నేటిధాత్రి హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షునిగా ఎమ్మెల్సీ డాక్టర్. పల్లా రాజేశ్వరరెడ్డికి రెండో సారి అవకాశం దక్కింది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో కీలకపాత్ర పోషిస్తున్న పల్లా రాజేశ్వర రెడ్డిని గతంలో మొదటి సారి ముఖ్యమంత్రి కేసిఆర్ రైతు బంధు సమితి అధ్యక్షుడిని చేశారు. ఆ పదవీ పూర్తి కావడంతో మరోసారి పల్లాకు ముఖ్యమంత్రి కేసిఆర్ అవకాశం కల్పించడంతో, ఆయన సమర్థతను గుర్తించినట్లైంది. పార్టీ కోసం ఆయన పడుతున్న శ్రమతో పాటు, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు సమితి నిర్వహణ అందరి చేత శబాష్ అనిపించుకుంటున్నారు. పార్టీలో నాయకులంతా పల్లా లాగ తమ కర్తవ్య నిర్వహణలో సాగాలి. రాష్ట్రంలో ఏ ఎన్నికలైనా తన భుజస్కంధాల మీద వేసుకొని పని చేయడం పల్లా కు అలవాటు. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్ట భద్రుల స్థానం నుంచి రెండు సార్లు పల్లా రాజేశ్వరరెడ్డి విజయం సాధించారు. సక్సెస్ కు చిరునామాగా మారారు. గత ఎన్నికలలో పల్లాను ఎలాగైనా ఓడించాలని ఎమ్మెల్సీ ఎన్నికలలో అతిపెద్ద బ్యాలెట్ వచ్చేలా, ప్రతిపక్షాలు చేసిన కుట్రలను పటా పంచెలు చేస్తూ విజయం సాధించారు. ఎవరు ఎన్ని విన్యాసాలు చేసినా యువత టిఆర్ఎస్ వైపే వున్నారని, ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంపై ఎంతో నమ్మకంతో వున్నారని పల్లా గెలిచి రుజువు చేశారు. పల్లా రాజేశ్వరరెడ్డి ఇలాగే మరిన్ని ఉన్నత పదవులు అందుకోవాలని, ప్రజలకు మరింత సేవ చేయాలని, భవిష్యత్తులో టిఆర్ఎస్ మరో సారి అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలని ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు, పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. పల్లా రాజేశ్వర్ రెడ్డి పదవీ కాలాన్ని మరో రెండేళ్ల పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. అనంతరం ఆయన ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసిఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తనపై ముఖ్యమంత్రి కేసిఆర్ వున్న నమ్మకానికి ధన్యవాదాలు చెప్పారు.