చందుర్తి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని నాలుగో వార్డ్ లోని రాజన్న యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద గురువారం రోజున కుంకుమ పూజ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ సెస్ ఛైర్మెన్ అల్లాడి రమేష్, మల్యాల గ్రామ సర్పంచ్ గట్టు లక్ష్మి నారాయణ మరియు రుద్రంగి మాజీ సర్పంచ్ మేడిశెట్టి ఆనందం, మరియు కార్యక్రమ నిర్వాహకులు హాజరై స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలు పాడి పంటలతో,ఆయురారోగ్యాలతో ఉండాలనీ కోరుకున్నామని, వినాయక మండపాల వద్ద భక్తి శ్రద్ధలతో యువకులు ముందుండి నడిపించటంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజన్న యూత్ సభ్యులు శేఖర్ మధు దివ్యసాగర్ గమన్ రంజిత్ గణేష్ హరీష్ రాజు