భావితరం భవితవ్యం…కేసిఆర్‌ నాయకత్వం.

 

`ముఖ్యమంత్రి కేసిఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా బిఆర్‌ఎస్‌ విధానాలపై కట్టా రాఘవేంద్రరావు ప్రత్యేక విశ్లేషణ…

`దేశంలో విప్లవాత్మక ప్రగతి విజయాలు కేసిఆర్‌ తోనే సాధ్యం.

`తెలంగాణలో కనిపిస్తున్న అభివృద్ధి దేశానికి అన్వయం…

` రైతు రాజ్య స్థాపనే ధ్యేయం…

`కల్తీ లేని ఆహారం, ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణం…

`సాగు రంగంలో నూతన ప్రపంచం…

` నీటి పారుదల రంగానికి విసృత ప్రాధాన్యం…

`దేశం సుభిక్షంగా జాతి మనుగడకు శుభోదయం…

`పాడి, పంటలు సమృద్ధి కోసం…

`పారిశ్రామిక పరుగుల సాదృశ్యం…

`విద్యుత్‌ వెలుగులు ముఖ్యం…

`వ్యవసాయ ఉత్పత్తులలో నూతన ఆవిష్కారం…

`పారిశ్రామిక విధానంలో సరికొత్త మార్గం…

` అన్ని రంగాలలో అద్భుతాల కోసం ప్రయత్నం…

` తాగు నీటి కల్పనకు నిశ్చయం….

`శీఘ్ర గతిన సమగ్ర ఫలితాలే ఇప్పుడు అవసరం…

` దేశమంతా ఉచిత విద్యకు శ్రీకారం…

` ప్రజలందరికీ ఉచిత వైద్య సేవలకు మార్గనిర్దేశం…

`భావి భారత సమాజం అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబడడం. 

` ఇదే కేసిఆర్‌ లక్ష్యం… అందుకే బిఆర్‌ఎస్‌ నిర్మాణం.

పల్లెలే దేశానికి పట్టు కొమ్మలు అని జాతిపిత మహాత్మా గాంధీ అన్నాడు…తెలంగాణ పిత కేసిఆర్‌ ఆచరిస్తున్నాడు…తెలంగాణ ను పాడి పంటలకు స్వర్గసీమ చేశాడు…పల్లెల రూపురేఖలు మార్చాడు… తెలంగాణ పల్లెల్లోనే ప్రగతి జీవన వేధాన్ని రంగరించాడు..ఇప్పుడు దేశమంతా ప్రగతి శీల పల్లెలుగా తీర్చిదిద్ది, సువిశాల భారతం సస్యశ్యామలం చేయడానికి కేసిఆర్‌ సంకల్పించాడు. సుసంపన్నమైన భారతావణి నిర్మాణానికి బయలుదేరాడు. తెలంగాణ పిత ముఖ్యమంత్రి కేసిఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ‘‘నేటిధాత్రి’’ ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ అందిస్తున్న ప్రత్యేక కథనం…’

 హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఉద్యమ నాయకుడిగా కేసిఆర్‌ వేసిన అడుగు తెలంగాణ ఉద్యమానికి నాంది పలికింది. ఆయన పోరాటంతో తెలంగాణ సాకారమైంది. ఆయన నేతృత్వంలో తెలంగాణ సస్యశ్యామలమైంది. సుభిక్షమైంది. సమస్యలు లేని తెలంగాణ నిర్మాణమైంది. తాను కలలుగన్న తెలంగాణ ప్రజల హృదయాలలో గూడు కట్టుకున్న బంగారు తెలంగాణ ఆవిష్కృతమైంది. ఇప్పుడు తెలంగాణ ఆచరిస్తోంది…రేపు దేశం అనుసరించేందుకు సిద్దపడుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వం దేశం కోరుకుంటోంది. తెలంగాణ సాధనే కాదు, ఎనమిదేళ్లలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి, దేశం మొత్తం జరగాలని కోరుకుంటోంది. అందుకే దేశమంతా తెలంగాణ వైపు చూస్తోంది. అసలు ఊహకలందనంత ప్రగతిని సాధించిన తెలంగాణ అన్ని వనరులున్నా, గతంలో పాలకులు చేసిన నిర్లక్ష్యం మూలంగా ఒక తరమే శాపగ్రస్ధమైంది. గోసను అనుభవించింది. ఇప్పుడు దేశంలోనే తెలంగాణ నెంబర్‌ వన్‌గా కీర్తింపబుతోంది. ఆర్ధిక వృద్ధి రేటు పెరిగింది. దేశ జిడిపికన్నా తెలంగాణదే ఎక్కువ వుంది. ఒకనాడు ఉపాధి కరువై, పాలమూరు లాంటి జిల్లాలు పాడుబడిన గ్రామాలతో బెంగటిల్లింది. ఊర్లకు ఊర్లు ఖాళీ చేసి, చెట్టుకో దారి, పుట్టకోదారి అన్నట్లు వలస పక్షుల్లా ప్రజలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లి బతికారు. కాని కాలం మారింది. కేసిఆర్‌ శకం మొదలైన నుంచి తెలంగాణలో మార్పులు మొదలయ్యాయి. ఎప్పుడైతే కేసిఆర్‌ జై తెలంగాణ అని నినదించడం మొదలు పెట్టారో అప్పటినుంచి అభివృద్ధి ఛాయలు మొదలయ్యాయి. అయినా నాటి పాలకులకు ఆ మాత్రం తెలంగాణ ప్రగతి కూడా ఇష్టం లేకుండాపోయింది. దాంతో తెలంగాణ సాధన కోసం కేసిఆర్‌ పోరాటం, తెలంగాణ ప్రజల ఆరాటం ఉద్యమ రూపం సంతరించుకొని, సకల జనుల గొంతుక ఒక్కటై నినదించింది. జై తెలంగాణ అన్న పదం మారు మ్రోగింది. ఒక్కడుగా మొదలైన కేసిఆర్‌ ఉద్యమ ప్రస్ధానం తెలంగాణలో కొన్ని కోట్ల గొంతుకలైంది. కొన్ని లక్షల మంది తెలంగాణ సైనికులను తయారు చేసింది. పసి పిల్లాడి నుంచి పండు ముసలి దాకా జై తెలంగాణ అన్నదే వినపడిరది. నాటి పాలకులకు తెలంగాణ ఇవ్వని పరిస్ధితి ఎదురైంది. కేసిఆర్‌ సంకల్పం విజయం సాధించింది. తెలంగాణ వచ్చింది. ప్రగతి వైపు కేసిఆర్‌ నేతృత్వంలో తెలంగాణ అడుగులు పడిరది. ఇప్పుడు పరుగులు పెడుతోంది. దేశానికి ఆదర్శంగా నిలించింది. అలాంటి తెలంగాణ ఇప్పుడు దేశానికి రోల్‌ మోడలౌతోంది. కేసిఆర్‌ నాయకత్వం దేశానికి కావాలని ప్రజలు నినదిస్తున్నారు. కేసిఆర్‌ నాయకత్వాన్ని ఆహ్వానిస్తున్నారు. అందుకే తెలంగాణ అభివృద్ధిని దేశానికి అన్వయించి, అన్ని రంగాల్లో దేశాన్ని పురోగమించేలా చేయడానికి కేసిఆర్‌ మరో సంకల్పం చేపట్టాడు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే యజ్ఞం చేయనున్నాడు. దేశానికి మరో కొత్త యుగాన్ని అందించనున్నాడు. భవిష్యత్‌ తరం బంగారు మయం చేయనున్నాడు. 

  రైతంటే కేసిఆర్‌కు ఎంతో ఇష్టం.

 స్వతాహాగా ఆయన కూడా ఒక రైతే కావడం విశేషం. సాగు కోసం ఒకనాడు తెలంగాణ పడిన కష్టం కళ్లారా చూశాడు. రైతులు పడుతున్న గోస తాను అనుభవించాడు… చుక్క నీరు లేని తెలంగాణ నిత్యం రైతు కన్నీటి చుక్కలతో తడవడం చూసి చలించిపోయాడు. తాను కొన్నిసార్లు కన్నీటిపర్యంతమయ్యాడు. తెలంగాణ తలాపున గోదారి పారుతున్నా ఉత్తర తెలంగాణ ఎందుకు ఎండుతోంది? పక్కనుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నా దక్షిణ తెలంగాణ ఎందుకు నీరులేకుండా గొంతెండుతోంది? అని మధనపడ్డాడు. తెలంగాణలో పారుతున్న నీళ్లను మళ్లించి, తెలంగాణ బంగారు భూమి చేయాలని అనుకున్నాడు. నాటి పాలకులకు చెప్పాడు. వారు వినిపించుకోలేదు. కనికరించలేదు. తెలంగాణ రైతుగోస తీర్చేందుకు నాటి పాలకులు ముందుకు రాలేదు. ఆ కసిలో నుంచి పుట్టిన తెలంగాణ ఉద్యమంతో తెలంగాణ సాధించి ఎక్కడైతే నీటి చుక్క పారలేదో అక్కడే ఇప్పుడు నీటి పరవళ్లు చూపించాడు. సాధ్యం కాదన్న చోట్లే కాళేశ్వరం నిర్మాణం చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చాడు. దేశంలో తెలంగాణలాగా నీటి వనరులెన్నో వున్నా, చుక్క నీటికి దిక్కులేకి భూములు బీడులైపోవడాన్ని కేసిఆర్‌ చూశాడు. రైతుల కష్టం తీర్చేందుకు నడుంబిగించాడు. ఇటు తెలంగాణ అభివృద్ది చేస్తూనే, దేశ ప్రగతి కోసం ఆలోచన చేశాడు. ముందు తెలంగాణ ప్రగతిని చూపించి, దేశ గతిని మార్చే ప్రణాళిక సిద్దం చేయాలనుకున్నాడు. అనుకున్నట్లుగానే దేశం తెలంగాణ పాలనవైపు చూసేలా చేస్తున్నాడు. ప్రపంచంలో ఇంత తక్కువ కాలంలో జరిగిన ప్రగతి ఎక్కడా లేదని చూపించాడు. అందుకే దేశం ప్రగతిలో రైతుభాగస్వామి అయితే తప్ప, భవిష్యత్తు లేదన్న సత్యాన్ని రుజువు చేసి చూపించాడు. సాగుతో వున్న భూమికి విలువెక్కువ. బంగారు పంటలు పండే భూమికి ధరెక్కువ. ఒకప్పుడు వేల రూపాయల ధరలేని తెలంగాణ భూములు కోట్లుకు చేరుకున్నాయి. రైతును రాజును చేశాయి. అదే తరహాలో దేశంలోని అన్ని ప్రాంతాల భూములు బంగారు మయం కావాలి. దేశమంతా ధన రాసులు పండాలి. సస్యశ్యామల భారతం విరాజిల్లాలి. ఇది తొలిమెట్టు…తెలంగాణ ఎలా ఒక్కొమెట్టు ఎక్కుతూ, నాలుగేళ్లలో బంగారు తెలంగాణ సాకారం ఎలా జరిగిందో…దేశమంతా అదే విధంగా మారాలి. అవసరమైన చోట ప్రాజెక్టులు రావాలి. వాటితో భూములు సస్యశ్యామం కావాలి. ఆ నీటితో జల విద్యుత్‌ ఉత్పాదన జరగాలి. దేశమంతా వెలుగులు నిండాలి. ఇదంతా దేశం చూడాలి. అందుకు కేసిఆర్‌ నాయకత్వం దేశానికి కావాలి. 

 ఎటు చూసినా కల్తీ…దేశంలో సమృద్ధికరమైన వ్యవస్ధ లేక, చాలీ చాలని పంటల మూలంగా ప్రతిదీ కల్తీ జరుగుతుంది. 

తాగే పాల దగ్గర నుంచి తినే తిండి దాకా అన్నీ కల్తీయే…దాంతో ప్రజల ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి. అనారోగ్యాల పాలై విగతజీవులౌతున్నారు. అలాంటి పరిస్ధితి నుంచి దేశాన్ని కాపాడాలి. దేశమంతా సమృద్ధికరమైన పంటలు పండాలి. మనకే కాదు, అవసరమైతే ఎగుమతులు చేసేంత సాగు విప్లవం జరగాలి. ప్రపంచంలోనే ఏ దేశంలో లేనంత నీటి సంపద మన దేశంలో వుంది. దేశం నలువైపుల నదుల పారకం జరుగుతోంది. వాటిని ఒడిపి పట్టాలి. ఆ నీటిని పొలాలకు మళ్లించాలి. సమృద్ధికరమైన అన్ని రకాల పంటలకు భారత్‌ కేంద్రం కావాలి. అంతే కాకుండా దేశంలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టాలి. ఒకనాడు ఉమ్మడి రాష్ట్రంలో కరంటు కోతలు అంటే చెప్పనలవి కానిది. కాని ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా ఇరవై నాలుగు గంటల కరంటు సరఫరాతో తెలంగాణలో పారిశ్రామిక ప్రగతిలో కీలకమైంది. ఒకనాడు పవర్‌ హాలీడేస్‌తో కునారిల్లిన పారిశ్రామిక రంగం ఇప్పుడు దూసుకుపోతోంది. తెలంగాణ పారిశ్రామిక ప్రగతిలో ముందు వరసులో వుంది. అంతే కాకుండా దొంగలు దోచలేని, నిప్పు కాల్చలేనిది విద్య ఒక్కటే…ఆ విద్య సామాన్యులకు అందక దేశంలో ఎంతో మంది విద్యకు దూరమౌతున్నారు. చదువుకోవాలన్న తపన వున్నా, చదవించే స్ధోమత లేక ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలను కూలీ పనులకు పంపిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా ఉపాది కోసం ఉత్తరాధి నుంచి వచ్చిన యువతే కనిపిస్తున్నారు. వారికి ఆయా రాష్ట్రాలలో విద్యావకాశాలు లేక, ప్రభుత్వాలు విద్యపై సరైన శ్రద్ద చూపకపోవడం కూడా యువతకు శాపంగా మారింది. కనీసం పది కూడా చదువుకోలేని పరిస్ధితులు వున్నాయి. తల్లిదండ్రులకు ఉపాధి లేక, సాగు చేయలేక, పిల్లలను పోషించలేక, వారి చేత కూలీ పనులు చేయిస్తున్నారు. దేశానికి పనికొచ్చే ఎంతో మంది పిల్లలు యుక్త వయసు రాకముందే కూలీలుగా మారుతున్నారు. ఈ పరిస్ధితి మారాలి. దేశమంతా ఉచిత విద్య అందరికీ అందుబాటులోకి రావాలి. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ గురుకులాలు ఏర్పాటు చేసి, అందిరకీ చదువు అందుబాటులోకి తెచ్చారు. తెలంగాణను విద్యా నిలయంగా మార్చాడు. ఇప్పుడు దేశమంతా సరస్వతీ నిలయం కావాలి. అందరికీ ఉచిత విద్య అందాలన్నదే కేసిఆర్‌ లక్ష్యం…

 ఇక సంపూర్ణ ఆరోగ్యవంతమైన సమాజం దేశమంతా ఏర్పడాలి. 

 తెలంగాణలో ఎలాగైతే ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారో అలాగే దేశంలో కూడా ప్రజలకు ఉచిత వైద్యం అందించాలన్నదే కేసిఆర్‌ నిర్ణయం. ఆ దిశగా కూడా అడుగులు పడాలంటే కేసిఆర్‌ నాయకత్వం దేశానికి ఎంతో అవసరం. ఇదే రేపటి దేశ భవితకు తార్కాణం…దేశమంతా కేసిఆర్‌ రాక కోసం ఎదురుచూస్తున్న తరుణం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!