నేడు శని అమావాస్యకు సప్తపురి శనిఘాట్ ముస్తాబు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం అమావాస్య సందర్భంగా శ్రీ శనీశ్వరుని ఆలయలు ముస్తాబు అవుతున్నాయి. ఝరాసంగం మండల పరిధిలోని ఏడాకుల పల్లి సప్తపురి శనిఘాట్ శనీశ్వరాలయంలో శనివారం శని అమావాస్య నిర్వహించేం దుకు పూర్తి ఏర్పాట్లు చేశారు. సంగారెడ్డి జిల్లాతో పాటు కర్ణాటక,మహారాష్ట్రలకు చెందిన భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది.శని అమావాస్యను పురస్క రించుకొని ఉదయం నుండి సాయంత్రం వరకు వివిధ రకాల పూజా కార్యక్రమం నిర్వ హిస్తున్నట్లు తెలిపారు. ఈ పూజ కార్యక్ర మంలో భాగంగా ఆలయ ఆవరణలో నిత్య పూజలతో పాటు శని మహా యజ్ఞం 1108 కలశములతో తైలాభిషేకం, భక్తులే స్వయంగా అభిషేకం చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయానికి తరలివచ్చిన భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.