మైనంపల్లి మదమెక్కి!

https://epaper.netidhatri.com/

 `పచ్చి తెలంగాణ వ్యతిరేకి?

 `చంద్రబాబు తొత్తుగా మారి?

 `ఉద్యమ కాలంలో కేసిఆర్‌ ను తూలనాడి?

`చంద్రబాబు 2014లో టికెట్‌ నిరాకరించె?

`అదే సమయంలో కాంగ్రెస్‌ పంచన చేరి?

`అక్కడా టికెట్‌ రాక వెనుదిరిగి?

`కేసిఆర్‌ కాళ్లు మొక్కి..కారెక్కి!

`మల్లారెడ్డి చేతిలో మల్కాజిగిరిలో ఓడిపోతివి?

`అయినా కేసిఆర్‌ ఆదరించి ఎమ్మెల్సీ చేస్తే!

`తర్వాత మల్కాజిగిరి ఎమ్మెల్యే గెలిపిస్తే!

`మారకపోతివి మైనంపల్లి !

`తిన్నింటి వాసాలు లెక్కిస్తుంటివి!

`హరీష్‌ రావుపై నోరు పారేసుకొని తప్పు చేస్తివి!

`రాజకీయ జీవితం కాపాడిన కేసిఆర్‌ కుటుంబ టిక్కెట్లు లెక్కించివి?

హైదరబాద్‌,నేటిధాత్రి: 

తన రాజకీయ చీటి తనకు తాను చింపేసుకోవడం కోసమే మైనంపల్లి హనుమంతరావు నోటికి పని చెప్పుకున్నాడు. చెరపకురా చెడేవు అన్న సామెతను నిజం చేసుకున్నాడు. అసలు మంత్రి హరీష్‌ రావు నాయకత్వం ప్రశ్నించేంత రాజకీయం మైనంపల్లి కి వుందా? హరీష్‌ రావు మీద పోటీ చేసేంత దమ్ముందా? ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆదేశాల మేరకు ఉద్యమ కాలంలోనే ఒంటి చేత్తో ఎమ్మెల్యేలను గెలిపించిన చరిత్ర హరీష్‌ రావుది. ఓటమెరుగని నేతగా, నియోజకవర్గంలో ప్రతి ఇంటికి బంధువైన నాయకుడు హరీష్‌ రావు. మాకు హరీష్‌ రావు లాంటి నాయకుడు వుంటే బాగుండు అని తెలంగాణ లోని అనేక నియోజకవర్గాలు కోరుకునే నాయకుడు హరీష్‌ రావు. అదీ హరీష్‌ రావు గొప్పతనం. రాజకీయంగా ఒక నాయకుడి గీటురాయి. అతివిశ్వాసం, నోటి దురుసుతనం మైనంపాటి హనుమంతరావుకు మొదటి నుంచే వుంది. ఆ అహంకారంతో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు పై అనుచిత వ్యాఖ్యలు చేసి తప్పు చేశారు. హరీష్‌ రావు ఒక వ్యక్తి కాదు. తెలంగాణ ఉద్యమ శక్తి. తెలంగాణ ఉద్యమ కారుడు. సుదీర్ఘమైన తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర దారి, సూత్రదారి. తెలంగాణ చరిత్ర వున్నంత కాలం హరీష్‌ రావు పేరు ప్రస్తావన వుంటుంది. అంత గొప్పది హరీష్‌ రావు పాత్ర. మైనంపల్లి హనుమంతరావు చెప్పినట్లుగా ఒక సామాన్యుడుగా మొదలైన హరీష్‌ రావు జీవన ప్రస్థానం తెలంగాణ ఉద్యమంతో ముడిపడి సాగింది. అది ఎంతో గప్ప విషయం. అది చెప్పుకోవడానికి ఎంతో గర్వించదగ్గ అంశం. అలాంటి సందర్భాన్ని తప్పుగా మాట్లాడి, మరో సారి తెలంగాణ ఉద్యమ ద్రోహిని అని మైనంపల్లి తనకు తానే సర్టిఫికేట్‌ ఇచ్చుకున్నాడు. మైనంపల్లి పల్లి లాంటి పరాన్న భుక్కులకు హరీష్‌ రావు త్యాగాలు అర్థం కానిది. యువకుడైన హరీష్‌ రావు తన యుక్త వయసునంతా తెలంగాణ ఉద్యమానికి అంకితం చేశాడు. పద్నాలుగు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి కేసిఆర్‌ తోపాటు ఉద్యమంలో పాల్గొని, నిరంతరం పోరాటం చేసిన నాయకుడు హరీష్‌ రావు. తెలంగాణ వచ్చిన తర్వాత పదవులనుభవించేందుకు బిఆర్‌ఎస్‌ లో దూరిన మైనంపల్లికి మంత్రి హరీష్‌ రావు పేరెత్తే అర్హత లేదు. ఎందుకంటే మైనంపల్లి హనుమంతరావు తెలంగాణ ద్రోహి. చంద్రబాబు చెప్పినట్లు వింటూ ఒక దశలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ను కూడా తూలనాడిన నాయకుడు. అయినా ముఖ్యమంత్రి కేసిఆర్‌ మనసులో పెట్టుకోలేదు. ఆ సమయంలో ఆ పార్టీ అధినేత ఒత్తిడి మేరకు మాట్లాడాల్సి వచ్చినట్లు తర్వాత మైనంపల్లి చెప్పుకొన్నాడు. క్షమించమని కాళ్లా వేళ్లా పడి బ్రతిమిలాడుకున్నాడు. దాంతో కేసిఆర్‌ క్షమించారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమ కారుడు, మంత్రి హరీష్‌ రావు మీద విపరీత వ్యాఖ్యలు చేశాడు. మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు. తన మనసులో ఇంత కాలం గూడు కట్టుకున్న విషమంతా కక్కేశాడు. తన వైనమిదే అని నిరూపించుకున్నాడు. తన పొలిటికల్‌ కేరిర్‌ తనే నాశనం చేసుకున్నాడు. పార్టీ ఆయనకు మల్కాజిగిరి సీటు ఖరారు చేసింది. అయినా అత్యాశకు పోయి, విపరీత ధోరణి తో ఏకంగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ కుటుంబం గురించే మాట్లాడి తప్పు చేశాడు. తనకు ఏదైనా అసంతృప్తి వుంటే పార్టీ వేధిక మీద మాట్లాడుకోవాలి. నిజంగా అంత సమర్థుడే మైనంపల్లి అయితే 2014 చంద్రబాబు ఎందుకు టికెట్‌ ఇవ్వలేదు? మైనంపల్లిని కాదని మంత్రి మల్లారెడ్డికి ఎందుకిచ్చాడు. గొప్పలకు పోయి కాంగ్రెస్‌ గూటికి చేరితే అక్కడా చీకొట్టిన రోజులు మైనంపల్లి మర్చిపోయినా ప్రజలు మర్చిపోలేదు.

ఏ నోటితో కేసిఆర్‌ ను తూలనాడావో అదే కేసిఆర్‌ కాళ్లు పట్టుకోక తప్పలేదు. ఆయన ఆశీస్సులు ఇచ్చి రాజకీయంగా నిలబెడితే గాని మైనంపల్లికి పదవి రాలేదు. అది మైనంపల్లి మర్చిపోయాడు. 2014లో మల్కాజిగిరి పార్లమెంటు స్థానమే కావాలని పట్టుబడితే సరే అని అవకాశం ఇచ్చారు. కానీ ఓడిపోతివి. రాజకీయం మళ్ళీ మొదటికి తెచ్చుకుంటివి. అప్పుడు కేసిఆర్‌ కాళ్ల మీద మళ్ళీ పడితే కనికరించి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. గ్రేటర్‌ హైదరాబాదు అధ్యక్షుడిని చేశారు. తర్వాత జరిగిన 2018 ఎన్నికలలో మల్కాజిగిరి ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చారు. గెలిపించారు. ఇన్ని సార్లు, ఇన్ని రకాలుగా సాయం అందించింది కేసిఆర్‌. ఈ మధ్య కాలంలో మైనంపల్లిపై ఎన్ని ఆరోపణలు వచ్చినా పార్టీ కడుపులో పెట్టుకున్నది. కానీ ఆఖరుకు తిన్నింటి వాసాలు లెక్కబెడితివి. మైనంపల్లి అంటేనే పచ్చి తెలంగాణ వ్యతిరేకి? అయినా బిఆర్‌ఎస్‌ లో చేరి రాజకీయంగా ఎదిగితివి. చంద్రబాబు తొత్తుగా మారి తెలంగాణకు అడ్డంకులు సృష్టిస్తివి. 

 కేసిఆర్‌ కాళ్లు మొక్కి..కారెక్కిన నాటి నుంచి సముచితమైన స్థానం ఇస్తూనే వస్తున్నారు. అయినా మారకపోతివి మైనంపల్లి ! అని బిఆర్‌ఎస్‌ శ్రేణులు మండిపడుతున్నాయి. ఏం సాధించాడని మైనంపల్లి హనుమంతరావు తన కుమారుడికి టికెట్‌ అడుగుతున్నాడు? మెదక్‌ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ రెడ్డి తెలంగాణ ఉద్యమకారిణి. మాజీ డిప్యూటీ స్పీకర్‌. తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఎమ్మెల్యేగా ఎన్నికైన నాయకురాలు. నాలుగుసార్లు ఎమ్మెల్యే గా ప్రజల ఆశీస్సులు పొంది గెల్చిన నాయకురాలును కాదని మైనంపల్లి తన కుమారుడికి టికెట్‌ కోరడమే! తప్పు. మైనంపల్లి కుమారుడు తెలంగాణ ఉద్యమ కారుడు కాదు. సామాజిక వేత్త అసలే కాదు. రాజకీయాల కోసం నాలుగు సేవా కార్యక్రమాలకు ఫోజులు ఇస్తే సరిపోతుందా? మహిళా ఉద్యమ కారిణిగా తెలంగాణ కోసం అహర్నిశలు కొట్లాడిన చరిత్ర పద్మా దేవేందర్‌ రెడ్డికి వుంది. అవన్నీ పక్కనపెట్టి తన కుమారుడు కు టికెట్‌ కావాలని కోరడమే మైనంపల్లి అహంకార పైత్యం. తన కోపమె తన శత్రువు..తన శాంతమే తనకు రక్ష. మెదక్‌ రాజకీయాలలో గత మూడేళ్లుగా వేలు పెట్టి, మైనంపల్లి కుమారుడు బిఆర్‌ఎస్‌ లో అంత కలహాలు సృష్టించాలని చాలా సార్లు చూశాడు. టికెట్‌ నాదే అని ప్రకటించుకున్నాడు. అయినా ఏనాడు పద్మా దేవేందర్‌ రెడ్డి స్పందించలేదు. తన పని తాను చేసుకుపోయింది. టికెట్‌ సాధించింది. ఆఖరుకు ఎలిమినేట్‌ అయ్యింది మైనంపల్లి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!