సోమవారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్
ఎంపీఓ పై దాడి చేసిన గ్రామ సర్పంచ్ భర్తపై చట్టపరంగా చర్యలకు తీసుకుంటాం
గంభీరావుపేట (రాజన్న సిరిసిల్ల జిల్లా) నేటి ధాత్రి:* గంభీరావుపేట మండలం లోని ముస్తఫా నగర్ గ్రామానికి చెందిన సర్పంచ్ సంధ్యారాణి భర్త కొక్కు దేవేందర్ అధికార అండదండలతో గత కొన్ని రోజులుగా ఎం పి ఓ రాజశేఖర్ ను ఒత్తిళ్లకు గురి చేస్తూ అసభ్యకర పదజాలంతో తిడుతూ చంపుతాను అని బెదిరింపులు చేశాడని జూన్ 25. శనివారం రోజున గంభీరావుపేట పోలీస్ స్టేషన్లు ఫిర్యాదు చేశారు. గతంలోనూ అధికారిక విధుల్లో భర్త జోక్యాన్ని ప్రోత్సహించడం , సర్పంచ్ గా ఉంటూ సెట్ బ్యాక్ లేకుండా ఇంటి నిర్మాణం చేపట్టడంతో గ్రామ సర్పంచ్ కొక్కు సంధ్యారాణి పై అప్పటి జిల్లా కలెక్టర్ సస్పెన్స్ వేటు వేశారు పల్లె ప్రగతి పనుల్లో నిర్లక్ష్యం వహించడం, విధుల నిర్వహణలో వైఫల్యం, అధికారిక విధుల్లో భర్త జోక్యాన్ని ప్రోత్సహించడం తో సహా
గ్రామ పంచాయితీ తీర్మానం లేకుండానే చట్ట వ్యతిరేకంగా పనులు చేసి , సంబంధిత గ్రామ సెక్రెటరీ ఎస్ రాజు
సోమవారం కలెక్టరేట్ ఆవరణలో జిల్లాలోని గంభిరావు పేట
మండల పంచాయతీ అధికారి రాజశేఖర్ పై
ముస్తాఫానగర్ గ్రామ సర్పంచ్ కొక్కు సంధ్యారాణి భర్త దేవేందర్ యాదవ్ భౌతిక దాడులు చేయడం పై
జిల్లా ఎంపీడీవో లు, ఎం పి ఓ , ఏ పి ఓ, సాంకేతిక సహాయకులు, కార్యదర్శుల సంఘాల ప్రతినిధులు నిరసన చేపట్టారు.
మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో
మండల పంచాయతీ అధికారి రాజశేఖర్ లు భౌతిక దాడులకు పాల్పడిన సర్పంచ్ భర్త తో పాటు సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్, డి పి ఓ రవీందర్ రెడ్డి, డి ఆర్ డి ఓ మదన్ మోహన్ లకు వినతి పత్రాలు సమర్పించారు.
విధుల్లో సర్పంచ్ కు బదులు ఆమె భర్త దేవేందర్ చట్ట విరుద్ధంగా జోక్యం చేసుకోవడమే కాకుండా ఉద్యోగులను వేధిస్తున్నాడని తెలిపారు.
దాడుల కు తెగబడిన దేవేందర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
స్పందించిన జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్ ఇప్పటికే ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. సర్పంచ్ కొక్కు సంధ్యారాణి కు బదులు ఆమె భర్త విధుల్లో జోక్యం చేసుకోవడం చట్ట విరుద్ధం అన్నారు. జిల్లాలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఇది వరకే ఆదేశాలు జారీ చేశామన్నారు. వాటిని స్ట్రిక్ట్ గా అమలు చేయాలని క్షేత్ర అధికారులకు మరోసారి లిఖతపూర్వకంగా ఆదేశాలు ఇస్తామన్నారు.
భౌతిక దాడుల ఘటన పై ఇప్పటికే గంభి రావు పేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయినందున చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ అధికారులకు సూచిస్తామని తెలిపారు.
అధికారులు, ఉద్యోగుల పై ఏమైనా ఫిర్యాదులు ఉంటే జిల్లా యంత్రాంగ దృష్టికి తేవచ్చుననీ అన్నారు. అలా కాకుండా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామంటే ఊరుకోబోమని హెచ్చరించారు.
క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తించే ఉద్యోగులకు జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా అండగా ఉంటుందని జిల్లా అదనపు కలెక్టర్ పేర్కొన్నారు.మండల పంచాయతీ అధికారి రాజశేఖర్ లపై ఒత్తిడి తెచ్చిన గంభిరావు పేట మండలం ముస్తాఫానగర్ గ్రామ సర్పంచ్ కొక్కు సంధ్యారాణి నీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సోమవారం సస్పెండ్ చేసినట్టు ఉత్తర్వులు జారీ చేశారు.