Headlines

మహిళా లోకపు ఆర్తి, తెలంగాణ స్పూర్తి కవిత.

` చెట్టు పేరు చెప్పి రాజకీయాల బతుకు షర్మిలది? 

`వైయస్సార్‌ టిపి అధ్యక్షురాలు షర్మిలపై చర్లపల్లి కార్పొరేటర్‌ బొంతు శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు.

`నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో, కార్పొరేటర్‌ బొంతు శ్రీదేవి చిట్‌ చాట్‌….

`అడుగడుగునా వైఎస్‌ కుటుంబం ఎప్పటికీ తెలంగాణకు అడ్డంకే!

`తెలంగాణ మీద షర్మిల మాటలన్నీ మొసలికన్నీళ్లే?

`కల్వకుంట్ల కవిత మీద మాట్లాడే స్థాయి షర్మిలకు వుందా?

`షర్మిల తన జీవితంలో సామాజిక సేవ అనే పదం వుందా?

` తెలంగాణ కోసం కొట్లాడిన చరిత్ర కల్వకుంట్ల కవితది?

`జాగృతి పేరుతో యువతలో చైతన్యం నింపిన శక్తి కవితది?

`ప్రజల ఆశీస్సులతో ఎంపిగా గెలిచింది.

`ఉన్నత చదువులు చదివి, అమెరికాలో ఉద్యోగం చేసింది.

`అనర్గళంగా ఐదారు బాషలు కవిత మాట్లాడుతుంది?

`కవితలో వున్న ఒక్క క్వాలిటీ అయినా షర్మిలలో వుందా?

` కనీసం వార్డు మెంబరుగా ఒక్కసారైనా షర్మిల గెలిచిందా?

` కవిత గురించి మాట్లాడే నైతిక హక్కు షర్మిలకుందా?

` షర్మిల తెలంగాణ గురించి మాట్లాడడం అవి వేదాలు వల్లించడమే!

`కల్వకుంట్ల కుటుంబం మీద మాట్లాడితే తెలంగాణ చోటు కాదు కదా? ఒక్క ఓటు పడదు?

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

రాజన్న బిడ్డని.. జగనన్న బాణాన్ని అని ఇంకా ఎంతకాలం చెప్పుకుంటావు? చెట్టుపేరు చెప్పుకొని ఎంత కాలం రాజకీయాలు చేస్తావు? తెలంగాణకు ఏం చేశావు? తెలంగాణ అంటే ఏం తెలుసు? తెలంగాణలో రాజన్న రాజ్యానికి రూపు లేదు. వైఎస్‌ అన్న పదానికే తావు లేదు. రాజన్న రాజ్యం. ..జగన్న బాణం అని పాచిపోయిన పాట తప్ప చెప్పుకోవడానికి షర్మిలకు చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇప్పుడ జగనన్న కూడా షర్మిలను పట్టించుకోవడం లేదు..అది కూడా ఆమే స్వయంగా చెప్పిందే…అందుకే షర్మిలా…ఒట్టి మాటలు కట్టిపెట్టు. తెలంగాణకు ఏనాడైతే వైఎస్‌ కుటుంబం వ్యతిరేకం అని గుర్తించిందో ఆనాడే తెలంగాణ సమాజం మీ కుటుంబాన్ని చీ కొట్టింది. దూరం పెట్టింది. మానుకోటలో రాళ్ల వర్షం కురిపించి, తరిమేసింది. అయినా ఇంకా తెలంగాణ రాజకీయాలు పట్టుకొని షర్మిల వేలాడుతోంది. తెలంగాణ అంటే ఒక ఆత్మాభిమానం..ఆత్మగౌరవం. అవేవీ లేని వాళ్లకు తెలంగాణ రాజకీయ వేధిక కావాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది. తను పుట్టిన రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేయలేని, రుణం తీర్చుకోలేని షర్మిల తెలంగాణ కోసం మొసలి కన్నీరు కార్చితే ప్రజలు నమ్ముతారా? కన్న తల్లికి బువ్వ పెట్టనోడు చిన్నమ్మకు చీర కొనిస్తానంటే నమ్ముతారా? తెలంగాణ కోసం నిలువు కాదు..అడ్డూ కాదంటూ ప్రతి క్షణం అడ్డుపడిన వైఎస్‌ కుటుంబాన్ని తెలంగాణ సమాజం క్షమిస్తుందా? తెలంగాణ ప్రజలు ఇంకా వంద సంవత్సరాలైనా వైఎస్‌ కుటుంబాన్ని, షర్మిలను నమ్మరు. అయినా తెలంగాణలో రాజకీయం చేస్తా…గెలిచి ఏలుతా షర్మిల పగటి కలలు కంటా అనుకుంటే ఎవరూ కాదనరు…ఇక్కడ రాజకీయాలు చేస్తా అంటే కూడా ఎవరూ అడ్డుపడడం లేదు. కాని తెలంగాణ అస్ధితత్వం మీద, ఉద్యమ కారులు మీద, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ నాయకురాలు కల్వకుంట్ల కవిత మీద షర్మిల ఎలాంటి వ్యాఖ్యలు చేసినా సహించం… అంతో ఇంతో జనానికి వైఎస్‌ కుటుంబం అనే సానుభూతైనా వుండేది. కాని ఎప్పుడైతే జగన్‌ పార్లమెంటులో తెలంగాణకు వ్యతిరేకంగా ప్లకార్డు ప్రదర్శించాడో అప్పుడే తెలంగాణ ప్రజల గుండెల్లో షర్మిల కుటుంబం తుడిచిపెట్టుకపోయింది. అయినా ఇంకా ఇక్కడ రాజకీయాల పేరుతో తెలంగాణ ఉద్యమ నాయకురాలు, మాజీ ఎంపి. జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విషయంలో షర్మిల చిల్లర మాటలు, వెకిలి దెప్పిపొడుపులు చేస్తుంటే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. ముఖ్యంగా తెలంగాణ మహిళలు అసలే ఊరుకోరు. అయినా మా తాతలు నేతులు తాగారు…మా మూతులు వాసన చూడన్నట్లు రాజన్న పేరు చెప్పుకుంటే పబ్బం గడవని రాజకీయాలు ఎందుకు? అసలు నువ్వేంటో…నీ రాజకీయమేంటో…మహిళా సమాజ చైతన్యంలో నీ పాత్రేమిటో…తెలంగాణకు నువ్వు చేసిన మేలేమిటో ఒక్కటి చెప్పు? చెప్పుకోవడానికి ఏమీ లేనప్పుడే ఇలా చేత్త మాటలతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకో..తెలంగాణలో రాజకీయాలు చేసుకో…కాని తెలంగాణ సాధనలో, తెలంగాణ మహిళా ఉద్యమానికి చైతన్య దీపికైన కల్వకుంట్ల కవిత విషయంలో ఇంక్కొక్క మాట మాట్లాడినా షర్మిలను క్షమించేది లేదు..వదిలిపెట్టేది లేదు…ఇంత కాలం పోనీ..పోనీ అనుకుంటూనే ఓపికతో వుంటున్నాం.. పాదయాత్ర పేరుతో నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలపై మాట్లాడుతూ, వారి చేత చీవాట్లు పెట్టించుకోవడం షర్మిలకు అలవాటైనట్లుంది. మహిళగా సభ్యత, సంస్కారంతో మాట్లాడాల్సిన విధానం వదిలేసి, ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి, రాజకీయ పబ్బం గడుపుకోవాలని షర్మిల చూడడం విడ్డూరం. వెకిలి తనానికి నిదర్శనం. తెలంగాణలో అలాంటి సభ్యత లేని మాటలకు తావులేదు. దుర్భాషలకు చోటు లేదు. వెలికి మాటలను తెలంగాణలో ఉచ్చరించరు. వాటిని తెచ్చి తెలంగాణ రాజకీయాలను, సమాజాన్ని కలుషితం చేయాలని షర్మిల చూస్తోంది. ఇది ఏ తెలంగాణ వాది ఆహ్వానించరు. అంతేకాకుండా మరొక్కసారి కల్వకుంట్ల కవిత గురించి ఒక్క మాట మాట్లాడినా షర్మిలకు తెలంగాణ మహిళా సమాజం తగిన బుద్ది చెబుతుంది. అంటున్న బిఆర్‌ఎస్‌ నాయకురాలు, చర్లపల్లి కార్పోరేటర్‌ బొంతు శ్రీదేవి, నేటి ధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో చిట్‌ చాట్‌…బొంతు శ్రీదేవి మాటల్లోనే…

తెలంగాణ కోసం, తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ సాధన కోసం కల్వకుంట్ల కవిత అమెరికాలో చేస్తున్న ఉద్యోగం వదులకొని వచ్చింది.

తెలంగాణ పోరాటంలో పాల్గొన్నది. ఎండనక, వాననక ఉద్యమాన్ని సాగించింది. అసలు కల్వకుంట్ల కవిత మీద మాట్లాడే స్దాయ షర్మిలకు వుందా? కవితకు చేసిన త్యాగం, ఆమె చేసిన ఉద్యమం ఒక చరిత్ర. కాని షర్మిలది చెట్టుపేరు చెప్పుకొని కాయలమ్ముకునే చిల్లర రాజకీయం. అయినా పదేపదే తెలంగాణ మీద విషం చిమ్ముతూ, కల్వకుంట్ల కవిత అక్రమాస్తులంటూ పొద్దస్తమానం లేనిపోని మాటలు మాట్లాడుతోంది. ఇంతకీ షర్మిలకు తెలంగాణలో రాజకీయాలు చేయడానికి డబ్బు ఎక్కడినుంచి వస్తోంది. పాదయాత్రకు అవుతున్న ఖర్చు ఎవరిస్తున్నారు? వైఎస్‌. రాజశేఖరరెడ్డి పాలన పోయి దాదాపు పద్నాలుగేళ్లవుతుంది. అప్పటి అక్రమ సంపాదన తప్ప షర్మిల రాజకీయాలకు నిధులెక్కడివి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణను పీల్చిపిప్పి చేసి, తెలంగాణ భూములు తెగనమ్మి, ఆస్ధులు పోగేసుకొని, అక్రమ సంపాదనకు ఎగబడి వెనకేసుకున్న సొమ్ముతో ఇంకా జపం చేస్తున్న షర్మిలకు తెలంగాణలో రాజకీయం చేసే నైతిక హక్కులేదు. రాజ్యాంగపరంగా ఎక్కడైనా రాజకీయం చేయొచ్చు. కాని నైతికత అన్నది ఒకటుంటుంది. అది లేకుంటే రాజకీయాలు కూడా సాధ్యం కాదు…

 కల్వకుంట్ల కవిత ఒక ఉద్యమ నాయకురాలు..ఉన్నత విద్యావంతురాలు..ఉన్నత ఉద్యోగం చేశారు.

 తెలంగాణ ఆశ, ఆశయం, సాధన, ప్రజల ఆర్తి కవితకు తెలుసు. తెలంగాణ స్ధితిగతులు తెలుసు. తెలంగాణ గోస తెలుసు. అందుకే ఆమె అమెరికా నుంచి వచ్చిన వెంటనే రాజకీయాలు చేయలేదు. తెలంగాణ సమాజంలో చైతన్యం కోసం, విద్యా వ్యాప్తి కోసం, యువత కోసం, వారికి సాంకేతిక విద్యలో నైపుణ్యం కోసం, వారి ఉన్నతి కోసం జాగృతి అనే స్వచ్చంధ సంస్ధను ఏర్పాటు చేసి, ఎంతో మందికి మేలు చేసింది. సేవ చేసింది. సామాజిక బాధ్యతను నిర్వర్తించింది. ఇప్పటికీ కొనసాగిస్తోంది. ఇప్పుడు జాగృతిని దేశమంతా విస్తరించే పనిలో వుంది. తన శక్తి యుక్తులను సమాజ ఉన్నతి కోసం వినియోగిస్తోంది. దేశంలోని యువతకు మేలు చేసే పనిలో వుంది. అదీ కవిత అంటే…ఇందులో షర్మిల ఏ ఒక్క పనైనా చేసిందా? తన జీవితంలో ఏనాడైనా సామాజిక బాధ్యతను నిర్వర్తించిందా? వైఎస్‌ కాంగ్రెస్‌కు అధికారం తెచ్చారని గొప్పలు చెప్పుకోవడం, తమకు అన్యాయం జరిగిందని సానుభూతి కోసం మొసలి కన్నీరు కార్చడం తప్ప షర్మిల ఏం చేసింది? తెలంగాణలో ఇప్పటి వరకు ఏ ఒక్క విద్యార్ధికైనా సాయం చేసిందా? ఏ ఒక్క సామాజిక కార్యక్రమం చేపట్టిందా? ఎంత సేపు రాజకీయం…అధికారం…ఇదే షర్మిల అసలు స్వరూపం…కుటిల స్వభావం..గోతి కాడి నక్క వినయం.

 కల్వకుంట్ల కవిత అంటేనే ఒక బ్రాండ్‌…ఆమె పోరాట యోధురాలు…తెలంగాణ సాధనలో కీలక భూమిక పోషించారు…

తెలంగాణ వచ్చాక ప్రజల ఆశీస్సులతో ఎంపిగా గెలిచారు. దేశంలోనే పేరు ప్రఖ్యాతులు సాధించారు. అనేక సందర్భాలలో గొప్ప స్పీకర్‌గా గుర్తింపు పొందరు. విదేశాలకు పార్లమెంటు డెలిగేషన్‌ వెళ్లినప్పుడు వారికి ప్రాతినిధ్యం వహించే బాధ్యతలు నిర్వర్తించారు. చట్టసభలో మహిళా రిజర్వేషన్‌ కోసం పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే పలు మార్లు పార్లమెంటులో ప్రస్తావన చేశారు…ఇటీవలే డిల్లీలో జంతర్‌ మంతర్‌ వేధికగా ధర్నా కూడ నిర్వహించారు. ఇదీ కల్వకుంట్ల కవిత అంటే…మరి షర్మిల అంటే ఏమిటో ఒక్కసారి ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది…లేకుంటే తన పరువు తానే తీసుకున్నట్లౌతుంది. మరోసారి నోరేసుకొని కవితపై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా తెలంగాణ మహిళా సమాజం ఊరుకోదని మాత్రం హెచ్చరిస్తున్నాను..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *