భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గణపతి నవరాత్రులు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణంలోని లక్ష్మినగర్ లో బాల వినాయక కమిటి ఆద్వర్యంలో ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసి నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. కాగా మూడవ రోజు భక్తులు వినాయకుడికి భారీ నైవేద్యాన్ని సమర్పించారు. 108 రకాల పిండి వంటలు, స్వీట్లను స్వామి వారి ముందు ఉంచారు. మా గణపయ్య ఉండ్రాళ్లు ఒకటే కాదు ఎన్నో రకరకాల స్వీట్లను, పిండి వంటలను ఆరగిస్తాడు అనే విధంగా భారీ నైవేద్యాన్ని ఏర్పాటు చేశారు. గణపతి పూజ అయిన అనంతరం వచ్చిన భక్తులందరికీ 108 రకాల ఇంటి వంటలు కలిసిన భారీ నైవేద్యాన్ని భక్తులకు ప్రసాదంగా పంచారు. ఈ సందర్భంగా పూజారి, అలాగే నిర్వాహకులు, మహిళలు మాట్లాడారు..గత 25 సంవత్సరాలుగా లక్ష్మీ నగర్ లో వినాయక చవితి సందర్భంగా గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు.. అయితే ఈ సంవత్సరం 25 వ సంవత్సరం కావడంతో గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని అందులో మూడవ రోజు స్వామి వారికి అత్యంత భారీ నైవేద్యాన్ని సమర్పించాలనే ఆలోచనతోనే అందరం కలిసి 108 రకాల పిండి వంటలు, స్వీట్లతో భారీ నైవేద్యాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు..
ఈ కార్యక్రమంలో మంద శంకర్ వెంకటయ్య సమ్మయ్య వెంకటరెడ్డి సమ్మయ్య రమేష్ లక్ష్మారెడ్డి సంపత్ రాజు ముంజల రవీందర్ శ్రీనివాసు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు