
మందమర్రి, నేటిధాత్రి:-
108 అంబులెన్సులో మహిళ ప్రసవించిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని ఊరు మందమర్రి కి చెందిన ఎం శిరీష కు శుక్రవారం పురిటి నొప్పులు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు 108 కు ఫోన్ ద్వారా సమాచారం అందించగా, 108 సిబ్బంది ఊరు మందమర్రి చేరుకొని శిరీష ను అంబులెన్స్ లో జిల్లా కేంద్రంలోని మాత శిశు కేంద్రానికి తరలిస్తుండగా, గంగా రోడ్డు దగ్గరలో శిరీష కు పురిటి నొప్పులు అధికం కావడంతో అంబులెన్స్ ను పక్కకు ఆపి,డెలివరీ చేయగా, అంబులెన్స్ లోనే శిరీష ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈమెకు ఇది మొదటి సంతానం కాగా తల్లీ బిడ్డ ఇరువురు క్షేమంగా ఉన్నారు. ప్రసవం అనంతరం శిరీష ను, శిశువును మెరుగైన చికిత్స కొరకు ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఈసందర్భంగా 108అంబులెన్స్ ఇఎంటి డి ఆత్మరావు, పైలెట్ ఎండీ అసద్ పాషా కు, అంబులెన్స్ సిబ్బందికి శిరీష కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.