బీసీ హక్కుల సాధన కై అధ్యాపకులు పాటుపడాలి

బిసి పొలిటికల్ జె ఎ సి చైర్మన్ సుందర్ రాజు యాదవ్

బీసీ హక్కుల సాధనకై అధ్యాపకులంతా కలిసి రావాలని బీసీ జేఏసీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ అన్నారు.హంటర్ రోడ్ లోని మాస్టర్ జీ కళాశాలలో వేణుమాధవ్ సభాధ్యక్షతన బీసీ అధ్యాపకుల సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా సుందర్ రాజు యాదవ్ మాట్లాడుతూ అధ్యాపకులు ఎంతో మంది విద్యార్థులకు రోల్ మోడల్ గా ఉన్నారని, అడుగడుగునా బీసీ అధ్యాపకులకు అన్యాయం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీసీలంతా ఐక్యంగా పనిచేస్తే మన హక్కులను సాధించడం చాలా సులభం అవుతుందని అన్నారు.ఇందుకోసం బీసీ జేఏసీను ఏర్పాటు చేసి, ప్రతి సంఘాన్ని కూడా ఇందులో భాగస్వామ్యం చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నామన్నారు.బి సి అధ్యాపకుల సంఘమే కాకుండా వర్తక సంఘం,విద్యార్థి సంఘం, మహిళా సంఘం, అధ్యాపక సంఘం, డాక్టర్ల సంఘం,అడ్వకేట్ల సంఘం, వాకర్స్ అసోసియేషన్,ఈ విధంగా రకరకాల విభాగాలను ఇందులో వివిధ రకాల సంఘాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. త్వరలోనే బీసీ లెక్చరర్స్ ఫోరమ్ ను కూడా ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. విద్యా,ఉద్యోగ, ఉపాధి రంగాలను పరిగణలోకి తీసుకొని బీసీ హక్కుల కోసం అధ్యాపకులు ఏకమై ముందుకు నడిపించాలని కోరారు. బీసీల హక్కుల సాధనకై అనేక అవగాహన సదస్సులు నిర్వహించనున్నామని అన్నారు. ప్రతి కళాశాలకు వెళ్లి అధ్యాపకులను, విద్యార్థులను బీసీ లకు జరిగే అన్యాయాల పట్ల పట్ల చైతన్యం తీసుకురావాలని అన్నారు.గ్రేటర్ వరంగల్ లో సుమారు 300 వరకు కళాశాలలో ఉన్నాయని అందులో 3000 పైచిలుకు వరకు బీసీ అధ్యాపకులు పనిచేస్తున్నారని అన్నారు. వారందరినీ సమన్వయం చేసి అతి త్వరలో పెద్ద ఎత్తున ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు.ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ ద్వారా బీసీ విద్యార్థులు నష్టపోతున్నారని అన్నారు.ఇటీవల ప్రకటించిన డీఎస్సీ ఫలితాల్లో కూడా ఈడబ్ల్యూఎస్ వల్ల అనేకమంది యువతి, యువకులు తమ యొక్క ఉద్యోగ అవకాశాలను కోల్పోయారని అన్నారు.ఈ విషయాన్ని గ్రామస్థాయిలోకి తీసుకెళ్లి అవగాహన కల్పించేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. మనం పని కల్పించుకోవాలి పదిమంది బీసీలకు పని కల్పించాలి. ఆ దిశగా ముందుకెళ్లాలని అన్నారు. ఉన్నతంగా ఆలోచించినప్పుడే బీసీల సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు.ప్రొఫెసర్ విజయ్ బాబు మాట్లాడుతూ రేపటి సమాజానికి మార్పు ఉపాధ్యాయులు అని రేపటి తరం కోసం అధ్యాపకులంతా పనిచేయాలని అన్నారు.ప్రతి తరగతి గదిలో చివరి ఐదు నిమిషాలు పిల్లలకి కెరీర్ గైడెన్స్ పైన అవగాహన కల్పించాలన్నారు. టీజీపీఎల్ఏ రాష్ట్ర అధ్యక్షుడు,బీసీ రాష్ట్ర నాయకులు పులి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నారు.బీసీ రాష్ట్ర నాయకులు డాక్టర్ తిరునహరి శేషు మాట్లాడుతూ ప్రతిరోజు అనేకమంది విద్యార్థులకు పాఠాలు చెబుతున్నటువంటి అధ్యాపకులు బీసీ హక్కులను కూడా విద్యార్థులకు తెలియపరచి సంఘటితం చేయాలన్నారు.ప్రొఫెసర్ గడ్డం భాస్కర్ మాట్లాడుతూ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం బీసీలను వాడుకుంటున్నారని, దీనిపైన విస్తృతస్థాయిలో చర్చలు జరగాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు డాక్టర్ మోటె చిరంజీవి,తాడిశెట్టి క్రాంతి కుమార్,వీరస్వామి,చెరాల సూర్యనారాయణ,కృష్ణమూర్తి, సతీష్, డా.అనిల్,ప్రో. సాంబయ్య,గూడూరు సుమన్, వీరగాని భాస్కర్,కాసర్ల మహేందర్,లక్ష్మణ్,శ్రీనివాస్,న్యాయవాది బండ వివేకానంద పాటు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *