మార్కెట్లో కార్మికులకు సౌకర్యాలు కల్పించాలి.
నర్సంపేట వ్యవసాయ మార్కెట్‌లో హమాలి, కూలి గంప, చీపురు కార్మికులకు కనీస వసతులు కల్పించాలని టీఆర్‌ఎస్ కెవి జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు అన్నారు. బుదవారం తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ టీఆర్‌ఎస్ కేవీ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో మార్కెట్ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్‌కు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్లో కోతుల బెడద ఎక్కువగా ఉన్నందున కార్మికులు భోజనం చేయడానికి తీసుకువచ్చిన భోజనాలు ఎత్తుకు వెళ్తున్నాయని, వాటి రక్షణకోసం కార్మికులు సామానులు భద్రపరుచుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ప్రత్యేక విశ్రాంతి గది ఏర్పాటు చేయాలని, హామాలి కార్మికులకు సైకిల్ స్టాండ్ ఏర్పాటు చేయాలని, మహిళ కార్మికులు మూత్రవిసర్జనకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి ప్రత్యేక మూత్రశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. రాత్రివేళలో కాంటాలు జరుగుతున్నందున యార్డులో విద్యుత్ లైట్స్ లేక ఇబ్బందులు పడుతున్నారని, వాటిని పరిష్కరించాలని చైర్మన్‌ను కోరగా సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హమాలి యూనియన్ జిల్లా ఇంచార్జి కొల్లూరి లక్ష్మీనారాయణ, జిల్లా నాయకులు పాలడుగు రమేష్, డివిజన్ అధ్యక్షులు బలం ప్రసాద్, కార్మికులు మాదాసి భారతమ్మ, ఈశ్వరమ్మ, చిలకమ్మతోపాటు తదితరులు పాల్గొన్నారు.