జైపూర్, నేటి ధాత్రి :
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పౌనూర్ గ్రామానికి చెందిన దుర్గం మధుకర్ తన తండ్రి ఇటీవల కాలంలో కోల్పోవడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న అతని (1996 – 97)పదో తరగతి స్నేహితులు కొంత ఆర్థిక సాయం అందించి చేయూత నివ్వడం జరిగింది. మిత్రులంటే సంతోషాలలో వేడుకలలో పాల్గొని ఆనందాన్ని పంచడం మాత్రమే అని కాకుండా కష్టకాలంలో కూడా స్నేహితునికి అండగా నిలవడమే నిజమైన స్నేహమనీ నిరూపించిన సంఘటన జైపూర్ మండలం పౌనూరు గ్రామంలో జరిగింది. పదో తరగతిలో కలిసి చదువుకున్నటువంటి మిత్రుడు దుర్గం మధుకర్ స్వర్గస్తులైన తన తండ్రి దుర్గం బానయ్యను కోల్పోయి కష్ట కాలంలో ఉన్నాడనే విషయాన్ని తెలుసుకుని పూర్వ స్నేహితులందరూ కలిసి తల ఒక చేయి వేసి 10,000 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మధుకర్ కి అందించి నిజమైన స్నేహానికి నిదర్శనంగా నిలిచారు. భవిష్యత్తులో కూడా ఏటువంటి సహాయానికైనా మేమున్నమనే భరోసాని ఇవ్వడం జరిగింది.రక్తసంబంధికుల నుండే ఏటువంటి సహాయం పొందలేని పరిస్థితులు ఉన్న ఈ రోజులలో ఎప్పుడో కొన్ని రోజులు కలిసి చదువుకున్న స్నేహాన్ని గుర్తుంచుకొని మధుకర్ కష్టాన్ని అర్థం చేసుకొని వచ్చి మరి సాయం చేసిన స్నేహితులను పలువురు అభినందించారు. ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఈ స్నేహితుల బృందంలో గుండు తిరుపతి, కటుకూరి సత్యనారాయణ, మద్దుల సురేందర్ రెడ్డి, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, రాచర్ల సతీష్, మల్లేష్, ,సాయి బాబా, రాజన్న, ఉన్నారు.