
మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్
వేములవాడ నేటిధాత్రి
వేములవాడ రాజన్న ఆలయం వద్ద యాచక వృత్తి చేసుకునే వంగల సుజాత అనే యాచకరాలు మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న నిత్య అన్నదానానికి స్ఫూర్తి చెంది హైదరాబాదులో ఉంటున్న తన కుమారుడైన
ధర్మారెడ్డి జన్మదిన పురస్కరించుకొని అతని పేర అన్నదానం చేయాలంటూ మై వేములవాడ చారిటబుల్ ట్రస్టుకు 1116/- రూపాయలు అందించడం స్ఫూర్తిదాయకం. నిజానికి రాజన్న దేవాలయం వద్ద యాచకురాలుగా ఉన్న ఈమె తన కుమారునిపై ఉన్న ప్రేమతో అన్నదానాన్ని నిర్వహించడానికి నిత్యం భక్తుల నుండి సేకరించిన రూపాయి రూపాయి జమచేస్తూ మిగతా వారికి అన్నదానం చేయాలనే సంకల్పంతో తన కుమారుని పేరున ట్రస్టు ద్వారా అన్నదానానికి సహకరించినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఇలాగే ఎంతో మందికి స్ఫూర్తి కలిగి ఆడంబరాలకు ఖర్చు చేయకుండా, బీదలకు, అన్నార్తులకు నిర్వహించే అన్నదానం, వస్త్రదానం లాంటి కార్యక్రమాలకు ప్రోత్సాహం అందిస్తే ఎంతోమంది కడుపు నింపినవారం అవుతామని, ఇంకా ఎంతోమందికి ఆదర్శవంతంగా ఉండేలా ఆలోచన చేయాలని ట్రస్ట్ సభ్యులు కొరుతున్నారు.