సిఎస్‌ స్పెషల్‌… స్పెషల్‌ సిఎస్‌. సోమేశ్‌ కుమార్‌!

`రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టిన అర్థికవేత్త.

`తెలంగాణ నెంబర్‌వన్‌ లో కీలక సూత్రదారి.

`అధికార గణంతో అర్థిక పరిపుష్టికి పాత్రదారి.

`తెలంగాణ ప్రగతి దూత.

`ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆలోచనలకు సంక్షేమ నీడ.

`అభివృద్ధిలో సిఎం. కేసిఆర్‌ కు చేయూత.

`అడుగడుగునా తన మార్క్‌ పరిపాలన.

`తెలంగాణ ఆర్థిక ఖజానాకు రక్షణ.

హైదరబాద్‌,నేటిధాత్రి: 

వ్యవస్థను తీర్చిదిద్దడంలో అందరి పాత్ర ఒకేలా వుండదు. వారు వారు చూసే దృష్టి మాత్రమే కాదు దూర దృష్టి కనబర్చిన వారే చరిత్ర నిర్మాతలౌతారు. సమాజాన్ని ఉన్నతంగా రూపకల్పన చేయడంలో కీలకపాత్ర పోషిస్తారు. అలా సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాలలో పరుగులు పెట్టించడంలో అధికారుల పాత్ర ఎంతో ఉన్నతమైనది. వారి చిత్తశుద్ధి, అంకితభావం కూడా రాష్ట్ర ప్రగతిని ప్రతిబింబిస్తుంది. లేకుంటే రాష్ట్రం తిరోగమనం వైపు అడుగులు పడుతుంది. ఒక లక్ష్యం, ఒక గమ్యం, ప్రజల సంక్షేమం, వారి ప్రగతి ప్రజా బాహుళ్యంలో వున్న వారు మాత్రమే నెరవేర్చుతారు. అలఅందుకుంటున్న , తెలంగాణ ఉద్యమ కారుడు ముఖ్యమంత్రి కేసిఆర్‌ తెలంగాణ అభివృద్ధిని కూడా ఉద్యమ సంకల్పంతో నిర్మాణం సాగిస్తున్నారు. బంగారు తెలంగాణ సాకారం చేస్తున్నారు. అందుకు సహకరించే అధికారులు కూడా ఆ వేగాన్ని అందుకోగలగాలి. పాలకులు ఎంచుకునే ప్రగతిని అధికారులే ప్రజల కళ్ల ముందు ఆవిష్కరింపజేయాలి. అలా తనదైన శైలిని ప్రదర్శిస్తూ, ఉన్నతమైన ఆశయాలను మిలితం చేస్తూ, తెలంగాణ మౌలిక స్వరూపంలో గణనీయమైన ప్రగతిని ఆవిష్కరించి, చిరునామా చేస్తున్న వారిలో సోమేశ్‌ కుమార్‌ ఒకరు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆలోచనలతో ముందుకు సాగుతూ, అభివృద్ధి వైపు తెలంగాణను పయనింపజేస్తూ ప్రభుత్వం నుంచి ప్రశంసలు అందుకుంటున్న రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి సోమేశ్‌ కుమార్‌. 

 

కార్యనిర్వాహక శాఖ ఎంత పటిష్ఠంగా వుంటే ఆ రాష్ట్ర భవిష్యత్తు అంత పురోగమిస్తుంది. ఉజ్వలంగా వుంటుంది. రాష్ట్రం అన్ని రంగాలలో ముందడుగు వేస్తోంది. ఒక రాష్ట్రం ముందుకెళ్లాలన్నా, తిరోగమనం పట్టినా అధికారయంత్రాంగం వైఫల్యం కచ్చితంగా వుంటుంది. అయితే అధికారుల చేత పని చేయించుకోగలిగే పాలకుల సమర్థత మీద కూడా రాష్ట్ర వేగం ఆధారపడివుంటుంది. ప్రగతి కుంటుపడిరదంటే అధికార గణం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అది పాలకుల మీద ప్రభావం పడుతుంది. కానీ సోమేశ్‌ కుమార్‌ లాంటి అధికారులుంటే పాలనలో తప్పటడుగు అనే ప్రశ్నకే తావుండదు. ఒక రకంగా చెప్పాలంటే పురోగమించే రాష్ట్రాన్ని ఏ శక్తులు అడ్డుకోలేవు. అందుకు తనకు అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే సోమేశ్‌ కుమార్‌ లాంటి ఉన్నతాధికారులుంటే ఏ రాష్ట్రమైనా అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పడంలో సందేహం లేదు. 

  ఉన్నతమైన ఆశయాలున్న పాలకులకు అంకిత భావం వున్న అధికారులు తోడైతే ఆ రాష్ట్ర ప్రగతికి తిరుగుండదు.

 అభివృద్ధిలో ఎదురుండదు. సంక్షేమ రంగంలో అలుపుండదు. అలాగే తెలంగాణ ఏర్పటయ్యే నాటికి పాలనాపరమైన చిక్కులు అనేకం వున్నాయి. అలాంటి వాటినన్నింటినీ అధిగమించి, పురోగమించడమంటే సవాలుతో కూడుకున్న పని. తెలంగాణ రావడాన్ని జీర్ణించుకోలేని వాళ్లు, తెలంగాణ విఫల ప్రయత్నం అనేదానిని ఎలా ఎత్తి చూపాలా? తెలంగాణ మీద మళ్ళీ ఎలా ఆధిపత్యం సంపాదించాలా? అన్న దానికోసం ఎదురుచూస్తున్నారు. ఆ సమయంలో కొందరు ఐఏఎస్‌ అధికారులు తమ కర్తవ్యాలను ఎంతో శ్రద్దాసక్తులతో నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ కలలుగన్న బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములయ్యారు. అందులో ముందు వరుసలో వున్న అధికారిగా సోమేశ్‌ కుమార్‌ ను చెప్పవచ్చు. నిజానికి సోమేశ్‌ కుమార్‌ ఆంద్రప్రదేశ్‌ కు వెళ్లాల్సిన అధికారి. కానీ ఆయనకు సవాళ్లంటే ఇష్టం. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు తీర్చిదిద్దడంలో కృషి చేయాలనుకున్నారు. అందుకే ఆయన తెలంగాణలో విధులను నిర్వర్తించేందుకు మొగ్గు చూపారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేయడంతో పాటు తనదైన ముద్రను వేయడంలో కీలక భూమిక పోషించారు. తెలంగాణ వచ్చిన తర్వాత జిహెచ్‌ఎంసి తొలి కమీషనర్‌ గా ఆయన విప్లవాత్మక పరిపాలనకు శ్రీకారం చుట్టారు. జిహెచ్‌ఎంసి. పరిధిలో నూతన ఆవిష్కరణలు చేసి, నగరం రూపురేఖలలో కొత్త సొగబులు అద్దారు. మున్సిపల్‌ శాఖ మంత్రి కేటిఆర్‌ ఆలోచనలను అమలు చేస్తూ హైదరాబాదు అభివృద్ధిలో తనదైన శైలిని చూపించారు. అంతే కాకుండా నగరంలో హరేరామ హరికృష్ణ సంస్థ తో కలిసి రూ.5 భోజన ఏర్పాట్లు తెలంగాణ ప్రభుత్వానికి ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టేలా చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన మున్సిపల్‌ ఎన్నికలలో బిఆర్‌ఎస్‌ ( అప్పటి టిఆర్‌ఎస్‌) 99 సీట్లు గెలవడంలో ప్రధాన పాత్ర పోషించిందని చెప్పడంలో సందేహం లేదు. హైదరాబాద్‌ లో మౌలిక సదుపాయాల కల్పన అన్నది పెద్ద టాస్క్‌. 2014కు ముందు హైదరాబాదు ఇప్పుడు హైదరాబాదు ను గమనిస్తే ఎంత తేడా అన్నది కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ఒకప్పుడు నాలుగు ఫ్లై ఓవర్లు నిర్మాణం చేసి ఇదే అభివృద్ధి నమూనా అని ప్రచారం చేసుకున్న వారికి ఇప్పుడు హైదరాబాదు చూస్తే ఆశ్యర్యపోవాల్సిందే. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆశయాలను పూర్తి చేయడంలో సోమేశ్‌ కుమార్‌ అప్పగించిన అన్ని పనులను విజయవంతం చేశారు. పళ్లున్న చెట్టుకే రాళ్లు, ముళ్లున్న చెట్ట్లే ఔషదాలు పెద్దలు అన్నారు. కొత్తగా వచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో తనదైన పాత్ర పోషిస్తున్న స్పెషల్‌ సిఎస్‌. సోమేశ్‌ కుమార్‌. ఏరకంగానైనా సరే సోమేశ్‌ కుమార్‌ ను అబాసుపాలు చేయాలని చాలా మంది చూశారు. కానీ కుదరలేదు. ఆయన మీద అనేక ఆరోపణలు చేశారు. అటు మీడియా, ఇటు ప్రతిపక్షాలు కూడా సమయం వచ్చినప్పుడల్లా విమర్శల దాడి చేస్తూనే వుంటాయి. ఒక దశలో అధికారిక కార్యక్రమాలలో అందజేసే చాయ్‌ బిస్కట్లను కూడా వివాదం చేయాలని చూశారు. కోవిడ్‌ సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పని చేసిన సోమేశ్‌ కుమార్‌ పనితనాన్ని కొనియాడాల్సిన మీడియా ప్రశ్నలడుగుతుంటే బిస్కట్‌ తిన్నారని వార్తలు ప్రసారం చేశాయి. అడుగడుగునా ఒక ఉన్నతాధిరి లక్ష్యంగా ఇంతలా మీడియా కూడా టార్గెట్‌ చేయడం గతంలో ఎప్పుడూ లేదు. కారణం సోమేశ్‌ కుమార్‌ వల్ల తెలంగాణ ప్రగతిలో దూసుకుపోవడమే కారణం…తెలంగాణ ఒక విఫల ప్రయత్నంగా చూపాలని ఆశించిన ఓ వర్గం మీడియాకు తెలంగాణ ప్రగతి నచ్చలేదు. అందుకే సోమేశ్‌ కుమార్‌ ను మానసికంగా దెబ్బ తీసే ప్రయత్నం మీడియా కూడా చేసింది. ఇక లేనిపోని అవినీతిని అంటగట్టి సోమేశ్‌ కుమార్‌ ను ఎలాగైనా అప్రదిష్టపాలు చేయాలని ప్రతిపక్షాలు అనేక సార్లు ప్రయత్నం చేశాయి. నిజాయితీగా పని చేసే అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బ తీస్తే పాలనపై దాని ప్రభావం పడుతుందనేది ప్రతిపక్షాల కుట్ర. అంతే కాదు గతంలో జిహెచ్‌ఎంసిలో ఓట్ల గల్లంతును కూడా సోమేశ్‌ కుమార్‌ కు ముడిపెట్టి ప్రతిపక్షాలు రాజకీయం చేశాయి. అయినా ఎక్కడా సోమేశ్‌ కుమార్‌ తన ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. మరింత రెట్టించిన విశ్వాసంతో ముందుకు సాగారు. పాలనలో తన ముద్ర వేశారు. ఒక దశలో దేశంలో ఏ నగరానికి రానన్ని అవార్డులు, రివార్డులు కేంద్రం నుంచి రావడం ఒక పరంపరగా నేటికీ రావడం అన్నది సోమేశ్‌ కుమార్‌ చూపించిన అభివృద్ధికి తార్కాణమని చెప్పాలి. అడుగడుగునా ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆలోచనలకు రూపకల్పన చేసి ప్రజలకు అందించడంలో అందరికన్నా ముందు వరుసలో సోమేశ్‌ కుమార్‌ వున్నారు. అందుకే ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎప్పుడూ సోమేశ్‌ కుమార్‌ మీద వచ్చిన విమర్శలను పట్టించుకోలేదు. సోమేశ్‌ కుమార్‌ సిఎస్‌ గా వున్న సమయంలో మిగతా ఉన్నతాధికారులకు సమయం కేటాంచరని రకరకాల ఆరోపణలు కూడా మీడియా ఆఫ్‌ ది రికార్డు సృష్టించింది. కానీ వేటికీ సోమేశ్‌ కుమార్‌ వెరవలేదు. ఇక రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ఆయన ఆధ్వర్యంలో సాగిన ధరణి తెలంగాణలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. విమర్శలు అన్నవి ఎంత మంచి కార్యక్రమం చేపట్టినా సహజం. తెలంగాణలో వున్న భూముల వివరాలు నిక్షిప్తం చేయడం అన్నది సామాన్యమైన విషయం కాదు. ఎప్పుడో నిజాం కాలం నాటి లెక్కలు తప్ప కొత్తగా మళ్ళీ చేపట్టింది లేదు. అంతటి కార్యక్రమాన్ని విజయవంతం చేసి చూపిన ఘనత సోమేశ్‌ కుమార్‌ ది. ఇదిలా ఉంటే తెలంగాణ వచ్చాక జరిగిన అభివృద్ధి విప్లవానికి పూర్తి స్థాయిలో సహకరించడం అంటే తన పనిని యజ్ఞంలా పూర్తి చేయడమే అవుతుంది. 

పాలకులు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని అమలు చేసే బాధ్యత అధికారులది. 

రాజకీయ నాయకులైన పాలకులు ప్రజలకిచ్చే హామీల అమలులో కీలక పాత్ర దారులు అధికారులు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కానీ, ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ తెలంగాణలో అమలవుతున్న పథకాలను సృష్టించలేదు. అమలు చేసింది లేదు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో అభివృద్ధిపై కలలుగన్న ముఖ్యమంత్రి కేసిఆర్‌ కలలను సాకారం చేయాలంటే ఆర్థిక స్థితి గతులను మార్చే గురుతర బాధ్యతలు ఉన్నతాధికారులది. సంపద సృష్టి, ప్రజలకు సంక్షేమ పథకాల అమలుకోసం అధికారులు పడే శ్రమ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆలోచనలను అమలు చేయాలంటే సోమేశ్‌ కుమార్‌ లాంటి అధికారుల వల్లనే సాధ్యమవుతుంది. అందుకే మళ్ళీ స్పెషల్‌ సిఎస్‌ గా ముఖ్యమంత్రి కేసిఆర్‌ సోమేశ్‌ కుమార్‌ ను విధుల్లోకి తీసుకున్నారు. నిజానికి సోమేశ్‌ కుమార్‌ పని తనం ముఖ్యమంత్రి కేసిఆర్‌ కు బాగా తెలుసు. 1989 బ్యాచ్‌ కు చెందిన సోమేశ్‌ కుమార్‌ తొలుత ఉమ్మడి నిజామాబాద్‌, బోధన్‌ లలో డిప్యూటీ కలెక్టర్‌ గా విధులతో తన ఉద్యోగ ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత ఆయన అనంతపురం కలెక్టర్‌ గా పనిచేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఆయన ను ఆంధ్రా క్యాడర్‌ అధికారి అయినా తెలంగాణ లో విధులను నిర్వర్తించారు. తెలంగాణలో జరిగిన అనేక అభివృద్ధి పనులకు సాక్షిగా, పాత్రదారిగా నిలిచారు. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు వంటి కార్యక్రమాలతో పాటు, ఇటీవలి దళితబంధు అమలును పటిష్ఠం చేశారు. సాగు విప్లవానికి అవసరమైన ఆర్థిక తోడు కోసం ఎంతో కృషి చేశారు. తెలంగాణ వ్యాప్తంగా కార్యనిర్వాహక వ్యవస్థ ను ఏకీకృతం చేయడం కోసం ముప్పై మూడు జిల్లాలలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాల నిర్మాణం చేపట్టడం జరిగింది. ఏక కాలంలో అటు ప్రాజెక్టులు, ఇతర నిర్మాణాలు, జిల్లాల ఏర్పాటు, కొత్త మండలాలు, గ్రామ పంచాయతీలు ఇలా అనేక కార్యక్రమాలు సమన్వయం చేసుకుంటూ ప్రగతిని సాధించడం కోసం సోమేశ్‌ కుమార్‌ చేసిన కృషి అనితరసాధ్యమైనది. అనన్యసామాన్యమైనది. అద్భుత సృష్టిలో ఆయన భాగస్వామ్యం అమూల్యమైనది. తెలంగాణ భవిత గుండెల్లో నిండిపోనుంది. అభివృద్ధిలో అధికారుల పాత్ర పైకి కనిపించకపోయినా దాని ముద్రలు మాత్రం చెరిగిపోవు. అలాగే సోమేశ్‌ కుమార్‌ చేసిన గొప్ప పనులు సువర్ణాక్షరాలు. సోమేశ్‌ కుమార్‌ తెలంగాణ అర్థిక పరిపుష్టి, ప్రగతిలో కీలక పాత్రదారి, సూత్రదారి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *