మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జడ్చర్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి.
అభివృద్ధి వైపే మా అడుగు అంటూ నిరంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జరుగుతున్నాయి.
రాజాపూర్ మండల కేంద్రనికి చెందిన (10) మంది కాంగ్రెస్ పార్టీ యువకులు అభిమన్యు రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
అభిమన్యు రెడ్డి మాట్లాడుతూ… ఈ 25 రోజులు మీరు పని చేయండి వచ్చే 5 ఏండ్లు మేము మీకోసం పనిచేస్తానని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ మరొకసారి లక్ష మెజారిటీతో లక్ష్మారెడ్డిని గెలిపించాల్సిందిగా కోరారు.