భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
చుంచుపల్లి మండలం రుద్రంపూర్ సి.ఈ.ఆర్. క్లబ్ మరియు గౌతంపూర్ కమ్మునిటీ హాల్ ను పర్యవేక్షించిన కొత్తగూడెం ఏరియా జి.ఎం. జక్కం రమేశ్.
రుద్రంపూర్ సి. ఈ.ఆర్. క్లబ్ మరియు గౌతంపూర్ కమ్మునిటీ హాల్ ను కొత్తగూడెం ఏరియా జి.ఎం. జక్కం రమేశ్. ఈ రోజు పర్యవేక్షించినారు. ఈ సందర్భముగా టిబిజికేఎస్ వైస్ ప్రెసిడెంట్ ఎండి.రజాక్ ఉద్యోగుల నుండి అందుతున్న అభ్యర్ధనల మేరకు సి. ఈ.ఆర్. క్లబ్, మరియు గౌతంపూర్ కమ్మునిటీ హాల్ ను పునరుద్దరించాలని కోరినారు. ఈ సందర్భముగా జి.ఎం. జక్కం రమేశ్. సి. ఈ.ఆర్. క్లబ్, కు చేపట్టవలసిన మరమ్మతులను అదే విధంగా కిచెన్ హాల్, డైనింగ్ హాల్, స్టడీ హాల్ మరియు ఇతర పనులను అలాగే గౌతంపూర్ కమ్మునిటీ హాల్ కు ఏ.సి. సౌకర్యము అదనపు డైనింగ్ హాల్ ను నిర్మించాలని అందుకు సంభందించిన పనులను వెంటనే చేపట్టాలని ఏ.జి.ఎం. (సివిల్) సూర్యనారాయణ గారికి ఆదేశించారు.
ఈ కార్యక్రమములో కొత్తగూడెం ఏరియా జి.ఎం. జక్కం రమేశ్, కొత్తగూడెం ఏరియా టిబిజికేఎస్ వైస్ ప్రెసిడెంట్ ఎండి.రజాక్. ఎస్. ఓ. టు జి. ఎం. ఆర్. నారాయణ రావు, ఏ.జి.ఎం. (సివిల్) సూర్యనారాయణ, ఎం. శ్రావణ్ కుమార్, సి. ఈ.ఆర్. క్లబ్ జాయింట్ సెక్రెటరీ లిక్కి చంద్రశేఖర్, గోపు కుమార్, చిలక రాజయ్య, సకినాల సమ్మయ్య, శేషం రాజు, నిమ్మల రాజు , కుమార్, రాజశేఖర్, మహేశ్, తదితరులు పాల్గొన్నారు.
డిజిఎం పర్సనల్, కొత్తగూడెం ఏరియా