రాష్ట్ర భాజాపాలో మొదలైన వర్గ విభేదాలు

# ప్రధాని మోడీ వస్తున్న వేళ బండి వర్గంపై దెబ్బ

# అదునుచూసి దెబ్బకొట్టిన భాజపా చీఫ్ కిషన్ రెడ్డి వర్గం

వరంగల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

భారతీయ జనతా పార్టీ తెలంగాణలో వర్గ విభేదాలు మొదలయ్యాయి. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి జాతీయ అధ్యక్షుడు జేసీ నడ్డా ఇచ్చిన హామీ నెరవేరగా ముందే ఆయన వర్గంపై వేటు మొదలైంది. బండి సంజయ్ భాజపా రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న సమయంలోనే దేశ ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ జిల్లా పర్యటన ఖరారైంది. ప్రధాని రాక ముందుగానే భాజపా అధ్యక్ష పదవిపై మార్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ జిల్లాకు రానున్న 24 గంటల ముందే బండి వర్గంపై మొదటి దెబ్బ పడింది. బండి సంజయ్ వర్గం పై రేటు పడిందని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వర్గం కొండేటి శ్రీధర్, రేవూరి ప్రకాష్ రెడ్డిలు అదును చూసి దెబ్బకొట్టారనే ఆరోపణలు మరోవైపు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ జర్నలిస్టు యువ తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణి రుద్రమదేవి తన సోదరుడు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ యువజన నాయకుడు డాక్టర్ గోగుల రాణా ప్రతాపరెడ్డి తో కలిసి గత సంవత్సరంనర క్రితం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో భాజపాలో చేరారు. ముందుగా మున్సిపాలిటీ ఎన్నికలకు ముందు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుండి భాజపాలు చేరారు. నర్సంపేట పట్టణంలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలలో పోటీ చేసేవారు కూడా లేనప్పటికీ కొన్ని వార్డులలో వారు డిపాజిట్లు గల్లంతైన సందర్భాలు ఉన్నాయి. నర్సంపేట నియోజకవర్గంలో బిజెపి పాత క్యాడర్ తో పాటు రేవూరి వర్గం కలిసిపోలేని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన యువజన నాయకుడు డాక్టర్ రాణా ప్రతాప్ రెడ్డి నియోజకవర్గంలోని గ్రామ గ్రామాన తన సంఖ్యాబలాన్ని పెంచుతూ భారతీయ జనతా పార్టీలో యువతను చేర్పించారు. త్వరలో జరగబోయే ఎన్నికలలో భాజపా అధికార పార్టీకి గట్టి పోటీ ఇస్తుందన్న సాంకేతాలు వినబడుతున్న నేపథ్యంలో రాణా ప్రతాప్ రెడ్డి ని పార్టీ నుండి సస్పెండ్ చేయడం పట్ల భాజాపాకు గట్టి దెబ్బ తగిలినట్టే అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బండి సంజయ్ కి ప్రధాన అనుచరులుగా ఉన్న వర్గం నుండి రాణా ప్రతాప్ రెడ్డి ని సస్పెండ్ చేయడం బండి సంజయ్ వర్గాన్ని తొక్కే క్రమంలోనే ఇది మొదటి దెబ్బ నర్సంపేట నియోజకవర్గ నుండే మొదలైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భాజపా లో చేరిన నాటినుండి రానా ప్రతాప్ రెడ్డి యువతను చేర్పించి పార్టీని ఉవ్వెత్తున లేపుతూ క్యాడర్ను పెంచాడని ఈ నేపథ్యంలో ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేయడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ అని విశ్లేషకులు భావిస్తున్నారు. టిడిపి నుండి బిజెపిలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి భాజపా పాత కార్డును కాపాడలేదు అలాగే కొత్తవారిని చేర్చలేదని తెలుగుదేశం నుంచి వచ్చిన రేవూరి నేడు బిజెపిలో కొనసాగుతాడా లేక కాంగ్రెస్ పార్టీకి పోతారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నర్సంపేట నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయాల రీత్యా రానా ప్రతాప్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ నుండి సస్పెండ్ చేయడం పట్ల పార్టీలో ఉన్న క్యాడర్ అయోమయంలో పడుతున్నారని పలువురు పేర్కొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!