మహిళా హక్కులకు విలువలేదా?

`ఈడీ విషయంలో మినహాయింపా?

`డిల్లీ మద్యం కేసు విషయంలో కవిత నిందుతుల జాబితాలో లేదు?

`ఇప్పటి వరకూ అనుమానితురాలు కూడా కాదు?

` కేవలం సాక్షిగానే ఆమెకు నోటీసులు?

`అలాంటప్పుడు పదే పదే విచారణకు పిలువడంలో ఆంతర్యమేమిటన్నదే బిఆర్‌ఎస్‌ ప్రశ్న?

`ఇప్పటికే ఓసారి తన వద్ద వున్న సమాచారం కవిత ఇచ్చానంటోంది?

`మీడియా అత్యుత్సాహం?

`బిజేపి రాజకీయ కక్ష వ్యవహారం?

`ఎలాగైనా కవితను ఇబ్బందులకు గురి చేయాలన్నదే బిజేపి లక్ష్యం?

`బిజేపి పై బిఆర్‌ఎస్‌ నేతల అగ్రహం.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విషయంలో ఈడీ పెంచిన దూకుడు సహజంగా రాజకీయాలలో ప్రత్యర్థులకు ఉత్సాహ వాతావరణాన్ని కలిగించొచ్చు…కానీ రాజకీయాలలో ఈర్ష్యతో, దురుద్దేశ్యాలతో కక్ష సాధింపులు సరికావు. ఈడీ అనేది ప్రభుత్వ రంగ సంస్థ అయినా ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో, వారి ఆదేశాల మేరకే పని చేస్తుందని తెలిసిందే..ఇదే ఇక్కడ అసలు సమస్య. నిజానికి డిల్లీ లిక్కర్‌ కేసు విషయంలో ఎమ్మెల్సీ కవిత మీద అభియోగాలు మోపబడలేదు. నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి జాబితాలో లేదు. కేవలం సాక్షిగా మాత్రమే ఆరోపణలు ఎదుర్కొంటోంది. అంతే కాకుండా ఇప్పటికే ఒకసారి కవిత ను ఈడీ. డిల్లీలో ప్రశ్నించింది. కావాల్సిన సమాచారం సేకరించింది. మరో సారి కవిత ఈడీ విచారణకు హజరు కావాలని నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఈడీ పొందుపర్చిన కేసులో కవిత పేరు లేదు. కేవలం అనుమానం పేరుతో ప్రస్తావన మాత్రమే వుంది. అలాంటప్పుడు ఆమెకు రాజ్యాంగ రిత్యా సంక్రమించిన హక్కులు వున్నాయి. వాటి ఉల్లంఘనకు ఆస్కారం లేదు. మహిళలు, చిన్న పిల్లల విషయంలో కొన్ని ప్రత్యేక వెసులుబాటులున్నాయి. సిబిఐ వాటిని అమలు చేస్తోంది. ఈడీ విషయంలో మినహాయింపు ఎలా వుంటుంది? అన్న సందేహం అందరి మదిని తొలుస్తోంది. ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీలాండరింగ్‌ ఆక్ట్‌( పిఎమ్‌ఎల్‌ఏ) 2002 ఏర్పాటు చేయడం జరిగింది. నిజానికి ఈడీ 1947లో ఏర్పాటైన సంస్థ. అ తర్వాత 1957 దానిని మరింత పటిష్ఠం చేశారు. 1999లో ఫెమా చట్టం తెచ్చారు. తాజాగా 2018లో ఎఫ్‌ఈఓయే చట్టం జత చేశారు. ఇంతవరకు బాగానే వుంది. కానీ ఇటీవల 2022లో పార్లమెంటులో జరిగిన చర్చలో ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. కేంద్ర ప్రభుత్వం విమర్శలు కూడా ఎదుర్కొంటోంది. ఈడీ దాడులు రాజకీయ దురుద్దేశ్యపూరితంగా జరుగుతున్నవే అన్న అందరూ చెబుతున్న మాట. నిజానికి మనీలాండరింగ్‌ కేసుల విషయంలో జప్తుకు ఆస్కారం వుంటుంది. కానీ డిల్లీ లిక్కర్‌ కేసు విషయంలో ఆరోపణలు , ఆధారాలు నగదు రూపంలో దొరికింది లేదు. జప్తు జరిగింది లేదు…అసలు దానిపై సరైన లెక్కలు లేవు…కేవలం ఊహాగానాలతో మొదలైన కేసు మాత్రమే అన్నది న్యాయ నిపుణులు చెబుతున్న మాట.. బిఆర్‌ఎస్‌ నేతలు అంటున్న మాట కూడా! ఈడీ ముందు సోనియా గాంధీ హాజరుకాలేదా? అని ఒకరంటారు? తమిళనాడులో ఓ మహిళ కోర్టుకు ఆశ్రయిస్తే అంగీకరించలేదని ఒకరు ఉటంకిస్తారు? మనీలాండరింగ్‌ చట్టాలు కఠినంగా వుంటాయని భయపెడతారు. అసలు డిల్లీ లిక్కర్‌ కేసు అసలు నిలబడేదే కాదని దేశమంతా అంటుంటే సూడో మేధావులు తమకు తోచింది చెప్పడం, రాయడం మరీ విచిత్రం. 

మహిళా హక్కులకు విలువలేదా? 

ఇక్కడ సందేహమేమిటంటే మహిళా హక్కులు, సాధికారిత, వాటి పరిరక్షణలు, మహిళా బిల్లు వంటి అంశాలలో నిరంతరం చర్చ జరిపే, వాటి గురించి కొట్లాడే కవిత విచారణలో అవేవీ హక్కులు పట్టించుకోకపోవడమే అభ్యంతరం వ్యక్తమౌతోంది.

 కవిత లేవనెత్తిన అంశాలలో మహిళల విచారణ వారి అనుమతి, ఇష్టపూర్వకంగా జరక్కపోవడం మహిళల హక్కులను కాలరాయడమే అవుతుంది. ఐపిసి సెక్షన్లు అమలు చేసే అన్ని పోలీసు వ్యవస్థలు మహిళలను విచారించే విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. చట్టాలకు లోబడి దర్యాప్తు నిర్వహిస్తారు. విచారణ చేపడతారు. అసలు మహిళలను అరెస్టు చేసే సమయంలో అయినా, వారి విచారణలో కూడా కచ్చితంగా మహిళా అధికారులుండాలి. న్యాయవాది సమక్షంలో జరగాలి. ఈడీ. విచారణలో అలాంటి అవకాశం ఎందుకు లేదన్నదే ఇప్పుడు దేశ వ్యాప్తంగా జరుగుతయన్న చర్చ. ఈడీ ప్రధాన కార్యాలయం డిల్లీలో లో వున్నా, దేశంలో వివిధ ప్రాంతాలలో ప్రాంతీయ కార్యాలయాలు కూడా వున్నాయి. అందులో హైదరాబాదు కూడా వుంది. కవిత లిక్కర్‌ కేసులో నిందుతుల జాబితాలో లేదు. అలాంటప్పుడు ఆమెను హైదరాబాదులో కూడా విచారించే అవకాశం కూడా వుందని న్యాయ నిపుణులు చెబుతున్న మాట. డిల్లీ కేసు కావడం మూలాన అక్కడ విచారణ జరిపినా సమయపాలన లేకుండా విచారణ జరగడాన్ని కవిత ప్రశ్నించడం ఆమెకున్న హక్కులో భాగం. కవితను రాజకీయంగా కుంగదీయంలో భాగంగానే బిజేపి కేంద్ర ప్రభుత్వం కుటిల యత్నం చేస్తోందనేది బిఆర్‌ఎస్‌ వాదన. 

మీడియా అత్యుత్సాహం?

 సమకాలీన రాజకీయాలు, ప్రజా చైతన్యం, ప్రభుత్వాల పని తీరు, ప్రజా సమస్యలు, సామాన్యుల బాగోగులు, రైతుల అవస్థలు, చిరు వ్యాపారుల కష్టాలు, నిత్యావసర వస్తువుల ధరలు… సమాజంలో వున్న రుగ్మతలు, ఎన్నికలు, దేశ భవిష్యత్తు ఇవేమీ ఈ తరం మీడియాకు పట్టకుండా పోయింది. ఎంత సేపు సెన్సేషనల్‌ వార్తలు…టిఆర్పి రేటింగ్లులు, అత్యుత్సాహాలు, జ్యోతిష్యాలు, నిమిష నిమిషానికి అప్‌ డేట్లు, డిబేట్లు…ఇదేనా మీడియా చేయాల్సిన పని. అదిగో పులి అంటే ఇదిగో తోక అని ప్రచారం చేయడం బాగా అలవాటైపోయింది. గత 11 ప్రజలను ఎంటర్టైన్మెంట్‌ చేస్తూ,కవిత అరెస్టు… అంటూ ఊదరగొట్టింది…ఆ వార్తలు వాస్తవ రూపం దాల్చకపోవడంతో, మీడియా ఆశలు 16కు వాయిదా వేసుకున్నారు. ఇదిగో, అదిగో…మద్యాహ్నం అరెస్ట్‌ చేయొచ్చని రకరకాల వార్తలు వండి వార్చారు. కవిత విచారణకు హజరుకాకపోవడంతో ఖంగుతిన్న మీడియా మళ్ళీ రకరకాల వదంతులు మొదలుపెట్టింది. ఈడీ నుంచి వచ్చిన మరో వాయిదాను ఆసరా చేసుకొని 20 కోసం మీడియా కంటి మీద కునుకు లేకుండా చూసుకోనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!