మైనర్ బాలికపై రేప్ కేస్ నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష

నేటిధాత్రి కమలాపూర్ (హనుమకొండ)

హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల లోని ఒక గ్రామానికి చెందిన మైనర్ బాలికపై 2018 సం.లో అత్యాచారానికి పాల్పడిన మండలంలోని కాని పర్తి గ్రామానికి చెందిన నిందితుడు కోడిగుటి పెద్ద స్వామికి మొదటి అదనపు జిల్లా జడ్జి కోర్టు బుధవారం 20 సంవత్సరాల జైలు శిక్షతోపాటు పదివేల రూపాయల జరిమానా విధించినట్లు కమలాపూర్ ఎస్హెచ్ఓ సంజీవ్ తెలిపారు.మైనర్ బాలిక తల్లి చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు విచారణ అనంతరం నిందితుడికి కోర్టు శిక్ష విధించినట్లు తెలిపారు.ప్రభుత్వం తరఫున బాధితురాలికి రూ.రెండు లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *