తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీపీ పడిగల మానస రాజు మాట్లాడుతూ పదవ తారీఖున తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కరీంనగర్ పార్లమెంటరీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ కి మద్దతుగారోడ్ షో నిర్వహిస్తున్న సందర్భంగా మండలం నుండి భారీ ఎత్తున హాజరై రోడ్ షోని విజయవంతం చేయాలని ఎంపీపీ పడిగల మానస రాజు మాజీ సర్పంచ్ అనిత రవి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి బొట్టు పెడుతూ కేసీఆర్ రోడ్ షో కి రావాలని ఆహ్వానించారు అలాగే కరీంనగర్ పార్లమెంటరీ అభ్యర్థి బి వినోద్ కుమార్నీ గెలిపించాలని ఆయన ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారని కేంద్రంలో తెలంగాణ నినాదాన్నిగట్టిగా వినిపించారని ఎంతో ఉన్నత విద్యావంతుడైన వినోద్ కుమార్ కి ఓటు వేసి మన కరీంనగర్ నియోజకవర్గం ను అభివృద్ధి పరచుకోవాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో పాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి కోడం సంధ్యారాణి ఏఎంసీ మాజీ డైరెక్టర్ రోజా జాగృతి మండల అధ్యక్షులు కందుకూరి రామ గౌడ్ విజయ్ శివ రమేష్ బాలకృష్ణ మహేష్ మహిళలు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు