ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ జెండా శత ఆవిష్కరణ
సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )
రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం “నిత్య జాతీయ పతాకావిష్కరణ వంద (శత) వ రోజు కార్యక్రమంలో” భాగంగా సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్ది హరి ప్రసాద్ పతాకావిష్కరణ చేయడం జరిగినది. అగ్గిపెట్టెలో చీర , సూది బెజ్జంలో దూరే చీర , ప్రముఖుల ముఖ చిత్రాలతో నేసిన వస్త్రాలతో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ మాట్లాడుతూ జాతీయ పతాకావిష్కరణ అవకాశం మాన్యులకే కాకుండా సామాన్యులకు కూడా అందించేటువంటి నిత్య జాతీయ పతాకావిష్కరణ అభినందనీయమని, ప్రతిరోజు విద్యార్థుల చేత జాతీయ పతాకావిష్కరణ చేయించడం ఒక వినూత్న కార్యక్రమమని ఈ విధంగా ఈ విధమైన కార్యక్రమాన్ని నిర్వహించే రాష్ట్రంలోని ఏకైక కళాశాల ప్రభుత్వ జూనియర్ కళాశాల అని తెలిపారు .ప్రతి విద్యార్థి దేశభక్తి భావాలను పెంచుకోవాలని క్రమశిక్షణతో చదివితే ఎలాంటి ఉన్నత ఉద్యోగాలైన సాధించవచ్చు అని పేర్కొన్నారు.

విద్యతోపాటు పుస్తక పఠనం చేయాలని ప్రతి విద్యార్థి సెల్ ఫోన్లకు దూరంగా ఉండి, మీ గురువులు చెప్పే విషయాలను పాటించి. ఇష్టపడి,కష్టపడి చదివితేనే మీ లక్ష్యాన్ని చేరగలుగుతారని ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని వారు తెలిపారు. పట్టుదలతో కష్టపడి ఇష్టంతో ఏ రంగంలో , ఏ కళ లోనైనా పనిచేసిన విజయాన్ని సాధిస్తారని వారు తెలిపారు. కార్యక్రమంలో వారు తయారు చేసిన చేనేత వస్త్రా న్ని విద్యార్థులకు ప్రదర్శించారు.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కనక విజయ రఘునందన్,అధ్యాపకులు శ్రీధర్, కేదారేశ్వర్ ,బి.వెంకటేశం. సామల వివేకానంద్.ఈ కనకయ్య. .అరుంధతి. విజయ ,రాజయ్య , ఆంజనేయులు, చంద్రమౌళి, సురేష్ ,సరోజ,
చంద్రశేఖర్,రాజశేఖర్,శ్రీనివాస్, సుజిత , మమత,నర్మద, మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
