పరకాల నేటిధాత్రి(టౌన్)
కొండా లక్ష్మణ్ బాపూజీ 108 వ జయంతి వేడుకను పురస్కరించుకుని బుదవారం బిఆర్ఎస్ పరకాల పట్టణ కమిటి అధ్వర్యంలో జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.పరకాల పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పరకాల పట్టణ అధ్యక్షుడు డాక్టర్ మడికొండ శ్రీను
మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధులు,చేనేత సహకార ఉద్యమ పితమహుడు,నైజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన బాపూజీ, తొలి మలిదశ తెలంగాణ ఉద్యమ సారధి,తెలంగాణ జాతిపిత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. పరకాల మున్సిపల్ ఛైర్పర్సన్ సోదా అనితా రామకృష్ణ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యోద్యమంలో నిజాం వ్యతిరేక పోరాటంలోనూ చురుకుగా పాల్గొన్న యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. నిఖార్సయిన తెలంగాణ వాది 97 యేండ్ల వయస్సులో కూడా తెలంగాణ కోసం పరితపించి మలి దశ ఉద్యమాలలో పాల్గొన్నారన్నారని తన జల దృశ్యాన్ని ఉద్యమాలకు అడ్డాగా మార్చిన త్యాగశీలి బాపూజీ అని ప్రశంసించారు.పరకాల మునిసిపల్ వైస్ ఛైర్మన్ రెగురి విజయపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర చేనేత సహకార రంగానికి అనేక సేవలు చేశారు. బడుగు, బలహీనవర్గాల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పరకాల పట్టణ ప్రజాప్రతినిధులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.