prabuthva karyalama…padaka gada…?,ప్రభుత్వ కార్యాలయమా…పడక గదా…?

ప్రభుత్వ కార్యాలయమా…పడక గదా…? వరంగల్‌ ఇంటర్మీడియట్‌ అర్బన్‌జిల్లా ప్రదాన కార్యాలయంలో పగలంతా సిబ్బంది తమ విధులు ముగించుకొని వెళ్లగానే, కార్యాలయంలోకి రాత్రివేళలో ఓ ఇద్దరు వస్తున్నారని వారు అక్కడే మకాం పెడుతున్నారని, ఆ ఇద్దరు ఎవరై ఉంటారు? వారు రాత్రి అవగానే ఎందుకు వస్తున్నారు..కార్యాలయంలో ఉన్న ఆ రెండు పరుపులు ఎవరివి అయ ఉంటాయ..ఆ రెండు పరుపులు వారిద్దరు పడుకోవడానికే తెచ్చుకొని ఆఫీస్‌లో పెట్టుకున్నారా? ఆఫీస్‌ను తమ వ్యక్తిగత అవసరాల కోసం ఏమైనా వాడుకుంటున్నారా? ఇంటర్మీడియట్‌ వ్వవస్థకు…

Read More

jayagirilo swachbharath, జయగిరిలో స్వచ్చభారత్‌

జయగిరిలో స్వచ్చభారత్‌ మండలంలోని జయగిరి గ్రామంలో బాలవికాస ఆదర్శ గ్రామ కమిటీల ఆద్వర్యంలో స్వచ్చ గ్రామం నిర్వహించామని బాలవికాస ప్రతినిధులు బాబురావు, రాజ్‌కుమార్‌ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రతను పాటించాలని, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. దీంతో ఎలాంటి అంటువ్యాధులు దరి చెరవని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలవికాస కమిటీ అధ్యక్షుడు అయిల కొమురమ్మ, జ్యోతి, లలిత, అయిలయ్య, కొంరయ్య తదితరులు పాల్గొన్నారు.

Read More

modaliana prapancha paryavarana dinostava ustavalu, మొదలైన ప్రపంచ పర్యావరణ దినోత్సవ ఉత్సవాలు

మొదలైన ప్రపంచ పర్యావరణ దినోత్సవ ఉత్సవాలు ఈనెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ప్రారంభం చేసినట్లు జిల్లా అటవీశాఖ అధికారి పురుషోత్తం తెలిపారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం నుండి ఈనెల 5వ తేదీ వరకు జరిగే ఉత్సవాలను ఉత్సవాలు వరంగల్‌ రూరల్‌ జిల్లా అటవీశాఖ, జన విజ్ఞాన వేదిక, వైల్డ్‌ లైఫ్‌ సొసైటీ, వన సేవా సొసైటీ ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. మొదటిరోజున హైదరాబాద్‌ బర్డింగ్‌ ఫాల్స్‌ సొసైటీ బాధ్యులు…

Read More

arthikame neramaothunda…?, ఆర్థికమే ‘నేర’మౌతుందా…?

ఆర్థికమే ‘నేర’మౌతుందా…? ఆర్థిక సమస్యలు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయి. అవసరానికి తీసుకున్న డబ్బులు అప్పుల ఊబిలోకి నెట్టివేస్తే అవే ఆర్థిక అవసరాలు నేరానికి పురిగొల్పుతున్నాయి. అధికవడ్డీలతో చుక్కలు చూస్తూ అవి కట్టలేక కొందరు నేరగాళ్లుగా మారితే, ఇచ్చిన డబ్బులను అధిక వడ్డీతో సహా రాబట్టేందుకు కొందరు ప్రైవేట్‌ ఫైనాన్సర్స్‌ నేరగాళ్లుగా మారుతున్నారు. ఇంకొందరైతే వ్యాపారాలు పెట్టే తమతో ఉన్న భాగస్వాములను నమ్మి లక్షల్లో పెట్టుబడి పెట్టి లెక్కలు తేలక భాగస్వామి చేతిలో మోసపోయి దిక్కుతోచని స్థితిలో పగతో…

Read More

sankethika vyavasthalapia purthi parignanam undali, సాంకేతిక వ్యవస్థలపై పూర్తి పరిజ్ఞానం ఉండాలి

సాంకేతిక వ్యవస్థలపై పూర్తి పరిజ్ఞానం ఉండాలి జిల్లాలోని పోలీస్‌స్టేషన్‌లలో విధులు నిర్వహించే కానిస్టేబుల్‌, సిసి టిఎన్‌ఎస్‌ రైటర్లు, రిసెప్షనిస్టులకు సాంకేతిక వ్యవస్థలపై పూర్తి పరిజ్ఞానం ఉండాలని సిరిసిల్ల రాజన్న జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్‌స్టేషన్‌లలోని సిబ్బందికి ఒకరోజు శిక్షణా శిబిరం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిసిటిఎన్‌ఎస్‌ రైటర్లు, రిసెప్షనిస్టులకు, పోలీస్‌స్టేషన్‌ టెక్‌ టీమ్‌ సిబ్బందికి సిసిటిఎన్‌ఎస్‌, టెక్‌ డాటమ్‌, రిసెప్షన్‌ సెంటర్‌, 07 ఇంటిగ్రేటెడ్‌ ఫార్మ్స్‌ ఎంట్రీ,…

Read More

rashtra avatharana dinostava reharsals, రాష్ట్ర అవతరణ దినోత్సవ రిహార్సల్స్‌

రాష్ట్ర అవతరణ దినోత్సవ రిహార్సల్స్‌ ఈనెల 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ రిహార్సల్స్‌ కళాశాల మైదానంలో శనివారం జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే పర్యవేక్షణలో జరిగాయి. రేపటి కవాతు రిహార్సల్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…యూనిఫార్మ్‌ ధరించి చూపరులను ఆకట్టుకునేలా కవాతు నిర్వహించాలని చెప్పారు. నేడు చేసిన రిహర్సల్స్‌ చాలా బాగున్నాయని, వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉందని తెలిపారు. కళాశాల మైదానంలో…

Read More

pranam thisina selfie sarda, ప్రాణం తీసిన సెల్ఫీ సరదా

ప్రాణం తీసిన సెల్ఫీ సరదా సెల్ఫీ సరదా ప్రాణాలను మింగేసింది. సరదాగా సెల్ఫీ కోసం చెరువులో దిగి బావ, ఇద్దరు మరదళ్లు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన జనగామ జిల్లా నర్మెట్ట మండలం బొమ్మాపూర్‌ రిజర్వాయర్‌ వద్ద చోటుచేసుకుంది. బొమ్మాపూర్‌ జలాశయంలో పడి ముగ్గురు మృతిచెందారు. మతులు అవినాశ్‌ (32), సంగీత (19), సుమలత (18)లను రఘునాథపల్లి మండలం మేకలగట్టు గ్రామస్థులుగా గుర్తించారు. ఫొటోలు తీసుకుంటూ ప్రమాదవశాత్తూ ముగ్గురూ జలాశయంలో పడిపోవడంతో ఈ దారుణం చోటుచేసుకుంది.

Read More

thimmapurlo padakesina parishudyam, తిమ్మాపూర్‌లో పడకేసిన పారిశుద్ధ్యం

తిమ్మాపూర్‌లో పడకేసిన పారిశుద్ధ్యం వరంగల్‌ గ్రేటర్‌ మహానగరంలోని ఆరో డివిజన్‌ తిమ్మాపూర్‌ పేరుకే మహానగరంగా పిలువబడుతోంది. తిమ్మాపూర్‌లో పారిశుద్ధ్యం పడకేసింది. డ్రైనేజీల్లో ఎక్కడికి అక్కడ మురుగునీరు నిలిచి కంపు కొడుతున్నాయి. కాలనీలలో ఎక్కడి చెత్త అక్కడే ఉంటుందని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీలో విలీనమై ఏళ్లు గడుస్తున్నా స్థానిక కార్పొరేటర్‌, స్థానిక మున్సిపాలిటీ సిబ్బంది పట్టించుకోవడంలేదని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా స్థానిక కార్పొరేటర్‌, మున్సిపాలిటీ అధికారులు స్పందించాలని తిమ్మాపూర్‌వాసులు వేడుకుంటున్నారు.

Read More
error: Content is protected !!