విజయవంతంగా బడిబాట ర్యాలీ…
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పిస్తే వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని వరంగల్ అర్బన్ జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి తల్లిదండ్రులను కోరారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం లష్కర్ బజార్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ర్యాలీని జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ విద్యార్థి సంపూర్ణ వికాసానికి ప్రభుత్వ పాఠశాలలోని బోధన సహకరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ మండల విద్యాశాఖ అధికారి వీరభద్రనాయక్, ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాల లష్కర్‌బజార్ ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణలత, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల లష్కర్‌బజార్ హెచ్‌ఎం శైలజ, మర్కజి ఉన్నత పాఠశాల ఇంచార్జ్ హెచ్‌ఎం శ్రీనివాస్, పెట్రోల్ పంప్ హైస్కూల్ హెచ్‌ఎం, ప్రభుత్వ అభ్యసన ప్రాథమికోన్నత పాఠశాల హెచ్‌ఎం శ్రీరాముల దాత మహర్షి, ప్రభుత్వ అభ్యసన ప్రాథమిక పాఠశాల ఇంగ్లీష్ మీడియం హెచ్‌ఎం ఉప్పలయ్య, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మార్కజి హెచ్‌ఎం ఎం.ధర్మయ్య, పెట్రోల్‌పంప్ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం, పాఠశాలల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులు పెద్దసంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. లష్కర్‌బజార్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ పబ్లిక్‌గార్డెన్ మీదుగా డైట్ కళాశాల మీదుగా ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి సెంటర్‌కు చేరుకుంది.