స్థానిక ఎన్నికల్లో వికలాంగులకు 10% రిజర్వేషన్లు అమలు చేయాలి
బీసీ రిజర్వేషన్ల తరహాలోనే వికలాంగులకు పోటీకి జిఓ ఇవ్వాలి
తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా అధ్యక్షులు రాయికోటి నర్సింలు
జహీరాబాద్. నేటి ధాత్రి:
బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జిఓ ద్వారా అమలు చేయబోతున్న 42 శాతం జిఓ తరహాలోనే వికలాంగులకు ప్రత్యేకంగా 10 శాతం రిజర్వేషన్ బిల్లును పెట్టి అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులను ప్రతినిధులుగా ఎంపికయ్యే అవకాశన్ని కల్పించి వికలాంగులకు ధైర్యం కల్పించి అండగా నిలవాలని సంగారెడ్డి జిల్లా వికలాంగుల వేదిక జిల్లా అధ్యక్షుడు రాయికోటి నర్సింలు ప్రభుత్వానితో కోరారు.
