష్టి సారించాల్సిన చైర్మన్. ఏకపక్ష నిర్ణయాలతో జమ్మికుంట మున్సిపల్ పాలన గాడి తప్పుతుంది. దీని పై ప్రశ్నించే నాథుడే లేకపోవడంతో నేనేం చేసినా అడిగే వారు లేరనే ధైర్యంతో ఏకపక్షంగా మున్సిపల్ చైర్మన్ వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రజలు కట్టే పన్నుల డబ్బుతో పాలన జరుగుతుందనే విషయాన్ని పాలకవర్గం మర్చిపోయి తమ ఇష్టానుసారం పరిపాలన చేయడమనేది సరైన విధానం కాదని. ప్రభుత్వం ఖర్చు చేస్తున్న ప్రతి పైసా ప్రజలకు తెలియాల్సిందేనని. ఆ విషయాన్ని జమ్మికుంట పురపాలక సంఘం చైర్మన్, అధికారులు విస్మరించడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఏది ఏమైనా ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు పని చేస్తున్న పాలకవర్గం ఆ దిశలో పూర్తి స్థాయిలో సరైనటువంటి పాలన అందించేందుకు దృష్టిసారించాలని పట్టణ ప్రజలు సైతం కోరుకుంటున్నారు. మున్సిపల్ లో జరిగిన నిధుల దుర్వినియోగం పై మెజార్టీ పాలకవర్గం సభ్యులే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం పట్ల పట్టణంలో ఎక్కడ చూసినా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇక ముందు కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు దృష్టి సారించి ప్రజా ధనాన్ని కాపాడేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని మేధావి వర్గాలు సైతం కోరుతున్నాయి.

విధినిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు..: కలెక్టర్ గోపి

  • పాఠశాల పని తీరుపై అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్.
  • మరిన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తాం జెడ్పి చైర్ పర్సన్ గండ్ర జ్యోతి.
  • పెద్ది స్వప్న చొరవతో కదిలిన జిల్లా అధికార యంత్రాంగం.       

నల్లబెల్లి – నేటి ధాత్రి :ఇటీవల జరిగిన జడ్పీ సమావేశంలో మండలంలోని మూడు చెక్కల పల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల లో నెలకొన్న సమస్యలపై జడ్పీ సమావేశంలో జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న ప్రస్తావించి నివేదికను కలెక్టర్ మరియు సంబంధిత అధికారులకు అందజేయగా స్పందించిన జిల్లా కలెక్టర్ గోపి, జెడ్పి చైర్ పర్సన్ గండ్ర జ్యోతి మంగళవారం జిల్లా యంత్రాంగంతో గిరిజన ఆశ్రమ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసినారు ఈ సందర్భంగా కలెక్టర్ అక్కడ నెలకొన్న సమస్యలను స్వయంగా పరిశీలించి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులను మందలించారు.
పాఠశాలలో త్రాగు నీటి సమస్య, వాటర్ పైప్ లీకేజెస్, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడాన్ని గుర్తించి తక్షణమే పరిస్థితులను చక్కదిద్దాలని అధికారులను ఆదేశించారు.

 పాఠశాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తా. గండ్ర జ్యోతి

జెడ్పి చైర్ పర్సన్ గండ్ర జ్యోతి మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఆహారాన్ని మెనూ ప్రకారం అందించాలని, పచ్చదనం పరిశుభ్రతను పాటిస్తూ పిల్లలకు మెరుగైన విద్యను అందించి వారి భవిష్యత్తుకు దోహదపడాలని ఆమె అన్నారు అలాగే పాఠశాలలోని వంటగది, డార్మెటరీ, టాయ్ లెట్స్, వాటర్ ప్లాంట్స్ ను పరిశీలించి రిపేర్స్ ఉన్న చోట్ల యుద్ధ ప్రాతిపదికన పనులను చేపట్టాలని, మౌలిక వసతులు కల్పనపై దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులు రెగ్యులర్ గా పాఠశాలను విజిట్ చేస్తూ మానిటరింగ్ చెయ్యాలని లేనియెడల చర్యలు తప్పవని అధికారులను ఆమె ఆదేశించారు.

 విద్యార్థులతో మాటామంతి

పాఠశాలలోని విద్యార్థినులతో కలెక్టర్, జెడ్పి చైర్ పర్సన్ స్వయంగా మాట్లాడుతూ ఉపాధ్యాయుల బోధన, తరగతుల నిర్వహణ సక్రమంగా నిర్వహిస్తున్నార అని అడిగి తెలుసుకున్నారు త్వరలోనే పాఠశాలలో పూర్తిస్థాయిలో సిబ్బందిని భర్తీ చేస్తామని వారన్నారు.

ఈ కార్యక్రమంలో జెడ్పి వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ , జెడ్పి ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న , ఎంపీపీ ఉడుగుల సునీత ప్రవీణ్ గౌడ్ , డి టి డి ఓ జహీరుద్దీన్, జె డి ఎ ఉషా దయాల్,ఆర్ డి ఓ పవన్, ఏ డి ఏ తోట శ్రీనివాసరావు ,తాసిల్దార్ ప్రవీణ్ కుమార్ , ఎం పీ ఓ కూచన ప్రకాష్, ఏవో పరమేశ్వర్, సర్పంచ్ పూల్ సింగ్, ఎంపీటీసీ దేవ్ నాయక్, వివిధ శాఖలకు చెందిన అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇసుక క్వారీలను వెంటనే నిలిపి వేయకుంటే కోర్టును ఆశ్రయిస్తాం : జడ్పిటిసి నామ కరంచంద్ గాంధీ

ములుగు, నేటి ధాత్రి : ములుగు జిల్లా ఏజెన్సీ గ్రామీణ ప్రాంతాలలో ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఇసుకాసురులు దోపిడీకి పాల్పడుతున్నారు. ఈ వ్యవహారంపై కన్నాయిగూడెం జడ్పిటిసి నామ కరంచంద్ గాంధీ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ పలు అంశాలను వెల్లడించారు. ప్రజలకు నయానో భయానో ఎంతో కొంత ముట్టజెప్పి వారి పట్టా భూములను లీజుకు తీసుకొని ఇసుక దొంగలు అధికార పార్టీ నాయకుల అండదండలతో అధికారులను మచ్చిక చేసుకొని నిబంధనలకు విరుద్ధంగా ఇసుక క్వారీలకు అనుమతులు పొంది ఇసుకను ఏజెన్సీ గ్రామీణ అటవీ ప్రాంతాల నుండి వరంగల్ హైదరాబాద్ లాంటి నగరాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటు అందినకాడికి దోచుకుని కోట్లు గడిస్తున్నారని ఆరోపించారు. ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో పది కిలోమీటర్ల మేర పర్యావరణ పరిరక్షణ హద్దులు కలిగి ఉంటాయి ఎక్కువ సెన్సిటివ్ జోన్ పరిధిలో పర్యావరణానికి వ్యతిరేకంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి వీలు లదు. కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రత్యేకమైన నిబంధనలు కలిగి ఉన్నాయి అని జెడ్ పి టి సి నామ కరంచంద్ గాంధీ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పర్యావరణానికి హాని కలిగించే ప్రయత్నం ఎవరు కూడా చేయవద్దు కానీ బుట్టాయిగూడెం, చింతగూడెం ఏటూర్ నాగారం ప్రాంతాలలో ఇసుక క్వారీలు ఏర్పాటు చేసి పూర్తిగా నిబంధనలు తుంగలో తొక్కి తూట్లు పొడుస్తున్నారని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులు ఎవరైనా లాలూచీ పడితే అధికారులపై కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బుట్టాయిగూడెం చింతగూడెం గ్రామంలో ఇసుక క్వారీ పెట్టడానికి ముందు ఏర్పాటుచేసిన డి ఎల్ సి పై పరిపాలన అధికారి జిల్లా కలెక్టర్ కి భూగర్భ జల వనరుల అధికారులు ఇతర అధికారులు తప్పుడు నివేదికలు ఇచ్చే కలెక్టర్ ని తప్పుదోవ పట్టించారని వాపోయారు. గ్రామాలను పర్యావరణ రహితంగా మార్చి అడ్డగోలుగా ఖనిజ సంపదను ధ్వంసం చేస్తున్నారని అన్నారు. పర్యావరణ పరిరక్షణ గురించి జిల్లా కలెక్టర్ పూర్తిస్థాయిలో శ్రద్ధ తీసుకోవాలని ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

నదీ గర్భంలో ఇసుక అక్రమ తవ్వకాలు ఉన్నారని ఇది సరైంది కాదని ఆయన తెలిపారు.
వాగులో రోడ్లు వేసి గోదావరి కి అనుసంధానం చేసి రాత్రి పూట ఇసుక అక్రమ తవ్వకాలు నదీ గర్భంలో చేపడుతున్నారు. ఇసుక ఖనిజ సంపదలను ఇసుక వ్యాపారులు కొల్ల కొడుతున్నారని ఆయన ఆవేదన చెందారు. టి ఎస్ ఏం డి సి పి ఓ న స్వయంగా అదనపు బకెట్ దందా కి పూర్తి సహకారం అందిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయని అదనపు బకెట్ దందా కి టి ఎస్ ఎన్ డి సి పి ఓ అనుమతి ఇవ్వడం జరిగిందని వ్యవహారం లో వచ్చిన వాటాలో గుత్తేదారులు అధికారులు వాటాలు పంచుకున్నట్లు ఆరోపించారు. మైనింగ్ అధికారులు రెండు బకెట్ లకు మాత్రమే అనుమతి ఇచ్చారని చెప్పుకుంటూ గుత్తేదారులు అదనంగా ఐదు బకెట్లో వరకు ఒక్కొక్క బడ్జెట్ కు రెండు వేల చొప్పున వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. బుట్టాయిగూడెం, చింతగూడెం ఇసుక క్వారీల నుండి ప్రతి లారీ ఓవర్లోడ్ తో పోతూ రోడ్లను ధ్వంసం చేస్తున్నారనీ ఇసుక నిబంధన మేరకు తీయకుండా ఇష్టానుసారంగా తీయడంతో నది భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని జెడ్ పి టి సి అన్నారు. రైతులు పూర్తిస్థాయిలో తాగునీటికి సాగునీటికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చిందని, నది గర్భంలోనే మట్టి రోడ్లు చేశారని ఆయన పేర్కొన్నారు.

కన్నాయిగూడెం మండలంలో 52 కోట్లతో నిర్మించిన రోడ్డు ప్రస్తుతం ఇసుక లారీల వల్ల ధ్వంసం అవు తుందని కన్నాయిగూడెం ప్రజలందరికీ కొద్ది సంవత్సరాల క్రితమే రోడ్డు అందుబాటులోకి వచ్చింది రూ 52 కోట్లతో నిర్మించిన రోడ్డు ప్రస్తుతం ఇసుక లారీలు ఓవర్ లోడ్ తో వెళ్లడం ద్వారా రోడ్లు పూర్తిగా ధ్వంసం అవుతున్నాయని అన్నారు. దీని వెనుక పాత్ర సూత్రధారులు మొత్తం టి ఎస్ ఏం డి సి అధికారులే అధికారులు పూర్తిగా నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు 52 కోట్లతో నిర్మించిన రోడ్డు ధ్వంసం అవుతున్న భూగర్భజలాలు అడుగంటి పోతున్న ఎవరి ప్రయోజనం కోసం గుత్తేదారులకు సంపాదించి పెట్టడానికి ఇసుక క్వారీలు ఏర్పాటు చేసుకొని సంపాదన ధ్యేయంగా ఇసుకను తోడేస్తున్నారనీ తెలిపారు.

అటవీ శాఖ జిల్లా విజిలెన్స్ అధికారులు గత శనివారం ఆకస్మాత్తుగా క్వారీలలో తనిఖీలు నిర్వహించారనీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో ఇసుక క్వారీల నిర్వాహకులు అధికార పార్టీ నాయకులు కొంతమంది అధికారులను మభ్యపెట్టే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారనే విమర్శలు వెల్లు వెతుతున్నాయని తెలిపారు.

అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న అంతసేపు వాజేడు, వెంకటాపురం, కన్నాయిగూడెం ఎటురు నాగారం ఆయా మండలాల్లోని పట్టా ల్యాండ్స్ సొసైటీ ఇసుక క్వారీల నుండి లారీలు నిలిపివేశారని ఆయన అన్నారు. నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు ఉన్నాయని నిబంధనలు తుంగలో తొక్కి ప్రభుత్వాన్ని అధికారులను మోసం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా క్వారీలను ఆపకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి, ప్రజల పక్షాన పోరాటం చేయక తప్పదని జడ్పిటిసి నామ కరంచంద్ గాంధీ హెచ్చరించారు.

ఘనపురం స్టేషన్ లో నిరసనల వెల్లువ , పలుచోట్ల పాల్గొన్న ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య

ఘనపురం మండల కేంద్రంలో రైతు వ్యతిరేక చట్టాలు కలిగించిన కేంద్ర ప్రభుత్వం బీజేపీ పై నిరసన శవ యాత్రలు చేపట్టడం జరిగింది ర్యాలీగా శవాన్ని ఊరేగింపు చేశారు ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఈ రోజున ఘనపూర్ స్టేషన్ నియోజక వర్గంలో అన్ని గ్రామాలలో ఈ నిరసనలు చేపట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డివిరిచే ప్రయత్నం చేస్తుందని ప్రతిదీ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తూ రైతాంగాన్ని రైతులు పండిస్తున్న పంటలను ధాన్యాన్ని కొనకుండా ఇబ్బంది పాలు చేస్తుందని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం యొక్క ఒంటెద్దు పొకడ వల్ల అలాగే రైతుల వ్యతిరేక చట్టాల వల్ల రైతులు అయోమయ పరిస్థితి లో పడ వేస్తున్నారని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు నిర్ణయాలు మార్చుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇలానే నిరసనలు చేపడతామని వారు హెచ్చరించారు.
ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతాంగం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి పనుల వల్ల రిజర్వాయర్లు కాలువల ద్వారా వస్తున్నా సాగునీటితో రైతులు పంటలు పండించి సంతోషంగా ఉంటున్నారు ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులను తప్పుదోవ పట్టిస్తూ రైతులను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నామని అన్నారు

ఘనపూర్ స్టేషన్ మండలం కొత్తపల్లి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా బీజేపీ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం కోసం చావు డప్పుతో శవయాత్ర ద్వారా గ్రామంలో ఊరేగింపు కార్యక్రమం లో పాల్గొన్నా తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, కొత్తపల్లి గ్రామ సర్పంచ్ గోవిందు ఆనందం,
స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారుపాక రవి, కూడా డైరెక్టర్ ఆకుల కుమార్ గన్ పూర్ మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు, సింగపూర్ ఎంపీపీ కందుల రేఖ-గట్టయ్య, ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు

ఘనపూర్ స్టేషన్ మండల కేంద్రంలోని తానేదార్ పల్లి గ్రామంలో బుధవారం రోజున గ్రామ శాఖ అధ్యక్షుడు కాంసాని రాజు రెడ్డి, ముఖ్యఅతిథి మార్కెట్ వైస్ చైర్మన్ చల్ల చందర్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చట్టాలపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను డబ్బులతో గ్రామమంతా ఊరేగింపు చేసి గ్రామ చౌరస్తా సెంటర్ లో దిష్టిబొమ్మను తగలబెట్టి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ యూత్ అధ్యక్షుడు గుండె రంజిత్, మండల్ ఎస్సీ సెల్ ఉఫాద్యాక్షడు గాదె పురుషోత్తం, గ్రామ శాఖ బీసీ సెల్ కార్యదర్శి రాచర్ల శీను, మండల నాయకులు చల్ల అనిల్ రెడ్డి, ఉరుమొడ్ల పద్మా రెడ్డి, కొలిపాక కొంరయ్య, కొలిపాక చంద్రు, గ్రామ శాఖ మహిళా విభాగం అధ్యక్షురాలు మాచర్ల విమల, మండల మహిళా ఉపాధ్యక్షురాలు మాచర్ల నీల, గ్రామ శాఖ మహిళా కార్యదర్శి బాస్కుల వెంకటమ్మ, చింత జయ, చుక్క కౌసల్య, డప్పు కళాకారులు బాస్కుల చిన్న ఎల్లయ్య, బాస్కుల ఉప్పలయ్య, బాస్కుల ఏలియా, చింత ప్రభాకర్, బొమ్మగళ్ళ చంద్రయ్య, మంద అశోక్ అశోక్, గుండె క్రిష్టయ్య, గాదె ముత్తయ్య, పెండ్లి ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

జనగామ జిల్లా జఫర్గడ్ మండల కేంద్రంలో తమ్మడ పల్లి గ్రామంలో మోడీ దిష్టిబొమ్మను చావు డప్పులతో ఊరేగింపుగా చేసి బిజేపి ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు హాజరయ్యారు, ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు చిలువేరు శివయ్య
గ్రామశాఖ అధ్యక్షుడు మారపల్లి కుమార్, మండల పార్టీ ఉపాధ్యక్షుడు రాపర్తి
రాజ్ కుమార్, గ్రామ రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ గద్ద కొమురయ్య, పిఏసిఎస్ డైరెక్టర్ లోకిని భిక్షపమ్మసాయిలు, మండల పార్టీ రైతు విభాగం మాజీ అధ్యక్షుడు పులిగిళ్ళ కుమార్,
వేల్పుల కొమురమ్మ,మహమ్మద్ బషీర్, వేల్పుల సతీష్, మహమ్మద్ రియాజ్, రైతులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

పాలకుల విధానాలే అతి పెద్ద శాపం : తాటి వెంకటేశ్వర్లు

దేశంలో, రాష్ట్రంలో పాలకులు అవలంబిస్తున్న దివాలాకోరు విధానాలు అన్ని వర్గాల ప్రజలకు అతి పెద్ద శాపంగా మారాయని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం(బికెయంయు) రాష్ట్ర కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు అన్నారు.
ఆదివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఆ సంఘం జిల్లా 2వ మహాసభ జరిగింది. ఈ సందర్భంగా సంఘ పతాకాన్ని తాటి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం అలుపెరగని పోరాటం చేసిన చరిత్ర వ్యవసాయ కార్మిక సంఘానికి ఉందన్నారు. దున్నేవాడికే భూమి కావాలని. వెట్టిచాకిరీ నిర్మూలించాలని తొలినాళ్ళనుండి ఉద్యమిస్తూనే ఉందని చెప్పారు . సుదీర్ఘ పోరాటాల ఫలితంగా వచ్చిన అటవీ హక్కుల చట్టం, ఉపాధి హామీ పథకం ఆశించిన స్థాయిలో అమలు కావడం లేదని, ఉపాధి హామీ పథకంలో అవినీతి చోటు చేసుకుంటుందని అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే పరిస్థితి లేదని, పేదలు మరింత పేదలు గా మారిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సబ్సిడీలు పేదలకు అందడం లేదని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కొరత పెద్ద ఎత్తున ఉందని, ప్రభుత్వ వైద్యం పై ఆధారపడి జీవనం సాగిస్తున్న పేదలకు సరైన వైద్యం అందక మృత్యువాత పడుతున్నారని అన్నారు, కరోనా కష్ట కాలంలో ఎన్నో పేద కుటుంబాలు తిండి గింజలు లేక అల్లాడిపోయాయని అని, వైద్యం చేయించుకునే స్తోమత లేక ప్రాణాలు వదిలేశారని, పేదలకు సరైన వైద్య సదుపాయాలు అందించాల్సిన ప్రభుత్వం మొక్కుబడిగా వ్యవహరించిందని అన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీల నిధులు డారి మల్లు తున్నాయని, వాటిని కాజేస్తున్నారని , దీంతో అసలైన లబ్ధిదారులకు మోసం జరుగుతుందని చెప్పారు.

గ్రామీణ ప్రజల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న మాటలు కేవలం కేవలం మిగిలిపోన్నాయని మండిపడ్డారు. క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకుని పరిష్కరించాల్సిన పాలకులు ఖరీదైన భవంతులు, ఏసీ గదుల్లో కూర్చుని మాట్లాడితే ఒరిగేది ఏముందన్నారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా మాట్లాడుతూ ఈ దేశ సంపద కొందరి చేతుల్లోనే నిక్షిప్తమై ఉందని, ఆ వర్గానికి అన్ని రకాల ఫలాలు అందుతున్నాయని అన్నారు. రేషన్ షాపుల్లో ఒకప్పుడు తొమ్మిది రకాల నిత్యావసర సరుకులు ఇచ్చేవారని ఇప్పుడు బియ్యం తప్ప మరేమీ ఇవ్వడం లేదన్నారు వాటిని కూడా రేషన్ షాపు డీలర్లు దొడ్డిదారిన అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు అని మండిపడ్డారు నిత్యావసరాల ధరలు నానాటికీ ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో నిరుపేదలు కొనలేక తినలేక అంటున్నారని కానీ పాలకులు మాత్రం ప్రజాధనాన్ని లక్షల కోట్లు కాజేసి దోచుకుంటున్నారని ఆరోపించారు అన్ని రకాల వస్తువులతో పాటు డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగి పోతున్నప్పటికీ పేదల ఆదాయం మాత్రం కొంచెం కూడా పెరగడం లేదని చెప్పారు.

గిరిజనులు పేదల సాగులో ఉన్న భూమి సమస్యలు పరిష్కరించడంలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, పేదల సాగులో ఉన్న ప్రతి ఎకరాకు పట్టాలు ఇవ్వాలని, ప్రభుత్వం విద్యా, వైద్యానికి పెద్దపీట వేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు, వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈ నెల 29 30 తేదీల్లో రంగారెడ్డి జిల్లా కేసరి లో తలపెట్టిన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 3 వ మహాసభలు జయప్రధానికి పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావులపల్లి రాంప్రసాద్ రాష్ట్ర సమితి సభ్యులు కల్లూరి వెంకటేశ్వర్లు, ముత్యాల విశ్వనాథం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు తమ్మళ్ళ వెంకటేశ్వరరావు, భాస్కర్, వాసంశెట్టి పూర్ణచంద్ర రావు, పద్మ ,ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

నేతకాని రాష్ట్ర సదస్సును విజయవంతం చెయ్యాలి : దుర్గం ప్రేమ్ కుమార్

“చలో కరీంనగర్ విజయవంతం చేయాలని” భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేతకాని సంఘం విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు దుర్గం ప్రేమ్ కుమార్ అన్నారు

భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి: కరకగూడెం మండల పరిధిలోని విలేకర్ల సమావేశంలో ఈనెల 19/12/2021 కరీంనగర్ లోని సాయి మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ లో జరిగే రాష్ట్ర విద్యార్థి సమస్యలపై జరిగే సదస్సును విజయవంతం చేయాలి నేతకాని విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు దుర్గం ప్రేమ్ కుమార్ అన్నారు.

గత కొన్ని ఏళ్లుగా నేతకానీలు ఎదుర్కొంటున్న సమస్యల పైన మరియు ఏజెన్సీ గోదావరి పరివాహక ప్రాంతాల నేతకాని లు ఆదివాసీల ప్రజలతోనే మమేకమై నివసిస్తున్నప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఎలాంటి హక్కులు,చట్టాలు వర్తించక పోవడం వలన అభివృద్ధికి గత 50 సంవత్సరాల వెనకబాటు తనం లో ఉన్నారు. నేతకాని లు విద్య వైద్యం రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డారు. ఇప్పటికైనా నేతకాని కులస్తులు అందరూ ఏకంగా పోరాడాలని కోరుకుంటున్నాను. కాబట్టి నేతకాని కుల బంధువులందరూ మన యొక్క హక్కులను సంపాదించుకో గలము. మన కులస్తులు అందరూ రాష్ట్ర సదస్సును విద్యార్థులు యువకులు పెద్ద సంఖ్యలో హాజరై సదస్సును విజయవంతం చేయగలరు.

దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఆర్థికంగా రాజకీయంగా ఉపాధి పరంగా విద్య పరంగా ఉద్యోగపరంగా మనకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. మనకు జరుగుతున్న అన్యాయాలపై తెలంగాణలోని నేతకాని విద్యార్థి కులస్తుల అందరం ఏకమై ప్రభుత్వంపై మన హక్కుల సాధన కోసం మనకు జరుగుతున్న అన్యాయం గురించి బహిరంగంగా ఉధ్యామాలకు సిద్ధం అవుదాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జాడి నాగరాజు, రామటేంకి మోహన్ రావు, చప్పిడి వెంకటేశ్వర్లు, జాడి సంజీవ, జిల్లా నాయకులు దుర్గం సందీప్‌, ప్రకాష్, గాందర్ల సతీష్,గాందర్ల ధనంజయ, కొండ గొర్ల కోటేశ్వరరావు, బాడిస సమ్మయ్య, బాడిస సుభాష్, జనగం సుమన్, జాడి దినేష్, దుర్గం శరత్ బాబు, దుర్గ ప్రసాద్, జాడి రవి కుమార్,జిమ్మిడి విజయ్,గోగు విజయ్,జాడి విజయ్,దుర్గం ప్రవీణ్, రామటేంకి వంశీ, జాడి అర్జున్, జాడి వంశీ,గాందార్ల లోకేష్,దుర్గం కిరణ్,జిమ్మిడి మనోరంజన్,దుర్గం సురేందర్, తదితరులు పాల్గొన్నారు.

ధాన్యానికి మద్దతు ధరకోసం రైతుల పక్షాన కాంగ్రెస్ పోరాటం : కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

“కాంగ్రెస్ అధికారంలొకి వస్తే….ఖాయిలా పడ్డ పరిశ్రమలను పున ప్రారంభిస్తాం ..వాణిజ్య పంటలకు ప్రోత్సాహం కల్పించడంలో విఫలమైన ప్రభుత్వాలు పసుపు బోర్డు ఏర్పాటును అటకెక్కించిన అర్వింధ్  చెరుకు రైతులను రోడ్డుమీద పడేసిన ఘనత కవితదే ధాన్యానికి మద్దతు ధరకోసం రైతుల పక్షాన కాంగ్రెస్ పోరాటం” – కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల జిల్లా నేటిదాత్రి ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణాలో ఖాయిలా పడ్డా పరిశ్రమలను పున ప్రారంభిస్తామని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాలలో బుధవారం టిపిసిసి ప్రచార కమిటి చైర్మెన్,మాజీ ఎంపీ మధు యాష్కిగౌడ్ పుట్టిన రోజు సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నిర్మానాథ్మక పాత్ర పొశిస్థుంధన్నారు.

జగిత్యాల జిల్లాలోని ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీని ప్రభుత్వపరంగా నడిపించి చెరుకు రైతులను అన్నివిధాల ఆధుకుంటానని చెప్పి ఎన్నికల్లో ఎంపీగా గెలిచి ఆ ఫ్యాక్టరీనే మూయించి రైతులకు తీరని అన్యాయం చేశారని కవిత పై తీవ్రంగా జీవన్ రెడ్డి మండిపడ్డారు.

నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పసుపు పంటను రైతులు అధికంగా పండిస్థారని నాకు ఓట్లు వేసి గెలిపిస్థే పసుపు బోర్డ్ తీసుకువచ్చి గిట్టుబాటు ధర కల్పిస్థానని రైతులకు బాండ్ పేపర్ రాసి ఇచ్చి దాన్ని ఎంపీ అరవింద్ అటకెక్కించారని దుయ్యబట్టారు.
ఇరువురు నిజామాబాద్ ఎంపీలు రైతుల విషయంలో మోసం చేశారని చెభుతూ ఎంపీగా మధుయాష్కీ బడుగు,బలహీన,మైనార్టీ వర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజక వర్గాన్ని అభివృద్ధి పర్చాడని పేర్కొన్నారు.

రాష్ట్రంలో పసుపు,మిర్చి వాణిజ్య పంటలకు ప్రోత్సాహకాలు కల్పించక పోవడంతో రైతులు తీవ్రంగా నస్టపొయారని కెంధ్ర,రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం వరి పంటకు ప్రత్యామ్నాయoగా ఆరుతడి పంటలు వేసుకోవాలని చెబుతూ వాటికి అవసరమైన చర్యలు తీసుకోవడం లేదనీ విమర్శిస్తునె జగిత్యాల ప్రాంతంలో చెరుకు పంట అనుకూలంగా ఉంటుందని దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని ప్రభుథ్వానికి సూచించారు.

రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విపలమయ్యయని ఆరోపించారు. రైతుల ధాన్యానికి మద్దతు ధర కల్పించడంకొసం కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణా ఉద్యమంలో మధుయాష్కి కీలకంగా వ్యవహరించి సోనియాగాంధీకి తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను వివరించి సానుకూలపరిచారని వివరించారు.

మధు యాష్కి పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అడ్లురి లక్ష్మణ్ కుమార్ తో కలిసి కేకు కట్ చేసి నాయకులకు తినిపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గిరి నాగభూషణం,దేవేందర్ రెడ్డి, బండ శంకర్ , ధుర్గయ్య,మన్సుర్ ఆలీ, రామచంద్రా రెడ్డి, చిట్ల అంజన్న , జున్ను రాజేందర్, గుండా మధు, రఘువీర్ గౌడ్, తోట నరేశ్,మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.

మండలకేంద్రానికి చేరుకున్న జ్ఞాన యుద్ధ యాత్ర..

26 నవంబర్ 2021న యాదాద్రి… నుండి ..భువనగిరి జిల్లా కేంద్రం.అంబేద్కర్ విగ్రహం 14 ఏప్రిల్ 2022 వరకు ….
పల్లె నుండి ఢిల్లీ వరకు { సి ఏ పి ఎస్ ఎస్ } జాతీయ కమిటీ అధ్యక్షుడు జేరిపోతుల పరుశరము . జ్ఞాన యుద్ధ యాత్ర ను ప్రారంభించారు
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి నేటిదాత్రి డిసెంబర్15 ఇల్లంతకుంట మండలకేంద్రంలో రావడంతో వారికి మండల అంబేద్కర్ నాయకులు వారికి ఘనంగా స్వాగతం పలికి తరువాత అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారు మండలకేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో అంబేద్కర్ మండల అధ్యక్షుడు తడ్కపల్లి భూమయ్య ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసినారు . సి ఏ పీ ఓ ఎస్ ఎస్ జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరుశరములు మాట్లాడుతూ ..మా యొక్క ఈ యాత్ర ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే మన్న దేశంలో కరెన్సీ నోట్ల పై. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్ర పాఠాన్ని ముద్రించాలని.అలాగే .స్వతంత్ర దినోత్సవం రోజున .గణతంత్ర దినోత్సవం రోజున అందరి చిత్రపటలతో పాటు అంబేద్కర్ చిత్ర పాఠాన్ని పెట్టాలని కోరారు.దేశంలో ఈరోజు ఇలా అందరూ ఉన్నారు అంటే ముఖ్య కారణం. భారత రాజ్యాంగం వ్రాసినది ఒక్క అంబేద్కర్ ఆని. దాంతో పాటు జాతీయ జెండాను కూడా అశోక చక్రాన్ని కూడా పెట్టింది కూడా ఆ మహాత్ముడు అని ఇలా స్వతంత్ర వచ్చిన నాటినుండి భారత దేశంలో నోట్ల ముద్రణలో చాలా రకాల వ్యవసాయ నికి సంభవించింది. ముద్రించారు .అలాగే జాతీయ మహాత్మా గాంధీ చిత్ర పాఠాన్ని కూడా కరెన్సీ నోట్లు పై ముద్రించారు .మాకు గాంధీ అంటే వేరు కాదని వారు మా నాయకుల ని ..కానీ మాకు ఇప్పుడైనా ఇన్ని కార్యక్రమంలో సహాయం చేసిన అంబేద్కర్ చిత్రాన్ని ఎందుకు కరెన్సీ పై ముద్రించారు అని ఈరోజు ఈ యాత్ర చేస్తున్నామని .మరియు దేశంలో చాలా విగ్రహాలు ఉన్నాయి అంటే అవి అంబేద్కర్ వని .కానీ చాలా గ్రామలో పట్టణాల్లో విగ్రహాల పరిస్థితి చూస్తే వ.చేతులు. కన్ను.లేకుంటే మొండిగా పెడుతున్నారు అని వాటికి గ్రామంలో కానీ పట్టణాల్లో కానీ సీసీ కెమెరాల ను ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో మాకు సహకారాన్ని అందించిన .అంబేద్కర్ మండల అధ్యక్షుడు తడ్కపల్లి భూమయ్య.అలాగే మండల అంబెడ్కర్ నాయకులు .గుండ్రేడ్డి రాజు.దేవదాసు.మామిడి సంజీవ్.పసుల బాలరాజు.శంకర్.తడుకపల్లి రాములు.బాలయ్య.తో పాటు తదితరులు పాల్గొన్నారు

కరీంనగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి బీసీ మేధోమథన సదస్సు.

కరీంనగర్ జిల్లా కేంద్రంలో జాతీయ బీసీ విద్యార్థి సంఘం అధ్వర్యంలో బీసీ మేధోమథన సదస్సు నిర్వహించడం జరిగింది,
రెండు రోజుల పర్యటన లో భాగంగా బీసీ, ఎస్సీ విద్యార్థి వసతి గృహాలు సందర్శించి విద్యార్థులతో ముఖ ముఖి నిర్వహించడం జరిగింది, శాతవాహన విశ్వ విద్యాలయంలో సందర్శించి విశ్వ విద్యాలయ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తామని తెలిపారు,

అనంతరం రాష్ట్ర స్థాయి బీసీ మేధోమథన సదస్సు నిర్వహించడం జరింగింది.
ఈ కార్యక్రమంలో అల్ ఇండియా ఓబీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నాయకులు జి కిరణ్ కుమార్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కో ఆర్డినేటర్ జక్కని సంజయ్ కుమార్ లు ముఖ్య అతిధులుగా హాజరై మాట్లాడారు.

కింది డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
1. 2021 జనాభా లెక్కలలో కుల గణన చేపట్టాలి.

2. చట్ట సభల్లో బీసీలకు 53% రిజర్వేషన్లు కల్పించాలి.

3. పెండింగ్ లో ఉన్న పూలే ఓవర్సీస్, అంబెడ్కర్ ఓవర్సీస్ (విదేశీ విద్య), స్కాలర్షిప్, రియంబర్స్మెంట్, హాస్టల్ మెస్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి.

4. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో నూతన పోస్ట్ మెట్రిక్ వసతిగృహాలు నెలకొల్పాలి.

5. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంలో 1000 మంది సమర్థంగల ఓబిసి వసతి గృహాలు ఏర్పాటు చేయాలి.

6. వసతి గృహాలకు, గురుకులకు పక్క భవనాలు నిర్మించాలి.

7. రాష్ర్టంలో ఉద్యోగాల క్యాలెండర్ ను అమలు పరచాలి, నోటిికేషన్లు విడుదల చేయాలి.

8. కరీంనగర్ లో మెడికల్ కళాశాల, సైన్స్ సెంటర్ ను వెంటనే నిర్మించాలి.

9. ఫీజుల రీయింబర్స్మెంట్ పథకం ద్వారా మెడికల్, ఇంజనీరింగ్, డిగ్రీ, పిజి, డిప్లొమా కోర్సులకు పూర్తి స్థాయి ఫీజులను ప్రభుత్వమే చెల్లించాలి.

10. పెరిగిన ధరలకు అనుగుణంగా వసతి గృహాలలో, గురుకులలో, మెస్ చార్జీలు పెంచాలి.

11. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ లో విద్యా రంగానికి ప్రాధాన్యత కల్పించాలి.

పై డిమాండ్లను పరిష్కరించాలని, వాటి సాధన కోసం నిరంతరం ఉద్యమిస్తామని తెలిపారు, అణగారిన వర్గాలపై వివక్ష దోరణి మార్చుకోవాలని సూచించారు లేని పక్షంలో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో అల్ ఇండియా ఓబీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు జి. కిరణ్ కుమార్, జాతీయ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కో ఆర్డినేటర్ జక్కని సంజయ్ కుమార్, జాతీయ సహలదారులు మండే అంజి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓ. కొండల్, ముక్తిష్వర్, పవన్ నాయక్, బీసీ విద్యార్థి సంఘం నాయకులు లెంకల అనిల్, ఎర్ర బాలకృష్ణ, బోయినపల్లి సాయి చంద్, బీర్పుర్ వివేక్, కల్వ అజయ్, దుబాసి ప్రణీత్,
తదితరులు.

పబ్లిక్ గార్డెన్ లో స్వచ్ఛ సర్వేక్షన్-స్వచ్ఛ భారత్.

నేటిదాత్రి, హనుమకొండ : పబ్లిక్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ హన్మకొండ ప్రెసిడెంట్ వల్లాల జగన్ గౌడ్ అధ్వర్యంలో ప్రదానమంత్రి స్వచ్ఛ సర్వేక్షన్లో భాగంగా మన వరంగల్ నగర మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య ఆదేశాల మేరకు హెల్త్ ఆఫీసర్ రాజా రెడ్డి పర్యవేక్షణలో మున్సిపల్ సిబ్బంది మరియు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పబ్లిక్ గార్డెన్ లోని అన్ని పరిసర ప్రాంతాలలో స్వచ్ఛ భారత్ మరియు క్లినింగ్ చేసి స్వచ్ఛ గార్డెన్ కార్యక్రమం చేపట్టారు. బుధవారం జరిగిన ఈ కా ర్యక్రమాన్ని ఉద్దేశించి పబ్లిక్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ హన్మకొండ అధ్యక్షులు వల్లాల జగన్ గౌడ్ మాట్లాడుతు జాతీపిత మహత్మ గాంధీ కలలు కన్న పరిశుద్ద భారతదేశ ఆకాంక్షలను, భారత ప్రధాని నరేంద్ర మోడి గారు స్వీకరించి 2014సంవత్సంరంలో 5సంవత్సరాలలో పరిశుభ్ర భారతవని తయారుచేయడం కోసం స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ రాజారెడ్డి మట్లాడుతు ప్లాస్టిక్ నివారించాలని,పొడిచెత్తను తడిచెత్త వేరు చేసి మున్సిపాలిటీల కు సహకరించాలని మన చుట్టుపక్కలున్న ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలని అన్నారు.

గౌరవ అధ్యక్షులు దేవానందం, వైస్ ప్రెసిడెంట్స్ గిరిజ, అన్నపూర్ణ,కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, కోషాదికారి రాజ్ కుమార్, కిరణ్ రాజ్, ఉపేందర్, ప్రసూనరెడ్డి,అన్వర్,రిపోర్టర్ శ్రీనివాస్, రాంబాబు, కృష్ణ,సంతోష్,రవీందర్,అనిల్,వెంకన్న,చంద్రకళ,ప్రమీల,శానిటరీఇన్స్పెక్టర్స్,అనిల్,గోల్కొండ శ్రీను,మరియు వందల సంఖ్యలో వాకర్స్ పరిశుద్ద కార్మికులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

మరుగుదొడ్ల అక్రమ బిల్లులు దుర్వినియోగం అనే నేటిధాత్రి కథనంతో మంగళవారిపేట సర్పంచ్, ఉప సర్పంచ్ సస్పెండ్.

 

ఖానాపూర్ మండలంలోని మంగళ వారి పేట గ్రామంలో మరుగుదొడ్ల దుర్వినియోగం అనే కథనాలతో నేటిదాత్రి పత్రికలో వచ్చిన వార్తలకు, సర్పంచ్ రమేష్ ఉప సర్పంచ్ ఉపేందర్ బాధితులకు బిల్లులు కట్టమని జిల్లా అధికారులు చెప్పినా కూడా అవకాశం ఇచ్చినా వినియోగించుకోకుండా గత ఆరు నెలలుగా ఇలాగే ఉండడంతో వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి శుక్రవారం రోజు రాత్రి ఎంపీవో కార్యాలయానికి సస్పెండ్ ఆర్డర్స్ వచ్చినట్లు ఎంపీవో తెలిపారు.

దళితులంతా ఏకం కావాలి : ఏ వై ఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్ల మల్లయ్య

 

చిట్యాల, నేటీ దాత్రి:జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్ తో కలిసి మాట్లాడారు. గ్రామాల్లో ఉన్న దళితులంతా సంఘటితంగా ఏకం కావాలని పిలుపునిచ్చారు. దళితులపై జరుగుతున్న సంఘటనలను అరికట్టుటలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనందున కులాల పేరుతో దూషించి దాడులు దౌర్జన్యాలు అవమానాలు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, అందులో భాగంగానే మండలంలో ఒక దళితున్ని కులం పేరుతో దూషించి దాడి చేసి కొట్టారన్నారు. రాజ్యాంగం ప్రకారం, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. దళితులకు సరియైన న్యాయం జరుగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల మనో భావాలు దెబ్బతినకుండ వివిధ రాజకీయ పార్టీలలో ఉన్న దళిత నాయకులంతా ఐక్య మత్యంతో కలిసి కట్టుగా జరుగుతున్న సంఘటనలను అరికట్టేందుకు ఏకమై ముందుకు రావాలని మల్లయ్య కోరారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్ జిల్లా సాంస్కృతిక కార్యదర్శి జన్నే యుగేందర్ చిట్యాల మండల అధ్యక్షుడు బొడ్డు ప్రభాకర్ మండల నాయకులు సరిగొమ్ముల రాజేందర్ బొట్ల ఆనందం గుర్రం తిరుపతి గురుకుంట్ల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్ట్స్ కళాశాలలో బిపిన్ రావత్ కు నివ్వాలి

సుబేదారి, నేటిదాత్రి

 

భారతదేశం త్రివిధ దళాధిపతి( చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ సి డి ఎస్) జనరల్ బిపిన్ రావత్ మరణానికి నివాళులు అర్పించారు. గురువారం కళాశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో బిపిన్ రావత్ చిత్రపటానికి ప్రిన్సిపల్ ఆచార్య బన్న అయిలయ్య పూలమాలవేసి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఆచార్య బన్న ఐలయ్య మాట్లాడుతూ భారతదేశ మొట్టమొదటి త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ బుధవారం తమిళనాడు లో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన విషయం మన అందరికి తెలిసిందే. జనరల్ బిపిన్ రావత్ గొప్ప సైనిక అధికారి అని పొరుగుదేశాలతో సైనిక పరంగా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ శాంతిభద్రతలను కాపాడడంలో బిపిన్ రావత్ చూపిన చొరవ గణనీయమైన దని ఆయన అన్నారు. సుదీర్ఘ అనుభవం గల సైనిక అధికారిని కోల్పోవడం విచారకరమని ఆచార్య ఐలయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డాక్టర్. స్వామి, డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ పని, డాక్టర్ కనకయ్య, డాక్టర్ సురేష్, డాక్టర్ ఉషారాణి, డాక్టర్ సునీత, డాక్టర్ ప్రణీత, డాక్టర్ ఫరా ఫాతిమా, డాక్టర్ శేషు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

కథ కాదు…బాల సుబ్బయ్య జీవితం…..| కౌంటర్‌ విత్‌ కట్టా…

ఒక వ్యక్తి సర్వం కోల్పోయి రోడ్డున పడ్డాడు. దిక్కు లేని వాడయ్యాడు. ఒకనాడు సమాజంలో గౌరవంగా బతికిన బాల సుబ్బయ్య ఇప్పుడు తలదాచుకుని బతకాల్సి వస్తోంది. జాలసుబ్బయ్య ఏ పాపం చేయలేదు. నేరం చేయలేదు. ఒకరికి మోసం చేయలేదు. కాని ఆయన చితికిపోయాడు. చిల్లిగవ్వ లేకుండా భయం భయంగా బతుకుతున్నాడు. ఎప్పుడూ పది మందికి లేదనకుండా, కాదనకుండా అన్నం పెట్టిన బాల సుబ్బయ్య ఆకలికి బాధపడుతున్నాడు. సమయానికి భోజనం లేక కన్నీళ్లు మింగుతున్నాడు. కొన్ని వందల మందికి ఉపాధి కల్పించి, వారి జీవితాలకు వెలుగునిచ్చిన బాల సుబ్బయ్య జీవితం చీకటి చేసుకున్నాడు. తనతోపాటు పది మంది మంచి కోరే బాల సబ్బయ్య పది మందిని చూస్తే పారిపోయే పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకు? కేరుకు పెద్ద మనిషిగా చెలామణి అయ్యే ఓ నేత నిర్వాకం మూలంగా బాల సుబ్బయ్య జీవితం తలకిందులైంది. ఆఖరుకు కుటుంబాన్ని కూడా చూడలేనంతగామారిపోయింది బాల సుబ్బయ్య జీవితంతన జీవితాన్ని ఇలా అంధకారం చేసిన వ్యక్తిని గురించి చెబుతూ, ఉప్పొంగిన కన్నీళ్లను తుడుకుంటూ బాల సుబ్బయ్య బోరున ఏద్చేస్తున్నాడు. ఎలా బతికిన మనిషిని ఎలా అయ్యానని ఆవేదన చెందుతున్నాడు. ఊరు , వాడ , పల్లె తన పట్నంరాష్ట్రం దాటి వచ్చి, మాట కోసం కోట్లు పోగొట్టుకున్న వ్యక్తి పడుతున్న వేదన మాటల్లో చెవ్పలేనిది.తాను పడుతున్న ఇబ్బందులు, పడుతున్న బాధలు బాలసుబ్బయ్య నేటిధాత్రితో పంచుకున్నాడు.

 కట్టా రాఘవేంద్రరావు; నమస్తేబాల సుబ్బయ్య గారు

బాల సుబ్బయ్య: నమస్తే సార్‌

 కట్టా: ఎలా వున్నారు?

బాల: ఊపిరికి, ఉసురుకు మధ్య ఊగిసలాడుతున్నాను

 –కట్టా: అలా అనకూడదుజీవితమే ఒక పోరాటంఅన్యాయం జరిగినప్పుడు న్యాయం కోసం కొట్లాడి సాధించాలి.

బాల; నేను ఒక వ్యక్తితో అయితే పోరాటం చేయలగిగేవాడినేసార్‌కాని అవతల వ్యక్తి ముసుగులో అక్రమ వ్యవస్థ వుంది. దాన్ని డీ కొట్టలేక, బతకలేక , పారిపోలేక బతుకుతున్నాను. ఆకలిని ఎదుర్శొంటూ బతుకుతున్నాను. సమాజానికి దూరంగా బతుకుతున్నాను. ఒక నాడు గొప్పగా బతికానని చెప్పుకునేందుకు బతుకుతున్నాను. నేను ఏ తప్పు చేయలేదు. అయినా భయం, భయంగా బతుకుతున్నాను. మంచి వాళ్లు ఇలా బతుకుంటే, నన్ను మోసం చేసిన కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వారు మాత్రం నవ్వుతూ బతుకుతున్నారు. హుజూరాబాద్‌లో నవ్వు నాకు రక్ష్మ నేను నీకు రక్ష అనుకుంటూ, పెంచి పెద్ద చేసిన పార్టీని ఇద్దరూ వదులుకొని, నీతి మంతులుగా తమను తాము (ప్రచారం చేసుకుంటున్నారు. అది చూస్తూ….మంచికి ఈ లోకంలో స్థానం లేదని తెలుసుకొని బతుకుతున్నాను.

.. సార్‌ఆకలిని ఆపుకోలేను. దుర్మార్గాన్ని ఊస్తూ బతకలేను. కాని ఏం చేయగలను. అసమర్హ్భుడి జీవితయాత్ర సాగిస్తున్నాను.

 కట్టా: బాల సుబ్యయ్య ఏమిటీ మీకు జరిగిన అన్యాయం?

బాల సుబ్బయ్య: మాది ఆంధ్రప్రదేశ్‌ ప్రకాశం జిల్లానేను వదిహేనేళ్లుగా ఎల్‌అండ్‌టి కంపనీలో వని చేశాను. పలు రకాల పనులు చేయిస్తూ వుంటాను. ఒకరోజు నాకు ఓ ఫోన్‌ వచ్చింది. తెలంగాణలో జరుగుతున్న మిషన్‌భగీరథ పనుల్లో పైపుల జాయింట్‌ ఎలా చేయాలన్నది తెలియక కాంట్రాక్టర్లు ఆపసోపాలు పడుతున్నారట. ఆ సమయంలో ఎవరెస్టు కంపనీ నుంచి జనరల్‌ మేనేజర్‌ ఫోన్‌ చేశారు. ఆ ఉద్యోగి నాకు ఇది వరకు పరిచయం. వాళ్లు చేసే కాంట్రాక్టు పనుల కోసం మనుషులు కావాలని చెప్పినప్పుడు పంపించేవాణ్లి. అలా వాళ్లు నాకు తెలుసు. ఒకరోజు ఫోన్‌ చేసి మిషన్‌ భగీరథ పనులు మా కంపనీచేస్తోంది. పైపుల జాయింట్‌ అన్నది ఎలా చేయాలో అర్ధం కావడంలేదు. ఓసారి వస్తే మాట్లాడదామంటే రావడం జరిగింది. వచ్చానుఎలా చేయాలో చూపించాను. దాంతో సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఆ పనులు కొంత కాలం చేయించుకున్నారు. తర్వాత ఈ పనులు నువ్వే సబ్‌ కాంట్రాక్టు తీసుకొని పూర్తి చేయమన్నారు. సరే నాలుగు రూపాయలు మిగులతాయి కదా? పైగా మేమే కాంట్రాక్టు తీసుకుంటే పని కూడా త్వరగా పూర్తి చేసుకొని వెళ్లిపోవచ్చు. అని నా మనుషులను రప్పించుకొని, హుస్నాబాద్‌లో ఆఫీసు తీసుకొని పనులు మొదలు పెట్టి పూర్తి చేశాను. అప్పటికే నేను బిల్లుల గురించి అడుగుతూనే వున్నాను. వనులైతే పూర్తి కాని అంటూ వాళ్లు వాయిదా వేస్తూ వచ్చారే గాని, మోసం చేస్తారని ఊహించలేదు. వాళ్లు బిల్లులు ఇవ్వడం లేదనినా దగ్గర పని చేస్తున్నవారికి ఇవ్వకుండా వుండలేను. వాళ్ల వాళ్ల అవసరాలు వారికి వుంటాయి. కుటుంబాల పోషణ కోసమే పనిచేస్తున్నారు. ఇతర మెటీరియల్‌కు డబ్బులు కావాలి. అందుకోసం మా ఊరిలో అప్పులు చేశాను. తెచ్చి ఇక్కడ పనులు పూర్తిచేశారుఇక అప్పుడు మొదలైంది నాకు వాయింపు

 – కట్టా; ముందూ వెనుక ఆలోచించకుండా ఎలా నమ్మారు?

బాల సుబ్బయ్య: కొంత కాలం వారితో నాకు వున్న సాన్నిహిత్యం నమ్మాను. అయితే అప్పుడు నేను మనుషులను పంపడం వరకే నా పని. కాని ఇలా కిరికిరి పెడతారని మాత్రం తెలియదు. మొదట కొన్ని పనులకు బిల్లులు బాగానే ఇచ్చారు. కాని నన్ను నమ్మిస్తున్నారని అనుకోలేదు. నేను మోసపోతానని ఊహించలేదు. అడిగిన సమయానికి బిల్లులు ఇస్తుండడంతో నేను మరింత నమ్మకం పెంచుకున్నాను. వాళ్లు మోసం చేయడానికి సిద్ధపడుతున్నారని తెలుసుకోలేకపోయాను. మొదట సరిగ్గా ఇచ్చిన వాళ్లు, తర్వాత కాస్త ఆలస్యం చేస్తున్నా గట్టిగా అడగడానికి నాకు మొహమాటం అడ్డం వచ్చింది. అవతల పెద్ద పెద్ద వాళ్లు. కొండా విశ్వేశ్వరరెడ్డి అధికార పార్టీ ఎంపి. పైగా అపోలో ఆసుపత్రులు. ఇన్ని చూస్తూ కూడా వాళ్లు మోసం చేస్తారని అనుకుంటామా? చేసిన వనులకు మరిన్ని పనులు వస్తాయని అనుకుంటామే తప్ప, మోస పోతామని అనుకోంఇదే వాళ్లకు కలిసొచ్చింది. బకరా దొరికాడనుకున్నారు. నాకు నేల నాకించారు. కోలుకోకుండా చేశారు.

  కట్టా: మీకు మోసం చేసిన వ్యక్తి ఎవరు ..?

బాల సబ్బయ్య! నన్ను నమ్మించి మోసం చేసింది మాజీ ఎంపి. కొండా విశ్వేశ్వరరెడ్డి.

  కట్టా: ఎంపి పేరు మీద ఎలాంటి సంస్థ ఉండదు కదా?

బాల : అవును సార్‌ఎవరెస్టు కంపనీ అన్నది కొండా విశ్వేశ్వరరెడ్డి కొడుకు పేరు మీద ఉంది. నాయకులు దేని నుంచైనా తప్పించుకునేందుకు అదే కదా? చేస్తుంటారు. నా విషయంలోనూ అదే చేశారు.

 – కట్టా: నేరుగా ఆయనతో మాట్లాడి ఈ డీల్‌ కుదుర్చుకున్నారా?

 – బాల సుబ్బయ్య?: భలే వారు సార్‌ఆయనతో మాట్లాడడం అన్నది తర్వాత. పెద్ద పెద్ద కంపనీలకు నా లాంటి చిన్న కాంట్రాక్టర్‌ వెళ్లి వాళ్లతో మాట్లాడాల్సిన పరిస్థితి వుండదు. ఆ కంపనీలోనే ఉన్నత స్థానంలో వున్న ఉద్యోగులే అన్నీ మాట్లాడుతుంటారు. మా విషయంలోనూ అదే జరిగింది. కాకపోతే నాకు అన్యాయం జరిగిందన్న సంగతి కొండా విశ్వేశ్వరరెడ్డికి తెలుసు. తెలిసినా ఆయన స్పందించ లేదంటే కావాలనే వాళ్లు అన్యాయం చేస్తున్నారని అర్ధమైంది. దాంతో తేరుకున్న నేను కొండాను కలవాలని ప్రయత్నించగాప్రయత్నించగా ఒకసారి కలిశారు. అప్పుడు సరే సరే అంటూ ముక్తాయించారు. అయినా నాకు బిల్లులు రావడం లేదు. దాంతో మళ్లీ ఆయనను కలిశాను. అయినా నాకు బిల్లులు రాలేదు. దాంతో హుస్నాబాద్‌ ఎమ్మెల్యే ఒడితల సతీష్‌తో 2018 ముందు ఫోన్‌ చేయించాఅప్పుడు కొండా విశ్వేశ్వరెడ్డి ఎమ్మెల్యేను ఆ విషయం నీకు సంబంధం లేదు. వదిలేయ్‌ అన్నాడట. దాంతో ఆ ఆశ కూడా పోయింది. ఎందుకుంటే అప్పుడు ఇద్దరూ ఒకే పార్టీలో వున్నారు. తర్వాత చాలా మందిని కలిశాను. పిడమర్తిరవిని కూడా తీసుకొని రెండుసార్లు కొండా ఆఫీసులకు వెళ్లానుకాని పని జరగలేదు. ఏళ్లు గడిచిపోతున్నాయి. నా అప్పులు పెరిగిపోయాయి. వాటికి మిత్తికి మిత్తి పెరిగి, కోట్లకు చేరుకున్నాయి. వాటిని ఎలా తీర్చాలో తెలియక, ఎలా బతకాలో అర్ధం కాక త్రిశంకు

స్వర్గంలో వున్నాను.

 

కట్టా: అసలు కుటుంబంతో సహాఅన్న నిర్ణయం తప్పు కదా?

 

బాల: మరి ఏం చేయమంటారు సార్‌ఇక నాకు మిగిలిందేమిటి? ఉన్నది పోయింది. అప్పులు మిగిలాయి. సంపాదన ఆగిపోయింది. మరో పని చేసుకోవడానికి వీలు లేకుండాపోయింది. నాకు అనుభవం వున్న పనికి నాకు పెట్టబడి కావాలి. అవి ఎవరు ఇవ్వాలి.

ఎవరి వద్దకు నేను వెళ్లి మళ్లీ అడగాలి. కొత్త వారిని అడగలేను. మా ఊరికి వెళ్లలేను. ఊరిలో మరింత అప్పు చేయలేను. నా భార్యా పిల్లల్ని పైతం ఊరు దాటిపోకుండా కట్టిడి చేసి, ఊరంతా బాల సుబ్బయ్య దివాళా తీశాడని తెలిసిన తర్వాత నాకు ఎవరు సాయం

చేస్తారు? చేసిన వనికే బిల్లులు రాక సతమతమౌతున్నాను. నా బాధ చెప్పుకోవాల్సిన వాళ్లందరికీ చెప్పుకున్నాను. విన్నారు. వదిలేశారు. అందరూ అయ్యో అన్నవాళ్తేకాని సాయం చేసిన వాళ్లు లేరు. మాట సాయం చేద్దామనుకున్నవాళ్లు కూడా మనకెందుకు

అని వదిలేసినవాళ్లేనాకు ఇక్కడ, వాళ్లు తప్ప మరొకరు తెలియదు. మెరపెట్టుకున్నాను. (భతిమిలాడాను. నా పరిస్థితి వివరించాను. అయినా కొండా విశ్వేశ్వరరెడ్డి మనసు కరగలేదు. ఇంకేం చేయమంటారు? ఎలా బతకమంటారు? పూలమ్మిన చోట కట్టెలమ్ముకొనైనా బతకొచ్చు. కాని ఊరు కాని ఊరులో నేను కూలీ చేసుకోలేను. కష్టపడిన సొమ్ము పోయింది. పేరు పోయింది. అప్పులు మిగిలాయి. నా జీవితాంతం కష్టపడినా అంత సొమ్ముసంపాదించగలనా? పెద్ద పెద్ద పనులు చేస్తే కొద్దిగా ఎక్కువ ఆదాయం వస్తుందని కాంట్రాక్టులు చేస్తామే తప్పు మొత్తానికి మునిగిపోయేందుకు ఎవరైనా చేస్తారా? నేను ఇప్పుడు నిండా మునిగి వున్నాను. నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన పెద్ద మనిషి మంచిగా వున్నాడు. నేను ఆకలికి అలమటిస్తున్నాను. నా కుటుంబాన్ని పస్తులుంచుతున్నాను. కన్నీళ్లు దిగమింగి బతుకుతున్నానుఇప్పుడు చెప్పుండి, నాకు దారి చూపించండి. కనీసం మీరైనా నా బాధ ఏమిటన్నది తెలుసుకుంటానన్నారు. అలా వినేందుకు కూడా ఎవరూ ముందుకు రావడంలేదు. నా కన్నీళ్లను ఆపే శక్తి నాకు కూడా లేకుండాపోయింది. అందుకే ఆ పని చేయాలనుకున్నానుఅలా చేస్తానని కూడా కొండా విశ్వేశ్వరరెడ్డికి భహిరంగ లెటర్‌ కూడా రాశాను. అయినా ఆయనలో స్పందనలేదు. అంటే ప్రాణాలు పోసే ఆసుషత్రులు నడుపుకుంటూ, నా ప్రాణాలు తీసుకుంటానని అంటే కూడా కనికరం చూపించలేదు. అలాంటి వ్యక్తి నీతి, నిజాయితీ, ప్రాంతం, అభివృద్ధి అని మాట్లాడుతుంటే నాకు ఎంత రగిలిపోతుందో చెప్పలేనండి. తప్పులు చేసేవాళ్లు అలా నీతులు చెప్పి మోసం చేస్తారని చెప్పడానికి నా జీవితమే ఒక సాక్ష్యం.

 కట్టా: ఎంత కాలం ఈ అజ్ఞాతవాసం?:

బాల: మరి ఏం చేయమంటారు సార్‌నేను ఏం కూలీ చేయాలి. ఆ అప్పులన్నీ ఎలా తీర్చాలి. అప్పులు తీర్చకుంటే ఇచ్చిన వాళ్లు ఊరుకుంటారా? నా సమస్యలు విని వదిలేస్తారా? అందుకే ఇప్పటికైనా మీ ద్వారా ప్రభుత్వానికి, పెద్దలకు తెలియాలని, నాకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగొద్దనే మీ దగ్గరకు వచ్చాను. మిషన్‌ భగీరథ బిల్లులన్నీ ప్రభుత్వం ఎవ్పుడో చెల్లించేసింది. కాని (ప్రభుత్వాన్ని అబాసు పాలు చేస్తూ, బిల్లులు తీసుకొని, నా లాంటి వాడి కష్టం దోచుకొని పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న వారి బండారం (ప్రజలు తెలియాలి. ఆ నాయకుడి మాటలు విని ఎవరూ మోసపోవద్దు. కాకపోతే ప్రభుత్వం ఇప్పటికైనా నేను పడుతున్న బాధలు తెలుసుకొని, నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. నాకు నేనుగా రాలేదు. నన్ను రప్పించి మోసం చేశారు. అలా నమ్మడమే తప్పు అనుకుంటే ఈ లోకంలో ఇక నమ్మకమనే పదమే వుండదుసార్‌అలా నాలాంటి వాడిని మోసం చేసి, పైకి నీతులు చెప్పే వాళ్లు సమాజాన్ని సర్వనాశనం చేస్తారు సార్‌

 ఆ కట్టా: పది మందికి నిత్యం అన్నం పెట్టిన చేయి, ఆసరా కోసం చూడాల్సివస్తుందని ఎప్పుడైనా అనుకున్నారా?

 బాల సబ్బయ్య?: లేదు సార్‌నేను మంచిగా వుంటే మరో పది మందికి ఆకలి తీర్చేవాడిని.. ఎంతోమందికి ఉపాధి కల్పించేవాడిని. ఒక్కరు చేసిన మోసం మూలంగా నేను నష్టపోయాను. నన్ను నమ్ముకున్నవాళ్లు మోసపోయారు. నాకు సాయం చేయడానికి అప్పులిచ్చినవాళ్లు నష్టపోయారు. ఇంత మంది జీవితాలు నాశనం చేసిన వ్యక్తి బతికి బాగుపడ్డా, పోయేప్పుడు పట్టుకుపోతారా? ఇంత దుర్మార్మమా? సార్‌కనీసం వాళ్లకు మానవత్వం అన్నదైనా వుండదా? అన్నం తినేప్పుడైనా ఒకరిని మోసం చేసి తింటున్నాన్న బాధ కూడా రాకుండా వుంటుందా? అలాంటి వాళ్లను ఏంమనాలో మీరే చెప్పండి.

 – కట్టా ; ఇంతకీ ఆ కరపత్రాలు ఎందుకు పంచినట్లుఇప్పుడే ఎందుకు పంచినట్లు..?

బాల : ఈ మధ్య కొండా విశ్వేశ్వరరెడ్డి హుజూరాబాద్‌లో కరపత్రాలు పంచారని తెలిసింది. తాను న్యాయం కోసం పోరాటం చేసే వ్యక్తిగా అందులో ఆయన రాసుకోవడం నన్ను రగిలించింది. ఆయన అసలు స్వరూపం ప్రజలకు తెలియజేసేందుకు నాకు ఇదొక వేధిక అనిపించింది. మామూలు సమయంలో జనానికి పెద్దగా ఆసక్తి వుండదు. ఆయన కరపత్రాలు జనం చూశారని తెలిసింది. అలాగేనా కరపత్రాలు కూడా జనం ఆసక్తిగా చూస్తారని అనుకొని, ఆయన బండారం మొత్తం బైటపెట్టాను. నాకు జరిగిన అన్యాయం కూడా ప్రపంచానికి చాటి చెప్పాను. ఓటు అన్నది ఎంతో పవిత్రమైంది. అలాంటి ఓటు ఒక మోసకారి అసత్య ప్రచారం చేస్తూ, ప్రజలను మభ్యపెట్టడాన్ని చూడలేకపోయాను. ఆయన కరపత్రం చూశాక నాకు కూడా ఇదే పని నేను చేస్తే కుక్కకాటుకు చెప్పుదెబ్బలాగా వుంటుందనుకున్నాను. (ప్రజలకు నేను ఎలా మోసపోయానో తెలుస్తుంది. నన్ను కొండా విశ్వేశ్వరరెడ్డి ఎలా మోసం చేశాడో తెలుస్తుంది. పైగా మోసం చేసే వ్యక్తులు వచ్చి, నీతి, నిజాయితీ అంటూ అబద్దాలు (ప్రచారం చేసి, నన్ను మోసం చేసినల్లే, లక్షలాది మందిని మోసం చేయడాన్ని ఆపాలనుకున్నాను. మోసకారి మాటలు తియ్యగా వుంటాయి. నాకు కూడా ఇలాంటి మాటలే అనేకం చెప్పాడు. అందుకే అలాంటి తేనే పూసిన మాటల వెనుక వుండే విషం గురించి (ప్రజలకు తెలియజేయాలనుకున్నాను. ప్రజలు పొరపాటున కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వారి మాటలు వింటే నిండా మోసపోతారని, ప్రజాస్వామ్యాన్ని బతికించాలని కరపత్రాలు పంచాను. దాంతో నాకు, హుజూరాబాద్‌ ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటున్నారు.

 కట్టా : నీ కోరిక నెరవేరాలని, మీకు మళ్లీ మంచి రోజులు రావాలని మేమూ కోరుకుంటున్నాము. మీకుమీ బిల్లులు వచ్చి, మీ కుటుంబంతో మళ్లీ మీరు సంతోషంగా బతకాలి ఆల్‌ ది బెస్టు.

బాల: ధన్యవాదాలు సార్‌నాకు ఈ మాత్రం మనో ధైర్యం నిండిందంటే అది మీ వల్లేఎన్నికల సమయంలో నా సమస్య పెద్దల దృష్టికి వెళ్లి నా సమస్యలు తీరితే మీ మేలు ఈ జన్మలో మర్చిపోను.

 

 

సీజె ప్రమాణస్వీకారానికి హాజరైన నేర చరితులు, చీఫ్‌ జస్టిస్‌ ప్రమాణస్వికారంలో పాస్‌ల జారీపై ఆరోపణలు

ప్రజల హక్కులను కాపాడుతూ , దేశ అభివృద్ధిలో కీలక వ్యవస్థగా ఉండి నిత్యం పాటుపడే అత్యున్నత వ్యవస్థల్లో అతి ముఖ్యమైన న్యాయవ్యవస్థలో సైతం విధివిధానాలు తప్పుదోవపడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తప్పులు జరిగితే సరిదిద్దే సుప్రిం వ్యవస్థలోనే ఇలాంటివి చోటు చేసుకోవడం పట్ల ప్రజలు , న్వాయవాదులు తీవ ఆందోళన వ్యక్తం చెస్తున్నారు. స్వయంప్రతిపత్తి గల వ్యవస్థలో నేరారోపణలు ఎదుర్కోంటున్న నేతలు కలిసేందుకు అవకాశం కల్పించిన అధికారులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర హైకోర్టుకు సంబంధించిన అధికారిక కార్యక్రమాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం యావత్తు న్యాయవాద వ్యవస్థ పూర్తిగా ఖండిస్తున్నట్లు న్యాయవాదులు బహిరంగ ప్రకటనలకు దిగుతున్నారు. రాష్ట్ర హైకోర్టులో జరిగే అధికారిక కార్యక్రమాలకు ఎవరిని అనుమతించాలో ఎవరిని అనుమతించకూడదో అధికారులకు తెలిసినప్పుటికి బేఖాతరు చేస్తూ ప్రజల్లో అనుమానాలు ,ఆందోళన రేకెత్తించిలా నడుచుకోవడం మంచిది కాదనే వాదనలు ఉన్నాయి.సోమవారం రాష్ట్ర హైకోర్టు సీజేఐగా జస్టీస్‌ సతీష్‌చం[ద శర్మ ప్రమాణస్వీకారం జరిగింది . కార్యక్రమానికి పెద్ద ఎత్తున రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు హాజరయ్యారు.

అయితే ఈ కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన వాస్‌ల జారీలో సంబధిత ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించి ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం పోయ విధంగా వ్యవహరించినట్లు చర్చ జరుగుతుంది. ప్రజలకు న్యాయాన్ని అందించడంలో ప్రజాస్వామ్య రక్షణకు మూలస్తంభంగా ఉన్న న్యాయవ్యవస్థ చీఫ్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నేర చరిత్ర కలిగి ఉండడంతో పాటు అనేక కేసులు ( రాజకీయేతర) కలిగిన వ్యక్తులను అనుమతించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి అనుమతులు జారీ చేయడం వెనుక అధికారుల కారణాలేవైనా ఇది రాజకీయ కార్యక్రమాలు కావనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని న్యాయవాదులు అనుకుంటున్నారు. న్యాయ వ్యవస్ధ ప్రతిష్ట, హుందాతనాన్ని వెక్కిరిస్తుంది సైదం లక్ష్మినారాయణ హైకోర్టు న్యాయవాది ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారానికి నేరారోపణలు ఎదుర్కోంటున్న వ్యక్తులను ఏ విధంగా హజరవుతున్నారో విఐపి పాస్‌లు మంజూరు ఏ ప్రాతిపదికన ఇస్తున్నారో ప్రజలకు తెలియజేయాలి.

న్యాయ వ్యవస్థ అనేది స్వయం ప్రతిపత్తి వ్యవస్థ కలిగి ఉంటుంది. ఇలాంటీ సమయంలో నేరారోపణలు ఎదుర్కోంటున్న వ్యక్తులను వ్పీబ్లే ప్రమాణస్వీకారానికి వివిధ రాజకీయ పార్టలకు చేందిన ఎంపీ , ఎమ్మెల్యే , ఎమ్మెల్సీ , మంత్రులు సహా ఇతర రాజకీయ నేతలు హజరు కావడం వలన ముఖ్యంగా సామాన్య ప్రజల్లోన్యాయవ్యవస్థ పై అప నమ్మకం ఏర్పడటమే కాకుండా న్యాయ వ్యవస్థ ప్రతిష్ట , హుందాతనాన్ని వెక్కిరించే విధంగా ఉంటుంది. రాజకీయ నాయకులు న్యాయమూర్తులను కలవడం ఎంత వరకు సమంజసం

కాంగ్రెస్‌ ఓటు బిజేపివైపు మళ్లిందా? ప్రచారం చేసిన నేతలు పైకి చెప్పదేంమిటి?

నా చేతికి కత్తి అందించండహోనేనేం చేస్తానో….చూడండహోనేనెంత ఎగిరెగిరి దుంకుతానో చూడండహోఅన్న రేవంత్‌ రెడ్డి ఏం చేశారు. కోవర్జులు వుండే వెళ్లిపోవచ్చుఅని పదే పదే చెప్పి రేవంత్‌ చేసిందేమిటి? మరో ఉత్తర కుమారుడికంటే గొప్పగా చేసిందేమిటి? నేను కొట్టినట్లు చేస్తా! నువ్వు ఏడ్చినట్లు చేయి!! నేను తిట్టినట్లు చేస్తాతుప్పిళ్లను తూద్చేయిఅనుకున్నా బాగుండేదేమో! అంతకన్నా అధ్వాన్నంగా కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు వ్యవహరించింది?ఈటెలకు మేలుఎవరికి లాభం;

పార్టీ ప్రయోజనాలను ఫణంగా పెట్టి, ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ సొంత లాభం చూసుకోవచ్చునా! అని కాంగ్రెస్‌ నేతలే కడిగిపారేస్తున్నారు. ఆ పాటి పోటీ ఎందుకు? దానికి అంత ప్రచారం ఎందుకు? ఎవరిని మోసం చేయడానికి అని కాంగ్రెస్‌ సీనియర్లు రగిలిపోతున్నారు. వచ్చీ రాగానే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ కు, పిసిసి అధ్యక్షుడు చేయాల్సిన పనేనా అని కారాలు మిదియాలు నూరుతున్నారు. అసలు గత ఎన్నికలలో పార్టీ పరిస్థితి ఏమిటి? ఇప్పుడున్న స్థితి ఏమిటి? గత ఎన్నికలలో ఈటెల రాజేందర్‌కు చక్కలు చూపించిన కాంగైస్‌ తనకు తానుగా చుక్కలు చూడాలనుకోవడం అంటే ఆత్మహత్య అదృశ్యం కాదా! అదే కౌషిక్‌ రెడ్డి కాంగ్రెస్‌ లో వుంటే, బిజేపికి అంత సీనుండేదా! రేవంత్‌ రాకతోనే కౌషిక్‌ ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది. అలా అపనమ్మకాన్ని కలిగేలా చేసింది ఎవరో పార్టీలో అందరికీ తెలిసిన ముచ్చటే కదా? అలా పార్టీ ప్రయోజనాలను తాకట్టు పెట్టి, పార్టీకి పుట్టగతులు లేకుండా చేయడం వెనుక వున్నదేమిటో అందరికీ తెలుసు. ఇలా పార్టీని ఫణంగా పెట్టడం ఎప్పుడూ జరగలేదు. ఈటెల రాజేందర్‌ బిజేపి నాయకుడు. ఉప ఎన్నికలో బిజేపి అభ్యర్థి. యుద్ధం అన్నాక పోరాడాలి. లేకుంటే ముందే తప్పుకోవాలి. కానీ యుద్ధం మధ్యలో చేతులెత్తేయడం రాజకీయ వైకల్యంవైఫల్యంతాను యుద్ధం చేయగలను అనుకున్నప్పుడు, కదనరంగంలోకి దిగినప్పుడు చావో,రేవో తేల్చుకోవాలి. అది మానిలోపాయి కారి ఒప్పందాలు సరైనవేనా! ఉమ్మడి శత్రువును బలంగా కొట్టాలనుకున్నప్పుడు కలిసి కొట్టాలి. కానీ దొంగ దెబ్బ తీసి శత్రవును గెలిచామనుకోవడం విజయం కాదు.

కొన్ని సార్లు పైకి కనిపించని రాజకీయం కౌకు దెబ్బలా పడుతుందంటారు. అది కోలుకోలేని రాజకీయాలకు మూలం కావొచ్చు. ఇంతకీ హుజూరాబాద్‌ లో కాంగ్రెస్‌ పార్టీ పోషించనున్న పాత్రేమిటి? పోషిస్తున్నదేమిటి? చేతులెత్తేసినంత పని ఎందుకు చేస్తోంది. ఎన్నికల బరిలో నిలిచినట్లేనిలిచి? జాతీయ పార్టీ కాంగ్రెస్‌ పార్టీ. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ. నూటా నలభై సంవత్సరాల వయసున్న చరిత్ర కలిగిన పార్టీ. ఎన్ని సార్లు చీలికలు పీలికలైనా మళ్ళీ నిలబడిన పార్టీ. ఇంతటి దురవస్థను ఏనాడూ ఎదుర్శొని పార్టీసాక్ష్యాత్తు ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలైన ఇందిరా గాంధీ ని సైతం పార్టీ నుంచి బహిష్కరించిన పార్టీ. అంతర్గత ప్రజాస్వామ్యానికి కేరాఫ్‌ అది. దేశంలో మళ్ళీ గ్గ పూర్వ వైభవం కోసం తహతహలాడుతున్న పార్టీ. మరి తెలంగాణ లో ఉనికి కోసం ఆరాట పడుతున్న పార్టీ కాంగ్రెస్‌ పార్టీ. తెలంగాణ ఇచ్చి చెల్లాచెదురైన కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణ ర మళ్ళీ జవసత్వాలు వస్తాయని అందరూ అనుకుంటున్న పార్టీ. మరేమైంది. మొన్నటి దాకా కోవర్టు రాజకీయ ఆరోపణలు విపరీతంగా వున్నదేపార్టీ ప్రెసిడెంట్‌ మారితే తప్ప, పార్టీ తలరాత మారదన్న వాళ్తేఎట్టకేలకు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కుర్చీ దిగిపోయాడు.. రేవంత్‌ రెడ్డి కుర్చీ ఎక్కాడు. కొంత జోష్‌ నింపాడు. గాంధీ భవన్‌ కు కళ తెచ్చాడు. దళిత గిరిజన దండోరా పేరుతో పార్టీ పటిష్టత కోసం పిసిసి కొత్త అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అలుపెరుగని ప్రయాణం చేస్తున్నారు. ఇంత వరకు బాగానే వుంది. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక విషయంలో రేవంత్‌ రెడ్ది ఏం చేశారన్నది (బ్రహ్మ రహస్యమేమీ కాదు. తన మార్కును, మార్పును చూపించాల్సిన సమయంలో ముందే చేతులెత్తేశాడు. ఆరు నెలల నుంచి రెండు పార్టీలు అలపెరగని ప్రచారం చేస్తుంటే గుడ్లప్పగించి చూసింది ఎందుకు? క్షేత్ర స్థాయిలో ఎంతో కొంత బలంగా వున్న కాంగ్రెస్‌ కు కోరి, కోరి కొత్త కష్టం ఎందుకు తెచ్చారు. గత ఎన్నికలలో 1683 ఓట్లు వచ్చిన బిజేపి బలడానికి కారణమై, నామినేషన్‌ ఆఖరు రోజు దాకా ఊగిసాలడడంలో ఆంతర్యం అర్ధం కానీదా? హుజూరాబాద్‌ నా వల్ల కాదని చేతులెత్తేయడానికేనా ఇంత హంగామా చేసింది. ఇప్పుడు ముప్పై లక్షల సభ్యత్వం సాధించాలని కోరితే జరిగేదేనాపని.

హుజూరాబాద్‌ విషయంలో కాంగ్రెస్‌ కప్పగంతులే: ఈటెల రాజేందర్‌ ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన దగ్గర నుంచి టిఆర్‌ఎస్‌, బిజేపి కనిపించిన ఆతృత కాం(గ్రెస్‌ లో కనిపించలేదు. ఇప్పుడు కూడా లేదు. ఎందుకు? రాజకీయాలలో సహకారాలనేవి ఎన్నికల నాడు క్షేత్ర స్థాయిలో పనిచేస్తాయని అనుకోవడం భ్రమ. ఏ ఏ పార్టీ అయినా తమకు ఓటేయమని ప్రచారం చేస్తుంది. ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్‌ ఏం ప్రచారం చేస్తోంది. కాం(గైస్‌ పార్టీతో ఆనుబంధం వున్న వాళ్లు ఏం (ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి అవకాశం కాంగ్రెస్‌ వదులుకోవడం తప్పిదం కాదా? రాజకీయాలలో శాశ్వత శత్రువులు, మిత్రులు వుండరు. వ్యవస్థలుగానే కాదు, వ్యక్తులుగా కూడా కలిసిపోతారు. సమాజం కోసం (ప్రగతి కోసం అంటూ చెబుతారుతాజాగా టిఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు గతంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ను దూషించినంతగా ఎవరినీ దూషించకపోయి వుండొచ్చు. ఇప్పుడు మేం మంచి మిత్రలం అనుకుంటున్నారు. టిఆర్‌ఎస్‌ గూటికి చేరారు. మరి కాంగ్రెస్‌ పార్టీకి హుజూరాబాద్‌ ఉప ఎన్నిక అన్న దానిని ఎంతో ప్రతివ్రాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఎందుకు విస్తరించింది. శత్రువు, శత్రువు మిత్రలే కాని, సమయమొస్తే రాజకీయాలలో మిత్రులు కూడా శత్రువులేఈ చిన్న లాజిక్‌ రేవంత్‌ రెడ్ది మర్చిపోయారా? ఎవరైనా ఆయనను మార్చారా? గత ఎన్నికలలో కాంగైస్‌ ఓటు బ్యాంకు అరవై వేలు. ఇది తెలంగాణ లోని అన్ని నియోజకవర్హాల కన్నా మెరుగైనది. ఆ బలమంతా కాంగ్రెస్‌ దే. నాడు బిజేపి బలం, దాని ముందు అతి తక్కువ.

ఈటెల రాజేందర్‌ బిజేపి గూటికి చేరడంతో టిఆర్‌ఎస్‌ బలం తగ్గుతుందే గాని, కాం([గైస్‌ బలం తగ్గదు. కౌశిక్‌ రెడ్డి టిఆర్‌ఎస్‌ లో చేరినా, ఆయన వెంట వెళ్లింది తక్కువేఈటెల రాజేందర్‌ తో టిఆర్‌ఎస్‌ నుంచి బిజేపికి వెళ్లిన వాళ్లే ఎక్కువ. ఓటు మార్చిడి అన్నది ఆ రెండు పార్టీలు పంచుకున్నా అటు కేంద్ర, ఇటు రాష్ట్ర రాజకీయాలతో విసిగిన వారి సైలెంట్‌ ఓటు కాంగ్రెస్‌ దే కదా! ఇది కాంగ్రెస్‌ ఎందుకు మిస్సైంది. (ప్రెసిడెంట్‌ మారితే: గడచిన ఐదేళ్ళ కాలంగా ఎక్కుడ విన్నా ఇదే మాట. ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ మీద ప్రేమ వుంది. తెలంగాణ ఇచ్చిందన్న అభిమానం వుంది. అయినా పార్టీ గెలవకపోవడానికి కారణం నాటి పిసిసి. అధ్యక్షుడు అని అందరూ అనుకున్న మాటే. కానీ కొత్త పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పార్టీలో నింపుతున్న జోష్‌ అందరికీ నచ్చింది. పార్టీకి పూర్వవైభవం వస్తున్న నమ్మకం ఇప్పుడిప్పుడే కలుగుతోంది. ఇలాంటి తరుణంలో వచ్చిన హుజూరాబాద్‌ ఉప ఎన్నికలలో రాజకీయ వ్యూహం పేరుతో వేసిన ఎత్తుగడ మాత్రం ఎన్నికల తర్వాత విమర్శలవాలౌతుందని చెప్పడంలో సందేహం లేదు.

కోనుగోలు చేసిన దాన్యాన్ని 24 గంటలలో తరలించాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

జగిత్యాల: 

వ్యవసాయ మార్కేట్ సెంటర్ల ద్వారా కోనుగోలు చేసిన దాన్యాన్ని 24 గంటల లోగా తరలించాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పౌరసరఫరాల శాఖ, మార్కేటింగ్, డిఆర్డిఓ, డిసిఓ లతో పాటు రైస్ మిల్లు యజమానులు, లారీ ఓనర్స్ అసోసియేషన్ లతో సమీక్షించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, కొనుగోలు చేసిన తరువాత దాన్యం 24 గంటల లోగా ఐకేపి, ఫ్యాక్స్ లేదా వ్యవసాయ మార్కేట్ ద్వారా కేంద్రం నిర్వహకులు బాద్యత వహించాలని, కొనుగోలు చేసిన దాన్యం రవాణాదారులు అలస్యం కాకుండా త్వరగా పూర్తయ్యేలా చూడాలని పేర్కోన్నారు. ప్రతిరోజు 7 నుండి 8 వేల మెట్రిక్ టన్నుల దాన్యాన్ని, పండుగలు, సెలవుల రోజులలో 6 వేల మెట్రిక్ టన్నుల దాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగుతుందని, దాన్యం కొనుగోలు త్వరగా జరిగేలా చూడాలని, వాతవరణంలో మార్పులు, వర్షాల వలన దాన్యం తడవకుండా చూడడంలో రైతులతో పాటు కేంద్రం నిర్వహకులు మరియు అధికారులు బాద్యత వహించవలసి ఉందని, ఎఫ్ఎక్యూ నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని, ఎఫ్ఎక్యూ ప్రమాణాలు లేకుండా దాన్యాన్ని కొనుగోలు చేసే చోట సంబంధిత అధికారుల పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

దాన్యం ప్రమాణాలను అధికారులు దృవీకరించిన అనంతరం కేంద్రం నిర్వహకులు బాద్యత వహించాలని, ప్రమాణాలకు సరిపోయో దాన్యం వెరే దాన్యంతో కలవకుండా వేరుగా ఉండేలా చూడలాని, ట్యాబ్ ఎంట్రి త్వరగా పూర్తయ్యేలా చూడాలని అన్నారు. ఇప్పటి వరకు 63వేల మేట్రిక్ టన్నులను కొనుగోలు చేయగా, అందులో 53 వేల మెట్రిక్ టన్నులు దాన్యాన్ని మాత్రమే తరలించడం జరిగిందని, మరో 10 వేల మెట్రిక్ టన్నుల దాన్యం కేంద్రాల వద్దే ఉందని అధికారులు తెలిపారు. ప్రతి కేంద్రాన్ని అధికారులు ప్రతిరోజు తనిఖీలు నిర్వహించాలని సూచించారు. లారీ డ్రైవర్లు ఎక్కడాకూడా డబ్బులు ఆడగకుండా చూడాలని, సకాలంలో లోడింగ్ అన్ లోడింగ్ అయ్యేలా చూడాలని పేర్కోన్నారు.
జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి చందన్ కుమార్ మాట్లాడుతూ, ఈ సీజన్ లో 407 కేంద్రాలకు గాను 406 ప్రారంభించుకోవడం జరిగింది, ఫ్యాక్స్ లో మరొకటి ప్రారంభించు కోవాల్సి ఉంది. సీజన్ లో 63 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం జరిగింది. 10 వేలు కొనులు కేంద్రాల వద్ద ఉన్నట్లు గుర్తించడం జరిగిందని, రైతులకు త్వరితగతిన చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని పేర్కోన్నారు.

ఈ సమావేశంలో కోరుట్ల ఆర్డిఓ టి. వినోద్ కుమార్, డిఆర్డిఓ పిడి ఎస్. వినోద్, డిఎం సివిల్ సప్లై అధికారి రజినికాంత్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పి. సురేష్, డిసిఓ రామానుజాచారి, రైస్ మిల్లు యజమానులు, లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గోన్నారు.

నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని వీడాలి : దీక్షలో కాంగ్రెస్ నాయకులు

నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని వీడి ఉద్యోగ అవకాశాలను కల్పించే విధంగా తక్షణమే నోటిఫికేషన్ లు జారీ చేయాలని జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బనుక శివరాజ్ యాదవ్ ,బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు చిలువేరు కృష్ణమూర్తి ,టీపీసీసీ కార్యదర్శి గణేష్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన పిలుపు మేరకు నియోజకవర్గ కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఒక్కరోజు దీక్ష చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వెంటనే మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలని కోరుతు నిరుద్యోగ సమస్య లు తీర్చాలని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరుద్యోగ చైతన్య దీక్షా ద్వారా సీఎం కేసీఆర్ ని డిమాండ్ చేశారు.ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి గద్దెనెక్కిన తరువాత నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు. అలాగే యువజన కాంగ్రెస్ జనగామ జిల్లా అధ్యక్షులు శివరాజ్ యాదవ్ మాట్లాడుతూ కెసిఆర్ ఎన్నికల సమయంలో నీళ్ళు, నిధులు మరియు నియామకాలు కల్పిస్తాం అని చెప్పి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకుండా కెసిఆర్ ఇంట్లోనే ఉద్యోగాలు కల్పించుకొని నిరుద్యోగులకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. పాలకుర్తి మండల యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు భార్గవ్ మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే వరకు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ నియంత ప్రభుత్వంపై పోరాడుతూనే ఉంటామని తెలిపారు.

పాలకుర్తి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మాదాసు హరీశ్ మాట్లాడుతూ కెసిఆర్ గారు బార్ షాపులు, వైన్ షాపులు కాదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే తెలంగాణ కావలి అని కోరారు. అదేవిధంగా పాలకుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ధరావత్ రాజేష్ నాయక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించమంటే గల్లికో వైన్ షాప్ తెరుస్తూ తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నారు అని, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని పోరాడి ప్రతేక రాష్ట్రం సాధించుకుంటే కేవలం కెసిఆర్ ఇంట్లోనే రాజకీయ ఉద్యోగాలు భర్తీ చేసుకున్నారని విమర్శించారు. అలాగే ప్రతిసారీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారి ట్రస్టు ద్వారా కొచిగ్ ఇస్తున్నామన్నారు కానీ అలా కోచింగ్ ఇచ్చిన వారిలో పాలకుర్తి నియోజకవర్గం నుండి ఎంత మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారో చెప్పాల్సిన బాధ్యత మీదే అని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో పాలకుర్తి నియోజకవర్గం లో ఉన్న నిరుద్యోగులను ఏకం చేసి నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళిన అడ్డుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమలో ఎంపీటీసీ మానస భాస్కర్, బిసి సెల్ అధ్యక్షులు ఐలేష్, ఎస్సీ సెల్ అధ్యక్షులు భాస్కర్, చిలువీరు సంపత్, డైరెక్టర్ సోమమల్లయ్య,జిల్లా ప్రధాన కార్యదర్శి భూపాల్ రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మహేష్ గౌడ్, వివిధ మండలాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు హరీష్ గౌడ్,యకస్వామి, మహమూద్ మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు పీడుగు రమేష్, సుధీర్, రవి, బనుక ప్రభాకర్, అశోక్, ప్రవీణ్, శ్రీకాంత్, నాగన్న, శంకర్, కళ్యాణ్ గౌడ్, రాజు అనిల్, హరిచందర్, సుధాకర్, వెంకట్ తిరుపతి, శేకర్, సంపత్ అఖిల్, బాబు,
నాగరాజు, రాజు,శ్రీను,రాజేష్,గణేష్ , మురళి కుస భాస్కర్, మహేందర్ తదితులున్నారు.

రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు: మిల్కురి వాసుదేవరెడ్డి

రైతు తనకు ఇష్టం వచ్చిన పంటను పండించుకునే హక్కు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రైతును వరి పండించవద్దని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మిల్కురి వాసుదేవరెడ్డి అన్నారు. జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద సిపిఎం, రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసన కార్యక్రమం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొనుగోలు సెంటర్లలో కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. తాలు, తప్పా, నిమ్ము పేరుతో కొర్రీలు పెడుతున్నారన్నారు. పార్టీకి ఓటు వేయలేదని కొందరు సెంటర్ నిర్వాహకులు కొనుగోలు చేయడం లేదని తెలిపారు. కొనుగోలు చేసిన వారం లోపు రైతుల అకౌంట్లలో డబ్బులు జమచేయాలని చెప్పారు. తాలు పేరుతో రైస్ మిల్లర్లు సంచికి 5 కిలోలు కోత విధిస్తూ రైతు నడ్డి విరుస్తున్నారన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలన్నారు. రాజకీయాలకు అతీతంగా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఏక కాలంలో రుణాలు మాఫి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రే వరి పంట వేయొద్దని ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ రైతాంగం పై ఎంత మాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే ఆ మాటలు వెనక్కి తీసుకుని రైతుల్లో ఆందోళన తొలగించాలని డిమాండ్ చేశారు. లేనియెడల రైతాంగం అంతా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం వరి వేయరాదని గత యాసంగి మరియు ఈ వానాకాలం కొనుగోలు చేయనన్న ప్రభుత్వం 6,300 కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలుకు ఆదేశాలు ఇచ్చిందని. గత యాసంగిలో 92 లక్షల టన్నుల వడ్లు కొన్నారని. ఈ వానాకాలం కొనడానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వ విధానం ప్రకటించకున్నా.. ఏలాంటి జీ.ఓలు రాకున్నా ప్రభుత్వ విధానాన్ని ప్రకటించడం చట్ట విరుద్దమన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ మరోరకం బియ్యం కొనుగోలు చేయవద్దని ఎఫ్సిఐ ద్వారా ఉత్తర్వులు ఇప్పించడం అది బహిర్గతం కావడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న దోబూచులాటకు నిదర్శనంగా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాల్లో భాగంగానే వరి పంటపై ఆంక్షలు విధించినట్లు కనబడుతుందని. ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదన్నారు.

రాష్ట్రంలో కోటి ఏకరాల మాగాణం చేస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి ప్రస్తుతం వానాకాలం, యాసంగి కలిపి 80 లక్షల ఎకరాల నుండి కోటి ఎకరాలకు పెరిగిందన్నారు. ఈ వానాకాలం 62 లక్షల ఎకరాలలో వరి వేశారని గత 3 సంవత్సరాలుగా వర్షాలు విపరీతంగా పడడంతో భూగర్భ జలాలు పెరిగాయని చెప్పారు. ప్రాజెక్టులలో, చెరువు, కుంటలలో పుష్కలంగా నీరు ఉందని నీరు బాగా ఉన్నపుడు మెట్ట పంటలు పండవని ఒక వేళ వేసిన మొలకెత్తవని. పైగా యాసంగిలో ఉలవలు, సెనగలు, నువ్వులు, ఆముదం పంటలు వేసినా.. అవి దిగుబడులు రాకపోగా… పెట్టిన పెట్టుబడి కూడా రాదని పైగా విత్తనాలు కూడా అందుబాటులో లేవన్నారు. ఇలాంటి స్థితిలో వ్యవసాయ శాఖ మండలాల వారీగా ప్రణాళికలు రూపొందించి అందుకు తగిన విత్తనాలను అందుబాటులో పెట్టి ప్రత్యామ్నాయ విధానాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు. ఇంకో వైపు ఈ సంవత్సరం 802 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డట్లు నేెషనల్‌ క్రైమ్‌ బ్యూరో ప్రకటించిందని. ఇది కూడా ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించలేదన్నారు. వెంటనే ప్రభుత్వం అధికారికంగా విధానాన్ని ప్రకటించి విత్తనాలు అందుబాటులో పెట్టి వరిపై అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వరి పంటపై రైతుల్లో గందరగోళాన్ని సృష్టిస్తూ ద్వంద విధానాలకు పాల్పడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఎక్కడికక్కడ ఆందోళనలకు పూనుకోవాలని పిలుపునిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక చర్యలు నిరసిస్తూ వరి పంటపై ఆంక్షలు ఎత్తివేయాలని జరుగుతున్న ఉద్యమాల్లో రైతులు రాజకీయలకు అతీతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు శీలం అశోక్, చెల్పూరి రాములు, కరంకొండ శ్రావణ్, పెరుమాండ్ల ప్రవీణ్, రావుల ఓదేలు, పుల్ల కరుణాకర్, హరీష్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

భద్రాచలం శ్రీ సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో 5 కేజీల బరువు గల శిశువు జననం

సాధారణంగా శిశువులు 3 నుంచి 4 కేజీల మధ్యలో జన్మిస్తూ ఉంటారు. కానీ భద్రాచలంలోని అంబేద్కర్ సెంటర్ లోని శ్రీ సురక్ష మల్టీస్పెషల్టి హాస్పిటల్ లో సోమవారం రాత్రి 5 కేజీల బరువుతో మగ శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో జన్మించింది. ప్రస్తుతం తల్లి బిడ్డ ఆరోగ్యం కూడా క్షేమంగా ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ గ్రామానికి చెందిన కె.శ్రావణి పురిటి నొప్పులతో బాధపడుతూ కాన్పు కోసం భద్రాచలం అంబేద్కర్ సెంటర్ లోని శ్రీ సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్* లో చేరింది. అక్కడ ఆమెని పరీక్షించిన గైనకాలజిస్ట్ సూరపనేని.శ్రీక్రాంతి, అనస్థీషియా వైద్య నిపుణులు డాక్టర్ అక్కినేని. లోకేష్గార్ల ఆద్వర్యంలో ఆమెకు శస్త్ర చికిత్స నిర్వహించగా, ఆమె 5 కేజీల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే సోమవారం రాత్రి జన్మించిన ఈ శిశువు సాధారన బరువుకంటే కూడా ఎక్కువగా ఉండడం గమనార్హం.


మొదటి కాన్పులో శ్రావణికి బాబు జన్మించిందనీ , రెండో కాన్పులో కూడా బాబుకు జన్మనిచ్చింది అని హాస్పిటల్ వైద్యులు తెలిపారు. ఈ
శాస్త్ర చికిత్స లో పిల్లల వైద్య నిపుణులు డాక్టర్:వై.రాజశేఖర్ రెడ్డి పాల్గొనీ జన్మించిన శిశువుకు చికిత్స అందించారు. మహిళ బంధువులు వైద్యులకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version